నోవాహు నావ - పెండ్లికుమార్తె ఎత్తబడుట

(1940వ సం| | లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

ఆది. 19: 19; మత్త. 25:10 - 11; 1యోహాను 1:1 - 3
"అప్పుడు యెహూవా ఓడలో అతని ( నోవాహును ) మూసివేసెను" ఆది. 7:16 )

దేవుని మాట చొప్పున ఆయన తీర్పు దినమున జలప్రలయము భూమిమీదకి వచ్చినపుడు నోవాహు ఓడప్రక్కన నీరుగలదు. ఈలోకములో క్రైస్తవుని బ్రతుకుకూడ ఆలాగే యుండును.చుట్టును ఆపదలో నిండియుండును.

  • ( 1 ) కొన్ని ఆపదలు మనిషి తెలివి తక్కువ వలన, అజ్ఞానము వలన వచ్చును. వీటిని ఓడ అడుగున నున్న నీటితో పోల్చవచ్చును.
  • ( 2 ) మరికొన్నీఅపదలు ఇతరులవలనవచ్చును. వీటిని ఓడ ప్రక్కనున్న నీటితో చెప్పవచ్చును.
  • ( 3 ) మరికొన్ని కష్టములు పైనుండి దేవుని దేవుని అనుమతి వలన కలుగును. వీటిని పైనుండి పడు జలధారకు సరిపోల్చవచ్చును. మనకు బుద్ధి చెప్పుటకు, మనలను సరిజేయుటకు దేవుడు వీటిని రానిచ్చును.

దేవుడు నోవాహును ఓడలోనికి "రమ్ము" అని పిలిచి తలుపులు మూసివేసెను. అనగా దేవుడు ఆ ఓడలో నున్నాడు. అందులో ఉండి నోవాహును పిలిచెను. విశ్వాసి జీవితములో కూడ బహిరంగ శరీరమునకే ప్రభువు శ్రమలు పంపించును. అంతరంగములో ప్రభువు ఉండును. గనుక విశ్వాసి భయపడడు. ప్రభువు ఆపదలను విశ్వాసి లోపలికి ప్రవేశింపనియ్యడు. గనుక విశ్వాసి భయపడనక్కరలేదు. దేవుడు మనకు అన్ని సదుపాయములుఇచ్చి , తుదకు రక్షణకూడ ఇచ్చినను మనుష్యునికి ఇంకను సందేహమే. మనిషి వృద్ధిలోనికి రాకపోవడమునకు కారణము భయము. ఎన్ని కష్టములున్నను ప్రభువు మన చెంత నున్నాడు ' అను దృష్టి మానవుడు కలిగియుండవలెను. ఆయన లేకుండ విశ్వాసిని ఎప్పుడు ఓటరిగా కష్టములలో నుంచడు. ఓడలోనికి నీరు రాకపోవడమునకు కారణము ఓడకు కీలుపూసి యున్నారు. గనుక ఓడలోపల నున్న వారికి కీడు రాలేదు. మరియు ప్రభువు వారితోనున్నారు. ఒకవేళ శరీరమునుబట్టి భయము కలుగవచ్చును గాని హానిమాత్రము ఉండదు. సొదమలో దూతలు లోతును లోపలికి లాగి తలుపువేసిరి. ఎందుకనగా బయట శత్రువులున్నారు. ఆలాగే విశ్వాసికి కష్టముండునుగాని హానిమాత్రము రాదు. మరియు పరలోకమే ఈ నావ అనికూడ చెప్పవచ్చును. భూమిమీదనున్న అవిశాసులు నావకు ప్రక్కనున్న నీటితో సరిపోల్చవచ్చును. వీరు సంఘమునకు శత్రువులు, అయితే పెండ్లికుమార్తె 7సం| | ల శ్రమలు రాకముందే, ఆ శ్రమలను చూడకుండనే వెళ్ళిపోవును. ఆలాగు ప్రభువు పెండ్లికుమార్తె సంఘమును తీసికొనిపోవును. ఉదా: ఒక గ్రామములో ఇంకను రెండు లేక మూడు దినములకు కలహము వచ్చునని తెలిసి ఆడపిల్ల తండ్రి తన బిడ్డ కలహములలో పడకుండ తీసికొనిపోయెను. ఆలగే 7 ఏండ్లు శ్రమలలో పడకుండ ప్రభువు సంఘమును తీసికొని 37వ. పేజి. వెళ్ళును. ఓడ అరారాతు కొండపైకి వెళ్ళి క్రిందికి దిగినరీతిగా, పెం డ్లి కుమార్తె ఎత్తబడి, నూతన యెరూషలేములో ఏడేండ్లు విందులోనుండి తర్వాత క్రీస్తు ప్రభువు యొక్క వెయ్యేండ్ల పాలనలో బోధ చేయుటకు భూమిమీదికి వచ్చును.

నోవాహు 120 సం | | లు ఓడను కట్టుటలోను, దేవుని గూర్చి ఇతరులకు చెప్పుటలోను ఉండెను. దేవుడు 120 సం | | లు ఎందుకిచ్చెననగా, ప్రజలు మారుమనస్సు మాత్రమేకాక నోవహు బాగుగా సిద్ధపడుటకును, గొప్ప విశ్వాసిగా తయారగుటకును ఇచ్చెను. ఆలగుననే ఇతరులమారుమనస్సు నిమిత్తమే కాక పెండ్లికుమార్తె బాగుగా సిద్ధపడు నిమిత్తము కూడ ప్రభువు తన రెండవ రా కడ ఆలస్యము చేయుచున్నాడు 2పేతురు 3: 9. నోవహు విశ్వాసియైనను మరింత బలపడుటకు గడువిచ్చెను. ఆలాగే పెండ్లికుమార్తె సంఘ విషయముకూడ జరుగుచున్నది.

నోవాహు నీతి నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడచినవాడు.( ఆది. 6:9). ఒకమనిషినిగూర్చి మనమేమి అడుగుదుము. అతను ఎవరు? ఏమి పనిచెయుచున్నాడు? అతడెటువంటివాడు? అని అడుగుదుము. దేవుడు లోకమంతయు పారజూచెను. ఒక్కడయినను మంచివాడు కనబడలేదు. ఒక్క నోవహు మాత్రము నీతిపరుడైయుండెను. దేవుడు ఏదైన గొప్పపని చేయించుటకు ఒక మంచివానిని ఏర్పరచుకొనెను, గాని ఒక్కొక్కప్పుడు చెడ్డవారినికూడ ఆయన ఏర్పరచుకొనును. ఎందుకనగా ఆ గొప్పపని అతనిమీద పెట్టినప్పుడే అతడు మార్పు చెంది మంచివానిగా మారునని.

నోవాహు నీతిపరుడు. ఉదా:- ఒక దొరగారి దగ్గరనున్న బంట్రోతు బల్లమీదనున్న రూ. 2ఊలు దొంగిలించెను. ఆ బంట్రోతునకు రాత్రంతయు నిద్రపట్టలేదు. అతనిలో ఇద్దరు మాట్లాడుచుండిరి. ఒకరు 'ఆ సొమ్ము ఇచ్చివేయుము అని , ఇంకొకోడ్ 'వద్దు ' అని, అతడు మరుసటి ఉదయమున ఆ సొమ్ము దొరగారికి ఇచ్చివేసెను. అప్పుడు అతని లోపల కలహముకూడా ఆగిపొయెను. మనసులో నెమ్మది కలిగెను. ఏ విశ్వాసియొక్క మనస్సాక్షి తన్ను గద్దించుటకు సందులేదో అట్టివారే ఎత్తబడే గుంపులో నుందురు. అనగా తన మనస్సాక్షికూడ తన్ను గద్దింపకుండు స్థితి ఎవరికున్నదో వారే పెడ్లికుమార్తె సంఘములోని వారైయుందురు. రెండవరాకడలోని వారు తమ స్వంత మనస్సాక్షికూడ గద్దించలేనంత పవిత్రమైన స్థితిలో నుందురు. నోవహు తన మనస్సాక్షి యెదుట నీతిమంతుడు, మనుష్యుల యెదుట నీతిమంతుడు, దేవునియెదుట్త నీతిమంతుడు. దేవుడు నోవహుతో 'ఈ తరములో నీవే నీతిమంతుడవనీ చెప్పెను. ఇట్టిస్థితి చదువరులు కలిగియుండు దీవెన ప్రభువు అనుగ్రహించును గాక! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद