సమాజముగా కూడుకొనుట - 1

(1940వ సం| | లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

నిర్గ. 35:1-3; మత్త. 4:23; హెబ్రీ. 10:24 - 25 'కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకుకును, సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచితము ' హెబ్రీ. 10: 24 - 25.

ప్రార్ధన:- వాక్య దానకర్తవైన ఓ తండ్రీ! వాక్యముద్వారా వర్తమానము అందిచుము. నీ వాక్య సారాంశము హృదయ నేత్రములకు కనబడునట్లు నీయాత్మతో మమ్మును నింపుము. మా జ్ఞానమును నీ యాత్మతో వెలిగించుము. అప్పుడు అద్భుత విషయములు గ్రహించగలము. నీ ఆత్మతో మా మస్సాక్షిని శుధీకరించుము. అప్పుడు నీ వక్యప్రకారము నడచుటకు మాకు ఇష్టము పుట్టును. కూడియున్న ఒక్కొక్కరికిని వర్తమాన మందించుము. నీ వాక్తము మాకు విడచెప్పుము. మర్మమైన విషయములు బయలు పరచుము. ఈ మా ప్రార్ధన నీ కుమారునిద్వారా అంగీకరించుము. ఆమేన్.

అపోస్తలుడైన పౌలుగారు పై వాక్యమును ఒకటవ శతాబ్దములో వ్రాసిరి. ఇప్పుడు మనము 21వ శతాబ్దములో ఉన్నాము. ఇన్ని శతాబ్దములలోను సంఘమున్నది. ఆ మొదటి శతాబ్దములోనున్న ఆది సంఘములో బలహీనులు గలరు. వారు సమాజముగా కూడుట మానివేసిరి. ఇప్పుడు కూడ ఈ 21వ శతాబ్దములోకూడ సమాజముగా కూడుత కొందరు మానివేయుచున్నారు. అక్కడనున్న లోపము ఇక్కడకూడ నున్నది. సంఘము అన్ని శతాబ్దములలోను మీటింగులు ఏర్పాటుచేయుట, క్రొత్త పద్దతుల ప్రకారము సేవచేయుట గలదు.

 • 1. ఆదివారము అందరు గుడికి రావలెను.
 • 2. వారములో ఏదోయొక దినమందు అందరూ కూడుకొనవలెను. ఇది గాక ఇంకా ప్రత్యేక సమయములు గలవు.
సమాజముగా కూడుకొనుట వీలు ప్రకారము చేయవలెనుగాని సిద్ధాంత ప్రకారముకాదు. గ్రామములో వ్యాధులున్న కూడుకొనవలెను. అలాగే యుద్ధములు జరుగునప్పుడుకూడ కూడుకొని ప్రార్ధింపవలెను. సంఘము కూడుకొనుటలేదని పౌలు వ్రాయలేదుగాని, కొందరుకూడుకొనుట మానుకొనుచున్నారని వ్రాసెను. ఇద్దరు ముగ్గురు కూడుకొనవచ్చునని ప్రభువు చెప్పెను ఆ కొడుకొనని వారి కోసము సంఘము ఆగలేదు గాని, కొందరు ఆగిపోయినందుకు పౌలునకు ఆయసముగా నుండెను. వారు మానినట్లు మీరు మానవద్దని సలహాలిచ్చుచున్నాడు.
 • ( 1 ) ' మానివేయవద్దు,
 • ( 2 ) కూడుకొనండి '
అని రెండు గొప్ప సలహాలు ఇచ్చునాడు .కూడుకొనుటలో ఉద్దేశములు భేదము కావచ్చునుగాని కూడుకొనుట మాత్రము ఒకటే. కొందరు ఎందుకు మానుకొనుచున్నారు? కారణముల జోలి మనకక్కరలేదుగాని కూడుకొనుట మన గురియై ఉండవలెను.
 • 1. కూడుకొనవలెను.
 • 2. ఎక్కువగా కూడుకొనవలెను.
ఎంత ఎక్కువగా కూడుకొనిన అంతమేలు. రానైయున్న 'ప్రభువు రాకడ సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకొనండీ అని హెచ్చరించెను. ఒక్క అరగంటయైన కూడుకొనిన చాలును. అది ప్రభువుతోనున్న సంఘము అగును. మనము రాకడ సమీపించుకొలది సామాన్యముగా కూడుకొనుటకంటె ఇంకా ఎక్కువగా కూడుకొనవలెను.

1వ శతాబ్దము వారికి రాకడ తలంపు ఉన్నది. 21వ. శతాబ్దములో నున్న మనకు రాకడ తలంపు గలదు. గురుతులు జరుగుకొలది,

 • 1. సామాన్యకూటములు ఎక్కువగా చేయవలెను.
 • 2. వృద్ధి కూటములుకూడ చేయవలెను.
వృద్ధికూటములలో రాకడ సంగతులు జ్ఞాపకము చేసికొనవలెను. వక్య ఉద్దేశమునైయున్నది. పౌలు కాలములోనే రాకడ తలంచుకొనవలెనంటే, మనము రాకడకు ఇంకా దగ్గరున్నాము గనుక మనమెక్కువగా కూడుకొని కూటములు చేయవలెను. అనేక పర్యాయములు మనకు నిరుత్షాహము కలుగును. అయినను మన గురి రెండవ రాకడ గనుక ఎక్కువగా కూడుకొనవలెను.

ఒకరినొకరు హెచ్చరించిచుకొనవలెనని వాక్యములో గలదు. పట్టణములలో గంటకొట్టిన కూటములకు వస్త్తారు గనుక అదే ప్రేరేపణ గ్రామములలో పిల్లలు ఇంటింటికి వెళ్ళి గుడికి రమ్మని చెప్పుదురు. తర్వాత సఘపెద్దలు ఇంటింటికి వెళ్ళి గుడికి రమ్మని చెప్పుదురు. తర్వాత సంఘపెద్దలు ఇంటింటికి వెళ్ళి వారిని రమ్మని ప్రేరేపించెదరు. ఈలాగు ప్రేపించుట ఆరంభమునుండి గలదు. కొన్నిచోట్ల శనివారము రాత్రి ఇంటింటికి గంట మ్రోగించే అలవాటుగలదు. కొన్నిచోట్ల వీధుల గుండ కొందరు కలిసి కీర్తనలు పాడుకొనుచు వెళ్ళుదురు. ఈ రీతిగా కూటములకు వచ్చుటకు ప్రేరేపణలు ఆదినుండి గలవు. నలుగురితో కలిసి కీర్తనలు పాడుట, ప్రార్ధనలు చేయుటవలన మనసుకు శాంతి కలుగును. విచారము తగ్గునని కూటములు చేసికొందురు.

 • 1. అరచుగా కూటములు పెట్టుట.
 • 2. అనేకులను ప్రేరేపించుట మానకూడదు.
పౌలు కాలములో ప్రే రే పించు పనిగలదు. కూటములు మానుకొనువారు మనకు మాదిరికాదు. తరచుగా కూడుకొనువారు మనకుమాదిరి, తరచుగా కూడుకొనుటకును, ప్రేపించుటకును దేవునికృప మీకు తోడైయుండును గాక! మరియు వాక్యములో
 • 1. ప్రేమ చూపుటకు
 • 2. సత్కార్యములు చేయుటకును అని గలదు. ఇక్కడ రెండు రకముల మీటింగులున్నవి.
  • ( 1 ) మానుకొనే మీటింగు,
  • ( 2 ) కూడుకొనే మీటింగు.
  ఆలాగే, రెండురకముల ప్రేరేపణలున్నవి.
  • ( 1 ) రండి అనే ప్రేరేపణ ,
  • ( 2 ) ప్రేమ వృద్ధి చేసికొనండి అనే ప్రేరణ.
  మంచి కార్యములు వృద్ధి చేసికొనండి అనే ప్రేరణకు వచ్చినాము గనుక ఒకరినొకరము ప్రేమిచుకొనవలెను. వారు వీరిని, వీరు వారిని ప్రేమింపవలెను. ఒకరి చెడుగు చెప్పుకొనుట, అల్లరిచేయుట కాదుగాని, రాకడను గూర్చి తెలిసికొనుటకు, ఆ రాకడ ప్రేరేపణ కలుగుటకు కూటములకు రావలెను.

  కూటములవలన ఉపకారములు:- ప్రేమ వృద్ధియగును. సంభాషణవల్ల సంతోషము వృద్ధియగును. మంచికార్యములు చేయుటయందుకూడ ఆ వృద్ధి కనబడును. ప్రేమ స్వభావము ఏమిటో తెలియవలెను. ప్రేమలో ఉన్న వృద్ధి కలిగించుకొనవలెను. ప్రేమ పనులు వృద్ధికావలెను. ఇవి బోధకుని బోధలో నుండును గనుక మీటింగులకు హాజరుకావలెను. ప్రేమవృద్ధి, మంచిపనులు వృద్ధి, రాకడ తలంపుల వృద్ధి; వీటికి కారణము తరచుగా కూడుకొనుట. వాక్యము చివర 'ఆలోచింతమూ అని ఊన్నది. ఇది ముఖ్యమైనది. అందరు కూడుటవల్ల పద్ధతులు ఆలోచించగలము. ప్రేమ తగ్గినది, వృద్ధియగుటకు ఏమిచేయవలెను? అని ప్రేమ వృద్ధియగు పద్ధతులు ఆలోచించుటకు కూడుకొనుట అవసరము. క్రొత్త బోధలు, క్రొత్త అనుభవములు కూడుకొనుట వలన కలుగును.గనుక వాక్యము వినువారమైన మనము సాధ్యమైనంతవరకు ప్రతిదినము కూడుకొని, దేవుని వాక్యమును పఠించి, ధ్యానించి ఆయన రాకడకు సిద్ధపడుముగాక! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद