సిద్ధపడుట - ఆయనయొద్ద ఉండుట

( 12 - 9 -1948వ సం| |లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసగము )

యెష. 40:3 - 4; లూకా. 1:5 - 17; 1 థెస్స . 4:17
"ఆలకించుడి , అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా - అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి" యెష. 40:3.

యేసుక్రీస్తు వారి చరిత్ర పరీక్షించినపుడు మనకు తెలిసిన అంశము లేవనగా, ఆయన జన్మము, బోధ, రోగులను బాగుచెసిన చరిత్ర, పాపుల రక్షణకొరకై సిలువమీద చనిపోయి లేచిన చరిత్ర, ఆయన పరమునకు వెళ్ళిన చరిత్ర. అయితే ఆయన మరల రానైయున్న కథ జరుగలేదు. ఆయన జన్మ కథకు ముందు "ప్రభువు వస్తారని" ఒక కథకుడు చెప్పినకథ నెరవేరెను. ఆయన ఇప్పుడు రెండవసారి వస్తారు. ఈ రెండు కథలకు మధ్య మనమున్నాము.

ప్రభువు భూలోకములో పుట్టకముందు యొహాను వచ్చి, యేసుక్రీస్తు వారు వ వచ్చినారని చెప్పెను. యొహానుగారు ప్రభువుకంటె 6 నెలలకు ముందు పుట్టెను. 30 సం || ల వయసు ఉన్నప్పుడు ఇద్దహరు పనిలో ప్రవేశించిరి. యెహాను ప్రవక్తలు చెప్పిన ఆయన వచ్చెనని చెప్పెను. గనుక మొదట యెహాను చరిత్ర తెలిసికొనవలెను. యెహాను నీతిసూర్యుడైన యేసుప్రభువు రాకకు ముందు వచ్చిన వేగువ చుక్కవంటివాడు. యెహాను రాకతో ఆయన వచ్చినాడని తెలిసిపోయెను. యెహానుకి, చుక్కకి ఉన్న సంబంధము మనకును రాకడకు ఉన్నది. రాకడ బోధకుల పని ఏదనగా, ఆయన రాకకుముందు ' ఆయన వస్తాడు, సిద్ధపడండి ' అని చేసే బోధయే. ఇది ఒక వేకువచుక్క. ప్రభువు వస్తున్నాడనే దానికి ఇదే గుర్తు.ఇంకా అనేకగుర్తులున్నవి.

అన్ని వేకువ చుక్కలే. యోహాను పుట్టకముందు, గుడిలో ఒక పూజారిగలడు. ఆయనపని గుడిని తుడుచుట,శుబ్ర్హము చేయుట, దీపములు వెలిగిచుట. యోహానుకు , ప్రభువుకు మధ్య ఒక ముసలి పూజారి వారు ఉన్నారు. వారికి సంతానములేదు. వారు భక్తిపరులుగా చనిపోవుటకు సిద్ధముగానేయుండిరి. పూజారులు గుడిలోనికి పోవలెను. ఆ కాలమునకు 24గురు పూజారులున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కవారము చేయవలెను. ఆయన వారములో ఆయనే లోపలికి పోవలెను.తక్కినవారు బయట ప్రార్ధించవలెను. మరల భయటకు వచ్చేవరకు వీరు ప్రార్ధించవలెను. లోపలి గర్భాలయములో ఈ పూజారి ధూపము వేయుచు ప్రార్ధించుచుండెను. పూజారి ప్రార్ధనచేసి ముగించితేనేగాని వెలుపలికి రారు. భక్తులు రెండు రకములు

 • 1 ) ఆజ్ఞ ప్రకారము నడుచు భక్తులు
 • 2) ఆచార ప్రకారము నడచేభక్తులు.
ఈ రెంటిలోను భక్తులైయుండవలెను. 'ఆత్మ శుద్ధిలేని ఆచారమదియేల ' గనుక ఆజ్ఞలు, ఆచారములు రెండునూ ఉండవలెను. లోకములో భార్యభర్తలిద్దరును భక్తులుగాయుండవలెను. ఒక్కొక్కరిలో పై రెండు రకముల భక్తి నుండవలెను. యాజకుడిట్లు ప్రార్ధించుచుండగా దేవదూత వచ్చెను. ఆయన హడలిపోయెను. ప్రార్ధనలో హడలిపోవచ్చునా? మనమెంత ప్రార్ధన చేసిననూ దేవదూతలవంటి వారముకాము గనుక హడలిపోవుదము. అయితే ఈ పూజారి దంపతులు మనుషుల ఎదుట భక్తులు, దేవుని ఎదుట భక్తులు. వారు
 • 1. ఆజ్ఞలు , ఆచారములు గలవారు.
 • 2. భార్య భర్తలు ఏకీభవిచువారు .
 • 3. దేవుని ఎదుట , మనుషుయుల ఎదుట భక్తి కలిగినవ్వరు.

దూతవచ్చి భయపడవద్దు నీకు కుమారుడు కలుగునని చల్లని కబురు చెప్పెను.

 • 1 ) భయపడకుము,
 • 2 ) నీ ప్రార్ధన వినబడెను,
 • 3 ) నీకు కుమారుడు కలుగును.
 • 4 ) అతడు గొప్పవాడగునని చెప్పెను. తాను చేసిన ప్రార్ధన వినబడెను.పూజారిగారు సంతానముగూర్చియే ప్రాధన చేసియుండవచ్చును. ఆలాగు జన్మించిన దేవుడు తల్లిదండుల వరమతనికి కలదు. అనగా భక్తి వరము కలదు. కుమారునికి దేవుని ఎదుట గొప్పవాడైయుండు వరము కలదు. గనుక పిల్లలు తల్లిదండ్రులకన్న ఎక్కువ భక్తులైయుండవలెను.
 • 5 ) లోకమునకు రావలసిన రక్షకుని గురించి చెప్పును అనెను.
 • 6 ) మధ్యము త్రాగడు, బైరాగైయుండుననెను.
ఆయన పని 17వ వచనములోనున్నది. ఆయత్తపడిన వారిని ఆయత్త పరచుట అనే పని. ఉదా: ప్రభువు బోధ తెలిసిన వారొక గుంపుగా ఉన్నారు. ఒక బడిలో తరగతి ఉన్నది. అందులో 30 మంది విధ్యార్ధులున్నారు.20 మంది బాగుగా చదివిన వారు పరీక్షలకు ఇంకా వారమున్నదనగా పాఠములు తిరగవేస్తారు. అశ్రద్ధ గలవారు 10 మంది గలరు. వారిని విడిచిపెట్టి శ్రద్ధ గలవారికే మరలా చెప్పవలెను. ఎందుకనగా వారము మాత్రమే ఉన్నది. ఎవరైతే ప్రభువు కొరకు కనిపెట్టిరో , వారికే బోధించుము అని దూత యోహానుతో చెప్పెను.ప్రభువు కొరకు సిద్ధపడియున్న వారిని మరల సిద్ధపరచుట కై ఆయన వచ్చెను. ఆ కాల భక్తులు రెండవసారి వస్తారని మీరు విన్నారా? విని సిద్ధపడుచున్న మిమ్మును సిద్ధపరచుటకై, ఈ బోధలు బయలు దేరెను. వారిని ఇంకా సిద్ధపరచలేకపోతే, వారుకూడ వెళ్ళరు. సిద్ధపడనివారికి కూడ చెప్పవలెను. అందరికి చెప్పుచు సిద్ధపడుచుండవలెను. ఈ రాకడ బోధకులు ఎక్కువ మంది కావలెను. రాకడ బోధకు సిద్ధపడుటకు " రండి" అంటే మాకు తీరుబడి లేదందురు. సిద్ధపడియున్నవారికి బోధించెటందుకు. అనేకమంది బోధకులు కావలెను. జకర్య, ఆయన భార్య ముసలివారయ్యే వరకు ప్రార్ధించేవారు. ఆలాగే మనము ప్రార్ధించవలెను. వారు ప్రార్ధించెను గనుక కుమారుడు పుట్టెను. ఆలాగే మీరు ప్రార్ధించితే బోధకులనేకులు వత్తురు. ఈ కాల మందు బాగా సిద్ధపడువారు ఎవరంటే; ఎవరు బాగా ప్రార్ధించుదురో ఎవరు ప్రార్ధన ధూపము బాగా వేస్తారో , ముసలి తనము వచ్చిననూ, ప్రార్ధిస్తారో వారే సిద్ధపడుతారు.

వారే రాకడను నమ్ముచున్నారు. వారు విన్నారు, ప్రార్ధించుచున్నారు, కనిపెట్టుచున్నారు, సిద్ధపడినారు. ఇంకా బాగా వినేటందుకు ఇంకా గొప్ప బోధకులను పంపించుము. యోహానులాంటి భక్తులను, వరపుత్రులను పంపుము. యోహాను, యేలెయాయొక్క ఆత్మయు, శక్తియుగలవాడు. యేలెయా గుణము ఏదనగా, మనిషినిచూచి ఆయన ఎటువంటి వాడో చెప్పుట. యోహానుకూడా అటువంటివాడే. ఇప్పుడు ముఖ్యముగా రాకడ బోధ చేయవలెను. 'వినుట, నమ్ముట, ప్రార్ధించుట, కనిపెట్టుట; వీటితో మనము కొంతవరకు సిద్ధపడినాము. అయితే ఆయన యొద్ద ఉన్నయెడల పరిపూర్ణముగా సిద్ధపదుదుము.

లూకా, 8:38; మార్కు. 5:18లో నన్ను నీయొద్ద ఉండనిమ్ము అని ప్రభువు వలన స్వస్థత నొందిన యొక గదరేనీయుడు ప్రార్ధన చేసెను. అతడు కోరుకొన్న నివాసము, ప్రభువు సన్నిధానము. అతడు చేసిన ప్రార్ధన. 'నీయొద్ద ఉండనిమ్ము ' అనునది నీవు ఆయన సన్నిధిని కోరుకొనుట లేదా? ఉండనిమ్మని ప్రార్ధించుటలేదా? ఈ కోరికయందును, ఈ ప్రార్ధన యందును నిలకడగా నుండుము. గోరీలలోనుండినవాడు, దయ్యములతో నుండినవాడు, దిగంబరియైయుండినవాడు, మార్గస్థుల మీద పడవలెనని ఉగ్రుడై వెళ్ళుచుండినవాడు, నేడు యేసునొద్ద నుండగోరుచున్నాడు. ఎంత గొప్పమార్పు. ఎంత గొప్ప కోరిక! ఎంత గొప్ప ప్రార్ధన! అతని దుస్థితి జీవితమంతయు పూర్తిగా మారిపోయెను. ఇదివరకు అతనికుండిన దుస్థితి అంశములన్నియు అతడు విడిచిపెట్టెను. నూతన పురుషుడాయెను. ఇతరులకు హానిచెయగోరి వెంటబడిన ఇతడు ఇప్పుడు యేసుప్రభువు వెంటబడినాడు. హానిచేయుటకు కాదుగాని ఆయనను ఆశ్రయించుటకే. యేసుప్రభువు తనకు చేసిన మహోపకార కార్యములనుబట్టి అతనిలో కృతజ్ఞత ఉద్భవించెను. అతనిలోనుండి, కృతజ్ఞతగల హృదయములో నుండి , ' నన్ను నీ యొద్ద నుండనిమ్ము ' అను ప్రార్ధన వెడలివచ్చెను. ప్రభువువలన రక్షింపబడిన వారందరు ఈ ప్రార్ధన చేయగలరు. ఎల్లప్పుడు ప్రభువు వద్దనే ఉండగోరుదురు. విమోచన కలిగి ఉండుటకు ఇట్టి కోరికగల ప్రార్ధన, మంచి గురిగానుండును. బాగుపడిన వారు ప్రభువు దగ్గర నుండగోరుదురు. బాగుపడని వారికి ఇట్టి కోరిక యుండదు. అదివరలో యేసుప్రభువు ఒక స్థలమందు ఉండెను. ఇతడు మరొక స్థలమందుండెను. ఇప్పుడు ఇద్దరు ఒక స్థలమందే ఉండవలెనని అతడు కోరెను.

రక్షితులు ఈ జీఅవాంత పర్యంతము యేసునొద్దనే ఉండగోరుదు. అప్పుడు జీవాంతమందు పరలోకములో నిత్యము ఆయన దగ్గర నుండగల భాగ్యము లభించును. ఇక్కడ ప్రభువు దగ్గర నుండని యెడల పరలోకములోఎట్లుండగలము? ఆ రోగి ప్రభువు నొద్ద శరీరరీతిగ నుండగోరెను. ప్రభువు కోరినది అది మాత్రమేకాదు. ఆత్మ రీతిగ రక్షితామ తనయొద్దనుండవలెనని ప్రభువు కోరును. అవతార కాలమందు అనేకులు ప్రభువు నొద్దనుండిరి. వారందరు ఆత్మరీతిగా ఆయనయొద్ద నుండిరా? లేదు. శరీర రీతిగానే ఉండిరి. భూలోకమందు శరీర రీతిగాను, ఆత్మరీతిగాను, ప్రభువుయొద్ద నుండిన సువార్తికుడైన యోహాను ఇప్పుడు పరలోకమందు ఆయనయొద్ద నున్నాడు. మనకాలమందు మనము ప్రభువునొద్ద శరీరరీతిగా నుండుటలేదు గాని ఆత్మరీతిగా నున్నాము. శరీరరీతిగా ఆయనను ఎరిగియుండి, ఆత్మరీతిగా ఆయనను ఎరుగనివారు ధన్యులు కాగలరా? కాలేరు. శరీర రీతిగా నెరుగకపోయినను ఆత్మరీతిగా నెరిగియున్న యెడల అట్టివారు ధన్యులే. చదువరీ! " నన్ను నీయొద్దనుండనిమ్ము" అను ఈ చిన్న గొప్ప ప్రార్ధన ప్రతి దినము చేసికొనగవా? ప్రభువు మేఘాసీనుడై వచ్చుచున్నాడని విశ్వాసులెదురుచూచుచున్నారు. ఇక్కడ ఆయనతో నుండగోరి ప్రార్ధించుచున్న నీవు, ఆయనతో రేపు మేఘములోకూడ నుందువు కదా? నూతన యెరూషలేములో నుందువుగదా? రెండవ రాకడ సమీపముగానున్న ఈకాలమునకు ఇది తగిన ప్రార్ధనే అని నీకు తోచునా? అట్లైనా ఈ ప్రార్ధన చేయుట మానవద్దు.

విజ్ఞప్తి ప్రార్ధన:- తండ్రీ! " నీయొద్ద నుండనిమ్ము". నా పూర్వ దుథితిలోనికి నేను మరల వెళ్ళకుండునట్లు నీయొద్దనుండనిమ్ము! నీ వలన ఉపకారము పొందిన నేను నిత్యము స్వస్థ చిత్తుడనైయుండు నిమిత్తము నీయొద్ద నుండనిమ్ము. దయ్యములనుండి నీవలన విమోచన పొందిన నేను , మరల దయ్యముల వశము కాకుండునట్లు నీయొద్దనుండనిమ్ము. పైలోకమున నీయొద్ద నుండునట్లు, ఈ లోకమున నీయొద్దనుండ నిమ్ము. ఎవరిని నీయొద్దనుండ నిమ్మని నేను నన్ను; దిగంబరినైయుండిన నన్ను; నిన్ను ఎరిగియుండని నన్ను నీయొద్దనుండనిమ్ము. ఉండనిమ్ము; నన్ను వెళ్ళిపోనియ్యవద్దు. నీ యొద్ద ఉండనిమ్ము! నయొద్ద ఉండుటకే నాకు సెలవిమ్ము. ఆమేన్.

యేసే మన నివాస స్థలమైయున్నాడు కీర్తన. 90:1 ప్రభువా తరతరములనుండి మాకు నివాస స్థ లము నీవే. ఆలాగున పరలోక నిత్యవాసియగు ప్రభువు యొద్ద ఎల్లప్పుడు ఉండగోరే అంతస్థు ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद