పెండ్లికుమార్తె పావురము

( 15-11-1948వ సం||లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

పరమ. 2: 14; మత్తయి. 25:1-13; 1తిమోతి. 4:3

కీర్తన: ప్రభు యేసు రూపే సంఘ - వధువు ధరియించెనామె విభవ మేమంచు నేను వివరింపగలను. || షారోను||

"స్వీయ రక్తమున ప్రభువు చిన్ని కన్నియను శుద్ధి జేయ పావురము వంటి - దాయె స్థిరముగను" ||షారోను||

పరమగీతము 2: 14వ వచనములో ఈ క్రింది భాగములున్నవి.

 • 1. బండ సందులలో ఎగురు పావురము ,
 • 2. పేటు బీటులను ఆశ్రయించు పావురము,
 • 3. నీ ముఖము మనోహరము,
 • 4. నీ స్వరము మధురము ,
 • 5. నీ ముఖము కబడనిమ్ము ,
 • 6. నీ స్వరము వినబడనిమ్ము.

ఈమె ఎవరు? పెండ్లికుమార్తె సంఘము . రోమా 3: 23వచనములో అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారని వ్రాయబడినది. గనుక లోకమంతటినుండి మహిమను సంపాదన చేసికొను గుంపును తెలిసికొనవలెను. ఆ దేవుని మహిమను సంపాదించుకొనకుండా సాతాను సర్వ లోకమును ఏలాగు మోసపుచ్చుచున్నదో , గమనించవలెను.

 • ( 1 ) లోకము:- సాతాను లోకథులను రెండు ముఖ విషయములలో మోసపుచ్చుచున్నది.
  • 1 ) ఏలాగైనా ఏ రూపములోనైనను, దేవుని ఆరాధించవచ్చు. ఏ నామమైనా ఒకటే. ఏ నామమున పూజించినా, ఆ నామమునకే చెల్లునని వారికి నచ్చచెప్పి, 33 కోట్ల దేవతలను మొలిపించెను.
  • 2. దేవుడు సర్వవ్యాపిగదా! అంతటాయున్నాడు. చెట్టులో, పుట్టలో, గుట్టలో. ఈలాగు అన్నిటిలో యున్నాడని వీరిని రెచ్చగొట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించునట్లు వారికి నచ్చజెప్పెను. (రోమా. 1:20-23 ).
 • 2. నామక క్రైస్తవులు:- సాతాను లోకమునకు నచ్చచెప్పిన రెండు విషయములు, వీరికి నచ్చలేదు. ఇన్ని దేవుండ్లు ఉండలేదనియు, దేవుడు అన్నిటిలో లేడనియు గ్రహించి, యేసు నామమే రక్షణ నామమని - ' నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పిన యేసునే మేము నమ్ముదుము ' అని లోకములోనుండి ఒక గుంపు బైటికి వచ్చినది. వీరే నామక క్రైస్తవులు. సైతాను వీరినిచూచి వీరియొద్దకు వచ్చి, వీరిని ఏవిధముగా మోసపుచ్చుదుమా! అని ఆలోచించి వీరిని ఈ విధముగా మోసపుచ్చెను. అదేలాగనగా:- ఓ క్రైస్తవులారా! మీరు నమ్ముకున్న దేవుడు ఒకడే, ఆయనే క్రీస్త్. ఇన్ని దేవుండ్లుంటే ఏ దేవుని పూజింతే తక్కిన దేవుండ్లకు కోపము. మీ నమ్మకము మంచిదే గాని ఒక పని మాత్రము మీరు చేయండి. మీ కన్నవారి ఇంటి సరుకు మాత్రము, పాత ఇంటి సరుకు మాత్రము విడిచిపెట్టకండి. కన్నవారు అనగా లోకము, లోకపు సరుకు విడిచిపెట్టవద్దని మోసగించెను. ఈ సరుకునుగూర్చి దైవ గ్రంధములో ఈలాగున్నది. 'మరియ వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు బ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని,,; మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమనువాటితో నిండినవారై; కొండెగాండ్రును, అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును, మాట తప్పువారును, అనురాగ రహితులును, నిర్ధయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమె గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు" ( రోమా. 1:28-32 ).
 • 3. రక్షితుల గుంపు:- ఈ గుంపులోనివారు సాతానుడు,-లోకమును మోసగించిన తంతులకు, నామకక్రైస్తవులకు నచ్చచెప్పిన తాంతులకు లోబడక , మేము పరిశుద్దులముగా జీవించెదమని వీరనుకొందురు. రాకడకు సిద్ధపడవలెనని తలంతురు. వీరు నామక క్రైస్తవుల నుండి బైటకు వచ్చిరి. బైటకు వచ్చిరి. సాతాను వీరిని చూచినాడు, వీరిని ఏవిధముగా మోసపుచ్చవలెనని ఆలోచించిరక్షితులారా! మీరు పరిశుద్దముగా ఏ పాపము చేయకుండా రాకడకు సిద్ధపడుట మంచిదేగాని అస్తమానము ప్రార్ధనేనా?. బైబిలు చదుటేనా? కూటములకు వెళ్ళటమేనా? తరువాత వెళ్ళకూడదా? తరువాత చదువకూడదా? అను తంతు వీరికి కల్పించెను. ఈ తంతు వీరికి పాపమువలె కనబడుటలేదు. ఎందుకనగా సబబుగా, సర్దాగా వీరికి సాతాను నచ్చచెప్పినది. ఈ "తరువాత" అను తంతుకు లోబడితే, 'తరువాతాలోని ""తరు" తీసివేస్తే, ఇక మిగిలినది "వాత" అనునదేగదా! ( 1తిమో .4:3 ). గనుక ఈ గుంపులోనివారు అటువంటి వాత వేయబడిన మనస్సాక్షిగలవారగుదురు. ఇకముందుకు సాగలేరు. ఆశీర్వాదము పొందలేరు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను , మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు (హెబ్రీ . 12:17 ).
 • 4. కన్యకలు:- ఏరు పై మూడు గుంపుల తంతులకు లోబడక రక్షితులలోనుండి బైటికి వచ్చిరి. సాతాను వీరినిచూచి, వీరిని ఏవిధముగా మోసపుచ్చవలెనని ఆలోచించి, దేవుని సెలవు, వీరికి అలవిగాని శ్రమలు రానిచ్చును. (రోమా. 8:35-37). ఇట్టి శ్రమలలో అనేకులు శ్రమలు సహించలేక , జయించలేక, వాక్యానుభవములేక ముందుకు సాగి రాలేరు. ఈ కన్యకల గుంపులోని ఈలాగు శ్రమలచేత శోధించి, సాతాను వీరిని ముందుకు వెళ్ళనీయక ఆపివేయును.
 • 5. సిద్ధపడిన గుంపు:- వీరు ఇప్పటి శ్రమలు, మేము పొందబోయే మహిమ ఎదుట ఏ మాత్రమని ఎన్ని శ్రమలు ఎదురైనను, అన్నిటిని ఓపికతో జయింతురు ( రోమా. 8:15 - 18; 2తిమోతి. 2:12;3:12 ). ఇట్టి అనుభవము కలవారు బుద్ధిగల కన్యకలు ( మత్త. 25:10 ). ఇదియే 5గురు బుద్ధిగల కన్యకలున్న 5వ గుంపు. ఈ గుంపునే పెండ్లి సంఘమని ప్రభువు మెచ్చుకొను చున్నాడు. పరమ. 2: 14లో రెండు భాగములున్నవి.
  • 1 ) బండసందులు,
  • 2 ) పేటు బీటులు.
  బండ: పాతనిబంధనకాలములో ఏర్పాటు జనమైన ఇశ్రాయెలీయులు అరణ్య ప్రయాణము చేయుకాలములో, నీటి కొరకు దేవునికి మొరపెట్టగా, వారి మొర దేవుడాలకించి, మోషేను పంపి వారికి నీరు సమృద్ధిగా అందించెను. ఇశ్రాయేలీయులు ఆ నీటి ప్రవాహములో స్నానము చేసిరి, దప్పి తీర్చుకొనిరి, బట్టలు ఉతుకుకొనిరి ( కీర్తన. 105:41; 28:15-16; 1కొరింథి. 10:4 ). ఆ బండ క్రీస్తే. పెండ్లి కుమార్తె సంఘముకూడ యేసుప్రభువు గాయములలో జలకమాడి, స్నానముచేసి, శుద్ధియై రక్షిపబడిరి. వీరిని " మీరు నా సన్నిధికి రండి" అని ప్రభువు పిలుచుచున్నాడు. పేటుబీటలను ఆశ్రయించుట అనగా ఆయన గాయములను ఆశ్రయించుట అనగా దైవసన్నిధిలో ఉండుట. ఇట్టివారు రాకడకు సిద్ధపడగలరు (యెష,4:6).
 • 1. ఆదాము హవ్వలు పాపముచేసి చెట్టుచాటున దాగిరి. ఇది కొంతసేపే. ఇది మనోశాంతి.
 • 2. అపో. కార్య. 5వ అధ్యాములో రోగులను మంచములతో తీసుకు వచ్చినప్పుడు, అపోస్తలుల నీడపడి వారు స్వస్థతను పొందిరి. ఇది శరీర శాంతి.
 • 3. ఆత్మశాంతి: ఇదిగలవారు సంపూర్ణులు. దా||కీర్త. 91:1వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తునినీడను విశ్రమించువాడు. ఇది దైవ సన్నిధి. ఈ సన్నిధికి వచ్చిన పెండ్లి కుమార్తె సంఘముయొక్క ముఖము, స్వరము, మంచివనియు; ఆమె స్వరము వినబడనిమ్మనియు; ఆమె ముఖము కనబడనిమ్ము అనియు పెండ్లికుమారుడు కోరుకొనుచున్నాడు.
పై 5గుంపుల స్వరములు గుర్తించినయెడల
 • ( 1 ) లోకుల స్వరము:- 'హరేరామ హరేకృష్ణ ...........' ఈ స్వరము ప్రభువుకు అక్కరలేదు.
 • ( 2 ) క్రైస్తవులు- నామక క్రైస్తవులు:- 'దేవా! పాపినైన నన్ను కరుణించుము ' ఈ స్వరము ప్రభువుకు అక్కరలేదు.
 • ( 3 ) రక్షితుల స్వరము:- ' ప్రభువా! రాకడకు నన్ను సిద్ధపర్చుము ' ఈ స్వరము ఆయనకు అవసరము లేదు.
 • ( 4 ) కన్యకల స్వరము:- ' శ్రమలపై జయమిచ్చి నన్ను సిద్ధపర్చుము. ' ఈ స్వరము యేసుప్రభువుకు అవసరము లేదు.
 • ( 5 ) సిద్ధపడిన గుంపు:- ' ప్రభువైన యేసూ! రమ్ము '....... ఈ స్వరమే పెండ్లి కుమారునికి కావలెను. పెండ్లికుమార్తె
 • స్వరములో 3 స్వరములున్నాయి. ఈ మూడు స్వరములు ఒకే స్వరములో ఉన్నవి. ఆ స్వరమే ....... ' మరనాత ' 1కొరిథి. 16:22.
పెండ్లికుమార్తె సంఘము లేక సిద్ధపడిన గుంపు :
 • 1 ) వీరి ముఖ్యమైన బోధ - రాకడ బోధ.
 • 2 ) వీరి రమ్యమైన స్తుతి - శ్రమలో స్తుతించుట.
 • 3 ) వీరి ప్రార్ధన - ప్రభువైన యేసూ! రమ్ము.

ఈ మూడు స్వరములు కలవారే ఈ కాలాంతమందు పెండ్లికుమార్తె సంఘముగా సిద్ధపడుదురు. వీరు దేవకుమారులు. యేసుప్రభువు వీరి బోధే, వీరి స్తుతే, వీరి ప్రార్ధనే కావలెనని కోరుచున్నారు. తక్కినవారి స్వరములు ఆయనకు అవసరము లేదని కనబడుచున్నది. రాకడ కాలములో ఉన్నాము, లోకములో ఉన్నాము. ఇది సిద్ధపడు కాలము, ఎత్తబడుకాలము. కనుక రాకడ బోధ చేయువారెవరో ఈ గ్రంధములో, ఈ వచనములో వారి వివరము కనబడుచున్నది. గనుక రానైయున్న పరలోక వరునితో త్వరలో పరమందు జరగనైయున్న పెండ్లివిందుకు సిద్ధమైయున్న పెండ్లికుమార్తెవలె సిద్ధపడు భాగ్యము; ఆ పరమవిందుకు సిద్ధమైయున్న గుంపుతో కలసి రాకడ మేఘమెక్కి వెళ్ళగల భాగ్యము; పెండ్లికుమారుడుగా రానైయున్న ప్రభువు మీకు అనగా ఈ పాఠము చదువు వారెల్లరకూ అనుగ్రహించునుగాక! ఆమేన్


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद