ఆటంకముల మేఘములు

(1955వ సం| | లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

యెహెజ్కేలు 37: 14; యోహాను 14:2; 2కొరింథి. 5:1
'మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను.' యొహా. 14:2.

ప్రార్ధన: - యేసుప్రభువా! ఎదిగో వెళ్ళుచున్నాను అని అన్నావు. అయినప్పటికిని సదా మీ దగ్గరే ఉన్నాను. అనికూడ చెప్పావు. వెళ్ళడం ఒకేసారి, ఉండడం ఒకే సారి అని అనుటద్వారా నీవు దేవుడవని గ్రహించుచు నీకు వందనములుచేస్తున్నాము. ఇదిగో తేరగా వచ్చి మిమ్మును తీసికొనివెళ్తాను అని అన్నావు. కాబట్టి నీకు వందనములు.సంఘము నీ రాకడ కొరకు ముఖ్యముగా ఈ దినములలో తలంచుచు ఎదురుచూచుచున్నది. మమ్మును సిద్ధపరచుము . నేటి వర్తమానము మాకు అనుగ్రహించుము ఆమేన్.

మనము ఎన్ని పండుగలు గురించి మీటింగులు చెసికొన్ననూ, ఎన్ని అంశములమీద ప్రత్యేక కూటములు పెట్టుకొన్ననూ, చివరకు ప్రభువు రాకడను గురించి మాట్లాడుకొనకపోతే పుల్ స్టాప్ పెట్టనటే. ఉదయమున నిన్న చెప్పిన అంశములు ముగించలేదు. అయినప్పటికిని రాకడను గురించి రవ్వంత ఇప్పుడు వచ్చినటువంటి వర్తమానము చెప్పుదును. అది క్రొత్తది కాదు. నేను చెప్పడం క్రొత్తదిగాని సంగతి క్రొత్తది కాదు అది మీకు తెలిసినదే. అదే ఆటంకముల జాబిత:

  • 1. ప్రార్ధనకాదు గాని అది ప్రార్ధ్నే. యేసుప్రభువా! ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పావు. ఏది? త్వరగా ఏది? 20వందల ఏండ్లు అయింది. 20 వందల 7 ఏండ్లు అయినది. అయిననూ రాకడ ఇంకా రాలేదు. 'అది త్వరగా ఎందుకయ్యింది!' అని నా గుండె కొట్టుకుంటున్నది. రాకడకు ఇది మొదటి ఆటంకము.
  • 2. ఆ పైన ఆకాశములో, ఈ క్రింద భూమి మీద గురుతులు జరుగునని; సూచనలు, రాకడ జాడలు జరుగుతాయని చెప్పావు, అవి జరుగుతున్నాయి. గాని నీ రాకడ ఇంకా రాలేదు. మరి అయితే త్వరగా అంటే ఏమన్నమాట? నా గుండెలో చాలా అదురున్నది. గాని ఆశకూడ ఉన్నది నీవు త్వరగా రావాలని!
  • 3. ఈ ప్రక్కను చూస్తే రాకడకు నేను సిద్ధముకాకుండా అన్నీ అడ్డాలే. ఆ అడ్డాలలో కొన్ని ఉదయానే చెప్పాను. ఆయా అంశములన్ని ఎప్పుడు ప్రార్ధన చేయాలి. అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? సంఘములు ప్రార్ధన చేయకపోతే సంఘము సిద్ధపడేదేలాగు? లోకమును సిద్ధపర్చడమేలాగు? ఆ అంశములన్ని మనము ప్రార్ధన చేయకపోతే, మన ప్రార్ధనకు పుల్ స్టాప్ లేదన్నమాట. అనగా ముగింపుకాలేదు. ఉదయము చెప్పిన ఆటంకములుకాక నాలోనే, లోపలకొన్ని ఆటంకములున్నవి. నాలో అనగా వరండా మీద ఉన్న నాలోనే పూర్తిగాకాదు. నేనున్న సంఘములోను ఆటంకములున్నవి.
  • 4. ఆటంకములంటే ప్రశ్నలు. ప్రభువు చెప్పినాడుగాని ఆయన ఎప్పుడో వత్స్సడు. ఈ లోపల వట్టివట్టిరాకడ ప్రార్ధనలన్ని ఎందుకు చేయాలని సంఘమంటున్నది. ఈ సంఘములో కొందరు, ఆ సంఘములో కొందరు అనేది వినగా వినగా నాకు కూడ ఆలాగే అనిపిస్తుంది. ఇదొక గొప్ప ఆటంకము.
  • 5వ ఆటంకము ఏదంటే వెనుకకు చూడాలని, రెండువేల సం | |ములలో అనేకమంది భక్తులు రాకడ కొరకు ఎదురుచూచి చనిపోయారు. వారివలె నేనుకూడ రాకడనిమిత్తము కనిపెట్టి, చచ్చిపోతానేమో అనే అనుమానము, భక్తులకు రాకడ భక్తులకు కలుగుచున్నది. అది గొప్ప ఆటంకము.
ఈ 5 ఆటంకములుంటే రాకడకు సిద్ధపడుట ఏలాగు? ఒక ఆటంకమునకంటే ఒక అటంకము మరియొక ఆటంకము మించిపోయినవి. వెలుపలి ఆటంకాలే, లోపలి ఆటంకాలుకూడ ఉన్నాయి. వెలుపటి వాటికంటె, లోపటివే ఎక్కువబాధ. "వెలుపట బహు యుద్ధములు లోపటను" ఇప్పుడు చెప్పిన చిన్నపాటము 'ఆటంకాల పాఠము '.

  • 1. త్వరగా వస్తానన్నావు. రాలేదు
  • 2. గురుతులు వస్తాయన్నావు. అవి వస్తాయన్నావు. అవి వచ్చినవిగాని నీవు రాలేదు.
  • 3. లోకములో నలువైపులా ఆటంకాలే. అయినా నీవు రాలేదు.
  • 4. సంఘము - నీవు ఎప్పుడు వస్తావుగాని ఇప్పుడు కాదంటున్నది. అయినా నీవు రాలేదు.
  • 5. భక్తులలోని ఆటంకములు. అయినా నీవు రాలేదు .

"త్వరగా" అనే దాని అర్ధము ఇంత ఆలస్యమా! గనుక ఇదంతా వట్టిదే అంటున్నారు. గనుక రాకడను గురించి చెప్పేటప్పుడు టక్కున కుదిరేటట్టు చెప్పవలెను. మళ్ళీమళ్ళీ ప్రశ్నలు లేకుండేటట్లు చెప్పవలెను. త్వరగా అనేది ఒక్కటే చూచుకుంటే ఏలాగు? "గురుతులు" ఒక్కట్తే చూస్తే ఏలాగు? " లోకము" ఒక్కటే చూస్తే ఏలాగు?"సంఘము" ఒక్కటే చూస్తే ఏలాగు? వెనుకటి మృతులైన భక్తుల చరుత్ర ఒకటే చూచుకుంటే ఏలాగు? ఈ 5ను 5 మేఘములు. ఇవి నీతి సూర్యుడు అనే క్రీస్తు ప్రభువును చూడకుండా చేస్తూ ఉన్న, మన మనోనేత్రముల కప్పివేస్తున్న మేఘములు. మన ఎదుట ఉన్న ఒక వస్తువును చూడవలెనంటే ఎదిట్ ఎదుట ఉన్న తెర ఒత్తిగించిచుకొని చూడవలెను.అట్లే ఈ 5 తెరలు దట్టమైన మేఘములవంటివి. ఈ 5 తెరలు ఒత్తిఒత్తిగిచుకొనిచూస్తే ప్రభువు కనబడిన యెడల మహాధైర్యానందములు కలుగును.

"త్వరగా రానున్న యేసూ" రాకడ ధ్యానముయొక్క అనుభవములు కొన్ని చెప్పుదును. 1. ముఖ్యమైన గుర్తులు అనగా 1900ల నుండి జరిగినవి కొందరు భక్తులు వ్రాసిరి. వారు గతించిరి. ఆ తరువాత 10 సం| | లలో ఏయే గుర్తులు జరిగినవో మరికొందరు వ్రాసిరి. వారును చనిపోయిరి. ఈ 107 సంలలో జరిరిగిన గుర్తులు వ్రాసిన వారును గతించిరి. ఇలాగు జరుగుచు వచ్చినది. ఇంగ్లీషులో హెరాల్డ్ ఆఫ్ ఈజ్ కమింగ్ అనే పత్రికలో ఈ గురుతులన్నీ వ్రాస్తారు. ఆ పత్రికాధిపతుల చేతులు ఎన్ని ఉంటాయి. ప్రతి దేశములోను రాకడను గురించి, ఆత్మ బాప్తిస్మమును గురించి ఎక్కువగా మాట్లాడుచున్నారు. ప్రాపసీ అనే అనే చిన్న పుస్తకములో వారు జరగబోయే ఇతర సంగతులు, క్రీస్తు సంగతులు వ్రాస్తూ ఉందురు. లోకములో ఉన్న ఈ పత్రికలన్ని తెప్పించి ఆ పత్రికలోనున్న ముఖ్య సంగతులు గుర్తు పెట్టుకొని ఇస్తే, వారు వ్రాస్తారు. ఇటువంటి పత్రికలన్ని అమెరికాలో ప్రకటింపబడుచున్నవని తెలిసి మద్రాసులో ఒక కుటుంబమువారు ఈలాగు వ్రాయుటకు ఒక పత్రిక ఆరంభించిరి. తర్వాత భవిష్యత్తులో ఈ వ్రాతలు వ్రాసేవారుండరు. రాకడను గురించి, గుర్తులను గురించి మనము చెప్పేవన్ని చిన్న చిన్న నీటి బొట్టులవంటివి. (అనగా చిన్న/ కొద్ది అంశములే). ఎవరైతే కనిపెట్టుదురో వారికి రాకడ గురుతులు, రాకడ సంగతులు పూర్తిగా తెలియబడును యేసుప్రభువునుగూర్చికూడ మనము పూర్తిగా చెప్పకపోతున్నాము. ఆ చెప్పేవికూడ నీటి బొట్టులవంటివే.

అయితే, రాకడ విశ్వాసికి అన్నీ పాటలే. ఏదిబడితే అదే పాడుదురు.
ఓ రాజా! నీ తలపే నాకు ఎంతో హాయి.
ఓ వరుడా! నీ తలపే నాకు ఎంతో హాయి
ఓ వధువా! నీ తలపే నాకు ఎంతో హాయి

ప్రార్ధన: - త్రియేక దేవుడవైన తండ్రీ! సర్వశక్తిగల తండ్రీ! ఎన్నికోట్లమంది ఎన్నికోట్ల మనవులు, చేసినప్పటికిని నీవు సుళువుగా నెరవేర్చగలవు. గనుక నీకు స్తొత్రములు. ఈ వరండామీద ఎన్నెన్నో కోట్లమందిలేరు. ఎన్నోకోట్ల మనవులు, ప్రార్ధనలు లేవు. కొద్దిమంది కొన్ని ప్రార్ధనలున్నవి. ఇవే నెరవేర్చలేవా? నెరవేర్చుతావని నమ్మితే నెరవేర్చగలవు.

కొంతమందియొక్క హృదయములలో వారిని విడిచిపెట్టని పాపములు కలవు. ప్రార్ధిస్తున్నారు. వాటిని వదలించగలవు. నీకు స్తోత్రములు. ఆత్మస్థితి ఈలాగుండగా కొందరికి శరీరములో అనారోగ్యము కలదు. అది వారిని వదలిపెట్టకుండా ఉన్నది. నీవు వదలించగలవు. నీకు స్తోత్రములు. వీరిలో కొంతమందికి కొన్ని విషయములలో కొదువలున్నవి. అవి వారిని వదలకుండా ఉన్నవి. కాని నీవు వదలించగలవు. గనుక నీకు స్తోత్రములు.ఇక్కడున్న వారిలో కొంతమది సంతానము లేదనే విచారమున్నది. అది వారిని వదలకుండా ఉన్నది. నీవు వదలించగలవు స్తోత్రములు. కొందరికి కొన్ని విషయములలో దురాత్మ పీడించుచున్నది. అది వదలకుండా ఉన్నది. నీవు వదలించగలవు స్తోత్రములు. కొందరిలో రకములైన చిక్కులు ఉన్నవి. అవి వారిని వదలిపెట్టడములేదు. నీవు వదిలించగలవు. కాబట్టి నీకు స్తోత్రములు. కొందరిలో తమ స్వజనులయొక్క కష్టముల నివాణ కొరకైన ప్రార్ధనలు ఉన్నవి, నెరవేరనివి ఉన్నవి. అవి వారిని పీడించుచున్నవి. వారిని వదలడములేదు. నీవు వదలించగలవు స్తోత్రములు. కొందరిలో రక్షణ గురించియు, రాకడను గురించియు అప్పుడప్పుడు సదేహములు వచ్చి; ముందుకుసాగి వెళ్ళుచున్నవారిని వెనుకకు లాగుచున్నవి. ఆ లాగడమును వారు తప్పించుకొనలేక పోవుచున్నారు. నీవు తప్పించగలవు. గనుక స్తోత్రములు. ఇప్పుడుదహరించినవి కాక ఇతర కష్టములుకూడ కలవారు కలరు. తృప్తిలేనివారు, సమాధానము లేనివారు, శాంతి లేనివారు, నెమ్మది లేనివారు, ఏమిచేమిచేయవలెనో తోచనివారు, ఎంత చెప్పిన నచ్చనివారు; వీరిని గురించికూడ ప్రార్ధితునాము. వారిలో ఉన్నవి విదల్చివేసి శాంతి కలుగజేయగలవు. స్తోత్రములు. ఎవరైతే స్వషానమునకు ప్రయాణమై వెళ్ళవలసి ఉన్నారో, వారికి నీదూతయొక్క సహాయము అనుగ్రహించి సురక్షితముగా తీసికొని వెళ్ళుదువని నమ్ముచున్నాము. నీకు స్తొత్రములు. మరల మేము ఎప్పుడుకూడుకొనవలెనో, అప్పటి స్థలమునకు కూడుకొనేటట్లు కృప దయచేయగలవు. అనేక స్తోత్రములు. చిన్న పిల్లలను, స్త్రీలను, మగవారిని, పెద్దవారిని, అందరిని దీవించుమని ఇక్కడ నేర్చుకొన్న విషయములు ఇతరులకు చెప్పి సంతోషింపజేయుమని వేడుకొనుచున్నాము. ఈ రెండు దినములకూడికవల్ల నీకు మహిమ కలుగునట్లు త్వరగా వస్తువున్న ప్రభువు ద్వారా మా ప్రాధనలు ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद