6వ అధ్యాయము - (Seals)


పరిచయము

  గొర్రెపిల్ల:
 • 1ముద్ర, 1 జీవి రమ్ము
  • ఎ. తెల్లగుర్రము
   • ఎ. విల్లుగలవారు ఒకరు దానిపై
   • బి. కిరీటము
   • సి. జయోద్దేశము
 • 2వ ముద్ర (2వ జీవి రమ్ము)
  • బి.. ఎర్రగుర్రము
   • ఎ. అధికారి
   • బి. చంపుకొనునట్లు
   • సి. సమాధాన శూన్యము
   • డి. పెద్ద ఖడ్గము
 • 3వ ముద్ర (3జీవి - రమ్ము)
  • సి. నల్లగుర్రము ఎ. త్రాసు
  • N.B: జీవుల స్వరము
  • 1 దేనారము = 1 శేరు గోధుమలు
   1 దేనారము = 3 శేర్ల యవలు
   నూనె + ద్రాక్షారసము, పాడుచేయవద్దు
 • 4వ ముద్ర (4వ జీవి రమ్ము)
  • డి. పాండుర గుర్రము
   • ఎ. మృత్యువు
   • N.B: మృతుల లోకము వెంబడించె
    • బి. ఖడ్గము
    • సి. కరువు
    • డి. మరణము
    • ఇ. మృగాలు    చంప 1/4 భూమి
 • 5వ ముద్ర బలిపీఠము క్రింద ఎ. దేవుని వాక్యము నిమిత్తము | బి. సాక్ష్యము నిమిత్తము | వధింప బడిన ఆత్మలు సి. వారు |
  • నాధా
  • సత్యస్వరూపి
  • పరిశుద్ధుడా
   • ఎందాక తీర్చవు
   • మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకుందువు
  • N.B: ప్రతివారికి తెల్లవస్త్రములు
   జవాబు : వారివలె చంపబడుట
   • ఎ. సహదాసులు
   • బి. సహోదరులు


   లెక్క
   ఎన్. బి. : పూర్తియగు వరకు కొంచెము కాలము విశ్రాంతి.
 • 6వ ముద్ర
   ఎ. పెద్ద భూకంపము
  • బి. సూర్యుడు నలుపు
  • సి. చంద్రుడు రక్తవర్ణము
  • డి. చుక్కలురాల్పు ( అంజూరపు కాయలవలె)
  • ఇ. భూమి తొలగె (గ్రంధము చుట్టవలె)
   • కొండ
   • ద్వీపము


   తప్పె

   • ఎ. కొండల గుహలలో
   • బి. బండల సందులలో
   • భూరాజులు
   • ఘనులు
   • సహశ్రాధిపతులు
   • ధనికులు
   • బలిష్టులు
   • దాసుడు
   • స్వతంత్రుడు

ప్రార్ధన

ఓ ప్రభువా ! నీ మహాకృపనుబట్టి ఈ దినమున మమ్మును సమావేశ పరచినందుకు వందనములు. నీవు మమ్మును ప్రేమించి పరలోక మర్మములు బైలుపర్చుటకు ప్రకటన వ్రాయించినావు, వందనములు. వ్రాయించిన నీ మాటలు వివరించుకొనుచుండగా మీరు వచ్చి మాతోపాటు ప్రకటన గ్రంధమును వ్రాసిన వారిని కూడ తీసికొనివచ్చి నీ దూతలను కావలియుంచి సాతానును బంధించి నీ గ్రంధముయొక్క అర్ధము బైలుపరచుమని ప్రభువు నామమున అడుగుచున్నాము. ఆమెన్.

విషయములు

ఈ అధ్యాయములో శ్రమలు ఆరంభమగుచున్నవి. ఈ శ్రమలో ఏడు ముద్రల శ్రమలు, ఏడు బూరల శ్రమలు, ఏడుపాత్రల శ్రమలు ఉన్నవి. ముద్రలో రడవముద్ర విప్పగానే ఏడుబూరలు వచ్చును. బూరలలో ఏడవ బూర ఊదగానే ఏడుపాత్రలు వచ్చును. ముద్రల శ్రమలకంటె బూరల శ్రమలు కఠినముగా నుండును. బూరల శ్రమలకంటె పాత్రల శ్రమలు మరీ కఠినముగానుండును. అనగా విడిచిపెట్టబడిన వారిలో మారుమనస్సు పొందినవారిని ప్రభువు రక్షించుచుండగా విడువబడిన వారి మనస్సు మరీ కఠినముగా మారును. భూలోకమునందు సిద్ధపడినట్టి పెండ్లికుమార్తె సంఘమును, పెండ్లి కుమారుడగు యేసుప్రభువు పరలోకమునకు తీసికొనివెళ్ళి అక్కడ ఏడు ఏండ్లు మహా విందులో ఉంచును. మహా శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలము గల గొర్రె పిల్లయు, పరలోక మందు సిం హాసనాసీనుడైన తండ్రి తన యొద్ద ఏడు ముద్రలు వేయ బడిన గ్రంధమును చేత పట్టుకొనియుండగా ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడెవడని ఒక బలిష్టుడైన ఒక దేవ దూత చెప్పగా ఆ 24గురు పెద్దలలో ఒకరు అనగా పెండ్లికుమార్తె సంఘమునకే దానిని విప్పగలిగిన, శక్తి కలిగిన వారెవరో తెలియును గనుక వధింపబడిన గొర్రెపిల్లయే యోగ్యుడని చెప్పగా యోహాను వినెను.

ప్రభువు ఏడేండ్ల శ్రమకాలములో భూలోకమునకు వచ్చుచుండవలెను. రెండవరాకడలో ఎత్తబడకుండ మిగిలినవారు భూలోకములో ఉన్నారు. వీరు అంతి క్రీస్తు పరిపాలనకాలములో ఉన్నారు. వీరి పరిపాలనలో శ్రమలు మారు మనస్సు పొంది రక్షింపబడిన వారిని రక్షించుటకు ప్రభువు పరలోకపు విందులోనుండి భూలోకమునకు వచ్చుచుండెను. భూలోకములో మారుమనస్సు పొందిన వారిని రక్షించుటకై పెండ్లి విందులోనున్న వధువే వారిని కూడా రక్షించుమని వరుడై ప్రభువును త్వరపెట్టుచు ఉండును. వరుడైన యేసుక్రీస్తు ప్రభువు సర్వవ్యాప్తి గనుక , భూలోకములోను, పరలోకములోను ఉండును. ఈ 7సం|| మహాశ్రమల కాలములో శిక్ష ఉన్నది, మారుమనస్సు పొందిన వారికి రక్షణ కుడా ఉన్నది.

ఉదా:- మామిడితోటలో వేసవికాలములో వడగాల్పులకు రాలి పోయిన పండ్లను యేరి బుట్టలో వేసుకొనిన రీతిగా, వరుడైన ప్రభువే అంతి క్రీస్తు పరిపాలన కాలములో తయారైన వారిని అంతి క్రీస్తునకు కనబడకుండగా, కనబడని చోట భద్రపరచును. భూలోక సంఘము వెళ్ళిన తరువాత విచారపడి మారుమనస్సు పొందిన వారిని అంతిక్రీస్తు ప్రభువు తీసుకొనివెళ్ళును. ఆయన రక్షణ కార్యక్రమము ఎన్నటికిని మానడు.

ఆయా సమయములందు రక్షణ పొందిన వారిని ప్రభువు తీసుకొని వెళ్ళును. ఆ సమయములో మారు మనస్సు పొందనివారికి మరి ఎక్కువగా కఠినమైన శిక్షలుండును. శిక్ష ఎక్కువగుచుండెను. చివరివరకు శిక్ష వృద్ధి అగుచుండెను. దేవుడు, మానవులను రక్షింపవలెనను ఉద్దేశముతో శిక్ష రప్పించును పాపములో పడి పోయిన మానవుడు పాపమును విడిచిపెట్టుటకు ఇష్టముండదు. శిక్షను బట్టి మారుమనస్సు మానవుడు పాపమును విడిచిపెట్టుటకు ఇష్టముండదు. శిక్షనుబట్టి మారుమనస్సు పొందక మనస్సు మరీ కఠినముగా మార్చుకొనును. ఈ ఏడేండ్ల మహాశ్రమల కాలంలో 21 సమ్యమున్నది. ఈ సమయములోనున్న ప్రజలందరు, ఒక క్రియచూచిరి. అనగా సంఘము భూలోకమునుండి పరలోకమున కెత్తబడుట చూచిరి. ఆ క్రియనుబట్టి మారుమనస్సు పొందవలసియున్నది. కాని పొందలేదు. గనుక ఉండిపోయిరి.

యూదులు:- ఆ ప్రభువు కాలములో అద్భుతములు చుస్తేనేగాని నమ్మమన్నారు. అద్భుతములు చూచినవారు నమ్మలేదు. ఏడేండ్ల మహాశ్రమలో మిగిలిపోయిన ప్రజలు ప్రభువును చూచిన నమ్మరు. అలాగే ఈ కాలములో ప్రజలు కూడా క్రైస్తవమతము చేయుచున్న ఉపకారములను, అద్భుతములను చూచిన నమ్మరు.

ఉదా:- ఒక కుర్రవాడు పెద్దలైన వారిని ఎదిరించిన ఒకదెబ్బ, ఇంకా ఎదిరించిన ఇంకొకదెబ్బ, ఇంకా యెదిరించిన మరియొక దెబ్బకొట్టును అలాగే ప్రభువు కూడ మారుమనస్సు పొందుటకు ఆయా శ్రమలనుబట్టి కొట్టును ఇదొక అరగంట ప్రకటనలోని ఈ అరగంట నిశ్శబ్దకాలము అదికూడా మారుమనస్సు పొందుటకే.

 • 1) అరగంట అనగా కొట్టలేక శిక్షించలేక ఉపాధ్యాయులు కుర్ర వానిని పొమ్మనుట.
 • 2) ఆ దెబ్బలుతిన్న కుర్రవాని కొరకు ఆ అరగంట ప్రార్ధన చేయుట స్తొత్ర సమాజమువారు అందరు కలసి ఆ కుర్రవాని కొరకు స్తుతించుట.
 • 3) మారుమనస్సు పొందుమని గడువు ఇచ్చినారు? ఆలోచించ వలసినదిగాని, అంధకారము వారిలో దాగియున్నది.
 • ఇంకా మిగిలినవారు హర్మగెద్దోను యుద్దమువరకు ఉండిపోదురు. ఇంకా కొందరు వెయ్యి ఏండ్ల పరిపాలన కాలము వరకు ఉండిపోదురు, ఉండిపోయినవారు ఈ లోకములో పెండ్లికుమార్తె సంఘమునెందుకు తీసుకొని వెళ్ళెనో, మమ్మును ఎందుకు తీసుకొని వెళ్ళరు అని దేవుని అన్యాయస్తునిగా చేసి నేరాలు మోపుదురు. యీలాగు వారు తమ మనస్సును కఠినపరచుకొందురు. ఇది అపవాది గుణము. సాతాను, అపొల్లోను శోధకుడు మొదలైనవి అపవాదికి పేర్లు వాని పని నేరాలు మోపుటయే అది దేవుడు సహింపలేని పని.
 • 4) క్రొత్త ప్లాను వారి మనస్సు గూర్చి ఏమిటి? ఇంకా ఏమిచేయవలెను? అని పరలోక కౌన్సిలువారు ఆలోచించుటకు ఆ అరగంట కావలెను.
తీర్మానము:- ఇప్పుడు శిక్ష ఏవిధముగా నుండవలెను.
 • 1) న్యాయమైనదిగా నుండవలెను.
 • 2) శిక్షయై యుండవలెను.
 • 3) పద్ధతిగా నుండవలెనుట్రయినింగ్ కాలములో ఒక రూలు ఉన్నది.

కోపము వచ్చినా కొట్టరాదని రూలు ఉన్నది. అలాగే ప్రభువునకు కోపము వచ్చినపుడు ఆగిపోవలెను. అధికకోపము వచ్చిన ఆ కోపము మానవునిపై చూపించిన భూలోకవాసులందరు నశించిపోవుదురు.

ఉదా:- బడిలోని పంతులుగారు ఒక అబ్బాయిని కొట్టుచున్నప్పుడు ఆ బెంచీలోని ఇతరులు ఆ బెంచీ నుండి తొలగిపోవుదురు.

ఏడేండ్ల పాలన ద్వారములు రెండు.

ఒకటవ ద్వారము:- ఈ ద్వారము దాటిన తరువాత రెండు విశాలమైన ద్వారము, దానిని కూడా చూచి 7 ఏండ్లపాలనలో ప్రవేశించుదురు. ఈ ఆరవ అధ్యాయములో ఆ ద్వారమున్నది.

అపవాది ఆత్మలు గలిగినవారు వేయు ప్రశ్నలు.

 • 1) దేవుడు కృపగలవాడా ! అయితే మమ్మును ఎందుకు తీసుకువెళ్ళలేదు.
 • 2) దేవుడు న్యాయస్తుడా! అయితే మేము బాధపడుచుండగా మమ్మును ఎందుకు తీసుకొని వెళ్ళలేదు! పెండ్లికుమార్తె వరుసలో వెళ్ళినవారు మాకన్నా భక్తులా? ఈ సంగతులు భూమిమీద మాకు ఎందుకు చెప్పలేదు. చెప్పియుంటే మారుమనస్సుపొంది యుందుము గదా? .
 • అందుకు సువార్తికులు ఇచ్చు జవాబు
  • 1) ఈ భూలోకములో వధువు సంఘము కృపను అంగీకరించెను గనుక ప్రభువు ఆ సంఘమును తీసుకొనివెళ్ళెను.
  • 2) దేవుడు న్యాయస్తుడే జడ్జిగారు శిక్షిస్తారు అట్టి శిక్ష న్యాయము మెచ్చుకొనును శిక్షించుచున్నాడు గనుకనే జడ్జిగారు న్యాయస్తుడు.
  • 3) వధువు సంఘములోని వారు భక్తులే. రాకడవార్త విన్నారు, రాకద కొరకు సిద్ధపడినారు. రాకడకాలములో ఎగిరివెళ్ళినారు. సిద్ధ పడనివారు ఆగిపోయినారు.
  • 4) రాకడ వార్త ప్రకటింపబడినది గాని భూమి మీద మిగిలినవారు విన్నవాటిని గైకొనలేదుశిక్షనుగూర్చిన వార్త భూమి మీద ప్రకటన గ్రంధములో వ్రాసియుంచినారు. బోధకులైన వారిచేత బోధింపచేసినారు. వినలేదు. గనుక ఇప్పుడు వినరు
  • 5) సైతానును వారిమీదికికి ఎందుకు పంపాలి? ఉదా:- ఒక ఊరిలో ఆకస్మికముగా ఇండ్లు కాలిపోవుచున్నవి. ఇండ్లు ఎందుకు కాలిపోచున్నవని ప్రశ్నలు వేసుకుంటే కాలిపోవుచున్న ఇల్లు ఆగదు. వెంటనే యిండ్లు విప్పటానికి మంటలు ఆర్పివేయటానికి మార్గము చూడాలి.
  • 6) పరఓక చరిత్ర:- ఇవన్ని చూచుచున యోహాను ప్రభువు పరలోకములో నుండగా చూచెను. భూలోకములోనికి వచ్చుట చూచుచుండెను. ప్రభువు తండ్రి సిం హాసనము దగ్గరకువెళ్ళి ముద్రను విప్పుట కూడచూచుచుండెను.

Home


మొదటి ముద్ర

ప్రకటన 6వ అ|| 1, 2 వచనములు

పెండ్లికుమార్తె సంఘమును తీసుకొనివెళ్ళి నూతన యెరూషలేములో పెట్టి మిగతావారి కొరకు పెండ్లికుమారుడైన యేసుప్రభువు భూమిమీదకు వచ్చును. నాలుగు జీవులలో ఒకరు అనగా మొదట జీవి సిం హము వంటిది. ఆ జీవి ఇక్కడకు ఎక్కి రమ్ము అని గర్జించు సిం హము వలె ఉరుము వంటి స్వరముతో పలికెను. మిగతా మూడు జీవులకు ఇటువంటి స్వరములేదు. ఎక్కి రమ్ము అనగా వచ్చి చూడుము అని కొన్ని ప్రాచీన గ్రంధములలో కనబడుచున్నది. అప్పుడు యోహాను పైకి ఎక్కి వెళ్ళెను. ఇది సంఘము పైకెత్తబడిన తర్వాత భూలోకములో జరుగనైయున్న సంఘటన.

  యోహాను
 • 1) ముర విప్పుట చూచెను.
 • 2) గుర్రమును చూచెను.

ఒకటవ అధ్యాయములో దేవుని చూచెను.

2, 3 అధ్యాయములలో సంఘ మహిమ చూచెను. ఇదంతా చూచునప్పటికి అలసట కలిగెను. యోహాను పైకెక్కి అక్కడ ఉన్నదంతయు చూచెను ఉరుము వంటి స్వరము విన్న యోహాను ఆత్మవశుడై పరలోకమునకు వెళ్ళి పరలోకమందున్న పెండ్లికుమార్తెను పరలోక రాజ్యమును పరలోకమందున్న వ్రాతలను చూచెను.

మనకు ఏవైనా కనబడకపోతే అన్ని తేటగా చూచుటకు కొండపైకి ఎక్కి వెళ్ళుదము అలాగే యోహాను కూడా పైకి ఎక్కి రమ్ము అనగా పైకెక్కి జరుగు కార్యములన్నిటిని చూచుటకు మొదలు పెట్టెను.

 • 1) యోహాను ఎక్కి రా
 • 2) యోహాను చూడు
 • 3) యోహాను చూడు

ఎక్కిరమ్మనుట బాగుగానే ఉన్నది. ఇదివరకు యోహాను పద్మసు లంకలో ఉండి ప్రభువును చూచుచుండెను. అలాగే భూలోకములో నున్న వధువు సంఘమును కూడచూచుచుండెను. గాని ఇప్పుడు అకస్మాత్తుగా సంఘము పైకెత్తబడెను. గనుకనే ప్రభువు యోహానును పైకెక్కి రమ్మని పిలిచెను. అక్కడనున్న సంఘము మహిమతో ప్రకాశించుచుండెను.

 • 1) ఒకసారి చూడగా ముద్ర విప్పుట కనబడెను.
 • 2) రెండవసారి చూడగా గొర్రెపిల్ల రూపముననున్న ప్రభువు సిం హానాశీనుడై యున్న వాచేతనుండి గ్రంధమును తీసికొని ముద్రను విప్పుట కనబడెను.

కొన్ని విషయములు పని కట్టుకొని పరికిస్తేనే కాని చూడలేము.
కొన్ని సర్వసాధారణముగా కనబడుచుండును..
గొర్రెపిల్ల పుస్తకము పట్టుకొని ముద్రను విప్పినప్పుడు

 • 1) తెల్లని గుర్రము
 • 2) గుర్రముపైన ఒకరు
 • 3) ఆ ఒకరిచేతిలోని విల్లు
 • 4) కూర్చుండుట
 • 5) కిరీటము
 • 6) జయించుట
 • 7) జయశాలి

గాడిద = సమాధానమునకు గుర్తు

గుర్రము = యుద్ధమునకు గుర్తు

ప్రభువు పెండ్లికుమార్తె సంఘమును పరలోకమునకు తీసుకొని వెళ్ళిన వెంటనే 7 ఏండ్ల శ్రమకాలము ప్రారంభమగును. గనుక పైకెత్త బడిన వధువు సంఘము తమలో మహావిందులో కూర్చున్న వరుడైన ప్రభువును కూర్చుండనీయక ప్రభువా మేము వచ్చిన తరువాత సిద్ధపడిన వారిని కూడా పరమునకు తీసికొని రమ్మని కోరినందువల్ల ప్రభువు తెల్లగుర్రము మీద మిగిలిన వారి కొరకు తిరిగి భూలోకమునకు వచ్చును.

ఇదిగో తెల్లని గుర్రము:- తెలుపు మహా పరిశుద్దతకు గుర్తు. అలాగే గుర్రము జయమునకు గుర్తు. తెల్లని గుర్రము మీద వచ్చుట, అనగా నేను పరిశుద్ధుడను నావల్ల మీకు హింసలుండవు. మీ పాపమువల్ల, మీ అజ్ఞానమువల్ల మీ అంతట మీరే హింసలు తెచ్చుకొన్నారు. అయినా హింసలలోనుండి ఎవరయినా పశ్చాత్తాపపడి నాతట్టు తిరుగుదురేమో వారిని రక్షింపవలెనని నేను వచ్చియున్నానని ధైర్యమిచ్చుటకు వచ్చును.

మరియు నేను లోకమును జయించి పెండ్లికుమార్తెను నాతోనుండుటకై తీసికొనివెళ్ళి యున్నాను. ఇదివరకే నేను లోకమును జయించియున్నాను అని లోకమునకు తెలియపరచుటకు ఆయన తెల్లని గుర్రము మీద వచ్చును. మిగిలినవారు అనగా విశ్వాసులై యుండి రాకడకు సిద్ధపడకున్నవారు.

గుర్రము:- గుర్రము వేగముగా భూలోకమునకు వచ్చుటకు గుర్తు అయి యున్నది. ఒక వేళ ప్రభువు భూలోకమునకు వేగముగా రాకపోతే మిగిలిన వారు మరింత కఠిన మనస్కులగుదురు. గనుక ఆయన వేగముగా రావలెను.

ఉదా:- ఇల్లుకాలుచుండగా లోపల చిక్కుకున్న వారిని త్వరితముగా తీసికొని రా అందురు. అలాగే పరమందు వధువుతో విందులో సంతోషించుచున్న వరుని మిగిలిన వారిని అనగా సిద్ధపడిన వారిని తీసికొని రమ్మని వధువు త్వరపెట్టుచున్నందున ప్రభువు త్వరితముగా వచ్చును.

తెలుపు:- పరిశుద్ధతకు గుర్తు పరిశుద్ధుడు కాకపోతే ఆయన రాలేడు. పరలోక సంబంధ మహిమను చూడలేరు. యోహానుకు తెల్లగా కనబడెను. అది పరలోక మహిమ అంతయు ప్రకాశమానముగా కనబడెను. ప్రభువు శ్రీఘ్తముగా వచ్చుట, మహిమలో వచ్చుట ఇందు ముఖ్యమైన అంశము.

కూర్చుండుట:- భూలోకంలో సిద్ధపడిన పెండ్లికుమార్తె సంఘమును తీసికొని వెళ్ళినందువల్ల ప్రభువునకు నెమ్మది, విశ్రాంతి, సంతోషము ఉన్నది.

లేనిచో సంఘమును రక్షించుటకై ఏదో ఒక పని చేయుచుండవలెను. గాని సంఘము పరలోకములో భద్రముగా నున్నందువల్ల ఈ లోకంలో సిద్ధపడిన వారిని తీసికొని వెళ్ళుటకే ఆయన వచ్చును ఇది లోకమునకు జయించినానని తెలుపుటయే అగును.

కిరీటము:- తెల్లని గుర్రముమీద వచ్చిన ప్రభువే కిరీటమును ధరించు కొని భూమిపైకి వచ్చును. అనగా నేను లోకమును పాపమును, సైతానును మరణమును, సమాధిని జయించి పునరుత్థానుడనై పెండ్లికుమార్తె సంఘమును పరలోకమునకు తీసికొని వెళ్ళితిని అని లోకమకు బయలు పరచుటకును విడువబడిన వారిలో నుండి సిద్ధపడిన వారిని తీసికొని వెళ్ళుటకు వచ్చుచున్నానని చెప్పుటకును ప్రభువు కిరీటము ధరించి తెల్లని గుర్రముమీద వచ్చును.

విల్లు:- అది విల్లే గాని దానికి అంబులేదు. విల్లు అనగా నిరీక్షణకు గుర్తు. అనగా ధనస్సు ఆకారము కలిగినది. హానిలేనిది మిగిలినవారు శ్రమలోనుండగా నిరీక్షణ లేనిస్థితిలో నుండగా నిరీక్షణ కలిగించుటకై విల్లు కనబడుచున్నది. అంబులేదు. అనగా పొడిచి చంపుటకు కాదు. ఇక్కడ చావులేదు ఇది ఎలాగూ తెలియుననగా తర్వాత గుర్రము మీద వచ్చినపుడు ఇంతమంది మృతులు అని ఉదహరింపబడినది. కానీ ఇచ్చట మరణమును గూర్చి ఉదహరింపబడలేదు. గనుక ఇచ్చట ప్రభువు సిద్ధపడినవారిని చావులేకుండా ఒక విధమైన మహిమ శరీరముతో పరలోకమునకు తీసికొనిపోవును. వీరును ఎత్తబడుదురు. ఇది రక్షణ జయముగాని నాశనకరమైనది కాదు. గనుక తెల్లని గుర్రము మీదవచ్చును. విల్లు అనగా సిలువకు కూడా గుర్తే. సిలువను చూడగానే నిరీక్షా కలుగును. గనుక ప్రజలందరు ఆ విల్లును చూచి భయపడరు కాని మమ్మును కూఉడా తీసికొని వెళ్ళుమని మొరపెట్టుదురు. పెండ్లికుమార్తె పరలోకములో ఏ నగలు ధరించుకొనునో అవి ముందుగా పెంద్లికుమార్తెకు తెలియును.

 • 1) ఆ నగలు ఇప్పుడే సంపాదించుకొనవలెను.
 • 2) అనుభవించవలెను.
 • 3) మురియు చుండవలెను.
 • 4) ఇతరులకు చెప్పవలెను.

జయశాలి:- ప్రభువు లోకములో జన్మించినది మొదలు ఆరోహణము వరకు తనకు అడ్డుగా వచ్చిన వాటన్నిటిని జయించెను. ఇప్పుడు ద్వితీయ సంఘారోహణ కాల అడ్డులను జయించుటకు కిరీటము ధరించి పెండ్లి విందులో నున్న ప్రభువు పెండ్లివస్త్రముతోనే భూలోకమునకు వచ్చివేయును. ఇది మొదటిముద్ర సారాంశము.

Home


రెండవ ముద్ర - రమ్ము

(ప్రకటన 6వ అ|| 3, 4 వచనములు

ఆయన రెండవ ముద్రను విప్పినపుడు రమ్ము అని రెండవజీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకని కొకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.

మొదటిముద్ర కాలములో తెల్లని గుర్రము మీదవచ్చిన పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువు ఈ లోకములో తన కొరకు కనిపెట్టుకొన్న వారిని పరమునకు కొనిపోయిన పిమ్మట భూలోకములో అసలైన శ్రమలు ప్రారంభమగును.

రెండవజీవి దూడవంటిది దూడ అనగా సాధువైన జంతువు అనగా లోకములో నెమ్మదియే గాని మానవుల నిర్లక్ష్యమును బట్టి లోకములో మహా భయంకరమైన శ్రమ, ఈ జీవిరమ్ము అని చెప్పగా యోహాను వినెను. స్వరము విన్న యోహాను పరలోకమునుండి ఎర్రని గుర్రము దిగివచ్చుట కనుగొనెను. ఈ గుర్రము ఆకరములో పెద్దది. గుర్రము మీద కూర్చున్న వ్యక్తి కూడా ఎరుపే. చేతిలోని కత్తి కూడా ఎరుపే. ఆయనలో నుండి బయలు వెడలువ్హున్న కిరణము కూడ ఎరుపేఎరుపు దేనికి గుర్తు? ఎరుపు గుర్రముమీద నున్న మనిషికి, కత్తికి, కిరణమునకు సంబంధించిన గుర్తు ఆ ఎరుపే సిలువ మ్రానుమీద కల్వరిగిరి పైన ప్రభువైన యేసు సర్వమానవాళి కొరకు చిందించిన అమూల్యమైన రక్తమునకు గుర్తు. ప్రభువు చిందించిన రక్తము వలననే రక్షణకు మార్గము ఈ లోక సంఘము కూడా క్రీస్తు రక్తము వలన మానవులకు రక్షణ కలుగునని బోధించెను. ఎందుకనగా పూర్వకాలమున జంతు రక్తము వలన పాప పరిహారము, అనే సిద్ధాంతము దేవునిని ఎరిగిన వారికిని, దేవుని ఎరుగని అన్యజనుల హృదయములలో కూడా ఉన్నది గాని, అన్య జనాంగమునకును, యూదా జనాంగమునకును, జంతు రక్తము వలన పాపక్షమాపణ, రక్షణలేదు అని తెలియజేయుటకే క్రీస్తుప్రభువు ఎరుపుగా భూలోకములో కనబడెను. దీనిని బట్టి క్రీస్తు యేసుప్రభువుని రక్తమే రక్షించ గలదను సంగతి తెలియ జేయుటకే ఎరుపు కనబడెను.

 • 1) గుర్రము
 • 2) మనిషి
 • 3) కత్తి
 • 4) కిరణము
ఇవి అన్నియు ఆయనకే సంబంధించినవి
 • 1) గుర్రముమీద ఎరుపు
 • 2) చంపుకొనుట
 • 3) సమాధానము లేకుండా చేయుట

ముద్రను విప్పిన దవీదు చిగురును యూదాగోత్రపు సిం హమునైన యేసుప్రభువే ఎర్రని గుర్రముమీద భూమిపైకి రాగా మృధువైన దూడవంటి స్వభావము కలిగిన యేసును తిరస్కరించిన మిగిలిపోయిన జనాంగములో శాంతి ఉండవలసినదిగాని శాంతికి బదులు గందరగోళము ఏర్పడెను.

 • 1) రాజ్యములలో
 • 2) సంఘములలో
 • 3) కుటుంబములలోరధముయొక్క శీలలు ఒలిసిపోయినట్లు భూలోకమునున్న వారికి ఒక పనియైనను సాగదు.

భూమిమీద గొప్ప గలిబిలి యేర్పడును. ఆరోహణ కాలములోనూ అనగా రాకడ కాలములోనూ పైకి వెళ్ళిపోయినవారిని గూర్చి లోకస్థులు వారు కనబడనందువల్ల గలిబిలి కలిగియుందురు. నిష్కళంకులైన చిన్న బిడ్డలు ఆరోహణమైనందువల్ల వారు లోకములో కనబడనందువల్ల తల్లిదండ్రులైన వారు వారికొరకు రొమ్ము కొట్టుకొనుచు, ఏడ్చుచు భూలోకమంతట వారి కొరకు వెదుకుదురు గాని వారు కనబడనందువల్ల మనస్సున మిక్కిలి గలిబిలి కలిగియుందురు. భూలోకవాసులకు రాత్రింబగళ్ళు నెమ్మది ఉండదు. ఒకరిపై ఒకరికి ద్వేషము విపరీతముగా పెరిగిపోవును. ఇండ్లు కాలిపోవుచున్నవి. గృహములలోని సామాగ్రిని బయట పెట్టుకొనుచుండగా బయట పెట్టిన సామాగ్రిని దొంగలు దొంగిలించినట్లు ఆకాలముండును.

గుర్రము మీద నున్నవానికి అధికారము:- గుర్రముమీద ఉన్న ఆ ఒకరికి ఒకరినొకరు చంపుకొననిచ్చు అధికారము ఆయన చేతిలో కలదు. ఇప్పుడు ఊరుకొన్నట్లే అప్పుడును ఊరుకొనును ఏమియు తోచక నిరాశస్థితిలో ఉన్న ప్రజలు ఒకరినొకరు చంపుకొందురు.

ఉదా:- అమెరికాలో ఒకమ్మాయి ఒకరిని చంపెను. ఎందుకు చంపినావని ఆమెనడుగగా సతదాగా చంపినానని ఆమె జవాబు చెప్పెను. ఏమితోచక, మతిలేనిస్థితిలో ఒకరినొకరు చంపుకొందురు. ఇది ఏండేండ్ల మహాశ్రమకాలములో ఎక్కువగా జరుగును. ఎక్కువగా కారణములు కూడా ఉండును.

చంపుకొనుట= శిక్ష రక్తము రక్షించుట=రక్షణ రక్తము (క్రీస్తురక్తము)

ఈ అసమాధాన స్థితి రాజ్యములలో, సంఘములలో, కుటుంబములలో, మనుష్యులందరిలో నుండును. రాకడ కాలములో, మొదటి ముద్రకాలములో కొందరిని తీసుకొని వెళ్ళి, మరికొందరిని విడిచిపెట్టగా మా గతి ఏమిటి అని మతిపోయి ఏమితోచక ఒకరినొకరు చంపుకొనుచు ఆ రక్తమును చూచి మరీ గందర గోళము అగుదురు.

ఖడ్గము:- ఒకరినొకరు చంపుకొనుటలో విశ్వాసులు, అవిశ్వాసులు కలిసి ఉన్నారు. కావున వారిని వేరుచేయుటకు ఎర్రని కత్తితో వచ్చిన ఎర్రని రంగు గల యేసుప్రభువు కత్తితో వేరుచేయును. అలాగు చేయకపోతే ప్రభువే భూలోకములోనున్న విశ్వాసులను పోగొట్టుకొనవలసి వచ్చును. అప్పుడు అవిశ్వాసులు మరింత నరుకు కొందురు విశ్వాసులు ప్రభువును చూచి ఆయన చెంతకు చేరుదురు. ఆ చేరుకొనునప్పుడు విశ్వాసులయిన వారిని ప్రభువు చెంతకు మీరెందుకు వెళ్ళుచున్నారని అవిశ్వాసులైన వారు చెంగుపట్టుకొని లాగునపుడు ప్రభువు కత్తితోనే వారిని వేరుచేయును.

ఉదా:- గడ్డమును కత్తితోనే మన శరీరములో నుండి వేరు చేయుదుము. అలాగే కత్తితోనే ప్రభువు అవిశ్వాసులను వేరుచేయును. లేనియెడల విశ్వాసులు ప్రభువునకు చిక్కరు. ఈ కత్తి సిలువకుగుర్తు. సన్మార్గులను ఆటంకపరచి దుర్మార్గులను శిక్షించు కత్తిని చూడగానే భయము. సిలువనుబట్టి విశ్వాసులకు ధైర్యము కత్తి చివర ఎర్రరంగుతో కూడిన సిలువ కనపడును. పరలోకములో నుండి రక్తము ఎలాగూ వచ్చును?

రక్తము:- ఈ రక్తము విలువవల్ల వచ్చినది. ప్రభువు సిలువ మ్రానుమీద రక్తము కార్చెను. గాన రక్తము సిలువకు గుర్తు. సిలువ కనిపిస్తే రక్షణ సిలువ కనిపించకపోతే శిక్ష.

 • 1) రక్తము
 • 2) కత్తితో వచ్చెను


సిలువ రక్తముతో వచ్చెను.

కత్తిని చూడగా దుష్టులకు భయము కత్తి విశ్వాసులకు పైకి కత్తి వలె కనబడును గాని నిదానించి తేరిచూడగా వానిలో సిలువ కనిపించెను.

 • 1) రంగు - రక్తము
 • 2) రక్తము - సిలువయొక్క రంగు
 • 3) రక్తమువల్ల సిలువ
 • 4) సిలువవల్ల రక్షణ

ఈ రెండవ ముద్రలో ఇవన్నీ కనిపించును. రక్తములో కాంతి ఉన్నది. సూర్యుని కాంతిలో తెల్లని కాంతి ఉన్నది. క్రీస్తురక్తము వలన తెలుపు చేయబడితిమి గనుక కాంతి (ఎర్రని కాంతి).

 • 1) ఎర్రని రంగు
 • 2) రక్తము
 • 3) ప్రభువు
 • 4) ఎర్రని కిరణములు
 • 5) కత్తి
 • 6) సిలువ

సూర్యుడు పైనున్నను కిరణములు క్రిందకి వచ్చును.
గుర్రముపై నున్నను కిరణములు క్రిందికి వచ్చును.
I) కిరణములతో ప్రభువు తనను నమ్మిన విశ్వాసులను కప్ప్ను అనగా దాచిపెట్టును. విశ్వాసులకు సిలువను బట్టి నిరీక్షణ, కత్తిచివర సిలువ ఉన్నది. దగ్గరకు రాగా రక్తము కనిపించును. సిలువవల్ల విశ్వాసులకు క్రమముగా నిరీక్షణ ఎక్కువగుచుండును. గనుక ప్రభువు వారిని తన కిరణములచేదాచి పెట్టును. రెండవ పర్యాయము కలిగిన శ్రమనుబట్టి మారుమనస్సు పొందినవారు ధన్యులు ఇకవారికి హింసలేదు. వీరు అవిశ్వాసులకు కనబడరు.

ఉదా:- లోతు ఇంటివద్ద దుష్టులయిన వారి కన్నులు మూయబడిన రీతిగానే ఇక్కడ కూడా ప్రభువే విశ్వాసులైన వారిని తన కాంతి కిరణములచే కప్పివేయును.

 • 1) పెండ్లి కుమార్తె సంఘము పైకి వెళ్ళిపోయినందువల్ల భూలోకవాసులకు సమాధానము లేదు.
 • 2) రెండవసారి మిగిలినవారిలో కొందరిని తీసికొని వెళ్ళునంతలో భూలోకములో సమాధానము లేదు.
Home


3వ ముద్ర : 3వ జీవి రమ్ము

ప్రకటన 6వ అధ్యా || 5. 6 వచనములు

"ఆయన మూడవ ముద్ర ముద్రను విప్పినప్పుడు - రమ్ము అని మూడవజీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు త్రాసుచేతపట్టుకొని కూర్చుండి యుండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను, ద్రాక్షారసమును పాడుచేయవద్దనియు ఆ నాలుగు జీవులమధ్య ఒకస్వరము పలికినట్లు నాకు వినబడెను" (ప్రకటన 6: 5. 6).

ఆ నాలుగుజీవులు అనగా సిం హము వంటిదియు, దూడవంటిదియు మనుష్యుని ముఖమువంటి ముఖము కలదియు, ఎగురుచున్న పక్షిరాజు వంటిదియునైన ఆ జీవులు దేవుని సన్నిధానమందు సర్వలోకము నిమిత్తమై దివారాత్రములు ప్రార్ధన చేయుచున్నారు. గనుక వారికి మానవులమీద అధికమైన ప్రేమ కలదు. ప్రేమతోపాటు మానవులమీద హక్కుకూడా కలదు. ఎందుకనగా వారు ప్రార్ధించుట మాత్రమే కాక పరీక్షించుచు చూచుచున్నారు. ఏడేండ్ల మహాశ్రమలో మిగిలిపోయిన వారిలో కొందరు మారుమనస్సు పొందుదురని వారికి బాగుగా తెలియును. ఇతరుల మారుమనస్సును గూర్చి ప్రార్ధన చేసే మనము కూడా మన ప్రార్ధన నెరవేరినదో లేదో అని వారి మార్పును గూర్చి పరీక్షించవలెను. మనము ఎవరి మారుమనసును గూర్చి ప్రార్ధింతుమో వారిమీద మనకు

 • 1) హక్కు,
 • 2) పరిశీలన
 • 3) అధికారము కలిగియుందుము

ఆ జీవులు ప్రతినిత్యము సిం హాసనమునకు మధ్యను, సిం హాసనమునకు చుట్టును దేవుని సన్నిధానమున ఉన్నారు. గనుక దేవుడు ఏమియు చెప్పకపోయినను ఆయన మనస్సులో ఏమి ఉన్నదో అ జీవ్వులకు తేటగా తెలియును. మనమును అట్లుండిన యెడల మనకు ఆ శక్తి దేవుడిచ్చును. ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు మనుష్య ముఖమువంటి ముఖముగల మూడవజీవి నిలువబడి పెద్దస్వరముతో యోహానుతో ఇక్కడికి ఎక్కిరమ్ము అని చెప్పగా యోహాను ఆ స్వరమును వినెను. యోహాను ఆ స్వరమును వినుచు ఉండగా ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకరు త్రాసు చేతపట్టుకొని కూర్చుండి యుండెను.

నల్లని గుర్రము:- గుర్రము అనగా పనులు త్వరత్వరగా ఈ ముద్రకాలములో జరుగవలెనని సూచించుచున్నది. గుర్రము ఎలాగు వడిగా పరుగెత్తునో ఈ 3వ మురకాలంలో పనులు త్వరగా జరుగవలెనని తెలియపరచుటకు ప్రభువు గుర్రముమీద వచ్చినట్లుగా యోహానుకు కనబడుచున్నది.

ఉదా:- ఒకరోగికి శస్త్రచికిత్స చేయునప్పుడు కలిగియున్న రోగము నుండి బ్రతికించుటకు గాను త్వరత్వరగా శస్త్రచికిత్స చేయుదురు గదా! అలాగే ఈ గుర్రము కూడా త్వరత్వరగా పనులు చేయుటకు యోహానుకు కనబడెను.

నలుపు:- భూలోకమందున్న ప్రజలు పెండ్లికుమార్తె సంఘము పరలోకమునకు వెళ్ళెనని వారిని తీసుకొని వెడలిరని మిగిలిపోయిన వారిలో కొందరు దుః ఖించుచున్నారు. ఈ విధమైన ప్రలాపముతో భూమి నిండియున్నది. (ఆది 3: 17) మనిషి పాపమును బట్టి భూమి శపింపబడినందువల్ల ఆకాశమునుండి వర్తకము కురిపింపబడలేదు. వృక్షములు ఫలించుటలేదు. భూమి తన పంటనిచ్చుటలేదు. మనిషి దేవునిమీద తిరుగబడినందువల్ల సృష్టి మనిషిమీద తిరుగుబడినది. అందువల కరువు వచ్చిన. మనిషి హృదయములో భక్తికి కరువు. దేవునియందు విశ్వాసమునకు కరువు దేవుని యందలి కృతజ్ఞతకు కరువు వచ్చినది. మానవుని అంతరంగంలోనే కరువు వచ్చినది. గనుక బహిరంగ కరువు కూడా వచ్చినది. దేవుని వాక్యమునకు కూడా కరువు వచ్చినది. చీకటిలో ఎవరైనా ఒకరు ఉంటే వారికి ఏమియు తోచదు. అలాగే ఆ కాలమందున్న విశ్వాసులకు పైకాలమునుబట్టియు , పెండ్లికుమార్తె పరలోకమునకు, వెళ్ళిపోగానే వెలుగు కిరణములు తొలగి వారి హృదయములలో అంధకారస్థితి కమ్ముటనుబట్టియు ఆకాలమందున్న అవిశ్వాసులకు ఏమిచేయవలెనో అని తోచని అంధకారస్థితి ప్రపంచమంత వ్యాపించియున్నది. గనుక వారిస్థితి వారికి బయలు పరచుటకు ఒకరు నల్లని గుర్రము మీద వచ్చెను.

షరా:- గుర్రముయొక్క నలుపునుబట్టి దాని మీద కూర్చున్నవారు క్రీస్తుప్రభువు కాడని, మృత్యువు, పిచాచి అని కొందరు వ్యాఖ్యాన కర్తలు అనుచున్నారు గాని గుర్రమే నలుపు కాని దానిమీద కూర్చున్న ఆయన నలుపు కాదు గనుక ఆయన యేసుప్రభువే.

ఒకరు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. సరుకు అమ్మునపుడు త్రాసును ఉపయోగించెదరు. గానీ ఇక్కడ మనుష్యులను చూచుటకు కూడా తెచ్చినట్లు కనబడుచున్నది. బెల్షస్సరు రాజును దేవుడు త్రాసుతో తూచి రాజా! త్రాసులో నీవు తూచబడి తూకమునకు తగ్గినావు అని చెప్పెను. అట్లే ఈ ముద్రకాలంలో మనుష్యులను తూచి మంచివారిని రక్షించుటకును, చెడ్డవారిని అనగా తూకమునకు రాని వారిని ఇంకా శ్రమలలో ఉంచుటకును వచ్చెను. ఈ పని ఇప్పుడు కూడా జరుగుచున్నది. గుణము, ప్రవర్తన, సేవనుబట్టి దేవుని అంగీకారమునకు ఎవరు సరిపోవుదురో వారు పెండ్లికుమార్తె వరుసకు సరిపోవుదురు. తూకమునకు రానివారు ఏడేండ్ల శ్రమలకు విడిచిపెట్టబడుదురు. పై లక్షణములలో ఎందరు ఆయనను వెంబడించెదరో తెలిసికొనుటకు ఆయన త్రాసులో వచ్చును. గుర్రముమీద ఉండు దుష్టులకు భయంకరుడుగాను, రక్షింపబడు వారికి దయగల వాడుగాను ఆయన ముఖవర్చస్సు కనబడును. సురేఫినికయ స్త్రీ ప్రభువు సహాయము కోరగా ప్రభువు ఆమెకు సహాయము చేయువానివలె ఎన్నో కఠినమైన మాటలు పలికెను. ప్రభువు ముఖమును చూచుచు ప్రభువును ఆశ్రయించుట ఆమె మానలేదు. ప్రభువు యొక్క మాటలు కఠినముగా నున్నను ఆయన ముఖములో కనికరముండెనని ఎరిగిన ఆ స్త్రీ ఆయనను వెంబడించి ఆయన ద్వారా మేలుపొందెను. (మత్తయి15:21,22) మరియు ఇట్టి ప్రత్యక్షత అప్పటి వారందరికిని ప్రభువు అనుగ్రహించును. భూలోకవాసులందరికి ఆయన తీర్పు తీర్చుటకు వచ్చియున్నారని తెలియును. మనిషికి తెలియకుండా అయన తీర్పు విధింపడు.

దేనారమునకు 1 సేరు గోధుమలనియు 3సేర్ల యవలనియు ఆ కాలములోని యోహానుకు అర్ధమగుచునంట్లు గోధుమలు, యవలు, దేనారములను పదములను ఉపయోగించెను. సరుకు సమృద్ధిగా ఉన్నయెడల త్రాసు అక్కరలేదు గానీ తక్కువగా నున్నప్పుడు త్రాసుకావలెను. పాప ఫలితముగా దాన్యాదులకు కరువు వచ్చెను. 4 జీవులు సృష్టి అంతటిని నాశనము చేయవద్దు మారుమనస్సు నొందిన వారికి శ్రమకాలములో ఆహారము ఉండవలెను గదా అని ప్రార్ధించెను. గనుక కరువు వచ్చినను అన్నిటికి కరువురాదు. అది దేవుని కృప. ఈ ముద్రసమయంలో తయారయిన వారిని ప్రభువు భూమిమీదనే ఉంచును. ఎందుకనగా జలప్రళయకాలంలో కూడా నోవహు కట్టిన నావ జలముల మీదనే ఉండెను. ఆ నీటిలో దుష్టుల శవములు ఉండెను. ఆ రీతి గానే ఈ సమయంలో కూడా విశ్వాసులను దేవుడు దుష్టుల మధ్యలోనే ఉంచి కాపాడును. అదే ఇప్పుడు కూడా చూడగలుగుచున్నాము. భూమి యొక్క 3వ భాగము నాశనమయ్యెను. చెట్ట్లలో కొన్ని నాశనమయ్యెను. అట్లే మనుష్యులలో, సముద్రములలో, జంతువులలో నాశనము కలుగును. ప్రభువు ముద్రకాలమున న్యాయము దూషించుచు కారణముగల కరువు రానిచ్చి కారణములేని కృప కనబరచును. అట్లే నూనె, ద్రాక్షరసము సమృద్ధిగా నున్నను పాడుచేయవద్దని చెప్పెను. విశ్వాసులయిన జనాంగమునకు గోధుమలు, యవలు అను ఆహారమును అది మాత్రమేకాక తలకు తైలమును, బలము కొరకు పానముచేయు ద్రాక్షరసము పాడుచేయవద్దని 3వ జీవి చెప్పుచుండగా తక్కినజీవులు కూడా తమ సరమును, ఆ స్వరముతో కలిపిరి. శ్రమకాలములో విశ్వాసులకు ఆహారము బాహాటముగా దొరుకును. సాధారణముగా నూనె పరిశుద్ధాత్మ ఆదరణకు గుర్తు. ద్రాక్ష పండ్లరసముసంతోషమునకు గుర్తు. ఇక్కడ నూనె, ద్రాక్షారసము సమృద్ధికి గుర్తు, పెండ్లికుమార్తె తన ప్రార్ధనలన్నియు ముగించి ఆఖరి ప్రార్ధన మేఘములో ముగించి పరలోకమునకు అనగా నూతన యెరూషలేమునకు వెళ్ళెను.

Home


4వ ముద్ర : 4వ జీవి రమ్ము

ప్రకటన 6వ అధ్యా|| 7, 8 వచనములు

ఆయన నాలుగవ ముద్రను విప్పినపుడు - రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుర్రము కనబడెను. దానిమ్మిద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాటాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలోనుండు కృఅమృగముల వలనను, భ్హునివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన అధికారము వానికియ్యబడెను. (ప్రకటన 6: 7,8).

ప్రతిముద్రను విప్పునది ప్రభువే నాలుగవ ముద్రను పరలోకమునందున్నప్పుడు ఇ క్కడకు ఎక్కిరమ్ము అని నాలుగవజీవి దైవ సన్నిధిలోనున్న యోహానుతో చెప్పెను. రమ్మని పిలువగా వచ్చినది ప్రభువు. ఈ స్వరము విన్న వెంటనే యోహాను చూడగా ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుర్రము కనబడెను. పాండుర వర్ణమనగా రక్తములేక తెల్లబారి పోయిన రంగు, బలము లేని జీవిగా కనబడెను. ఈ గుర్రము మీద వచ్చినవారు ప్రభువే భూమిమీద నున్న ఆయా పరిస్థితులను బట్టి ఆయా రంగులుగల గుర్రములపై ప్రభువు వచ్చెను. దానిమీద కూర్చున్న వారిపేరు మృత్యువు అని ఉన్నది. గానీ, ఈయన ప్రభువే అని కొందరు ప్రభువు కాదని కొందరు తలంచుచున్నారు. ముద్రలకాలములో వరుసగా నాలుగు గుర్రముల మీద కూడ వచ్చిన వారు ప్రభువే కాని మరియొకరు కారు.

ఆ గుర్రముమీద మృత్యువు కూర్చుండెను. పాతాళలోకము అనగా నశించిపోవు వారందరు దానిని వెంబడింతురు నాలుగవ ముద్ర విప్పబడినపుడు ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, మృగముల వలన నాశనము ముమ్మరముగ జరుగును. మరణములు భూమిమీద అధికముగా జరుగును. పాండుర వర్ణముగల గుర్రమురాగా పైనాలుగు విధములయిన మరణములు వచ్చును. మనుష్యుల హృదయములలో ధైర్యముచెడి సంతోష సమాధానములు లేక మనుష్యులలో మనుష్యులకు కలతలు ఎక్కువైనందున ఖడ్గములతో చంపుకొనుచున్నారు. నరులు సృష్టికర్తపై తిరుగబడినందున సృష్టి నరులపై తిరుగబడగా కరువు అధికముకాగా అనేక మరణములు సంభవించును. రకరకములైన అర్ధముకాని వ్యాధులు ఎక్కువైనందున మరణము అధికముగా జరుగును. కౄరమృగములు పట్టణములలోను, పల్లెలలోను చొరపడి చనిపోయిన వారు చావగా మిగిలిపోయిన వారిని తినుటకు వచ్చును. ఇదంతయు భూమిపైనున్న మానవులలో నాలుగవ భాగమునకు జరుగును.

Home


ఐదవ ముద్ర

ప్రకటన 6వ అ|| 9-11 వచనములు

బలిపీఠము క్రింద :

ఇదివరకు జరిగిన ముద్రలకును ఈ ఐదవముద్రకును భేధమున్నది. ఇదివరకు ముద్రలు పరలోకములో విప్పినప్పుడు వాటి నెరవేర్పులు భూమిపైన జరిగినది. ఈ ఐదవముద్ర విప్పినది పరలోకములోనే గాని, నెరవేర్పు భూమిమీద జరుగలేదు. గాని పరలోకమందే నెరవేరినది. చిత్రపటమునందు బొమ్మలువేస్తే అయిపోయిన వెనుక అదివిడిచి ఇంకొకటి మరలా ఇంకొకటి మరలా ఇంకొకటి మారిపోయినట్లుగానే ఈ ముద్రకాలములో అనేక మార్పులు కనబడుచున్నవి.

పాతనిబంధన కాలములో మోషే ప్రార్ధనా మందిరమును గుడారముగా వేసి దానిని మూడు భూఅగములుగా చేసి

 • 1) అతి పరిశుద్ధ స్థలము
 • 2) పరిశుద్ధ స్థలము
 • 3) ఆవణమని పేర్లు పెట్టెను.

అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడువచ్చి మోషేతో మాట్లాడగా ఆ మాటలు మోషే ప్రజలకు చెప్పవలెను. దేవుని గుడారముచుట్టు యిశ్రాయేలీయులు గుడారము వేసుకొనిరి గుడారము వెనుక బహు బలమైన బలిపీఠము కట్టబడెను.

ఈ ఐదవముద్ర సమయములో పరలోకములో యోహానుకు ఒక గుడారము కనబడినది. అందులో దేవాలయమున్నది. వెలుపల బలిపీఠమున్నది దేవాలయములోనికి దేవుని వలన నియమింపబడిన వారు వెళ్ళుదురు వారే వధువు సంఘము, వారు వెళ్ళిన తరువాత వచ్చినవారు వాకిట ఉందురు. వధువు సంఘము, వారు వెళ్ళిన తరువాత వచ్చినవారు వాకిట ఉందురు. లోపల వేరే కాంతి, బైట వేరే కాంతి, లోపల వేరేపని, బయట వేరేపని.

పాతనిబంధన కాలములో భూమిమీదనున్న ఆలయములోని బలిపీఠముపై గిర్రెపిల్లలను బలివేయువారు. కల్వరి సిలువ అను బలిపీఠముపైన మన ప్రభువైన క్రీస్తు ప్రజలందరికొరకు బలివేయబడెను. అట్లే ఏడేండ్ల శ్రమకాలములో హతసాక్షులయినవారు బలియైనవారే కనుక పరలోకములో కనబడుచున్న ఆలయములోని బలిపీఠము క్రింద వేరే ఆత్మలు కనబడుచున్నవి. పరలోకమందున్న ఆలయమును చూచిన మోషే, సొలోమోనులు భూమి మీద ఆలయములను నిర్మాణము చేసిరి. పరలోక ఆలయమునందు అతి పరిశుద్ధ స్థలము కలదు. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి పెండ్లికుమార్తె ప్రవేశించినది. ఈ ఆలయ ఆవరణములో బలిపీఠమున్నది ఈ బలిపీఠము క్రింద వధువు సంఘము వెళ్ళిపోయిన తరువాత ఏడేండ్ల శ్రమకాలములో హతసాక్షులైన వారి ఆత్మలు ఉండును. లోపలికివెళ్ళిన పెండ్లికుమార్తెయొక్క కాంతివేరు, పనివేరు ఆవరణములోనున్న వీరి పనివేరు, కాంతివేరు. అనగా రాకడలో ఎత్తబడి, వధువు సంఘము ఏడేండ్ల మహావిందునకు, లోపలికి ప్రవేశించియున్నది. గాని శ్రమలలో మారిన హతసాక్షుల ఆత్మల అంతస్థు వేరు కనుక వీరు ఆవరనములో నున్నవాని పోల్చి చెప్పబడుచున్నారు.

హతసాక్షులు రెండు రకములు:-

1) క్రీస్తుప్రభుని వాక్యము విని అంగీకరించి నా నిమిత్తము ఆయన చనిపోయెను. గనుక ఆయన నిమిత్తము నేను ఒకసాక్షి నౌదునని అనుకొని విశ్వసించి వాక్యము నిమిత్తమై, హతసాక్షులు అయిరి. మరికొందరు దేవుని వాక్యమును అంగీకరించి వాక్యమును బట్టి సాక్ష్యము నిచ్చినందునవల్ల కొందరు హతసాక్షులు అయిరి.

2) కొందరు చంపబడరు గాని వారి జీవితకాలమంతయు క్రీస్తుకొరకు శ్రమపొందుదురు వీరు దీర్ఘ కాల హతసాక్షులు. కొందరు చంపబడుదురు వీరు హతసాక్షులు ఈ హతసాక్షులకు గొప్ప ఘనత ఉండును. మొదటి హతసాక్షి హేబేలు హేబేలు దేవుని యొద్ద ఏమి అనలేదు. కాని రక్తము నా అన్న నన్ను చంపెను గనుక ప్రాయచిత్తము చేయుమని అడిగెను. (ఆది 4: 10) తమ్ముని రక్తము అన్నకు శాపము కోరినది. ఈ మధ్యకాలములో హతసాక్షులయినవారు అనేకులు ఉన్నారు. కాని క్రైస్తవ సంఘము వచ్చిన తరువాత స్తెఫను హతసాక్షి అయ్యెను. సంఘకాలములో ఎందరో హతసాక్షులు ఉన్నారు. (హెబ్రీ 11: 35-40) రెండవ రాకడకాల హతసాక్షులు ఏడేండ్ల మహాశ్రమకోని హతసాక్షులు ఇందులో కలరు.

బోధకులు బోధించుచుండగా ఇతరులు కొందరు మాకవసరములేదని త్రోసివేయుదురు. ఇదియు ఒక విధమయిన హతసాక్ష్యము. సంఘములలో నుండి వెలివేయబడుట ఇది ఒక విధమైన హతసాక్ష్యము. సంఘకాలములో ఊరివెలుపల ఒక బలిపీఠమును కట్టుకొందురు. అన్యులు క్రెస్తవుల చేత దాని మీద సాంబ్రాణిపొగ వేయించుటకు పూనుకొనిరి. వారు క్రైస్తవులతో ఈలాగు అందురు. మీరు మీ ప్రభువే తలంచుకొని ఈ బలిపీఠముపైన అన్యదేవతలకు సాంబ్రాణిపొగ వేయండి. కొందరు క్రైస్తవులు వారిమాట చొప్పున ఆ ప్రకారమే చేసిరి. అట్టివారిని పొగవేసినందున తమ ఇండ్లకు పంపివేసిరి. కొందరు క్రైస్తవులు ఈ పొడివేయుట అనేపొడివేసి తమ్మును ఇట్లు ధూపము వేయమనుచున్నారు కనుక మేము వేయము. ఎందుకంటే ప్రభువును తలంచి దేవతకు ధూపము వేసిన అది దేవతలకేకాని ప్రభువునకు కాదు అని ధూపము వేయలేరు. వేయనందున వారిని చంపిరి. అట్టివారు హతసాక్షులే. ప్రభువును తలంచి దేవతకు వేసిన సాంబ్రాణిపొగ దేవతకేకాని ప్రభువునకు కాదు. గనుక మేము ఇద్దరు యజమానులకు దాసులము కాదు అని అందురు. పదిమంది క్రైస్తవులను చంపితే వేయిమంది క్రైస్తవులయ్యేవారు. నరికేవారు కత్తులు పడవేసి ఇక మేము చంపలేము అని ఊరుకున్నారు. ఒకరిని చంపితే ఇంకా కొందరు తయారయ్యేవారు. వీరు హతసాక్షులే. మనుష్యుల వలనను, వ్యాధుల వలనను, ఆయా పరిస్థితుల వలనను, శ్రమలున్నను ప్రభువును గోజులాడి ఎంత ప్రార్ధించినను శ్రమలుపోవు. ఇట్టివారు హతసాక్షులే. తమ పాపముల కొరకు శ్రమపడువారు హతసాక్షులుకారు ప్రభువైన క్రీస్తు సాక్ష్యము నిమిత్తమును, వాక్యము నిమిత్తమును శ్రమపడువారు హతసాక్షులే. పరలోకములో పెండ్లికుమార్తె కంటే వేరే గొప్పఘనత నొందుదురు. పెండ్లికుమార్తె పరమునకు ఎత్తబడి ఏడేండ్ల పెండ్లి విందులో నుండి వెయ్యియేండ్లు భూమిపై పరిపాలన చేయుటకు వచ్చును. వీరితోపాటు యేడేండ్లు మహాశ్రమకాలములో హతసాక్షులైనవారు ఈ వెయ్యేండ్ల పరిపాలనకు వత్తురు. (ప్రకటన 20:16) బలిపీఠము క్రింద వున్న హతసాక్షులు చాలామంది మమ్మును చంపిన వారిని యేమిచేస్తావు అని హెబేలు రక్తము దేవునియొద్ద మొఱపెట్టిన రీతిగానే వీరి రక్తము కూడా మొఱపెట్టును. ఐదవముద్రకాలములోని బలిపీఠము క్రిందనున్న ఆత్మలు పాతనిబంధన జనులే గాని రేప్చర్ అయిపోయిన తరువాత ఏడు సం||ల శ్రమకాలములో కూడా హతసాక్షులు ఉందురు. అందులోను, ఇందులోను అన్యులు, యూదులు క్రైస్తవులుందురు. యూదులు ఎంత క్రైస్తవులైనా ధర్మశాస్త్రము మానరు. వారి రక్తములో హెబేలు రక్తజీర వుండకమానదు. కీడుకు కీడు కోరుట శ్రమకాలములో హతసాక్షులయిన యూదులు. హతసాక్షులైన క్రైస్తవులకు హేబేలు రక్తము లేదు గనుక వారిని క్షమించుట అనేది ఉన్నది. హేబేలు రక్తజీరగల పాతనిబంధన హతసాక్షులు నాధా! స్త్యస్వరూపీ పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్పకయుందువు.

1) నాధా = ఓ ప్రభువా సర్వలోక ప్రభువా తండ్రీ (లూకా 2: 29)

2) సత్యస్వరూపి = మా దేవుడు సత్యమైన దేవుడు క్రీస్తు

3) పరిశుద్ధుడా = పరిశుద్ధుడు.

అని దేవుని సంబోధించి కేకలువేసిరి. వీరు మారుమనస్సు పొందిన యూదులైనవారు. ఈ శ్రమకాలములో మా పితరులైనవారు చంపిన క్రీస్తే రక్షకుడని 144 వేల మంది రక్షింపబడగా అంతిక్రీస్తు వారిని చంపగా వారు బలిపీఠము నొద్దకు వెళ్ళుదురు. వీరి రక్తములో శపించుట ఉన్నది క్రైస్తవుల రక్తములో క్షమించుట కనబడుచున్నది.

నాధా సత్యస్వరూపీ పరిశుద్ధుడా ఈ మూడు స్తుతులే కాని ప్రార్ధన లేనేలేదు.

4) ఎందాక తీర్పు చేయక ఉంటావు? ప్రతిదండన చేయక ఉంటావు? ఇది బాగాలేదు. దావీదు కీర్తనలో ఎన్నో పర్యాయములు హేబేలు రక్తము యొక్క సైలి కనబడుచున్నది. స్తెఫను క్షమిచుమన్నాడు. ప్రభువు క్షమించుమన్నాడు. దావీదు, ప్రవక్తలు, రాజులు సొంత జనులనే శపించిరి. ఆ కథ అంతా వీరి రక్తనాళములో నున్నది. వీరిలో ప్రతివానికి తెల్లని వస్త్రములు ఈయబడెను. క్రొత్త నిబంధన సిద్ధాంతమునుబట్టి ప్రతివానికి తెల్లని వస్త్రములు ఈయబడెను. క్రొత్త నిబంధన సిద్ధాంతమునుబట్టి ప్రకటనలో క్రీస్తుప్రభువు యొక్క రక్తములో వారి వస్త్రములు తెలుపు చేయబడెనని ఉన్నది. (ప్రకటన 7: 4) జంతువుల యొక్కయు పశువుల యొక్కయు రక్తము వలన కాదు కీర్తిమంతుడైన క్రీస్తు ప్రభువైన ఆయన నీతినిబట్టి నీతి వస్త్రములు ధరింపచేసి యున్నారు. అది ప్రభువు కృపనుబట్టి భక్తులను నీతి ఉన్నను అది క్రీస్తునీతికి చాలదు గనుక భక్తుని నీతిని తన అమూల్య రక్తములో ముంచగా వారి స్వంత నీతిపోయి ప్రభువునీతి వచ్చినదని దానికి గుర్తుగా తెల్లని వస్త్రము. (మార్కు 9:3) గాని ఇట్టి గొర్రెపిల్లయైన క్రీస్తు అమూల్య రక్తము స్నానము వలననే నీతి దొరకును ఈ రక్తము పరలోక సంబంధమైనదే కాని ఈ లోక సంబంధమైనది కాదు సిలువపై కారిన రక్తము ఎరుపుగా కనబడుచున్నను ఆయన మహిమ లోకమునుండి వచ్చిన ఆ రక్తములో మహిమ జీవమున్నది ఈ లోకములో సంపాదించుకొన్న భక్తి అంతస్థులు పరలోకములో ఉండును.

 • 1) పెండ్లికుమార్తె ఉండును. వీరూ రక్షింపబడినవారే
 • 2) రక్షితులు-వీరును రక్షింపబడినవారే గాని అనేక తరగతులున్నవి.
 • 3) పరదైసు సిలువనొద్ద మారిన దొంగవలె బోధనేర్చు కొనుటకు సమయము లేనివారు వీరి వస్త్రమును బ ట్టి

చూడగా వీరు క్రైస్తవులని తెలియుచున్నది. వీరు బలిపీఠముక్రింద ఉన్నందున వీరి ప్రార్ధననుబట్టి చూడగా పాతనిబంధనకాల జనమని తెలియుచున్నది. అనగా వారు యూదులనియు తెలియుచున్నది. ఏడేండ్ల శ్రమకాలములో అన్యులలోనుండి వచ్చిన క్రైస్తవులును యూదులలోనుండి వచ్చిన క్రైస్తవులును హతసాక్షులగుదురని తెలియుచున్నది.

పరిశుద్ధత రెండు విధములు:
 • 1) పాతనిబంధన కాల పద్ధతి:- పాపము చేయగానే శిక్ష.
 • 2) క్రొత్తనిబంధనకాల పద్ధతి:- వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము.
పాతనిబంధన కాలపద్ధతి ప్రకారము మొదటి హతసాక్షి హెబేలు క్రీస్తుప్రభువు మానవ రక్షణార్ధమైన ఏర్పాటు జనమైన యూదులలో జన్మించు ఏర్పాటు కలదు. లోకములో యూదుల జనము తక్కువ గనుక అన్యజనులు యూదులను చంపివేసిన యూదాజనాంగమికను ఉండదు. క్రీస్తుప్రభువు వారినుండి రారు ప్రభువు రాకుండా చేయుటే సైతాను కార్యక్రమము. సైతాను కార్యక్రమము పెరగకుండునట్లు దేవుడు యూదులకు శత్రువులైన వారిని హతమార్చుమనెను. ఇదియు పరిశుద్ధతయే. పరలోకములో దేవుని ఆలయమునందు ఆవరణములోనున్న హతసాక్షులారా మీవలె చంపబడబోవు వారి యొక్క సహవాసులు లెక్క పూర్తియగు వరకు ఆగండి. విశ్రమించండి.
 • 1) మీవలె చంపబడబోవు సహదాసులు:- పెండ్లికుమార్తె కానివారు వీరికి కిరిటములుండవు ధవళ వస్త్రములు మాత్రమే యుండును.
 • 2) సహోదరులు:- యేసుప్రభువు ఈ నా సహోదరులలో ఒకనికి చేసితిరి గనుక నాకును చేసినట్లే (వారుయూదులే) ప్రభువు కొరకు పనిచేయు దాసులు అందరు వారు యే దేశపు వారైనను యే స్థితిగల వారైనను ప్రభువుకు సహోదరులే.
 • 3) లెక్కకు పూర్తియగు వరకు:- ఏడేండ్ల శ్రమకాలములో రక్షణ పొందవలసిన వారి సంఖ్య ప్రభువునకు తెలియును.

ఆ సంఖ్య పూర్తి అయ్యే వరకు ప్రభువు కని పెట్టుచున్నారు పూర్తియగుటకు కొద్దికాలమే పట్టును. ఆ సంఖ్య పూర్తియగుటకు కొద్దికాలమే పట్టును. ఆ సంఖ్య పూర్తికాగానే మహిమలోనికి వెళ్ళిపోవచ్చునని పరిశుద్ధాత్మ తండ్రి మనలను ఆదరించును. సదాసులు సహోదరులు కొద్దికాలమే అను ఈ మాటలు వినగానే హతసాక్షులకు సంతోషము కలిగినది.

Home


ఆరవ ముద్ర

ప్రకటన 6వ అ|| 12-17 వచనములు

ప్రభువు 6వ ముద్ర విప్పగానే పెద్ద భూకంపము కలిగినది. ఈ ముద్ర విప్పినప్పుడు జరిగిన భూకంపము సామాన్యమైనది కాదు గాని మహా గొప్పది. లంకలు జంకెను. భూమిపై కొండలు అదిరెను. ఏడేండ్ల శ్రమకాలములో శిక్షలు వృద్ధి యగుచున్నవి. ప్రజల కఠినత్వమును ఎక్కువగుచున్నది. ప్రజలనేకులు మారుమనస్సు పొందుచున్నారు. దేవుడు మనిషికొరకు భూమిని సృజించెను. మనిషి భూమిపై ఉన్నందున మనిషికి యేమికలిగినను అది భూమికిని కలుగును. అందువలననే మనిషి అపరాధము చేసినందున మనిషినిపట్టి భూమియు శపింపబడెను. (ఆది 3:17) సృష్టి దేవునికి లోబడుచున్నదిగాని నరుడు సృష్టికంటె గొప్పవాడై యుండియు దేవునికి లోబడుటలేదు. ఎందుకనగా దేవునియెడల నరునికి ఉన్న భక్తిపోయినందున ఆస్థిరుడయ్యెను. ఈ ఆస్థిరుని దేవునివైపు త్రిప్పుటకు భూమికి కంపము కలిగించెను. ఇందువలన నరునికి కంపము కలుగవలసినదేగాని బాగుపడే కంపము కలుగలేదు. కాని దాగుకొనే కంపము కలిగినది. ఈ ఆరవముద్ర ఫలితము భూమిపైకి వచ్చుచున్నప్పటికి ప్రజల హృదయము కఠినమగుట మాత్రమేకాక అస్థిరత కనబడుచున్నది. ఆ అస్థిరతను బయలు పరచుటకే భూకంపము కలిగినది. ప్రభువు సిలువవేయబడినప్పుడు తనను కలుగజేసిన సృష్టికర్తయగు ప్రభువు శ్రమ అనుభవించుచున్నారని సహింపలేక భూమి కంపించినది అది యెరిగిన ప్రజలకు కంపములేదు. ఇప్పుడున్న ప్రజలకును దేనియందు భయములేదు. శ్రమలున్ననూ భయపడుటలేదు. ఈ ముద్రకాలములో భూకంపము కలిగినను నరులు అస్థిరులుగానే ఉన్నారు. రాజ్యవిషయములోను, మతవిషయములోను, జనసంఘ విషయములోను యేమి చేయవలెనో తోచక అస్థిరతబుద్ధితో ఊగుచుండెను. 5ముద్రలు జరిగినందున భూమిపై కలిగిన భయంకరమైన గందరగోళమునుబట్టి

 • 1) రాజ్య పరిపాలకులకు ప్రజలకు స్థిమితములేక అస్థిరులై యున్నారు. పై 5 పర్యాయములు జరిగినది చూచి ఈ 6 పర్యాయము యేమి జరుగునో అని భయపడుచున్నారు.
 • 2) ప్రభువువచ్చి పెండ్లికుమార్తెను, మిగతావారిని తీసికొనివెళ్ళినందున మిగిలిన వారికి గందరగోళము కలిగియున్నది. 5 ముద్రలలో జరిగిన చరిత్రనుబట్టి గలిబిలి యెక్కువైనది.
 • 3) మతబోధకులు యేమీచేయలేక పోవుచున్నాము. ప్రభువు నెమ్మది యివ్వగలరని చెప్పలేక పోవుచున్నారు.

బోధకులమైనను, శ్రమలలో మిగిలిపోయినాము అని గలిబిలి, ఏ మతబోధకుడైనను, అయ్యా! ప్రార్ధన చేసికొందాము రండని పిలువలేడు. మతాలలో గలిబి. ప్రతిదేశములోను నెమ్మదిలేదు, గలిబిలే. పరలోక దేవుని పరిపాలనకు భూలోకము ఒప్పుకొననందున పరలోకబోధ లోకమతాలు ఒప్పుకొనలేదు గనుక మతాలదో గలిబిలి. భూలోక జనాంగములలోని కొందరు క్రీస్తుప్రభుని రక్తముచేత శుద్ధినొంది రక్షింపబడి, పరమందు స్తోత్రించుచు భూమిపె మారని వారికొరకు ప్రార్ధించుచున్నను ఆ ప్రార్ధనకు భూమిపై జనాంగము మారలేదు గనుక గలిబిలి. సృష్టికర్తయైన దేవుని యేర్పాటు అంగీకరింపక వారి యిష్టము వచ్చిన క్రొత్తయేర్పాట్లు యేర్పర్చుకొనినందున గలిబిలి కలిగినది. సైతానుకు అధికారము లేదు తుఫానులు, భూకంపములు, దేవుని పనులే నరులను భయపెట్టి రక్షించుటకు యివి రానిచ్చును ఇవి నరునికి బోధచేయు బోధకులే గనుక భూకంపము ఓ మనిషీ ! నీవు దేవునిని ఆశ్రయించనందున నీకుస్థిరతలేదు అని భూకంపము చెప్పుచున్నది.

సూర్యుడు నలుపు:- ప్రభువు సిలువ మరణ సమయమందు సూర్యుడు అద్రుశ్యుడు కాగా మధ్యాహన కాలమందే సృష్టికి చీకటికమ్మెను. అనగా సృష్టి కర్తయొక్క శ్రమను చూడలేక ప్రభువును హింసించు వారి కఠినత్వమును చూడలేక సూర్యుడు అదృశ్యుడాయెను. అందువలన చీకటికమ్మెను. ఈ 6వ ముద్రలో సూర్యుడు నలుపాయెను అని ఉన్నది. అనగా దేవుని కృపాదీపము సృష్టాదినుండి ప్రకాశించుచునే ఉన్నది. ఈ ముద్రకాలములో నరులు యీ కృపాకాంతిని గ్రయించలేదని నీడ ఆకాశము మీద పడినందున సూర్యుడు నలుపాయెను. అనగా కృపాజ్యోతియెత్తి వేయబడెను. దేవుని కృపను తృణీకరించి మానవుడు తన ష్తానమును తప్పినందున సృష్టి కూడా తన స్థానము తప్పినది. ఎందువలన? నరుడు తన అవిధేయత. అస్థిరత వలన తన హృదయములో కలిగిన చీకటినిబట్టి కృపాదీపమును ఆర్పివేసికొనెను. గనుక చీకటి కమ్మెను. అందువలన సూర్యుడు నలుపాయెను. దేవునియొక్క కృపాదీపమును మనుష్యులు లెక్కచేయబడినప్పుడు అది క్రమక్రమముగా తగ్గిపోయి చీకటి యగును. అలాగే పెండ్లికుమార్తె వరుసలోని వారు కూడా కృపను గైచేయకపోతే అలాగే జరుగును. యెరూషలేము దేవాలయము నాశనమగుటకు యూదులు దేవుని అంగీకరించనందున అది నాశనమాయెను.

చంద్రుడు రక్తవర్ణము:- దుఃఖము వలన నరుల ముఖము ఎఱుపుగా కందును. అట్లే నరులకు కాంతినిచ్చు చంద్రుడు ఈ ముద్ర కలదు స్థితిని చూచి బాధనొందినందున చంద్రకాంతి రక్తవర్ణమయ్యెను.

చుక్కలు రాలుట:- అకాలపు అంజూరపుకాయలు రాలునట్లు నక్షత్రములు రాలును. గనుక సూర్యునివలె, చంద్రునివలె, యీ నక్షత్రములు కూడ కాంతినియ్యవు. అందువలన తన స్థానములో నుండి రాలిపడిపోవును. నరులు కాంతినిచ్చిన దేవుని పూజింపక ఈ జ్యోతులను పూజించినందున యెప్పుడును ప్రకాశించు జ్యోతియైన దేవునిని ఆరాధించండి అని నరులకు నేర్పుట కొరకే నక్షత్రములు రాలిపోయెను.

ఆకాశమండలము చుట్టబడిన గ్రంధమువలెనై తొలగిపోయెను:- సూర్యుడునలుపై, చంద్రుడుయెరుపై నక్షత్రములు రాలిపోవుట వలన ఆకాశము వలన నరులకు యేవిధమైన ఉపయోగము లేదని తెలియజేయుటకు ఆకాశము చుట్టబడిన గ్రంధమువలెనిఎ తొలగిపోయెను. సృష్టికర్త శిక్షించుట మాత్రమేకాక సృష్టివలన కూడా శిక్ష ఉన్నది. అని తెలియుచున్నది. నరుని దోషమునుబట్టి ఇట్లు జరుగుచున్నది.

ప్రతి కొండయు, ప్రతి ద్వీపమును, వాటి వాటి స్థానములు తప్పెను:-

భూకంప సమయమప్పుడే లంకలు జంకెను, కొండలు అదిరెను అని పైన వ్రాసియుంటిమి మనిషి అస్థిరతవల్ల మతిలేక ఆదాము హవ్వలు పాపము చేసినందున వారు స్థానముతప్పి బైటకు పోయిరి. అలాగే నరుడు తనకిచ్చిన ఉన్నతస్థితిని తప్పినందున కొండలు, ద్వీపములు. స్థానములు తప్పినవి. ఇది మనిషి దుస్థితి బట్టి కలిగెను.

కొండగుహలలో బండసందులలో

 • 1) కొండలు:- ఉన్నత స్థలములలో పూజమానలేదని రాజుల చరిత్ర కాలమందు బైబిలులో చూడగలము.
 • 2) బండల:- చాకిరేవు, ఆయాస్థానములలోని బండలకు పసుపు రాసి పూజచేయుదురు.
 • 3) గుహలు:- మన్యప్రాంతములలో నున్న గుహలలో దీపములు వెలిగించి పూజచేయుదురు ఈ స్థానములనే ఆశ్రయములుగా చేసికొని భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్టులు, దాసుడు, స్వతంత్రుడు ప్రార్ధన చేసెను. ఇది సాతాను ప్రార్ధన కూటము.
ఉగ్రతలు రెండు:-
 • 1) తండ్రియైన దేవునినుండి.
 • 2) గొర్రెపిల్ల.
 • 1) తండ్రియొద్దనుండి ఉగ్రతవచ్చెను. ఎందుకనగా తండ్రి కలుగజేసిన ప్రజలు ఆయనను సేవించనందున.
 • 2) తండ్రిచేసిన వారిని కుమారుడు రక్షించెను. ఆ రక్షణవారు అంగీకరించినందున గొర్రెపిల్ల యొద్దనుండి ఉగ్రత వచ్చెను. గొర్రెపిల్ల అనగా సాధువైనది కోపములేని సాధువైన గొర్రెపిల్లకు ఉగ్రత కలుగుటకు కారణము ప్రజలు చేసిన యెక్కువయిన పాపమే కారణము.

రాబోవు ఉగ్రత:- స్నానికుడైన యోహాను రాబోవు ఉగ్రత తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వారెవరని బోధించెను. ఈ బోధ యూదా జనాంగము అంగీకరరించలేదు ప్రభువు 33 1| 2 సం||లు భూమిమీద ఉండి బోధించెను. తుదకు యూదులే ఆయనను సిలువచేసి చంపుచుండగ ప్రభువు వారిని క్షమించుమని ప్రార్ధించెను. ఆ ప్రార్ధన వారు అంగీకరించనందున 70 సం||లకు యెరూషలేములోని జనాంగము, పట్టణము దేవాలయము, ధర్మశాస్త్రము, అంతయు శ్త్రువుల వలన నాశనమైనది ఇదే యోహాను చెప్పిన రాబోవు ఉగ్రత. రాబోవు ఉగ్రతయైయున్న యెరూషలేము నాశనము చిన్న ముంగుర్తు. 6వ ముద్రలోని గొర్రెపిల్ల ఉగ్రతలోక నాశనమునకు గొప్ప నెరవేర్పు ఈ రెండు నాశనములను గూర్చి శాస్త్రులకు పరిసయ్యులకు తెలిసినను, వారు ప్రవక్తల గ్రంధములోనిది చదివి ఊరుకొన్నారు. ఇంత పరిశుద్ధ పట్టణము నాశనమగునా అని అనుకొన్నారు. కాని నాశనమైనది. ఉదా:- ఊరిలో గందరగోళము ఉన్నందువలన మనము ప్రార్ధనా కూటము పెట్టుకొన్నట్ట్లు లోకస్తులు 6వ ముద్రలో కొండ, బండ, గుహలకు ప్రార్ధనా కూటము పెట్టిరి. ఉగ్రతకు తాళలేమని తెలిసికొనిరి వారు జ్ఞానులే. శిక్ష తెలిసికొనిరి. దేవుడు, గొర్రెపిల్లయైన క్రీస్తు, గొపవారని తెలిసికొనిరి. ఉగ్రత యొక్క నష్టము తెలిసికొనిరి గాని మారుమనస్సు పొందలేదు.

మరుగుచేయుడి:- మరుగుచేయుట అనగా దేవునికి కనబడకుండ తమ్మును దాచిపెట్టుమనుట ఆయన ముఖబింబము చూచుటకు పాపులకు యిష్టములేదు. ఎందుకనిన వారిక్రియలే కారణము వారి క్రియలే వారు దేవుని సన్నిధికి రాకుండ వారిని దూరము చేయుచున్నవి. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ముఖము చూచుటకు అభ్యాసము చేసికొనకపోయిన అప్పుడు పారిపోవవలసి వచ్చును లోకస్తులు కొండ, బండ, గుహ, సహవాసులు గాన దేవునియొద్ద నుండి పారిపోయిరి. మమ్మును మరుగుచేయుమని పర్వతములతోను, బండలతోను, చెప్పుచున్నారు.

కొండ బండలందు దాగి-యుండలేముగ

వాని యండ నుండి - మండునగ్ని యదిగో వచ్చెగా ||నాడువచ్చినట్లు|| కొండ=కొండ:బండ = గుహ;

యండ = సన్నిధి

ఉదా:- పిల్లవానికి చదువురానపుడు వానిని శిక్షించే ఉపాధ్యాయునికి బెత్తము సహాయ పడినట్లు మారుమనస్సులేని వారిని దేవుడు శిక్షించునపుడు సృష్టియంతయు దేవునికి తోడ్పడినది. అనగా సృష్టి కూడా శిక్షించినది. అల్లరి పిల్లవానిని పంతులుగారు శిక్షించును. తరగతి లీడరుకూడ శిక్షించినట్లు దేవుడు. సృష్టి కూడ నరుని శిక్షించును. సృష్టియెందుకు శిక్షించును? నరుడు పూజించినందున దేవుడు నరుని శిక్షించునపుడు సృష్టి మనిషితో ఓ తెలివిలేని నరుడా! నన్నెందుకు పూజించుచున్నావు? నన్ను, నిన్న్ను సృష్టించిన సృష్టి నరునికి బుద్ధిచెప్పెను. నరుడు చేసినపాపమును బట్టి సృష్టి శపింపబడినది. (ఆది 3:17) నరుడు మార్పుచెంది దేవకుమారులై పరిశుద్ధముగా సృష్టిని పరిపాలించువారుగా ఉండవలెనని సృష్టి ప్రసవ వేదనపడుచుప్రార్ధించుచున్నది. (రోమా 8:19-22) బాగుగా పోరాడి ఓడిపోయిన జట్టి ఒగుర్చునట్లు మనిషి చేసిన పాపములకు సృష్టి యావత్తును మూల్గుచు ప్రసవ వేదన పడుచున్న పడుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టిమిగుల ఆశతో తేరిచూచుచున్నది ఎందుకనగా సృష్టియొక్క విమోచన కొరకు ఎప్పుడనగా వధువు సంఘము సిద్దమై పరమునకువెళ్ళి పెండ్లి విందులో ఏడేండ్లు ఉండి వెయ్యేండ్ల పరిపాలనకు భూమిమీదకు వచ్చును.

అప్పుడు సృష్టికి శాపము పోయిశుద్ధినొంది 1000 ఏండ్ల పరిపాలనకు సిద్ధమైయుండును. ఈ పరిపాలన కొరకే స్ర్ష్టి తేరిచూచుచున్నది. అప్పుడు సృష్టికి పూర్ణవిమోచన కలుగును యీ రారాజైన క్రీస్తుప్రభువు దేవుడుగా దేవదూతల మధ్యలో ఉండి నరుడుగా సృష్టిలోనికి రాగా దూతలందరు వచ్చి మహిమ గీతములు పాడిరి. సృష్టృఇకర్తయైన ప్రభువు నరరూపముతో వచ్చినను దేవుడే గనుక సృష్టియంతయు నమస్కారము చేసెను. ప్రభువు బాప్తీస్మము పొందుటకు యొర్ధానదిలో కాలుపెట్టగ నీళ్ళన్నియు నలుఒరక్కల ఆనందముతో పొంగి సృష్టికర్త మాలో కాలు పెట్టియున్నారని గౌరవార్ధమై ఆయనను యెదుర్కొన వచ్చెను. సృష్టి దేవునికి సహాయము చేయుచునే యున్నది. ఇట్టివి బైబిలంతటిలో చూడగలము.

ఉదా:- 1) భూమి, 2) పక్షులు, 3) జలచరములు, 4) జలము 5) జంతువులు, 6) సూర్యుడు, 7) మృగములు ప్రభువు వెయ్యేండ్ల పరిపాలనకు భూమిమీదికి వచ్చినపుడు సృష్టికి మహాసంతోషము నరుని పాపమునుబట్టి సృష్టికి మహారోదనము కలుగుచున్నది. సృష్టికర్తకు గొప్పసహకారి అని తెలియుచున్నది. దేవుని మాటవిని మారనందున సృష్టిలోని అన్ని రకములైన వారును 7సం||ల కాలములో శిక్ష అనుభవించెదరు.

 • 1) భురాజులు
 • 2) ఘనులు
 • 3) సహస్రాధిపతులు
 • 4) ధనికులు
 • 5) బలిష్టులు
 • 6) దాసులు
 • 7) స్వతంత్రుడు
ఈ జాబితానుబట్టి 7సం||ల శ్రమలలో యీ 7 తరగతుల వారికి ఎన్ని శ్రమలు వచ్చినను మారలేదు.
 • 1) భూరాజులు:- నేరస్థులను శిక్షించువారు గాన నేరము లేకుండ ఉండవలెను గాని నేరమున్నందున రారాజైన క్రీస్తు వారిని శిక్షించును.
 • 2) ఘనులు:- ఘనులను ఘనులే శిక్షించవలెను గాన ఘనుడైన క్రీస్తు క్రీస్తుప్రభువే వారిని శిక్షించును.
 • 3) సహస్రాధిపతులు:- నేరము చేసిన వారిని సర్వాధికారి శిక్షింపవలెను ప్రభువు సర్వాధికారి గనుక వీరిని శిక్షించును.
 • 4) ధనికులు:- ధనికులు నేరముచేసిన ధనికులే శిక్షింపవలెను. పర సంబంధమైన ఐశ్వర్యవంతుడైన ప్రభువు వీరిని శిక్షించును.
 • 5) బలిష్టులు:- నేరము చేసిన వారిని బలిష్టులే శిక్షింపవలెను. గాన బలిష్టుడైన ప్రభువే వీరిని శిక్షించును.
 • 6) దాసులు:- దాసులు నేరముచేసిన దాసుడే శిక్షింపవలెను. ప్రభువే దాసుని రూపములో వచ్చెనుగాన ఆయనే శిక్షింపవలెను.
 • 7) స్వతంత్రుడు:- స్వతంత్రుడు నేరముచేసిన స్వతంత్రుడే శిక్షింపవలెను. నా ప్రాణమును పెట్టుటకును మరల దానిని తీసికొనుటకును నాకు సర్వాధికారము కలదని చెప్పి తనంతట తానే చనిపోయి తనంతట తానే సమాధిలోనుండి లేచెను. గాన యీయనే స్వతంత్రులను శిక్షింపవలెను. 7 లక్షణములు కలిగి, 7 మాటలు పలికి, 7 అధికారములను చూపి, 7తరగతుల వారిని 7 రీతుల శిక్షించిరి.
ప్రకటన స్వరములు రెండు:
 • 1) వెళ్ళవద్దు
 • 2) వెళ్ళండి.
 • 1) వెళ్ళవద్దు అంటే నరకమునకు వెళ్ళవద్దు.
 • 2) వెళ్ళండి అంటే పెండ్లికుమార్తె వరుసకు వెళ్ళండి.
Home