14వ అధ్యాయము - Sealed one Harvest

పరిచయము

గొర్రెపిల్ల: స్థలము: సీయోనుకొండ
 • పనినిలిచె
144 వేలమంది
  నొసళ్ళపై
 • ఆయన పేరు
 • తండ్రిపేరు
శబ్ధమువంటి
 • ఎ. జలధ్వని
 • బి. ఉరుముధ్వని
 • సి. వైణికులనాదము
 • వైణికుల కీర్తన:
  • ఎ. క్రొత్త కీర్తన
  • బి. ఎవరికిరానిది

  సిం హాసనము
  నాల్గుజీవులు
  పెద్దలు
  ఆ వైణికులు:
  • ఎ. స్త్రీ.సా. అపవిత్రులుకారు
  • బి. స్త్రీ. సా. ఎరుగరు
  • సి. గొర్రె వెంబడించువారు
  • డి. కొనబడిరి
   • దేవునికై
   • గొ. కై
   ప్రధమ ఫలముగా
  • ఇ. అబద్ధమాడరు
  • ఎఫ్. అనింద్యులు

  ఒక దూత (నిత్యసువార్త) ప్రకటన

  ఎగురు:
  ఎ. దేవునికి భయపడుడి


  భూనివాసులు
  • మహిమ పర్చుడి
  • నమస్కరించుడి


  తీర్పువచ్చె
  • జన
  • వంశ
  • భాష
  • ప్రజ

  • దేవుడు ఆకాశమును
  • దేవుడు సముద్రమును
  • దేవుడు జలధారను  సృజించిన
  ఇంకొక దూత
   బాబేలు:
  • ఎ. కూలె
  • బి. కూలె
  ఉద్రేక | మధ్యము వ్యభిచార | త్రాగించిన వేరొక దూత: మనుష్యుడు
   ముద్రవేసికొన్న :
  • ఎ. మృగము
  • బి. ప్రతిమ
  • సి. నొసటి
  • డి. చేతి
  శిక్ష: త్రాగును
  • ఏమి ... దేవుడు కోప - మధ్య
  • కల్పక ... దేవుడు ఉగ్రత - పాత్రలు


  బంధింపబడు


  ఎదుట
  • దూతలు
  • గొర్రె


  అగ్ని గంధకము
  ఎన్.బి. : పొగ
   శిక్ష: నెమ్మదిలేదు
  • ఎవరికి?


  ఎదుట
  • = నమస్కారులకు
  • ముద్రగలవారికి


  మృగ ప్రతిమ


  N.B : పరిశుద్ధుల ఓర్పు
  • 1. దేవుని ఆజ్ఞలు
  • 2. యేసు విశ్వాసము


  గైకొను
  స్వరము వ్రాయుము
   ప్రభువునందు మృతులు ధన్యులు
  • ఆత్మ: నిజమే వారు : ఎ. ప్రయాసము మాని
  • బి. విశ్రాంతి పొందు
  N.B : వారి క్రియలు వారి వెంట
   మనుష్య కుమారుడు
  • ఎ. తెల్ల మేఘాసీనుడు
  • బి. సువర్న కిరీటధారి
  • సి. చేత వాడికొడవలి
   మరొక దూత
  • 1. సిం హాసనమునుండి వచ్చె
  • 2. చెప్పె


  ఆసీనునితో:
  • ఎ. పైరుపండె
  • బి. కోత వచ్చె
  • సి. కోయుము
   ఆసీనుడు :
  • 1. కొడవలి వేసె
  • 2. పైరు కోయబడె
   వేరుదూత:
  • 1. సిం హాసనము నుండి వచ్చె
  • 2. వాడికొడవలితో
   మరియొక దూత:
  • 1. బలిపీఠము సిం హాసనము నుండి వచ్చె 2. అగ్నిపై అధికారియో
  • 3. పిలిచి చెప్పె
  • ఎ. ద్రాక్షాపక్వము
  • బి. గెలలు కోయుము
   • ఆ దూత
   • ఎ. కొడవలి వేసె
   • సి. తొట్టెలో వేసె
     తొట్టె:
    • ఎ. పెద్దది
    • బి. దేవుడు కోపద్రాక్షా
    • సి. త్రొక్కి
    • డి. రక్తముగారె
     N.B : 1000 క్రోసుల దూరము
    • బి. గుర్రాల కళ్ళెమట్టుకు

    ప్రకటన 13వ అధ్యాయమును పోటీ సంఘమును గూర్చి వివరించు కున్నాము. అనగా దేవుని సంఘమునకు విరుద్ధముగా సాతానుడు ఏర్పరచుకొన్న సంఘమును, అతని క్రియలును కనబడుచున్నవి. పోటీసంఘములోనుండి 14వ అధ్యాయములోనికి వచ్చియున్నాము.

    1. సీయోను కొండ ఈకొండపై గొర్రెపిల్లయున్నది. పరలోకములో సీయోను కొండ ఉన్నది. ఆ కొండపై గొర్రెపిల్లయైన యేసుప్రభువు ఉన్నారు యెరూషలేములో అనగా భూమిపైనున్న సీయోను కొండకాదు పైన యెరూషలేములోనున్నది. భూమిమీద యెరూషలేములో ఉన్న సీయోను కొండ పరలోకపు వాటికి ముంగుర్తులై యున్నవి.

    భూమిపై చెట్లు, కొండలు, పట్టణములు ఉన్నవి గాని సీయోనుకొండ లాంటి గట్టిదికాదు. మహిమ కొందలు పరమందున్నవి గాని భూలోకమందున్నట్టి ఇసుక, మట్టి, రాళ్ళతో ఉన్నట్టి కొండలవీకావు. ఈ మహిమ కొండ మన ప్రాణమునకు హాయిగా నుండును భూలోక మందున్న రీతిగా ముండ్లుతుప్పలు ఈ మహిమ కొండపై ఉండదు. ఈ కొండపైకి ఎటుబడితే అటు నిర్భయముగా ఎక్కగల గొర్రెపిల్లయైన యేసుపెరభువే ఈ రీతిగా కనబడియున్నాడు. వ్యాకరణములో ముందు నామవాచకము రావలెను అటు తరువాత ఆయన అని అంటాము.

    ఉదా:- ఇస్సాకు గారు వచ్చి యున్నారని ఒక వ్యక్తి వచ్చినపుడు ఆయన నామమును బట్టి తెలియచేయుదుము కాని తరువాత మాటి మాటికి ఇస్సాకు గారు అని అనము గాని ఆయన అని అంటాము. అలాగే అయన అనగా గొర్రెపిల్ల అని ఈ మాటలో మనకు అర్ధము తెలియ వచ్చుచున్నది. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు గాని ప్రభువు అని అర్ధమిచ్చునదైయున్నది. ఇది ఆయన నామము. ఆయన తండ్రి నామమని యున్నది/ 144 వేల మంది నొసళ్ళపై యేసుప్రభువు నామము దేవుని నామము ఉన్నవి. ఈ 144 వేల మంది భూలోకమందు పొందిన ఈ వాక్కునుబట్టి పరలోకమునకు వెళ్ళగల్గిరి వీరు సీయోను కొండపైకి ఎక్కి గొర్రెపిల్ల యొద్దకు వెళ్ళెను. వీరు భూమిమీద ఉన్నపుడు మహశ్రమ కాలంలో సాతానుపై అంతి క్రీస్తుపై విజయము నొంది ప్రకటన 7వ అధ్యాయములో ఉన్నట్లుగా ముద్ర పొంది తిన్నగా పరలోక పరలోకమునకు వెళ్ళిరి. వీరు పరలోకమునకు వెళ్ళిరీనుసంగతి 7వ అధ్యాములోనిది గాని 8వ అధ్యాయములోగాని యోహాను గారు వ్రాయవలసినదిగాని అక్కడ వ్రాయక 14వ అధ్యాయములో ఈ విషయం మనకు కనబడుచున్నది. ఇది మనకు అర్ధము కాకపోయినదైవాత్మ ప్రేరేపణనుబట్టి వ్రాయబడినది. గనుక 14వ అధ్యాయంలో ఈ విషయము వ్రాయబడి యున్నది. ఈలాగు ప్రకటన గ్రంధములో అనేక చిక్కులు కనబడు చున్నవి గాని అర్ధచేసుకొనవలెను. అపార్ధము చేసికొనకూడదు. ప్రకటన 8వ అధ్యాయంలో ఏడవ ముద్రను గూర్చి వ్రాయబడియున్నది. ఇక్కడ 144 వేల మంది పరలోకమునకు వెళ్ళిన సంగతి చెప్పిన యెడల ముద్రల క్రమము తప్పి పోవును గనుక ఈలాగు వ్రాయబడినది. చరిత్ర యెరిగినవారు వాటి కళలను గ్రహింపగల్రు అట్టి వారు అపార్ధము చేసికొనరు.

    • 1. విస్తారజలముల శబ్ధము-భూమిమీదనుండి వినబడును.
    • 2. ఉరుముల శబ్ధము-పైనుండి వచ్చును ఈ రెండు శబ్ధములు పరలోకమునుండి వచ్చిన శబ్ధములు ఈ రెండును మనుష్యులు భూమిమీద ఎరిగియున్న దానిని బట్టియు పరలోకములోనున్న ఒకదానిని బట్టియు పోల్చిరి.
    • 3. వీణెలు వాయించుచున్న వైణికుల శబ్ధము - వీరు 144 వేల మంది
     • 1. సీయోను - సిం హాసనముపై తండ్రి ఉన్నారు.
     • 2. నాలుగు జీవులు - స్తోత్ర సమాజము.
     • 3. పెద్దలు - పెండ్లి కుమార్తె.

    ఇంకా దిగువకు వచ్చిన యెడల సీయోను కొండ, గొర్రెపిల్ల, 144వేల మంది రక్షితులు గాని వీరు పెండ్లికుమార్తెకాదు. 144వేల మంది తండ్రి, పెండ్లికుమార్తె నాలుగు జీవులు యెదుటనుండి క్రొత్తకీర్తన పాడిరి. ఈ కీర్తన పరలోకమునకు వెళ్ళిన పిమ్మట కట్టిరి. ఈ కీర్తన భూమిమీద ఎవరు కట్టియుండలేదు. పాడియుండలేదు. గొర్రెపిల్లయో, లేకనలుగు జీవులలో ఉన్నవారో, లేక పెండ్లికుమార్తెయో, మనకు తెలియదు ఎవరు కట్టిన ఈ 144 వేల మంది ఈ కీర్తన పాడిరి.

    • 1. 144వేల మంది కొనబడిరి.
    • 2. వీరు క్రొత్తకీర్తన పాడిరి.

    పరలోకములో సభ జరుగగా ఈ సభలో వీరు పాడిరి.

    స్త్రీల సాంగత్యము:- వీరు భూమిమీదనున్న సమాజము. అంతిక్రీస్తు భూమిమీదనున్నపుడు ఈ సమాజమునుఏర్పాటుచేసెను. క్రీస్తుప్రభువు భూమి మీద ఏర్పాటు చేసిన సరి సంఘములో పెండ్లికుమార్తె అనియు స్త్రీ సంఘమనియు ఏరీతిగా నున్నవో అదేరీతిగా స్త్రీ సంఘమని అంతిక్రీస్తు పోటీ సంఘములో దేవునికి విరుద్ధముగా ఏర్పాటుచేసికొనెను. పరలోకములోనున్న 144వేల మంది గొర్రెపిల్ల ఎక్కడకు తీసుకొనివెళ్ళునో అక్కడకువెళ్ళుదురు. అలాగే 7 సం||ల మహా శ్రమకాలంలో కౄర మృగ మన బడిన అంతిక్రీస్తునకు దెబ్బ మానగా అనగా అంతిక్రీస్తు విడచి వెళ్ళినవారు కొందరు మరల తిరిగి అతనిని వెంబడింపగా అంతిక్రీస్తు వారిని ఎక్కడకు తీసుకువెళ్ళితే అక్కడకు అతనిని వెంబడించు వారుకూడ వెళ్ళుదురు. అంతిక్రీస్తును వెంబడించిచిన వారిలో కొందరు ప్రభును వెంబడించగా అంతిక్రీస్తునకుదెబ్బ. ఈ దెబ్బనే గాయమని ప్రకటన 13వ అధ్యాములో మనకు తెలుపబడియున్నది.

    పెండ్లికుమార్తె ఈ లోకములో సిద్ధపడి ప్రభువుతో మహిమమేఘమును నెక్కి పరలోకమునకు వెళ్ళునపుడు వరుడైన క్రీస్తు ప్రభువు వధువైన పెండ్లికుమార్తె సంఘమునకు పరలోకమంతటిలోనున్న ప్రతిస్థలమును చూపించి అన్నియు ఏర్పరచెను.

    చరణ:- "అంతయు మనదేకదా - యేసునికున్నదంతయు మనదేకదా" గనుక పరలోక మహిమలో వివరించుకొనుటకు మనలోకములోనున్న ఈభాష చాలదు.

    అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుక కూడదు 2 కొరింథి 12:4

    • 1. దేవుని కొరకు
    • 2. గొర్రెపిల్ల కొరకు

    భూమినుండి వారు ఒప్పుకున్నారు గనుక ప్రభువు తన ప్రభావమువల్ల వారిని కొనెను.

    • 1. పాతనిబంధన జనము.
    • 2. క్రొత్తనిబంధన జనము,
    • 3. సంఘచరిత్రలో మూడవ ఫలము
    • 4. రేప్చర్లో నాలుగవ ఫలము
    • 5. యేడేండ్ల మహా శ్రమలు ఐదవ ఫలము

    పై నాలుగు ఫలములోని వారు పెండ్లికుమార్తె వరుసలో ఉన్నారు. అయిదవ వారు అనగా యేడేండ్ల మహాశ్రకాలములో అయిదవ ఫలముగా రక్షింపబడినవారు రక్షితులలోనికి వెళ్ళిరి. రేపు వరుడుగా మధ్యాకాశములోనికి రానైయున్న ప్రభువు ఆకరించగా రేప్చర్ వరకున్న వారు (ఆదాము మొదలుకొని రేప్చర్ వరకున్న) అందరు ప్రధమ ఫలమే గాని శ్రమకాలములో మనుష్యులు రక్షింపబడుట చాల కష్టము గనుక దేవునికి వీరు అవసరమైయున్నారు. వీరికి ఉన్న బిరుదులు

    • 1. కొనబడిన వారు
    • 2. ప్రధమ ఫలముగా ఉన్నవారు
    • 3. స్త్రీ సాంగత్యము యెరుగనివారు.
    • 4. క్రొత్త కీర్తన పాడినవారు.
    • 5. అబద్ధము తెలియనివారు,
    • 6. అనిద్యులు,
    • 7. ముద్రలు ధరించినవారు
    • 8. గొర్రెపిల్ల ఎక్కడకు వెళ్ళిన అక్కడకు వెళ్ళువారు,
    • 9. తండ్రి పెండ్లికుమార్తె జీవుల యెదుట కీర్తన పాడినవారు.

    ప్రకటన 14:6

    ప్రార్ధన:- ఓ దయగల ప్రభువా నేటిదినములలో

    • 1. గురుతులనుబట్టి
    • 2. వాక్యోపదేశమునుబట్టి
    • 3. విశ్వాసమునుబట్టి మేము నీ రాకకొరకు సిద్ధపడవలసి యున్నది.
    పాతనిబంధన విశ్వాసులు నేటికాల విశ్వాసులమైన మేమును రాకడ గూర్చియే ధ్యానించుచున్నాము. తండ్రీ ధ్యానించుటకు అనేక విషయములు ఉన్నవి గాని నేటి దినములలో నీ రాకడ ముఖ్య అంశమైయున్నది. నీకృపనుబట్టి మమ్మును సిద్ధపర్చుము. దూతలను కావలియుంచుము. దయ్యములను బంధించుము ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము ఆమెన్.

    భూలోకములో రాకడకొరకు సిద్ధపడిన పెండ్లికుమార్తె ఎత్తబడిన పిమ్మట కొంత శ్రమకాలము జరిగినపిమ్మట పరలోకమునుండి దేవదూతలు వచ్చి నిత్యసువార్త చేతబట్టుకొని ప్రకటించుచుండెను.

    • ప్ర్శ్న:- 1. ఈ కాలములో కూడ దేవదూతలువచ్చి చెప్పకూడదా?
    • 2. మోషే, ఏలియా, అబ్రహాములను దేవుడు పరలోకమునుండి పంపకూడదా?
    • 3. దేవదూతలను, అభక్తులను పంపకూడదా?
    ఈ ప్రార్ధన దేవదాసు అయ్యగారు షుమారు 30 సం|| తాను జీవించియుండగా ప్రార్ధించి యున్నారు.
     సువార్త నాలుగు అంశములు
    • 1. దేవునికి భయపడుడి.
    • 2. ఆయనను మహిమ పర్చుడి
    • 3. తీర్పుగడియ వచ్చియున్నది.
    • 4. ఆయనకు నమస్కారము చేయుడి.

    దేవునికి భయపడుడి అనగా మీరందరు అంతిక్రీస్తునకు భయపడుచున్నారు. అది మీకు హాని దేవునికి భయపడితే మీరు అంతిక్రీస్తునకు భయపడరు అప్పుడు నీకు మహారక్షణ వచ్చును. 2. ఆయనను మహిమ పర్చుడి అనగా దేవునిని కీర్తించుట. ఆయనను మెచ్చుకొనుట, దేవునిని ఘనపచుట. ఆయనకు మర్యాద చేయుట. ఇవన్ని ఒక్కమాటలో చెపావలెనంటే దేవుని కీర్తించుట. యేడేండ్ల శ్రమకాలములో అంతిక్రీస్తుజరిగించు అద్భుత క్రియలను బట్టి అంతిక్రెస్స్తులో సమానులెవరని వాడిని వెంబడించుచు వానికి మించిన వారు ఎవరున్నారు అనిచెప్పి మెచ్చుకొందురు. గనుక ఈదూత దేవుని మెచ్చుకొనుడి సృష్టిని కలుగ చేసిన సృష్టికర్తను మహిమ పర్చుడి అని ప్రకటించును.

    3. తీర్పు భూలోకమందు విచారణచేయు జడ్జిగారు కక్కీ దారుల వాగ్మూలము ముందు వినును. పిమ్మట సాక్షులు ప్రత్యుత్తరసాక్షుల వాగ్మూలము వినును వినుటకు ఇంకా యేమియులేదు అని తెలిసికొన్నప్పుడు తీర్మానము వినిపించును. వీటన్నిటికన్న ముందు ప్రభుత్వము వారు యేర్పరచిన చట్టమలు జడ్జీగారు తెలిసికొనవలెను. ఇవన్నీ ప్రభుత్వమువారు అచ్చువేసి ప్రజలకు పంచుదురు. ఈచట్టములను మీరిన వారున్నారు గనుక శిక్ష విధింప బడును.

    • 1. ఆజ్ఞ విధించుట
    • 2. మీరుట
    • 3. విచారణ
    • 4. తీర్మానము వినిపించుట అనగా తీర్పుచెప్పుట. ఇవన్నీ భూలోక ప్రభుత్వమందున్న ప్రభుత్వములోని క్రమములు. అలాగే ఆత్మలకును ఇప్పుడు విచారణ జరుగుచున్నవి
     • 1. మనస్సాక్షి
     • 2. బోధకులు
     • 3 వాక్యము
     • 4. సృష్టి
     ఇవన్నియు నరులకు బోధించుచునేయున్నవి మీరినయెడల శిక్షతప్పదు.
    • 5. నమస్కారము చేయుట సువార్త రెండు భాగములు బైబిలుగ్రంధము రెండు భాగములు. బైబిలు గ్రంధములో చట్టము, సువార్త ఈ రెండును ఇమిడి యున్నవి.
     • 1. ధర్మశాస్త్రము అనగా చట్టము. నరులారా ఈ ప్రకారముగా నడుచుకొనుడి అని చెప్పునది ధర్మశాస్త్రము.
     • 2. సువార్త అనగా మంచివార్త. ఈ వర్త ప్రకారము నడచుకొన్నయెడల మీకురక్షణ ధర్మశాస్త్ర ప్రకారముగా మీరు నడుచుకొనక పోతే మీకు శిక్ష యోహాను1:17

    ధర్మశాస్త్రము పాతనిబంధన కాలములో మోషేద్వారా అనుగ్రయింపబడెను. అయితే నూతన నిబంధన కాలములో యేసుప్రభువు ద్వారా సువార్త అనుగ్రహింపబడెను.

    • 1. కృప
    • 2. సత్యము
    ఇవియేసుప్రభువుద్వారా కలిగెను. ఆజ్ఞబట్టి శిక్ష. ఇది మోషేద్వారా అనుగ్రహింప బడెను. కృప-ఎన్ని పాపములు చేసిన మహాప్రభూ అని వేడుకుంటే ప్రభువు రక్షించి తన కృపను వెల్లడిపర్చును ఇదేకృప.

    సత్యము - అనగాఅజ్ఞప్రమాణము ధర్మశాస్త్ర ప్రకారముగా నడువని వారికి శిక్షయున్నది. రెండు ఒప్పుకుంటే రక్షణ ఉన్నది. ఈ రెండు సత్యములో ఉన్నది.

    యోహాను 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మన మందరము కృ పా వెంబడి కృప పొందితిమి తప్పు చేయగా ఒప్పుకున్నట్లేయితే కృపచేత రక్షింపబడుదుము క్షమాపణ కలుగును. ఎన్నిసార్లు ఆయన క్షమించుటయే కృప. కృప వెంబడి కృప కనబడును.

    దేవదాసు అయ్యగారు బైబిలు మిషను మహాసభలో ప్రసగించవలసివచ్చినపుడు ధర్మశాస్త్రము. కృప అను ఈ రెండు అంశములు చెప్పక మానరు. వట్టి ధర్మశాస్త్ర ప్రకారముగా చెప్పుట అనగా వాక్యము నమ్మండి పాపము చేయవద్దు, విగ్రహారాధన చేయవద్దు అనుమాటలతో బోధించిన గద్దించిన నరుడు అధైర్యపడును ఇదంతయు చెప్పినను నీపాపములను క్షమించు సువార్త ఉన్నది నిరాశపడక ధైర్యము తెచ్చుకొమ్ము అనిచెప్పగలిగిన నరుడు అదైర్యపడడు.

    మత్తయి 17వ అధ్యాయములో రూపాంతరపు కొండౌన్నది. ఆ కొండ మీదకు మోషే, ఏలీయాలు శరీరముతో ప్రభుయొద్దకువచ్చిరి మోషే చేతిలో ధర్మశాస్త్రమున్నది ఏలియా చెతిలో ప్రవచనమున్నది అనగా యేడుఏండ్ల పాపలన విషయము పరలోకమునుండి ఈయన నాకుమారుడు ఈయన మాట వినుడని ఒకశబ్ధము వినబడెను అదేసువార్త.

    దూత:-

    • 1. ఆకాశము.
    • 2. భూమిపేర్లు ఎత్తెను.
    • 3 సముద్రము.
    • 4. నదుల, జలధారలలో ఎత్తెను.
    వీటన్నిటిని కలుగ చేసిన సృష్టికర్తను నమస్కరించుడి అని దూత తెలియచేసెను అయితే మీరు అంతిక్రీస్తునకు నమస్కరించుచున్నారు. అదితప్పు అని అనెను. పై ఉదహరింపబడిన నాలుగు వానికి నమస్కారము చేయుచున్నారు. ఇది తప్పె. ఇక అట్లు చేయరాదని నిత్య సువార్తను చేత పట్టుకున్న దేవదూత తెలియపర్చెను.

    ఉదా:- బడిలోని మాష్టరుగారు బడిలోనికి వెళ్ళగా బంట్రౌతు వచ్చి బల్లపై కూర్చుండగా పిల్లవాడు వచ్చి మాష్టరుగారు నమస్కారమని చెప్పెను. ఆపిల్లవానికి చూపు మందము కనుక అలాగు గుర్తు ఎరుగక చెప్పెను. అట్లు చెప్పగానే ఆయన మాస్టర్ కాదని ఇతర్లు చెప్పినారు అలాగే భూజనులు తమకు కలిగిన మంద చూపుచేత అంతిక్రీస్తునకు నమస్కరించిరి. దూత సువార్తలో యేసుప్రభువుకథ లేక పేరులేని దేవుడని యున్నది. అందుకని సృష్టికర్త చరిత్ర చెప్పి ఆయన యేరీతిగా రక్షకుడుగా ఈ లోకమునకు వచ్చినాడో ఆచరిత్ర అంతాకూడ చెప్పవలెను. అప్పుడు ప్రజలకు సమ్మత మగును ఎప్పుడు ఏమి చెప్పవలెనో అప్పుడు దేవదూతవలె మర్మములు చెప్పవలెను. నిత్యసువార్త అనగా ఎల్లపుడు ఉండవలసిన సువార్త.

    ఉదా:- ఇంగ్లాండు దేశములో ఒక దేవాలయములో యేసుప్రభువు ఒక పేదవాని ఆకారంతో వచ్చి అద్భుతముగా బోధించి గుడి ముగింపు ఆయన పిమ్మట బయటకువచ్చి కనబడక పోయెను.

    ప్రకటన 14:8

    1. దూత నిత్యసువార్త ప్రకటించెను ప్రపంచ పటము. సువార్త సలహాలన్ని చూపించెను. వినిపించెను. దూత వెంటనేవచ్చిరి సువార్తలో కృప వెంబడి కృప ఉన్నది. ఇక్కడ దూత వెంబడి దూత దానికి సంబంధించినయే.

    బాబేలు కూలిపోయెను:- బాబెలు అనగా ఆదికాండము 11వ అధ్యాయములో ఆదికాల మానవులు దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళుదమని బాబెలు గోపురములు కట్ట నారంభించిరి. ఆసమయములో దేవుడు వారిని దూద దిగి వచ్చెను. దేవుడు వారి భాష తారుమారు చేయగా వారు వేరువేరు భాషలుగల వారై వారు కట్టుచూ ఉన్నట్టి షీనారు మైదానములోనుండి వేరు వేరు గ్రామములకు చెదరిపోయిరి. షీనారు యూఫ్రటీసు టైగరిస్ నదుల యొద్ద ఉన్నవి. ఈ చెదరి పోయిన బాబేలు జనులు కల్వరిగిరి యొద్ద తిరిగి కలుసుకొనిరి. ఆ గోపురము పాడైపోయెను. ఆ స్థానమున ఒక ప్రభుత్వము స్థాపన జరిగినది. ఇది అన్యజనులు స్థపించిరి. ఈ ప్రభుత్వమునకు ఒక రాజు ఉండెను. ఆ రాజు పేరు నెబుకద్నెజరు.

    • 1. బాబేలు రాజ్యము > యెరూష లేములోనున్న యూదా ప్రజ
    • 2. బాబేలు పట్టణము > లను రాజైన నెబుకద్నెజరు బాబేలు
    • 3. నెబుకద్నెజరు రాజు > దేశమునకు చెరపట్టి తీసుకొనివెళ్ళెను.

    ఈ బాబేలు రాజ్యములో ప్రముఖుడు ప్రవక్త అయిన దానియేలు దేవుని జనమైన యూదులకు విరోధముగా బాబేలు రాజ్యము వెలసెను.

    రాజైన నెబుజద్నెజరు ఒక కలను కని మరచిపోయెను. కలను దాని భావమును తెలియ చెప్పుటకు దానియేలును పిలవ నంపించిరి. ఈ ఒక్కరాజే దేవుని ప్రజలైన యూదులపై దయ చూపించెను. ఆయన తరువాత వచ్చిన రాజులు యూదుల యెడల కఠినముగా ప్రవర్తించిరి. దానియేలు రాజు కన్నకలలోని విగ్రహమును రాజునకు తెలియపర్చెను. అన్నిలోక రాజ్యములే దానియేలు కథ. హర్మగెద్దోను యుద్ధమువరకు లోక రాజ్యములు బాబేలు రాజ్యము ప్రజలకు లౌకికము నేర్పించెను. విగ్రహముల తట్టు ప్రజలను త్రిప్పినది. ప్రజలను హింసించిన రాజ్యము దానియేలు. యెషయ, యిర్మియ, యిర్మియా, మలాకీ వరకు క్రీస్తుజన్మము నుండి ఆరోహణము వరకు ఆరోహణము నుండి రేప్చర్ వరకు రేప్చర్నుండి 7సం||ల శ్రమ హర్మగెద్ధోను యుద్ధము వరకు బబులోను సామ్రాజ్యము. బబులోను రాజ్యమా నీవు లోకమునకు లౌకికమనే సారాయి త్రాగించితివి ప్రజలు మత్తులై నీ మూలమున పాడైపోయినారు.

    మహోద్రేకము:- (ఫార్మికేషన్) భార్య భర్తలు ఐక్యతగా ఉండుట సంసారము, దానికి వ్యతిరేకముగా వేరైపోతే వ్యభిచారము.

    దేవుడు + భక్తులు కలిసి యుండుట సంఘము. వేరైపోతే ఆరవ ఆజ్ఞ పాపము. ఇదే బాబెలులోను ప్రజలకు బాబెలు నేర్పిన లౌకికము. ఇట్టిది హర్మగెద్దోను యుద్ధమువరకు కొనసాగును యుద్ధమప్పుడు కూలిపోవును అదే రేపో మాపో జరుగు యుద్ధము.

    • 1. షీనర్రులో కట్టిన గోపురము.
    • 2. బాబెలు. బాబెలు స్థాపించిన లౌకికము ఉన్నవి.
    బాబెలు రాజ్యము దేవుని విడిచిపెట్టమని ప్రజలకు నేర్పించిన లౌకిక బాబెలు రాజ్యము. ఇది హర్మ గెద్దోను యుద్ధము వరకు ఉండును. ఇది మూడవ బాబెలు మన కాలములోనిది రెండవ బాబెలు మూడవది కూలిపోయెను.
    • 1. సైతాను,
    • 2. పిశాచములు,
    • 3. లౌకికము ప్రజలనులాగివేయుచున్నది. లౌకికమునకు ఎక్కువశక్తియున్నది. అదిపోవునట్లు ప్రార్ధించండి.

    ప్రార్ధన:- జీవాది పతివైన మాదేవా మీకు వందనములు. నీవు జీవము గల వాడవు గనుక సృష్టిని చేసినావు జీవము గల వాడవు గనుక నీవు వస్తువుకావు నీవు సృష్టియైన మేమును జీవము గల వారమే గనుక కదలక మెదలక ఉండలేము. మాకు జీవము ఉన్నది కనుక శరీరమును పెట్టినావు. పాపము ఉన్నది కనుక శరీరమునకు బాధ. ఆత్మకు జీవమునకుబాధ పాపమున్నందున ఈ బాధలు కలుగుచున్నవి. మాకు విమోచన దయచేయుమని పూర్వికులు ప్రార్ధించినట్లు మేము కూడ ప్రార్ధించు చున్నాము. ఇప్పుడు మాకు అనేక బాధలు ఉన్నవి కనుక ఈబాధలనుండి మమ్ములను విమోచించుము. కడవరికాలములో అప్పయకరమైన కాలము వచ్చునని పౌలుచేత వ్రాయించినావు. లోకములో జరుగుచున్న చిక్కులు, కష్టాలు, మొ||నవి వచ్చునని నీ వాక్యములో ఉన్నది. అవే ఇప్పుడు వచ్చుచున్నవి. వాక్యములు ముందే వ్రాయించిన నీకు మావందనములు. మేము ఏలాగు ఈ అపాయకరమైన దినములలో నడుచుకొనవలెనో ఆ ఉపదేశము ఇచ్చుచున్నందుకు వందనములు. లోకమందున్న ప్రభుత్వము వారు మానవుల కష్టము తొలగించుటకు జరిగించుచున్న ప్రయత్నములను నెరవేర్చుమని వేడుకొనుచున్నాము. ప్రభుత్వము చేయువారుకూడ ఈ సంగతులన్నియు తెలిసికొని సజ్జనులుగా ఉండుటకు కృప దయచేయుము. నీ జ్ఞానముచే నరుల జ్ఞానము నీ ఆత్మచె అందరి ఆత్మలు వెలిగించుము విశ్వాసమును, ప్రయత్నమును, మనస్సాక్షిని శుద్ధీకరించుము. నీ మహిమ కొరకు దైవ భక్తి పట్టుదల ప్రార్ధన శక్తిదయచేయుము. మమ్ములందరిని నూతనముగా దీవించుమని యేసుప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము.

    Home


    ఇద్దరు దేవ దూతలు

    ప్రకటన 14:9
    ఇద్దరు దేవ దూతలు :
    • 1. నిత్యసువార్త తెచ్చిన దూత.
    • 2. బాబెలు కూలిపోయినదని చెప్పినదూత.

    ఈ అధ్యాయంలో ఇద్దరు దూతలు ఉన్నట్లు కనుగొన్నాము. మూడవ దూత యొక్క స్వరమేమి?

    • 1) కౄర మృగము
    • 2) దాని ప్రతిమ.
    • 3) నొసలు.
    • 4) చెయ్యి
    • 5) ముద్ర వేసికొనును.
    కౄఉరమృగముద్ర ప్రత్యేకముగా వేరుగా ఉన్నది. కొందరు ఆ ముద్ర వేయించు కొందురు. కొందరు చేతిమీద కొందరు నొసటిమీద కౄరమృగము యొక్క ముద్ర వేయించు కొందురు ఎవరి ఇష్టప్రకారము వారు ముద్ర వేయించు కొందురు. అవి అప్పుడు జరగనైయున్నవి. ఇప్పుడు అది జరుగునా? ఇప్పుడు దాని ముంగుర్తులు జరిగి తీరును ప్రతిక్రైస్తవుడు పరిశుద్ధ గ్రంధమును తీసికొని జాగ్రత్తగా చదివి నోట్స్ తీసికొని ముఖ్య సంగతులు జరుగు చుండగా ఇది బైబిలులో ఎక్కడ ఉన్నదని పరిశీలన చేసికొని గుర్తులు పెట్టుకొనవలయును. హిందువులు పంచాంగమును తీసికొని చూచుకొనునట్లు క్రైస్తవులు కూడ బైబిలులో నున్న రిఫరెన్సులను నోట్సు తీసుకొని ఇది ఎక్కడ ఉన్నదని పరిశీలన చేసికొని గుర్తుపెట్టుకొన వలెను. ఈ కాలంలో జరుగుతున్న మంచికథలు పాపము, పాప ఫలితము, అక్రమము, మరణము ఇలాంటి సంగతులు వాక్యములో ఎక్కడ ఉన్నదో వాతిని వెతకవలెను. వాక్యములో అవి ఉన్నను లేక పోయినను వెతుకుట అనగా ఇక్కడ, అక్కడ కొండలలో ప్రవక్తలలో, సువార్తలలో, పత్రికలలో ఎక్కడ ఉన్నవి అని వెతక వలెను.

    ఉదా:- ట్రైను అనే పేరు బైబిలులో లేదుగాని దాని పని ఉన్నది. రేడియో అనే పేరు లేదుగాని దాని పని ఉన్నది మనకు ఒకటి ఇంకొకరికి ఇంకొకటి దొరుకును హ్త్యలు జరుగునని దోపిడీలు జరుగునని హైడ్రోజన్ బాంబులు వచ్చునని ఎక్కడ ఉన్నది? బైబిలులో వీటన్నిటిని జార్తత్తగా వెతకవలెను. లేకపోయినా జాగ్రత్తగా వెతక వలెను. దేవుని వాక్యము సంపూర్ణమైనది జాగ్రత్తగా వెతికినట్లయితే అన్నియు బైబిలులోనే దొరుకును వెతకండి మీకు దొరుకునని బైబిలులో ఉన్నది. గనుక జాగ్రత్తగా వెతకండి మనము వెతుకుటకు మిక్కిలి కష్టపడుదుము గాని మముందున్న భక్తులు అన్నియు జాగ్రత్తగా వెతికే యున్నారు. సోమవార్మ దొరకపోయిన మంగళవారమైన దొరుకును. గనుక వెతకండి ఇప్పుడు మనము వెతకపొతే ఇకముందునకు వెతకలేము అపాయ కరమైన దినములు వచ్చునని వాక్యములో వ్రాయబడి యున్నది మనము తెలిసికొనక పోతే పడిపోవుదము. పెండ్లికుమార్తె వెళ్ళకముందే ప్రకటన గ్రంధములోని విషయములు కొన్ని జరగనై యున్నవి. అందువల్ల ప్రకటన గ్రంధమును ఎక్కువగా చదువ వలెను. ప్రకటన గ్రంధములోని కొన్ని ముంగుర్తులు ఈ కాలమందు జరుగుచున్నవి. అవి మనము తెలిసికొనకపోతే రానైయున్న దినములలో జరుగనై యున్న ముంగుర్తులను తెలిసికొనలేము మనకాలములో కూడ అపాయకరమైన విషయములు జరుగుచున్నవి. ఇవి అన్నియు మనకు తెలియ పర్చుటకై బైబిలు గ్రంధములో దేవుడు మనకొరకు వ్రాయించి యున్నాడు. దేవుని వాక్యము దయగల వాక్యము బైబిలును బాగుగా చదివి నేర్చుకొని అనుభవములోనికి తెచ్చుకొన వలెను. వ్యత్యాసము బాగుగా చదివి నేర్చుకొని అనుభవములోనికి తెచ్చుకొన వలెను. వ్యత్యాసములను గుర్తించవలెను పాశ్చాత్య దేశములైన అమెరికా, ఇంగల్ల్డు దేశ్సములలో కొందరు బైబిలును అదేపనిగా చదువుచున్నారు. చదువుచున్న కొందరు బైబిలులో ఏమున్నదని హేళన చేయుచున్నారు.

    జ్యోతుష్కులైన కొందరు కొడైకెనాల్ అనుకొండ మీదకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక బంగ్లాలో బసచేసిరి. ఆ బంగ్లాలో కొన్ని గదులు ఉన్నవి కొందరు పనివారు కలరు. లోపల మర ఉన్నది దుర్నీతితో అంతరిక్షమును చూపెదరు. అంతరిక్షము నందు నక్షత్రములు ఉన్నవి. ఒక్కొక్క నక్షత్రము ఎట్లు ఉన్నది దానిలోపల ఏమున్నది. దాని నడక ఎలా ఉన్నది. అని కని పెట్టుదురు ఆ నక్షత్రముల కాంతి భూలోకములో పడునప్పుడు భూలోకమందు ఏమి జరుగునో ఏపంట పండునో ఏజబ్బు వచ్చునో యేదిక్కున వర్షము వచ్చునో అన్ని పరిశీలన చేయుదురు. వీరు ఆకాశమంతటిని పరీక్షించుచున్నారు వారు సృష్టిని అంతగా పరీక్షిస్తే దేవుని వాక్యము అంతా ఎంతగా పరీక్షించ వలెనో ఇందును బట్టి తెలియవచ్చుచున్నది.

    కొందరు ఒకచెట్టు యొద్దకు వెళ్ళి ఆ చెట్టు ఆకు తిని అది చేదు, ఇది తీపి, ఇది కారమని దాని రుచులను పుస్తకములలో వ్రాయుదురు. కొందరు నేలలోని మట్టితిని ఒక్కొక్క రకపు మట్టికి ఏమిరుచియో, ఏరీతిగా ఉపయోగమో పుస్తకములలో వ్రాయుదురు.

    లైనార్టు అను దేశమునుండి ఒక దొరగారు వచ్చిరి ఆ దొరగారి బట్టలు, మాసిపోయినవి అది చూచిన పిల్లలు హేళన చేసినారు గంజిత్రాగి అరుగుమీద పడుకొనినాడు చూచినవారికి పిచ్చివానివలె కనబడినారు ఆదొరగారు. పొలము వెళ్ళి ఒక నేరేడు చెట్టు క్రింద కూర్చుండి ఆ చెట్టు క్రింది మన్ను తిని ఫలాన స్థలములో త్రవ్విన బంగారము దొరుకునని వ్రాసిరి. కొంత కాలమునకు ప్రభుత్వము వారు తెలిసికొని త్రవ్వె మరలను తెచ్చినారు ఆదొర్గారు పొలమును ప్రభుత్వము వారు కొన్నారు తెచ్చిన మరలను పనిలో పెట్టి త్రవ్వ నారంభించినారు. మన్ను, ఇసుక, బైటపడినది త్రవ్వగా, త్రవ్వగా బంగారము బయట పడినది. అచ్చటి రైతులు నోరు తెరచి ఆవలించుకొని చూచినారు మాసిన బట్టలు వేసికొన్న దొరగారిని చూచిన పిల్లలు దొరగారు పిచ్చవాడు అని అనుకొన్నారు గాని ఈయన గొప్ప శాస్త్రవేత్త అని తరువాత తెలిసికొన్నారు.

    ఆకాశము, చెట్ట్లు, భూమి, జంతువులు, పక్షులను గూర్చి చదువుకొనుచున్నారు మానవుని శరీరమును గూర్చి పరీక్షించుచున్నారు. సముద్రములో గవ్వలు ముత్యములు నగల యొక్క స్వరూపములన్నియు వెతుకుచున్నారు. ఇవన్నియు పరీక్షించుచున్న మానవులు దేవుని వాక్యము ఎందుకు పరీక్షించకూడదు బైబిలులోని ప్రతిమాటను పరీక్షింప వలయును కొందరు తమ పనులన్నియు మానివేసి వాక్యములోని ప్రతిమాటను పరీక్షించు చున్నారు.

    దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనని బైబిలులో వ్రాయించెను ఎంతో అనగా అంతములేదు ప్రేమించెను. గనుక అనేక అపాయములుతప్పియున్నవి గనుక దేవుని వాక్యము బాగుగా చదివి పరీక్షించవలెను.

    కౄరమృగము ఇంకను రాలేదుగాని దాని పనులు కనబడుచున్నవి. ఈ పనులు కౄరమృగమునకు ముంగుర్తుగా కనబడుచున్నవి బైబిలులోని పాత నిబంధన గ్రంధము క్రొత్తనిబంధన గ్రంధమునకు ముంగుర్తు క్రొత్తనిబంధన గ్రంధము పాతనిబంధన గ్రంధమునకు నెరవేర్పు గ్రంధమైయున్నది. పాతనిబంధన గ్రంధము క్రొత్తనిబంధన గ్రంధము కలిసిన యెడల బైబిలు గ్రంధమైనది. భూలోకములో కొన్ని సంగతులు ఇప్పుడు జరుగుచున్నవి కొన్ని కథలు నడుచు చున్నవి ఇదే పాతనిబంధనైయున్నది. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఎలాగు ముంగుర్తుయున్నదో ఇక ముందునకు లోకంలో జరుగనైయున్న విషయములకు ఇప్పటి విషయములు ముంగుర్తు అయి యున్నది

    ప్రతిమ:- రాబోవు ప్రతిమకు ముంగుర్తుగా ఇప్పుడును ప్రతిమలు ఉన్నవి. అట్టి ప్రతిమలను చేసి అనేకులు వాటికి మ్రొక్కుచున్నారు.

    ముద్ర:- రాబోవు:- శ్రమకాలంలో ముద్ర కనబడుచున్నది. దానికి ముంగుర్తుగా ఈదినములలో అనేకులునొసట బొట్టుపెట్టుకొనుచున్నారు ఆదినములలో నొసటి యందుగాని చేతియందుగాని ముద్రవేసి కొననివారైనయెడల అట్టి వారికి అహరము ఉండదు ఇప్పుడును చేతికి పచ్చబొట్లు వేయించు కొనుచున్నారు ఇవికూడ ముంగుర్తులై యున్నవి. బైబిలు బాగుగా చదువ వలెను లోకములోని సంగతులు తెలిసికొని బైబిలులో ఎక్కడ ఉన్నదని బాగుగా చూచుకొనవలెను.

    బైబిలులో కొన్ని పాత్రలు ఉన్నవి మనము వాడుకొనే కొన్ని పాత్రలు ఉన్నవి ఆలయంలో సంస్కరములు ఇచ్చునపుడు వాడు కొనే పాత్రలు కొన్ని ఉన్నవి ఈపాత్ర అనే పదము బైబిలులో అనేక మారులు వచ్చుచున్నది అయితే ఈ గ్రంధములో ఉన్నవి. దైవోగ్రత పాత్ర ఇది పరలోకములో ఉన్నది. పరలోకమందు రక్షణ పాత్ర ఉన్నది. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన, ఇక్కడ పాత్ర ఉన్నది పరలోకములో ఉన్న దైవోగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించగా అపూడపుడు మనకు కలుగుచున్న కొద్దికొద్ది శిక్షలు కనబడుచున్నవి. మనము అడుగు నీళ్ళు చన్నీళ్ళతో తొరిపినట్లు ఉన్నది ఇక్కా దైవోగ్రతలలో అప్ప్త్రలో ఏమి తొరప కుండగనే కుమ్మరించ బడును అది భయంకర పాత్ర అది రాకముందే సిద్ధపడవలెను.

    త్రాగుదురు అనగా అనుభవించుదురు మత్తులైయుందురు అనగా మనిషి సారా త్రాగి మరలా త్రాగుచు అప్పుడు మత్తుగా తూలుపోవును అది సానిషా వంటిది త్రాగిన వారికి మత్తెక్కినట్లు దేవుని కోపము అనుభవించువారికి మత్తెక్కును.

    ఉదా:- త్రాగుబోతు సారా కొట్టునకు వెళ్ళి సారాత్రాగి మత్తిల్లును మత్తులోనుండి ఇంకా కావలెనని కోరును. మతి లేకపోయిన కోరుకొనును అలాగే పాపమువలన మత్తెక్కిన వానికి శిక్షలు వచ్చినపుడు దేవుని మీద విసుగుకొని చావనైన చస్తాడు గని మారుమనస్సు పొందడు ఇంతకంటే దేవుడు ఏమిచేయును. ఏమి చేయగలడని దేవునిని దూషించును దూషణ పాపమే కదా త్రాగినవాడు పిచ్చుక పిల్లవలె నోరు ఆవరించుకొని ఇంకా కావాలని కోరినట్లు పాపములో చిక్కినవాడు ఇంకా పాపమనే ఓడలోనికి దిగిపోవును 7సం|| ల శ్రమకాలంలో దేవుని కోపము అనుభవించువారు ఇంకా శిక్షలోనికి వెళ్ళిపోవుదురేగాని మారు మనస్సు పొందరు.

    ఈ లోకమందు నేటి దినములలో పెండ్లికుమార్తెగా సిద్ధపడువారు ఈ శిక్షలన్ని తప్పించుకొనుటకు దేవుడు ముందుగానే వాక్యము వ్రాసియుంచినారు. గనుక జారత్తగా చదువుకొని సిద్ధపడవలెను.

    శిక్ష:-

    • (1) అగ్ని
    • (2) గంధకము.

    అగ్ని మంట కలుగ చేయుటకు కాలిపోవుటకు ఆధారమైయున్నది అగ్ని మన శరీరమునకు తగిలితే శరీరమునకు మంట కనబడును. ఆ మంట తగ్గకుండ ఉండుటకు గంధకము సహాయపడును పాత నిబంధన కాలంలో సొదొమ గొమొఱ్రాలలో అగ్నితోపాటు గంధకము కలిగినందువల్ల. అచ్చటి మేడలు, మిద్దెలు, ఇండ్లు, చెట్లు, పశువులు, భూమిలోనికి దిగిపోయెను. అలాగే రేపు నరుడు హేడెస్సులోనికి దిగి పోవుదురు. కనుక మనము బైబిలు బాగుగా చదవక పోతే ఇవన్ని మనకు ఎలాగు తెలియును అగ్ని వల్ల బాధ, గంధకమువల్ల అధిక బాధ.

    ఉద:- ఒక కుర్రవాడు తప్పుచేస్తే పంతులుగారు కుర్ర వానిని కొట్టెను అప్పుడు ఆ కుర్రవాడు ఇంటికి పారిపోగ అతని అన్న అతని తల్లి ముందు మరలా కొట్టెను. ఇది ఆ కుర్రవానికి ఎక్కువ బాధ అలాగే శిక్ష నొందు వానికి అగ్ని బాధ గంధకము మరెక్కువబాధ అంతకన్న దేవదూతలు ఎదుట గొఱ్ఱెపిల్ల చూస్తు ఉండగా శిక్ష అనుభవించుట పాపికి మరెక్కువ బాధ.

    హేడెస్సు:- ఇక్కడకోటానుకోట్ల మారు మనస్సు పొందని ఆత్మలున్నరు. వారు రూపముతోనే యుందురు వారికి మనవలె కాళ్ళు, చేతులు ఉండును దిగంబరత్వముగా ఉందురు. అక్కడవారు గంధర గోళములో ఉందురు. అక్కడ వారి మధ్య సంభాషణ జరుగుచున్నది. వారి మధ్య క్రైస్తవుల కథ చెప్పుకొనుచు ఉన్నారు. వరి మధ్య షు,షు అను శబ్ధము వినబడినది ఎందు కనగా వారిలో ఒకరు మన మధ్య బిషప్గారు ఉన్నారు. వరికి ఈ మాటలు వినబడును గనుక ఊరుకోండి అన్నారు.

    దేవదూతలు :- ఓ పాపి! ఓదరిద్రుడా! నోవాహు కాలమున నీ కొరకు కష్టపడినాము. నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుటకు ఆ వరుసలోనికి తీసికొని వెళ్ళుటకు నీ కొరకు మేము శ్రమపడినాము. మాప్రయాస అంతా వ్యర్ధమై పోయినది. నీవు ఈ యేడేండ్ల శ్రమలకు వచ్చి వేసినావు అని దూతలందురు. ఇది మరింత శ్రమ.

    గొర్రెపిల్ల:- అవివేకి! నేను నీకొరకు భూలోక మందు అనేక పాట్లుపడి నిన్ను పెండ్లి కుమార్తె వరుసకు తయారు చేయ్యలని నీ కొరకు నా రక్తమంతయు కార్చియుండగా నాప్రయాస అంతా వ్యర్ధము చేసినావు. అని గొర్రెపిల్లయైన యేసుప్రభువు వారితో అనగా అది వారికిమరింత బాధ. ఇవన్ని బాధలే అన్ని తప్పించు కొనుటకు పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళవలెను. అనేకులను సిద్ధపరచిన వారు హేడెస్సులోనికి వెళ్ళిపోవుదరేమో గనుక ప్రతి పాపమునకు దూరముగా నుండుట అవసరమైయున్నది. గనుకదైవోగ్రత పాఠము ఇప్పుడు మనము వినియున్నాము. గనుక అట్టి ఉగ్రతలో ప్రవేశించకుండా మనము జారత్తపడవలెను.

    ప్రకటన 14:12 ఈ వాక్యమునందు మూడు కథలు ఉన్నవి నరకములోనున్న నరులకు శాశ్వత బాధ ఉన్నది. అవిశ్వాసుల స్టేషను 7సం||ల శ్రమ కాలములో ఇవి బయలుపడినవి.

    • 1 దేవుని ఆజ్ఞలు
    • 2 యేసుని గూర్చిన
    • 3 పరిశుద్ధుల ఓర్పు


    ముగ్గురు వ్యక్తులును మూడు
    విష యాలు ఇందున్నవి.

    అగ్ని గంధక బాధ. 12వ వచన కాలంలో ఎవరున్నారు? అవిశ్వాసులు ఉన్నారు. ఆ కాలంలోని ఈ పరిశుద్ధులు ఉన్నారు. వీరికి శ్రమకాల పరిశుద్ధులని పేరు ఉన్నది. ఈ శ్రమలే 12వ వచన కాలంలో అంతిక్రీస్తు తన పాలనలో పరిశుద్ధులను కూడ బాధపెట్టును. మారు మనస్సులేని వారు హేడెస్సునకు వెళ్ళిరి. చావ కుండగా మారు మనస్సులేని అవిశ్వాసులకును ఈ కాలమందు శ్రమలే. శ్రమకాల ఆరంభమునుండి 12వ వచన కాలమువరకు ఉన్నవారికి బాధ. ఆ కాలమందు పరిశుద్ధులైన వారిని అంతిక్రీస్తు బాధ పెట్టి శ్రమ పెట్టి అవిశ్వాసుల వరుసలోనికి వారినిచేర్చి నరకములోనికి పంపవలయునని శ్రమ పెట్టుచుండగా పరిశుద్ధులు ఆ శ్రమకు ఓర్చుకున్నారు. శ్రమకాల మొదటి సంవత్సరము నుండి రాను రాను అంతిక్రీస్తు కోపము ఎక్కువగు చుండును.

    • 1. శ్రమలను బట్టి విసుగు వచ్చును.
    • 2. వారినిబట్టి బ్రతక నిచ్చినందుకు వీరు విసుగు గొనవలసినది గాని విసుగు గొనలేదు. ప్రభుదయ ఎప్పుడో, అప్పుడు మమ్మును పిలుచునని అనుకొని ఓర్చుకుంటున్నారు.

    ఉదా:- లోకములో భయంకర విషయములు జరుగునప్పుడు భూ ప్రజలు ముందు చనిపోయినవారు ధన్యులు. ఇంకా ఈ బ్రతుకు ఎందుకని అనుకొందురు. పెండ్లి కుమార్తె ఎత్తబడక పూర్వము శ్రమలు కొద్దిగా వచ్చుచు ఉన్న ఆ శ్రమలనే ఓర్చు కొనలేకపోతే పెండ్లి కుమార్తె ఎత్తబడిన తరువాత కఠిన శ్రమలు రానైయున్నవి. గాన ఎక్కువ శ్రమలు పొందినవారు సహించుకొనుచు ఉండగా కొద్ది శ్రమలు కలిగిన మనము ఓర్చుకొన వలయును. మన శ్రమలు ఆ శ్రమలకు ముంగుర్తు శ్రమలై యున్నవి. 12వ వచన కాలంలో ఉన్న పరిశుద్ధులు దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చి ప్రభువునందు విశ్వాస ముంచిరి వారికి కలిగిన శ్రమలలో ఓర్చుకొనియున్నారు.

    ఆజ్ఞ:-
    • 1. ఈ ఆజ్ఞ విషయములో కూడ వినయ విశ్వాసములు ఉన్నవి ఇది కూడ పరిశుద్ధులది.
    • 2. యేసుప్రభువు ఈ విషయములోకూడ వినయ విశ్వాసములు ఉన్నవి ఇది కుడ పరిశుద్ధులది.
    • 3. శ్రమలు:- ఈ విషయంలో ఓర్పు ఉన్నది ఇది కూడ పరిశుద్ధులదే

    భక్తులు ఆజ్ఞలు గైకొన్నారు గనుక విధేయత ఉన్నది. విశ్వాసము కలిగి విశ్వాసముతో శ్రమలను ఓర్చుకొన్నారు. ఈ పరిశుద్ధులకు ప్రకటన 6వ అధ్యాయము నుండి శ్రమలు ఆరంభమైయున్నది ఇప్పుడు 14వ అధ్యామునకు వచ్చిరి. శ్రమలలో చావకుండగా బ్రతికియుండి రాడ్ తేలియున్నారు. ఇట్టి భక్తులు మృతి చెందినను వీరు ప్రభువునందు ధన్యులు, అవిశ్వాసులకు ఈ ధన్యత లేదు.

    ప్రభువునందు మృతులైన వారు ధన్యులని వ్రాయబడిన వాక్యము బాల్యమందు దేవదాసు అయ్యగార్కి నచ్చలేదు. ఇది సాధారణముగా సమాధుల మీద వ్రాయుదురు. పెండ్లికుమార్తె ఈ భూలోకమునుండి ఎత్తబడిన పిమ్మట 7సం||ల శ్రమకాలంలో ఇది వ్రాయవలసినది గాని ఇప్పుడే వ్రాస్తున్నారు గనుక నచ్చలేదు. ఈ వాక్యము ప్రకటన గ్రంధములోనిదని చిన్ననాటనుండి అయ్యగారు ఎరుగుదురు. జర్మనీ దేశమునుండి ఒకప్పుడు ఇండియాకు ఒకరాయి వచ్చినది. అందుపై బంగారపు అక్షరములతో ఇప్పటినుండి ప్రభువు నందు మృతి చెందు మృతులు ధన్యులని ఆ రాయిపై వ్రాయబడి యుండెను.

    • 1. ఆదాము మొదలుకొని రేప్చర్ వరకు ప్రభునందు మృతులైన వారు ధన్యులు.
    • 2. రేప్చర్ సమయములో చనిపోయినవారు ధన్యులు.
    • 3. శ్రమకాల ఆరంభములో మృతి చెందినవారు ధన్యులు
    • 4. 7 సంవత్సరముల శ్రమలలో హత సాక్షులు ధన్యులు
    • 5. ప్రకటన 14వ అధ్యాయములోని 12 వచనములోని శ్రమ సహించిన పరిశుద్ధులు ధన్యులు.

    భయంకర శ్రమలు రాకముందు చనిపోయేవారు ధన్యులు 6వ అధ్యాయపు శ్రమలు 7వ అధ్యాయపు శ్రమలు, 8వ అధ్యాయపు శ్రమలు ఇలాగు 14వ అధ్యాయము వరకున్న శ్రమలు హెచ్చు కనుక అవి రాకముందె చనిపోయెవారు ధన్యులు.

    • 1. ఆదాము నుండి రేప్చర్ కాలంవరకు ఎక్కువ శ్రమలు
    • 2. రేప్చర్ కాలమునుండి శ్రమకాలం వరకు ఇంకా ఎక్కువ శ్రమలు
    • 3. ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనములో మరియొక్కువ శ్రమలు ఇవి చెప్ప వీలుకానివి. వీటిని సహించిన వారుపరిశుద్ధులును ధన్యులునునై యున్నారు.
    ప్రకటన 14:13

    రాబోవు శ్రమలలో ఉండక ప్రభువునందు హాని లేకుండగా మృతునొందు పరిశుద్ధులు ధన్యులు.

    రేప్చర్ కు ముందు ప్రభునందు మృతులని వాడిరి. శ్రమ కాలములో మృతులని వాడిరి.

    • 1. ఆజ్ఞలనుబట్టి విధేయత
    • 2. విధేయతను బట్టి మహిమ.
    • 3. దేవునిని బట్టి ఆజ్ఞ
    • 4. ఆజ్ఞనుబట్టి ధన్యత
    యేసును బట్టి విశ్వాసము, విశ్వాసమునుబట్టి ధన్యత, పిలుపునుబట్టి శ్రమ. శ్రమనుబట్టి ఓర్పు, ఓర్పునుబట్టి ధన్యత. సిలువ లేనిదే కిరీటములేదు క్రీస్తు మతములో మొదట దొరికినది బోధ. ఆ మీద విశ్వాసము రక్షణ మోక్షము దొరుకును.

    రెండవ భాగము శ్రమలు:- "మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడు" యోబువలె శ్రమలు అనుభవించనిదే దైవమానవులము కాజాలము. విధేయత కన్నా విశ్వాసమున కన్న సిలువ వల్ల సంపాదించిన ఓర్పు గొప్పది ఆజ్ఞ నెరవేర్చినను విశ్వాసము ఉంచినను సిలువ వల్ల కలిగే ఓర్పు లేకపోతే అంతా వ్యర్ధము

    ఆఖరు సిలువ:- నీవు దేవుని యొద్దకు వెళ్ళవు విశ్వాసము పోయినది. దేవదూతలు రారు నిన్ను చూడడానికి ఎవరునురారు. ఇంకా కొంతసేపటికి నీసంగతి యేమగునో చూడు. నీకు హేడేసు తప్పదు అను సిలువ వచ్చును. అప్పుడు ఓర్పు చూపితేనే నీవు ధన్యత సంపాదించు కొనగలవు. సిలువ=శ్రమ (ఇది క్రైస్తవ డిక్షనరీలోని పదము)

    పాపము జబ్బు కనబడును మరణమునకు సమీపించిన తరుణము కనబడును మరణమునకు సంబంధించినవి దయ్యాలు. తరువాత సమధి. తరువాత హేడేసు, తరువాత నరకము.

    అవిశ్వాసికి మరణము:-

    • 1. పాపము,
    • 2. పాప ఫలితము
    • 3. జబ్బు
    • 4. సందేహములు
    • 5. దయ్యములు
    • 6. మరణము
    • 7. హేడెసు
    • 8 నరకము ఇవి వచ్చును.

    విశ్వాసి మరణము:-

    • 1. పాపము
    • 2. పాప ఫలితములు
    • 3. పశ్చాత్తాపము
    • 4. జబ్బు
    • 5. మోక్ష మార్గము కనబడును.
    • 6. దేవదూతలు కనబడుదురు.
    • 7. మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణమా నీ విజయమెక్కడ?
    • 8. సమాధి. వ్యాధి మీరు నా యొద్దకు రావద్దు
    అని విశ్వాసి నిరీక్షణతో ఉండును. అప్పుడు దేవదూతలు వచ్చి బంధువులలోనికి పరిశుద్ధులు వచ్చి విశ్వాసి ఆత్మను మోక్షమునకు తీసుకొనివెళ్ళును. విశ్వాసి కనుక ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. ఇప్పుడు అప్పుడు ధన్యులే మరణము కాదుగాని జీవము సంపాదించు కొనును నూతన మహిమ శరీరము ధరించుకొనును. అక్షయ శరీరమును ధరించును.

    (1కొరింథి 15:42-49)

    క్షయ శరీరము__అక్షయ శరీరము ధరించును

    ప్రకృతి శరీరము__ఆత్మ సంబంధ శరీరమును ధరించును.

    ఘనహీనమైనవి__మహిమగలవిగా లేపబడును.

    ఈ వ్రాతలలో విశ్వాసి యొక్కయు, అవిశ్వాసియొక్కయు జీవనములు కనబడుచున్నవి.

    ఏడు సంవత్సరములు శ్రమకాలంలో చనిపోయినవారు రెండురకములుగా ఉన్నారు.

    • 1. నిద్రించుట
    • 2. చనిపోవుట

    • 1. మారుమనస్సు లేకుండ చనిపోయిన వారు.
    • 2. అంతిక్రీస్తు వల్ల హతులైపోయినవారు.

    వీరిని యేసుప్రభువు వచ్చి మారుమనస్సు పొందిన వారిని హతసాక్షులైన వారిని తీసికొన వెళ్ళుము.( ఆవగింజంత విశ్వాసము అమరియున్న యెడల) చిరు పాపేచ్చ ఉన్నయెడల మోక్షమునకు వెళ్ళలేరని ప్రభువు ఒక పన్నాగ్మ పన్నియున్నారు. క్రీస్తునామము ధరించు కొన్నవారికి మారుమనస్సు పొందిన పొందక పోయిన యేడేండ్లలో శ్రమలు తప్పవు. ఈ ఏడు సంవత్సరములలో అంతిక్రీస్తు పరిపాలనలో మారుమనస్సు ఉన్నవారికి శ్రమలు తప్పకవచ్చును గాని హత్య తప్పదు. (నరకబడుట) మారుమనస్సు లేనివారు అంతిక్రీస్తును మహాప్రభువా అని అందురు. గనుక హత్య ఉండదు. మారుమనస్సు లేనివారు అంతిక్రీస్తును మహాప్రభువా అని అందురు. గనుక హత్య ఉండదు. మారుమనస్సు ఉన్నవారికి హత్య తప్పదు. కొందరు క్రైస్తవులు అంతిక్రీస్తును వెంబడించుటకు ఇష్టపడరు. అంతిక్రీస్తు అంటేభయము. అందుచేత పారిపోవుదురు. (ఆవగింజంత చిరు పాపము అంటియున్న) క్రీస్తునందు భక్తి ఉన్నది. అంతిక్రీస్తు అంటే అయిష్టము ఉన్నది గాని అంతిక్రీస్తునందు భయమున్నదిగాన మోక్షమునకువెళ్ళలేరు. విచార పడుదురు. భయముచేత దిగులొందుదురు ప్రార్ధించుచుందురు. దేవుడు వారిని ఏమి చేయవలెను. వారి గుణము అంతిక్రీస్తును ఒప్పుకొనదు క్రీస్తును ఒప్పుకుంటారు గాని పూర్తిగా క్రీస్తులోనికి రాలేక పోవుచున్నారు. వీరిని అంతిక్రీస్తునకు విడచి పెడితె మంచిదా! క్రీస్తు తీసుకొని వెళితే మంచిదా? అంతిక్రీస్తునకు విడిచి పెడిచ్తే ఆయన కార్చిన రక్తము వృధాగాపోవును తన రక్తము వృధాగా పోవును. తమరక్తములోకృప. నరకములో ఉన్నవారికి ఇచ్చియున్నాడు. ఏడు సంవత్సరపాలన వేరే కథ. హేడేస్సు వేరే కథ. నరకము వేరే కథ ఇప్పుడు ఏడు సంవత్సరముల పాలన కథ. దిట్టమైన క్రైస్తవులు ఉన్నారు వీరికి భయము లేదు. ఆంధోళనలేదు బాగుగా పాడి ప్రార్ధించగలరు నమక క్రైస్తవుల సంగతి వేరు అటు ఇటుగాకుండ ఉన్న క్రైస్తవుల సంగతి మాట పొగరాజెడు జనపనారవత్తిని ఆర్పడు అనగా మంట పోయినది. ఆగి పోయినది పొగ మాత్రము ఉన్నది. ఆ పొగ ఊదగా అగ్నిమంట వచ్చినట్లు వీరి భయము ఆయన శక్తిపోయి ధైర్యము వచ్చును ఆయువు వారిలో పేరుకు మాత్రమే బహు తక్కువ జీవమున్నది ఆయన ఊదగా తన జీవము ఆయన జీవముతో కలిసి రక్షణ పొందుదురు. ఇది వీరికి గడువు వీరు సేవచేయలేదు గాన కిరీటము ఉండదు. రక్షణ ఉండును. సాతాను నుండి అంతిక్రీస్తునుండి హేడేసు నరకములోనుండి తప్పించబడుటే వీరికి రక్షణ. ప్రకటన 14:18లో ప్రభువు వీరిని సర్దుబాటు చేసికొనును.

    • 1. మరుమనస్సు పొందిన వారిని.
    • 2. హతసాక్షులు అయిన వారిని.
    • 3. సజీవులు అయిన వరిని

    ఈ మూడు గుంపుల వారిని ప్రభువు తీసుకొని వెళ్ళును. ఏడుయేండ్లు శ్రమకాలంలో ఆ భయములోనుండి ఏదోఒక విధముగా వారిని తప్పించి తీసికొని వెళ్ళును. వీరిని తీసికొని వెళ్ళినను, వారికి తగిన స్థలమందు ప్రభువు వారిని పెట్టును.

    • 1) కిరీటము ఉండదు.
    • 2) ప్రశస్థ వస్త్రములుండవు.
    • 3) సిం హాసనముముందదు.
    • 4) బహుమానం ఉండదు.
    • 5) పెండ్లికుమాత్రె వరుస ఉండదు.
    • 6) మహిమ ఉండదు.
    • 7) సహవాసం ఉండదు

    ఈ శ్రమలకు భయపడిన పిరికి తనము ఉండదు. రక్షణ మాత్రం ఉండును. (యూద 1:23) అగ్నిలోనుండి కొందరిని లాగినట్లు ప్రభువు వారిని లాగును వెళ్ళగా వెళ్ళగా నశించగా నశించగా మిగిలిన వారి కథ ఇది దేవుని కృపకు వారిని విడిచి పెట్టవలెను. దేవుడు ఏమి చేసుకొంటాడో.

    రేప్చర్:

    మత్తయి 13:47 ఇందులో యేసుప్రభువు చెప్పిన వల ఉపమానము గలవు. ఇందులో నానా విధములైన చేపలను పట్టిన వల ఉన్నది. అది నిండినప్పుడు వలను ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలోచేర్చి చెడ్డ వాటిని బ్యట పారవేయును. అలాగే ప్రభువు కొందరిని పరలోకమునకు తీసికొని వెళ్ళును. మత్తయి 24:31 తన మహిమతో మనుష్య కుమారుడు సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన సిం హాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. మృతులను కూడా తీసుకొని వెళ్ళెను. ప్రకటన 18:4

    • 1 నీతి వస్త్రము ధరించు కొన్నవారిని ప్రభువు పరలోకానికి తీసుకొని వెళ్ళును.
    • 2. నా ప్రజలారా అను స్వరము ఎవరైతే విందురో అట్టి వారిని ప్రభువు పరలోకమునకు తీసికొని వెళ్ళును. ఎవరిలోనైన ఏ కొంచము, మంచి ఉన్న అట్టి వారిని ప్రభువు విడిచిపెట్టరు.

    ప్రకటన 14:13 క్రియలు: క్రియ అనగా మారుమనస్సు సిలువ మీద ప్రభువుతోపాటు వ్రేలాడ దీయబFఇన దొంగ చనిపోవునప్పుడు మారుమనస్సు పొందెను. అతనికి క్రియలులేవు. అతని వంటి వారును ఏడుయేండ్ల మహా శ్రమలలో క్రీస్తునిమిత్తము హతసాక్షులుకాగా, వారు భూలోకమునందు చేసిన క్రియలు వారి వెంట పోవును మంచి క్రియలులేని వారి వెంట వారిక్రియలు పోవు. అయినను మారుమనస్సు పొందినవారు గనుక రక్షింప బడుదురు. అట్టివారు క్రియలు లేనివారు అయినను పరలోకమునకు కొనిపోబడుదురు.

    ఏడు సంవత్సరముల శ్రమ కాలములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉందురు. ప్రకటన 18:4లో నా ప్రజలారా, అని ఉన్నది ఈ స్వరము ఎవరిదో తెలియదు గాని, క్రీస్తుప్రభువు యోర్ధాను నదిలో బాప్తిస్మము) పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అని తండ్రి అన్నారు. ఎప్పుడు పరలోకము నుండి స్వరము వచ్చినను అది తండ్రి స్వరమే. దేవదూతలైన పరిశుద్ధులైన అలాగు చెప్పలేరు.

    ఏడుయేండ్ల శ్రమ కాలంలో ఆయన తన ప్రజలను విడువలేదు. ఈ కాల మందు ఆయన ఎన్నోమార్లు తన ప్రజలను తీసుకొని వెళ్ళును. రాకడకు తయారు అయిన వారినందరిని మహిమకు పూర్తికాని వారిని క్రియలు లేని వారిని కూడా ఆయన తీసుకొని వెళ్ళినట్లు కనబడుచున్నది.

    ఏడు సంవత్సరముల శ్రమల కాలంలో

    • 1. పెళ్ళి కుమార్తె
    • 2. తండ్రి
    • 3. కుమారుడు
    • 4. పరిశుద్ధాత్మ పరలోకములో జరుగుచున్న పెండ్లి విందులో ఏకీభవించెదరు,
    పరలోకములో విందు ఆరగించుచున్న పెండ్లి కుమారుడు భూలోకమునకు వచ్చును ఆయన సర్వవ్యాపి అయి ఉన్నారు గనుక అక్కడ పరలోకములోను ఇక్కడ భూలోకమును ఉంటారు

    ప్రకటన 14:14 ప్రార్ధన:

    ఓ దయ గల ప్రభువా! ప్రతి జనాంగములో నీ యందు విశ్వాసము ఉంచువారిని నీవు కోరుచున్నావు ఈ కూటములోనికి వచ్చిన వారికి విశ్వాసము జ్ఞానము, ధైర్యము, ప్రత్యక్షత ప్రయత్నమును వెలిగించుము. లోక చరిత్ర ఆరిపోవుచున్నది. ఏ నిమిషమున ఏది జరుగునో తెలియదు. ఈ భూమి మీద ఎల్లప్పుడు వాక్య పంట పండవలెనని కోరె నీకు వందనములు ప్రతి జనాంగములోను నీ యందు నమిక ఉంచువారిని లేపవలెనని నీ కోరిక కొరకు వందనములు నీ దూతల కావాలి మా చుట్టు ఉంచుము దయ్యములను పారద్రోలుము. వర్తమాన దీవెన దయచేయుము. నీ పని అంతటి మూలముగ మహిమ పొందడము కడవరి కాలంలో ఉన్నాము గనుక అవిశ్వాసము భీతి మొదలగు వాటిని తొలగించెదవని నీ కొరకు కనిపెట్టు ఉపాయముదయచేయుము ప్రతి వారి హృదయములను తట్టుమని ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము ఆమెన్.

    యుగ సమాప్తి:- దీనికి నిరుకులేదు. యుగ సమాప్తి అను మాట బైబిలులో ఉన్నది. ఒక యుగము, కొన్ని సంవత్సరముల కాలము. ఇంకొక యుగము ఇంకా కొన్ని సంవత్సరముల కాలము.

    • 1. అదాము మొదలు కొని నోవాహు వరకు ఒక కాలము
    • 2. నోవాహు మొదలుకొని అబ్రహాము వరకు ఒక కాలము
    • 3. అబ్రహాము మొదలుకొని మోషే వరకు ఒక కాలము
    • 4. మోషే మొదలుకొని యెహూషువా వరకు ఒక కాలము
    • 5. యెహూషువా మొదలుకొని రాజుల వరకు ఒక కాలము
    • 6. రాజులు మొదలుకొని మలాకీ వరకు ఒక కాలము
    • 7. యోహాను మొదలు కొని క్రీస్తు వరకు ఒక కాలము
    • 8. సంఘ కాలమునుండి పెండ్లి కుమ్మర్తె ఎత్తబడే వరకు ఒక కాలము.

    ఎవరికైన సమయం, గడువు, ఆయుష్షు కాలము, సిద్ధపడేకాలము తక్కువే. రేప్చర్ దగ్గరకు వచ్చింది గనుక దూతలకు యెసుప్రభువునకు విశ్వాసులకు లోకమంతటికి సమయము తక్కువగా ఉన్నది. ప్రభువు వచ్చె ఈకాలము భయంకర కాలము. ఎవరికైన తరుణము తక్కువే.

    లోకమా ఈన్నాళ్ళనుండి ప్రకటింపబడిన నమ్మలేదు. సిద్ధపడలేదు. ఇప్పుడైన నీవు నమ్మిన యెడల రాకడలోనికి వెళ్ళుదువని. బోధకులు చెప్పుచున్నారు. దేవునికి కుమారునికి పరిశుద్ధాత్మకు తరుణము అను చక్రము బహు విరివిగా తిరిగి పోవుచున్నది. లోకము బొంగరము వలె తిరిగి పోవుచున్నదని పండితులు చెప్పుచున్నారు. లోక చరిత్ర గబగబా తిరిగి పోవుచున్నది. పడమటినుండి తూర్పునకు లోకము బహు విరివిగా తిరుగుచున్నది. మనము నెమ్మదిగా హాయిగా కూర్చుండ వీలులేదు. రాకడ వస్తుందని లోకమతట హడవిడిగా ఉన్నది. గనుక మనము త్వరగా సిద్ధపడవలెను. రేప్చర్ను ఆలస్యము చేయమని లోకము అడుగదు ఎందుకంటే లోకమునకు రాకడను గూర్చిన అవసరములేదు. సంఘము అడుగదు ఎందుకంటె అందరు వెళ్ళరు. లోకమునకు దేవుడు ఆరువేల సంవత్సరముల గడువు సిద్ధపడుటకు ఇచ్చెను. సంఘమునకు సిద్ధపడుటకై రెండువేల సంవత్సరములు యిచ్చెను అయిన సిధపడిన వారు మాత్రమే వెళ్ళగలరు. ఇప్పుడు ఏ మంచి క్రియ మనము చెయుదుమో ఆ మంచి క్రియ మన వెంటవచ్చును. ఈ వచ్చ్నములో మేఘ్మున్నది. మేఘము అనగా తెలుపు పరిశుద్ధులకు జయము జయమునకు గుర్తు మేఘము.

    • (1) దేవుని సన్నిధికి గుర్తు
    • (2) పరలోక సంబంధమునకు గుర్తు. పరలోకమునుండి వచ్చినది గనుక రేప్చర్తో మేఘముల అవసరంలేదు
    • (3) సిద్ధపడిన వారిని తీసికొని వెళ్ళుటకు వచ్చిన వాహనము. ఎవరో ఒకరు వాహనములో వచ్చియున్నారు. ఇవన్నిటికి మేఘము గుర్తు అయి ఉన్నది
    • (5) మేఘములో బేదముల ఉన్నవి. గాలి మేఘము, వర్ష మేఘము, ఆవరివల్ల వచ్చిన మేఘము. అయితే ఇప్పుడు మనము చూచిన ఈ మేఘము మహిమ వల్ల నిరూపించబడినది.

    • 1. ఇశ్రాఏలీయులు అరణ్యములో ఉండగా సినాయి కొండపై మేఘము దిగివచ్చెను. దేవుడు ఆ మేఘములో దిగివచ్చెను. అప్పుడు భయంకర ఆ కొండ పైకి ఎక్కి వెళ్ళెను ఇది మొదటి మేఘము ఈ మేఘములో నుండి దేవుడు మోషేకు ఇది ఆజ్ఞలను ఇచ్చెను.
    • 2. దేవుడు చెప్పగా మోషే గుడారములో మోషేతో మాటలాడెను. ఈ మేఘమునకే షెఖీన మేఘమని పేరు.
    • 3. ప్రభువు కాలములో రూపాంతర కొండపై మేఘము దిగివచ్చెను. ఆ మేఘములో నిర్గమమును గూర్చి మాటలాడుటకు మోషే, ఏలియాలు దిగి వచ్చిరి.
    • 4. మరణముపై విజయము సాధించిన ప్రభువు తన శిష్యులకు ఒలీవ కొండలపై కనబడి మాట లాడుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆయనను కొనిపోయెను.
    • 5. ప్రభువు రాకడ సమయమదు వచ్చిన మేఘము. ఇది పెండ్లి కుమార్తెను కొనిపోయే మేఘము
    • 6. పెండ్లికుమార్తె వెళ్ళిపోగా ఒక మేఘము వచ్చును. ఆ మేఘములో ప్రభువు వచ్చును. ఈ శ్రమలన్నింటి చివర ఇంకా ఒక్క శ్రమ ఉండగా ఈ తెల్లని మేఘము వచ్చును వచ్చిన ప్రభువునకు కిరీటము ఉన్నది. ఇది జయమునకు గుర్తు. అధికారము రాజరికము, ఔనత్యమునకు గుర్తు.
    Home


    సువర్ణ కిరీటము

    ప్రభువు నశించకుండా శాశ్వతముగా ఉండుటకు ఇది ఒక గుర్తుయై ఉన్నది. బంగారము ఎప్పుడును స్థిరముగా ఒకే రీతిగా ఉండును. మనుష్యకుమారుని పోలినవాడు:- చేతిలో కొడవలి ఉన్నది. కొడవలి కోయవలసిన పంటకు గుర్తు. దూత పరలోక దేవాలయము నుండి దిగివచ్చెను. భూమిపై పైరు పండి ఉన్నది. దేవదూత చెప్పినమాట.

    • 1. పైరు పండియున్నది.
    • 2. కోతకాలము వచ్చియున్నది.
    • 3. నీ కొడవలిపెట్టి కోయుమని చెప్పినది.
    ఉందురు. కోయకముందు కొంతమది రేప్చర్ తరువాత ఇంకా కొంతమంది పండినప్పుడు కోతకోయాలి. పండినది ఎందుచేత? శ్రమవల్ల పండినది. కోయుట అనగా, భూమిపై లేకుండా పరలోకమునకు తీసుకొనివెళ్ళుట. బాగా పండియున్నది. ఈ పంట శ్రమలవల్ల తయారైనది. శ్రమ రానీయుమని ప్రార్ధించువారు కొందరు వుంటారు.

    కళ్ళుమూసికొంటే కోడిపిల్లలు రాక ఉండదు. కండ్లు మూసికుంటే ప్రార్ధన వాలురాదు.

    ప్రార్ధన:

    ప్రభువా ప్రార్ధనవాలు రప్పించుటకు శ్రమ రానియ్యుమని సుందర్సింగ్ గారు ప్రార్ధించెను. ఓ పెండ్లికుమార్తె సంఘములో వెళ్ళనైయున్నవారులారా ఈ దినమునుండి ఈ ప్రార్ధన చేయండి 1. శ్రమరానిచ్చి విశ్వాస అభివృద్ది కలిగించుమని 2. ఓ ప్రభువా నా మందస్థితి తొలగించు నిమిత్తమై ఏదైన శ్రమ రప్పించు ప్రభువా అని ప్రార్ధించాలి. శ్రమరాగానే మందస్థితి పోవాలి. మిక్కిలి భయంకరమైన శ్రమరాగానే ప్రార్ధించుదుము. శ్రమ తొలగును. ప్రార్ధన రావడానికి తమకుతామే బాధ కలిగించుకొందురుగాని దేవుడు కలిగించు శ్రమవల్ల మందస్థితిపోతుంది. కొంతమంది ప్రార్ధన రానప్పుడు తల గోడకు కొట్టుకొందురు.

    కుంభకోణము కాలేజీలో బ్రాహ్మణపిల్లలు జుట్టుకు త్రాడుకట్టి ఆ త్రాడు పైకిలాగి కట్టుకొందురు. చదువుచున్నప్పుడు నిద్రవస్తే జోగినప్పుడు కట్టుకొన్న త్రాడునుబట్టి మెళుకువ వస్తుంది. మెళుకువనుబట్టి మరల చదువుదురు ఈలాంటి కలిగించుకొన్న శ్రమలనుబట్టి విద్యలో వారు బాగుగా కృతార్ధులు కాగలరు. అలాగే ప్రభువు శ్రమకాలములో తయారు అయిన పంటను కోసికొని వెళ్ళుటకు వచ్చెదరు.

    పంట కోయుమని దేవదూతలు ఎందుకు చెప్పాలి? భూలోకములో పొలము ఉన్నది. పైరు ఉన్నది. పంట కోయవలెను యజమానుడు. పొలము దగ్గరకు వచ్చును. ఇంటిలోని పెద్దకుమారుడు స్వజనులు కులీవారుకూడా వచ్చెదరు. ఆదాము మొదలుకొని అంత్యదినమువరకు భూమి పొలమై ఉన్నది. పైరు తయారుచేయుటకు అనగా నరులను రక్షించుటకు తండ్రి, దూతలు, భూమిమీద నున్న విశ్వాసులు పూనుకొనెదరు వీరందరికి పని వుండును. వీరిపని ఏమిటంటే రాకడ సమీపమని బోధించుట. దూతలైన వారు విశ్వాసులను కాపాడుట. ఈ సంగతులు జరుగును. పరలోకమునందున్న తండ్రి భూలోకమందున్న దూతలకు ఆజ్ఞాపించును. కనుక దూతలైనవారు బోధించుచున్న విశ్వాసులకు రాకడనుగూర్చి తెలియజేయువారికి సహాయముగా నుందురు. ఆటమకముగా నున దయ్యములను వీరు వెళ్ళగొట్టెదరు. అప్పుడు పంట త్వరగా పండును. కొందరు తెలియక నమ్మరు. మరికొందరు నమ్మలేక నమ్మిరి. పొలములో విశ్వాసులు ప్రార్ధించుచు పనిచేయుటకు శక్తి చాలనప్పుడు ప్రభువును వేడుకొనగా తండ్రి వీరికి సహాయముగా దేవదూతలను పంపును. గనుక పొలములో ఈ ముగ్గురికి పని వున్నది.

    • 1. కొన్ని సంగతులు అర్ధముకాక కొందరు నమ్మరు.
    • 2. కొందరికి నమ్ముట ఇష్టము లేదుకనుక నమ్మరు.
    • మనదగ్గర ప్రభువు ఉన్నారుగనుక దేవదూతలు అవసరము.
    • 1. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీరు ఒక గుంపు.
    • 2. ప్రధాన దూతలు, తక్కినదూతలు సహాయపడేవారు వీరు ఒకగుంపు.
    • 3. భూమి మీద విశ్వాసులు పనివారు కూలీలు వీరు ఒకగుంపు.

    మనయొద్దనున్న దేవదూతల సహాయము మనకు అవసరమై యున్నది. ఎందుకనగా వారికొరకు ఏర్పాటు చేయబడినపని వారికున్నది. గనుక దేవదూతలను కోరుకొనవచ్చు. రాత్రికాలమందు పరుండినప్పుడు ప్రభువా నేను జబ్బుగా వున్నాను అని అనవచ్చును. నేను జబ్బుగా వున్నాను అని ఇతరుల సహాయము కోరవచ్చునా? ఎవరిపని వారు చేయవలెను గనుక కోరవచ్చును.

    Home


    ప్రభుత్వము

    భూలోక ప్రభుత్వములో రాజుగారు మంత్రులు, గవర్నర్లు, కలెక్టర్లు మునసబులు, జడ్జీలు, పోలీసులు వీరందరు కలిసి రాజుగారికి సహాయము చేయుదురు. ఈ రీతిగానే పరిపాలనక్రమము జరుగుటకుగాను దేవుడు ఏర్పాటు చేసి యున్నారు, అచ్చటి ఛాయ ఈ భూలోక ప్రభుత్వము.

    భూలోకమందున్న విశ్వేఅసి తన అవసరతను బట్టి ప్రార్ధించిన యెడల ఆ ప్రాధన పరలోకమునకు చేరును. పరలోకమందున్న తండ్రి విశ్వాసి ప్రార్ధనను బట్టి దేవదూతలను పంపును వచ్చిన దేవదూతలు విశ్వాసికి సహాయముచేసి తిరిగి దేవుని యొద్దకు వెళ్ళితాము చేసి వచ్చిన పనిరిపోర్టు దేవునికి తెలియ జేయును.

    దేవదూత

    • 1. కోయుమని ప్రార్ధించెను
    • 2. పెరు పండియున్నదనేది రిపోర్టు గనుక దేవదూతలు దేవుడుపంపిస్తే వచ్చి సహాయము చేయుదురు.
    మనకొరకు ప్రార్దించెదరు. దేవునికి రిపోర్టు తెలియజేయుదురు.

    మనముచేయు తప్పులన్నియు దేవదూత లైనవారు పుస్తకంలో వ్రాయుదురు. కడమతీర్పు ఉండునని చిన్ననాటి నుండి మనము వినుచునే ఉన్నాము. దేవదూతలు మనతప్పులు ఎందుకు చెప్పవలెనని అనుకొనవచ్చును ఎందుకనగా అది క్రమము. మనపాపముల జాబితా దేవదూతలు వ్రాయుదురు. ఒకవేళ విశ్వాసి క్షమిపుమని వేడినయెడల దేవుడు క్షమించును. దేవదూత ఈ జాబితాను పట్టుకొని పరలోకమున ఉన్న తండ్రియొద్దకు వెళ్ళును. ప్రభువు తన రక్తపుబొట్టును ఆ జాబితాపై వేయగా జాబితాలోని పాపము లన్నిటిని ప్రభువు తుడిచిపెట్టును.

    • 1. కొడవలి భూమిపై వేసెను.
    • 2. పంట కోయబడెను.

    కొడవలిని ప్రభువు ఒక సాధనముగా ఉపయోగించు కొనుచున్నారు. ఒకదరినుండి విశ్వాసులను తయారుచేసి పరలోకమునకు తీసుకొని వెళ్ళుచున్న కొందరు దుష్టులను శిక్షించు చున్నారు.

    ప్రభువు ఆరోహణమై వెళ్ళకపూర్వము ఇదిగో క్రీస్తు ఇక్కడ వున్నారు. అక్కడవున్నారు అని అంటే మీరు నమ్మవద్దన్నారు. అది ఈవేళ భూమిమీద జరుగుచున్నది. ఈ యుగప్రారంభము నుండి, నేటివరకు షుమారు నలభై మంది మనుష్యులు భూమిపైకి వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకొన్నవారు ఉన్నారు. అల్;ఆగు చెప్పుకొన్నవారిని కొందరు నమ్మి నమస్కరించినారు. చాలామంది నమ్మలేదు.

    1950 సంవత్సరము ఏప్రి నెల 29వ తేదీన బ్రిటిష్ అను వార్త పత్రికలో ఒక 40 సంవత్సరముల వయసు కలిగిన ఒకవ్యక్తి లేచి, నేనే మెసియాను అని ఇటలీదేశములోని మిలాన్ అను పట్టణవాస్తవ్యుడు ప్రకటించెను. భూలోక రాజులకు అధికారులకు ఉత్తరములు వ్రాసినాడు, అదేమి టంటే మెసియ అను నాయొద్దకు వచ్చి నమస్కరించకపోతే మిమ్ములను నాశనము చేయుదును అని చెప్పెను.

    ఇటలిలో పోలిని అను ఒకవ్యక్తి ఉద్భవించినాడు. ఇటలీలోని పోపులతో అధికార తాళ్ళపుచెవులు నావిగనుక నాకు ఇచ్చివేయండి సంఘాధికారము నాది అని అన్నాడు. రాజులకుకూడా అధికారము రాజ్యము నాది అని వ్రాసెను.

    ప్రభువా ఈ ప్రవచనము మా కన్నుల ఎదుట జరిగించుచున్నావు గనుక నీకు స్తోత్రములు. ఈ ప్రవచనమును అనేకులు తెలిసికొని నేనే మెస్సియ అనువారితట్టు తిరుగకుండగా మనమందరము ప్రార్ధించవలెను. పోపు వెళ్ళినందున సరేలే నీకు గడువు ఇస్తున్నాను. అని అతడు పోపునకు వ్రాసెను. అలాగే రాజుకూడా రానందున నీకుకూడా గడువు ఇస్తాను అని వ్రాసెను. ఇతడు అంతిక్రీస్తు కాదుగాని అబద్ధక్రీస్తు. అబద్ధ క్రీస్తులు. యుగసమాప్తి కాలమందు లేస్తారని వాక్యములో వ్రాయబడినట్లుగా ఇలాగు నెరవేరుచున్నది.

    మత్తయి సువార్తలో అంజూరపుచెట్టు చిగుర్చును. అప్పుడు క్రీస్తుప్రభువు వచ్చునని వ్రాయబడెను. పాలస్తీనాకు ప్రధాన పట్టణము యెరూషలేము. పాలస్తీన పిలిష్తీయుల దేశము. చెదరిపోయిన యూదులు తిరిగివచ్చి తమ సంఘమును స్థాపించుకొనుచున్నారు. వారు తిరిగివచ్చిన తరువాత అరవై లక్షల అంజూరపుచెట్లు తమదేశములో నాటించియున్నారు. ఎందుకంటే నాజీ ప్రభుత్వములో తమ స్వజనులు అయిన యూదులు అరవై లక్షలమంది జర్మనీదేశంలో చనిపోయిరి గనుక వారికి గుర్తుగా జ్ఞాపకార్ధముగా తెలియనిరీతిగా తమ పని మీద స్వదేశంలో నాటిరి.

    1. అంజూరపుచెట్టు చిగిర్చిన యుగసమాప్తి. ప్రభువు బేతనియా గ్రామమునుండి యెరూషలేము పట్టణమునకు వెళ్ళుచుండగా దారిలో ఒక అంజూరపుచెట్టు కనబడెను. ఎంతో అలవరముగా ఉండెనుగాని పండ్లులేవు. అలాగే యూదులలో ఆచారములు బాగుగానే ఉన్నవిగాని ఫలితములేదు. మ్రాను ఆకులు అందముగా ఉండెనుగాని పండ్లులేవు. అనగా ప్రభువును వారు అంగీకరించి యుండలేదు గనుక ప్రభువు ఆ చెట్టును మత్తయి సువార్తలో అంజూరపుచెట్టు చిగుర్చును. అప్పుడు క్రీస్తుప్రభువు వచ్చునని వ్రాయబడెను. పాలస్తీనాకు ప్రధాన పట్టణము యెరూషలేము. పాలస్తీన పిలిష్తీయుల దేశము. చెదరిపోయిన యూదులు తిరిగివచ్చి తమ సంఘమును స్థాపించుకొనుచున్నారు. వారు తిరిగివచ్చిన తరువాత అరవై లక్షల అంజూరపుచెట్లు తమదేశములో నాటించియున్నారు. ఎందుకంటే నాజీ ప్రభుత్వములో తమ స్వజనులు అయిన యూదులు అరవై లక్షలమంది జర్మనీదేశంలో చనిపోయిరి గనుక వారికి గుర్తుగా జ్ఞాపకార్ధముగా తెలియనిరీతిగా తమ పని మీద స్వదేశంలో నాటిరి.

    1. అంజూరపుచెట్టు చిగిర్చిన యుగసమాప్తి. ప్రభువు బేతనియా గ్రామమునుండి యెరూషలేము పట్టణమునకు వెళ్ళుచుండగా దారిలో ఒక అంజూరపుచెట్టు కనబడెను. ఎంతో అలవరముగా ఉండెనుగాని పండ్లులేవు. అలాగే యూదులలో ఆచారములు బాగుగానే ఉన్నవిగాని ఫలితములేదు. మ్రాను ఆకులు అందముగా ఉండెనుగాని పండ్లులేవు. అనగా ప్రభువును వారు అంగీకరించి యుండలేదు గనుక ప్రభువు ఆ చెట్టును శపించెను.

    2. యూదులు అన్నిదేశములకు చెదరిపోయి తిరిగివచ్చి వ్యవసాయము చెసి గుడులు, బడులు కట్టి పాలస్తీనాలో తమ ప్రభుత్వము ఏర్పాటు చేసుకొన్నారు. అదే చిగిరించుట. క్రొత్త నిబంధనను గ్రంధమును పెట్టుకొందురు అరబీయులు వీరిపై యుద్ధముచేయగా అరబీయులపై యూదులకు విజయము లభించును. యోనా పారిపోయి దిగినరేవు యొప్పె అక్కడ పెల్ల అను పట్టణము ఉన్నది. వారు ప్రభుత్వము ఏర్పరచుకొన్నారు వారిని నరికిన అరబీయులనే వారు కూలీలుగా పెట్టుకున్నారు. అలాగుననే యూదులుకూడా వారిని నరికిన అరబీయులనే కూలీలుగా పెట్టుకొన్నారు. యూదులకు దైవాశీర్వాదము ఉన్నది. పంట, పశువులు విస్తారముగా వృద్ధిపొందుచున్నది. ఎండిపోయిన శపించబడిన అంజూరపుచెట్టు చిగిరించెను. అలాగే యూదులు తిరిగి వచ్చుట. ఈ పనులన్ని చేయుటయే చిగుర్చుట అయి యున్నది.

    ప్రభువుయొక్క ప్రవచనములు నెరవేర్పులోనికి వచ్చుచున్నవి గనుక అనేకులు పెండ్లికుమార్తె వరుసలోనికి వచ్చుచున్నారు.

    • 1. అంజూరపుచెట్టు చిగుర్చుట (యూదులు)
    • 2. ఆరులక్షల అంజూరపుచెట్లు నాటుట.
    • 3. ఇటలీలో పోనివచ్చి మృతులకు సజీవులకు తీర్పుచేయుటకు వచ్చియున్నాను అనుట ఇవన్నియు యుగసమాప్తికి గుర్తులై యున్నవి.
    గనుక విశ్వాసులు మా ప్రభువు త్వరగా వచ్చుచున్నారు అని. పై గుర్తులనుబట్టి సిద్దపడుచూ ఉన్నారు.

    ప్రార్ధన:-

    ప్రభువా ఈవేళ మేము మాట్లాడుకొనే గుర్తులు మోకాలికైన తగులకుండా చేయుము. కండ్లుమూసికొని నడిచేవారికి ముండ్లు, బెడ్డలు, గోతులు, గొప్పులు తగలకమానవు. యూదులు చెట్లునాటుట, చెట్లు చిగిరించుట అబద్ధ క్రీస్తు వచ్చుట అందరికి తెలియయును గనుక అవిశ్వాసులు. విశ్వాసులు, అయేటందుకు గుర్తులు వారికి బోధపరుచుము. విశ్వాసులు ప్రార్ధించినప్పుడు నీవు దర్శ్నములో వారికి కనబడుచున్నావు ఈ దర్శ్నమునకు ఇటలీలోనున్న అబద్ధ ప్రవక్తలకు సంబంధములేదు ఇది కాదని విశ్వాసమును గట్టిపరుచుకొనే కృప దయచేయుమని త్వరగా వచ్చుచున్న క్రీస్తునుబట్టి వేడుకొనుచున్నాము. ఆమెన్.

    ప్రకటన 14:17:-

    15వ వచనములో మొదటిదూత దేవాలయము నుండి వెడలి వచ్చినట్లుగా ఉన్నవి. రెండవ దూత. పరలోకమునుండి బయలుదేరి వచ్చునట్లు కనబడుచున్నది (14:17) మూడవ దూత బలిపీఠము నుండి బయలు వెడలి వచ్చినట్లు ఉన్నది (14:18) దేవాలయమువద్ద బలిపీఠమువద్ద నిత్యము జనములు ఉందురు. వారివద్ద దేవదూతలు ఉందురు.

    పరిపక్వములు రెండు విధములు:

    • 1. మారుమనస్సు పొందినవారు. శ్రమలవల్ల కోతకు సిద్ధము అయినవారు.
    • 2. మారుమనస్సు పొందనివారు కూడ పరిపక్వమై కోతకు సిద్ధపడిరి.
    మారుమనస్సు పొందినవారు మహిమ లోనికి జీవములోనికి సిద్ధపడిరి. మారుమనస్సు పొందనివారు నాశనమునకు సిద్ధమైనవారు గనుక పాతాళమునకు వెళ్ళుదురు. మారుమనస్సు పొందిన వారిని, పొందనివారిని, తీసికొనివెళ్ళడానికి త్రియేక దేవుని యొద్దనుండి పరలోకముద్వారా దేవదూతలు అయినవారికి ఆజ్ఞ రావలసి యున్నది. దేవదూతలయొద్ద త్రాసు ఉన్నది. ఈ త్రాసునుబట్టి జీవమునకును, నాశనమును, పాతాళమునకును తయారు అయ్యేవారి జాబితా పరలోకములోనే తయారు కావలసి యున్నది. ఈ పని దేవదూతల లోకములో జరుగును. విశ్వాసుల యొద్ద కూడా జరుగును. ఈ తీర్మానము దేవుని యొద్దనుండి పరలోకము నుండి రావలసి యున్నది. ఈ రెండు తీర్మానముల క్రమశిక్షణ పని దేవుడు మిక్కిలి నమ్మకమైన విశ్వాసులకుగాని, దేవదూతలకుగాని అప్పగింపనేరడు. తీర్మానము దేవునిదైన తీర్మానము నెరవేర్చుపని దేవదూతల్దై యున్నది. ఈ నెరవేర్పుపని అవిశ్వాసులది కాదు. పరలోక ప్రార్ధనలో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక అని ప్రార్ధించుచున్నాము గనుక ఈపని పరలోకములోనిది.

    బైబిలులో రెండువాక్యములు ఉన్నవి. ఆదికాండము 15:16. అమొరీయుల అక్రమము సంపూర్తి కాలేదు. గనుక వీరి నాల్గవతరము వారు ఇక్కడకు వచ్చెదరు. వీరికి ఒక సంతానములేదు. వీరు అనేకమంది గలవారు. ఇప్పుడు ఎందుకు పూర్తికాలేదు? వీరు దేవుని ఎరగనివారు. దేవుని వాక్యము ఎరుగనివారు దేవుని జనాంగమై ఇశ్రాఏలీయులను తృణీకరించినవారు దేవుని జనాంగమై ఇఋఆఏలీయుల దేశం అయిన పాలస్తీనాను ఆక్రమించుకొన్నారు. వీరు దేవుని ఎరుగక మేళ్ళు కలిగించుచున్న సృష్టిని పూజించిరి వారికి ఇష్టమువచ్చిన రీతిగా పాపము చేసినవారు అయిరి. వారి పాపము ఇంకా పూర్తికాలేదు. ఇంకా కొంచెము నిండలేదు.

    ఎప్పుడు పూర్తి అగును:-

    దేవుడు అబ్రహామును చూచి నీ సంతానము తమదిగాని ప్రదేశమందు నాల్గు వందల ముప్పది సంవత్సరములు పరవాసులుగా ఉందురని సెలవిచ్చెను. ఆ పిమ్మట బయటకువచ్చి అమోరీయులతో యుధముచేసి ఆ దేశమునకు వచ్చెదరు అని సెలవిచ్చెను. గనుక అప్పటికి వారిపాపము పూర్తీగును. ఈలోగా యూదులు మారుమనస్సు పొంది వారిని నాశనము చేయుదురు. యెహూషువకాలంలో అబ్రహాము సంతానమైన ఈనాల్గు తరములవారు అమోరీయుల దేశమును స్వాధీనపరచుకొందురు. దేవుడు అమోరీయుల మారుమనస్సు నిమిత్తము కనిపెట్టినారు. అప్పటివరకు వారు మారినయెడల సరే మారకపోతే వారిని వెళ్ళగొట్టి మీకు ఆ దేశము ఇచ్చెదనని వాగ్ధానముచేసిరి. అప్పటికి ఐదుగ్రంధముల చరిత్ర అనగా ఆదిక్కండము నుండి ద్వ్తీయోపదేశకాండ గ్రంధము వరకు ఉన్న చరిత్ర పూర్తిగాగావింపబడినది. ఆరవ గ్రంధమైన యెహూషువా గ్రంధమువరకు దేవుడు గడువు ఇచ్చెను. అప్పటికికూడా మారలేదు. అబ్రహాము అమోరీయుల దేశంలో ఉన్నాడు. అయినను అబ్రహాము దేవునిని వారు అంగీకరించలేరు. అబ్రహమునకు గల దైవభక్తిని చూచినవారు గాని ఆ దేవునిని వారు అంగీకరింపవలసినదిగాని వారికున్న కఠినత్వమును బట్టి అంగీకరించలేదు. ఇంత కృపాకాలము చూచినావారు ఏమాత్రమును మారుమనస్సు పొందలేరు.

    ఏడు స సంవత్సరముల శ్రమకాలంలో విడిచిపెట్టబడినవారు మహాప్ర్భూ మాదే నేరము మమ్మును క్షమిపుమని అంటే సరిపోవును, దేవుడు ఎంత కనికరము కృప చూపినా మారలేదు. ఏడు సంవత్సరములలో వారికికూడా గడువు ఇచ్చెను శిక్షలు వెంటవెంటనే వెల్లడి అగుచున్నది గనుక తెలిసికొని వెంబడింపవలెను కాని కొందరు మారరు. కొందరు తెలికొని మారినందు వల్ల మనుష్యకుమారుడు తెల్లమేఘములోవచ్చి వారిని తొడుకొని వెళ్ళును. ఇప్పుడు తయారుకానివారికి అక్రమము పూర్తికావు పూర్తీయితే నాశనమే.

    ఆదికాండము నుండి యెహూషువా గ్రంధము వరకు అమోరీయుల అక్రమము పూర్తీయినది. ఏడు యేండ్ల కాలములో యేడు సంవత్సరములకు అక్రమము పూర్తి అగును.

    ఆదికాండము 18:20 సొదొమ, గొమొఱ్ఱా, అగ్న, సై మెయం, సోయరు అను ఈ అయిదుపట్టణముల అక్రమము ఆకాశమునకు అంటెను. ఈఅయిదు పట్టణముల పాపము పరిపక్వము అయినది అమోరీయుల హృదయపాపము నిండనైయున్న ఆ సమయములో ఈ ఐదుపట్టణముల పాపము పరిపక్వమైనది. మొదటి నాశనము సొదొమ, రెండవ నాశనము అమోరీయులకు మూడవ నాశనము ఏడుయేండ్ల శ్రమలలో మారనివారి నాశనము. పైవారి నాశనములనుబట్టి అందరును తెలిసికొని మారుమనస్సు పొందవలెను.

    ఏడు సంవత్సరముల శ్రమకాలంలో ముద్రలవల్ల నాశనము.

    ఏడు సంవత్సరముల శ్రమకాలంలో బూరలవల్ల నాశనము.

    ఏడు సంవత్సరముల శ్రమకాలంలో పాత్రలవల్ల నాశనము.

    సొదొమ నాశనమునుగూర్చి దేవుడు ముందుగా చెప్పలేదుగాని లోతును అక్కడపెట్టెను. ఆ దేశథులు తమ పాపములద్వారా ఆ నీతిమంతుని మనస్సును నొప్పించిరి. లోతు ఇంటికి వచ్చిన దేవదూతలకు కీడుచేయ తలపెట్టిరి. దేవదూతలను చూచిన ఆ దేశస్థులు అప్పటికైనా మారుమనస్సు పొందవలసినది కాని మారలేదు లోతు తన కుమార్తెలకైన కీడు చేయమన్నాడు కాని అతిథులుగా వచ్చిన దూతలకు కీడు చేయవద్దని బ్రతిమిలాడినాడు. వారి హృదయ కఠినత్వమునుబట్టి వారికండ్లు మూయబడినవి అప్పుడు సొదొమ వారు మాకండ్లు కనబడుటలేదని లోతును ప్రార్ధించుమని కోరినయెడల ఆ నాశనము తప్పియుండునుగాని వారు అలాగు చేయలేదు. వారికి నాశనము తప్పలేదు. ఎందుకివి వ్రాయబడినవి అనగా మనకును ఏడుయేండ్ల శ్రమకాలంలో ఇలాంటివి జరగనై యున్నవని తెలియపర్చుటకే.

    • 1. సోదోమె కాలంవారు.
    • 2. జలప్రళయకాల ప్రజలు అమోరీయుల కథనుచూచి మనస్సు మార్చుకొనవలెను. రాజులకాలంలోను న్యాధిపతుల కాలంలోను ప్రజలచరిత్ర తెలిసికొనవలెను.
    • 3. ముద్రల కాలంలోనివారు.
    • 4. బూరల కాల్మలోనివారు.
    • 5. పాత్రల కలంలోని ప్రజలు ప్రభువా రక్షించు అని అనరు వినుటకును మార్పుచెందుటకును దేవుడు ఎంతగానో గడువు ఇచ్చునుగాని మార్పు పొందలేరు.
    ఇవన్నియు జరుగకమునుపే ఇలాగు జరుగునని దేవుడు దేదూతద్వారా చెప్పించెనుగాని ఈ విషయములు విన్న మనము మార్పుచెంది సిద్ధపడవలెను.

    ప్రార్ధన:-

    ఓ తండ్రీ మరొకమారు న్యాయమైన నీ ఉగ్రతనుగూర్చి మాట్లాడుగొనబోవుచున్నాము. అపార్ధము కాకుండగా కాపాడుము. నీవు ప్రేమగలవాడవైనను అనేకులు నీ ప్రేమనుగూర్చి గుర్తింపలేకపోవుచున్నారు. దూతలను మాచుట్టూ కావలిఉంచి, నీ వర్తమానము వినిపించుము. భయంకరమైన ఈ దినములలో నీ వాక్యము విడజెప్పుము చదువునప్పుడు అపార్ధము చేసికొనకుండగా ఉండే శక్తీమ్ము. తండ్రి మా మనస్సాక్షిని, జ్ఞానమును, విశ్వాసమును ప్రత్యక్షతను, ప్రయత్నమును వెలిగించుము. నీ వాక్యముద్వారా నీవు మహిమ పొందుము. ఈ మా ప్రార్ధనలు ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్

    దేవుని న్యాయగుణమును గూర్చి ఇంతవరకు పూర్ణముగా తెలిసికొనలేక పోవుచున్నారు. అన్ని గుణములనుగూర్చి వివరించ గలరుగాని దేవుని న్యాయగుణము గూర్చి వివరించి ప్రజలకు నచ్చచెప్పలేరు అనారొగ్యముగా ఉన్న విశ్వాసులలో ఎవరైన ఇకరు అనేక పర్యాయములు ప్రార్ధనచేసిన బ్రతుకకపోతే దేవుని ప్రమ ఎక్కడ్? దేవుని న్యాయం ఎక్కడ్? అని ప్రశనలు వేయుదురు. అనేకుల ఏటిలోపడి, నీటిలోపడి మరణించుచున్నారు. మనుష్యులైనవారు హత్య చేయబడుచున్నారు. అయినను దేవుడు చూచి ఊరుకొంటున్నాడుగనుక దేవుని న్యాయం ఎక్కడ? ప్రేమ ఎక్కడ? అని అనుచున్నరు.

    ఈ పాఠములో దేవుని న్యాయమునుగూర్చి ఎక్కువగా ఉన్నది. వివరించుకొనుట చాలా కష్టము. లోకములో అనేక కష్టములు, చిక్కులు ఉన్నప్పటికిని దేవుని న్యాయమేది? అని భూప్రజలు అందురు.

    • 1. జలప్రళయంలో
    • 2. సొదొమ, గోమొర్రాలో
    • 3. ఎర్రసముద్రములో

    అనేక వేలమంది చనిపోయిరి దేవునిన్యాయం యేది అని ప్రజలు చెప్పుకొందురు.

    1. శిక్ష:- నరుడు పాపము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించును. 2. నాశనము:- శిక్ష వచ్చినను నరుడు పాపముచేయుట మానకపోతే నాశనము వచ్చును. ఈ రెండు దేవుని పరిపాలనలో ఉన్నవి. శిక్ష వల్ల హానిలేదు. శిక్ష అనునది మనిషిని త్రిప్పుటకు వచ్చునది. దీనినే పుస్తకములలో క్రమశిక్షణ అందురు. ఇది అన్యులకైనా, క్రైస్తవులకైనా శిక్షించి క్రమపరచుటకై ఈ శ్రమలు వచ్చును.

    సొదొమ, గొమెర్రా, జలప్రళయము, ఎర్రసముద్రము ఈ మూడింటిలో నాశనము వచ్చెను. నాశనముయొద్ద దేవుని న్యాయముగూర్చి సందేహము వచ్చును. ఈపై మూడు స్థలములలోని వారిని శిక్షించకపోతే తక్కిన వారికి నాశనము తప్పదు బైబిలులో శిక్షను శిక్షించకపోతే తక్కిన వారికి నాశనము తప్పదు బైబిలులో శిక్షను గురించి అనేక వాక్యములు గలవు 1. శిక్ష వేరు 2. నాశనము వేరు బైబిలులో దేవదూతలకును దయ్యములకును బాబేలువద్ద శిక్ష కలిగినను శిక్ష వల్ల వృద్ధికలిగెను. వారికి శిక్ష రాకపోతే వారు ఇంకను నాశనము లోనికి వెళ్ళిపోదురు. దేవుడు సొదోమవారిని శిక్షించకపోతే వారు చుట్టూన్నవారుకూడా చెడిపోవుదురు.

    1కొరింథి 6:3:-

    మనము దేవదూతలకు తీర్పుతెర్చుదము అని మీరు ఎరుగరా అని ఉన్నది. దూతలు అనగా దయ్యములని అర్ధమిచ్చుచున్నది. మనము దయ్యములకు తీర్పు తీర్చుదము అని ఉన్నది. దేవదూతలకు ఎలాగు తీర్పు తీర్చుదుము వారు మనకంటే పరిశుద్ధులు. యుఫ్రటీసు నదివద్ద కట్టబడిన దయ్యములకు దూతలనుపేరు ఉన్నది. తీర్పుతీర్చుట అనేది చ్ర్డ్డదూతలకే గాని పరిశుద్ధదూతలకు కాదు.

    ఉదాహరణ:-

    ఒక విధ్యార్ధి బి.ఏ. పాస్ అయినాడు ఇంకొక విహ్యార్ధి స్కూల్ ఫినల్ ఫెయిల్ అయినాడు. ఇక్కడ బి. ఎ. అబ్బాయి పాస్ అవడమే రెండాబ్బాయి తీర్పు తెర్చ్గుట అయినది. గనుక వధువు సంఘము దేవదూతలకంటె ఎక్కువ దేవదూతలు వధువునకు పరిచర్య చేయుదురు గనుక వధువు దేవదూతలకు తీర్పుతీర్చ్గుట అని తెలియుచున్నది. అనగా పెండ్లికుమార్తె తన స్థితినిబట్టి తీర్పు తీర్చును.

    శిక్ష, తీర్మానము తండిదేగాని దేవదూతలది కాదు. జడ్జిగారుకూడా తీర్మానము చేయుదురు. ముందు ఏ విషయమునైన పరలోకములో తీర్మానము కావలయును. ఏడుయేండ్ల మహాశ్రమకాలంలో ముద్రల శ్రమ, బూరల శ్రమ. పాత్రలశ్రమ అను ఈ శ్రమలన్నియు తండ్రియొద్ద నుండియే రావలసియున్నది. సర్వాధికారము పరలోకమందున్న దేవునిదే. మనిషి వరుసలో ఉన్నాడు. నరులకు పరలోకములో భూమిమీద అధికారము లేదుగాని తన ప్రవర్తనా శక్తినిబట్టి అధికారము ఇయ్యబడెను. యేసుప్రభువు భూమిమీద మనిషిగా ఉన్నప్పుడు ఆయనకు సర్వాధికారము ఇయ్యబడినది. మనిషిగా ఉండి లోకశక్తులను జయించెను గనుక యేసుప్రభువునకు భూమిమీదను పరలోకములోను సర్వాధికారము ఇయ్యబడెను.

    అంత్యనాశనము త్వరగా వస్తుంది గనుక దేవదూతలైన వారు త్వరత్వరగా వచ్చుచున్నారు భూమిమీద ద్రాక్షగెలలు ఉన్నవి. పరిపక్వమునకు వచ్చిన ఈ పండ్లను దేవదూతలైనవారు కోయవలసి యున్నది. ఆ పండ్లను తొట్టిలో వేయవలెను ఆ తొట్టిని త్రిప్పగా అందులోనుండి రసము వచ్చును ఆ రసమునుండి 100 క్రోసులు ప్రవహించెను. గుర్రములు అందులోనికి దిగగా రక్తముకళ్ళెముల వరకు ప్రవహించును. "నా గిన్నెనిండి పొర్లుచున్నది" ఇది దైవదీవెనల గిన్నె, అగ్న్నె పొర్లుటకంటె తొట్టి పెద్దది ఆతొట్టికి పేరు దేవుని ఉగ్రత. అదివరలో దేవుని ఉగ్రత అనేపాత్ర భూలోకమంద కుమ్మరింబడినది. అట్టి పాత్రలకన్న ఈతొట్టి పెద్దది. అనగా ఆ గుర్రములు తొట్టిలో మునిగిపోవుచుండెను.

    యేసుప్రభువు మొదట తన రక్తమునకు గుర్తుగా గురువారమునాడు ద్రాక్షరసము ఇచ్చెను. ఇది ప్రభువు రాత్రి భోజనములో పుచ్చుకొన్నయెడల జీవము పాపక్షమాపణ కలుగును. ఇది అనేకుల కొరకు చిందించుచున్న రక్షణకొరకైన క్రొత్తనిబంధన రక్తము. యేసుప్రభువు ఇచ్చిన రసమునుబట్టి గిన్నెనిండి పొర్లుచున్నది. యేసుప్రభువు ఇచ్చిన ద్రాక్షరసము పండ్లునుండి తీసినదే అదే రక్షణకొరకు ఇయ్యబడినదిగాని ఇక్కడ మనము చూచే ఈ ద్రాక్షరసము నాశనముకొరకు ఉపయోగింపబడెను. ప్రభువు నా రక్తము అని చెప్పగా వారు నమ్మినారు గనుక రక్షణ పొందినారు. ఏడుయేండ్ల శ్రమలోని వారు ఈ రక్షణ ద్రాక్షరసమును ఒప్పుకొనలేదు గనుక ఆ తొట్టిలోని ద్రాక్షర్సము వలనే వారు నాశనమైరి. వారు అంగీకరించలేదు గనుక శిక్షకు పాత్రులు అయిరి.

    యుతులైనవారు పిలాతు కోర్టులో ఉన్న ప్రభువునుచూచి వానిరక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాక అని ద్వషముతో కోరుకొన్నారు అది శాపము. యూదులైనవారు అరవై లక్షలమంది చంపబడినప్పుడు వారిపై కోరిక నెరవేరెను. వారు హతమార్చినప్పుడు ఎంతరక్తము ప్రవహించెనో ఈ శ్రమలోనిదికూడా ఇటువంతి నాశనమే. ఎక్కువరక్తం ప్రవహించగా ఎక్కువ నాశనము. ఈ రక్తం 100 క్రోసుల దూరము ప్రవహించెను. ఇదే గుర్రము కళ్ళెవరకు మునుగుట. తొట్టి దైవోగ్రత ద్రాక్షరసము నాశనరక్తమునకు గుర్తు. ఎక్కువరక్తం ఎక్కువ నాశనము.

    గుర్రము:- గుర్రము అనగా యుద్ధమునకు గుర్తు. యుద్ధము రానైయున్నది ద్రాక్షారసమున పోలినరక్తం ప్రవహించనైయున్నది. పాత్రలశ్రమల కాలం రాకముందును, బూరలశ్రమల ముగింపునకు ముందు ఈ ఉగ్రత తొట్టి వచ్చియున్నది, పాత్రలకాలంలో ఈ యుద్ధము జరుగును. రక్తము నీరువలె ప్రవహించును. ఇది ప్రవచనమేగాని జరుగవలసి యున్న సూచన. ఏడు పాత్రల శ్రమకాలము అయిన తరువాత హర్మగెద్దోను యుద్ధము జరుగును. దేవుడు కృపగలవాడు కనుక ఈ రీతిగా జరుగునని ప్రవచనముగా ముందుగానే వ్రాసెను. ఇది ఆ ఉగ్రతను తప్పించుకొనుటకు వ్రాయబడిన ప్రవచనము. ఈ 14వ అధ్యాయములోని ఈ తొట్టి పెద్దది రక్త ప్రవాహము పెద్దది. గుఱ్ఱము పెద్దది. కళ్ళెమునకు వచ్చెను కనుక గుర్రము పెద్దది. తొట్టినిబట్టిరక్తం. రక్తమునుబట్టి గుర్రము ఇది అనిగ్రహ్యమగును. ఏడుయేండ్ల శ్రమకాలం అంతా ఒకకాలమనుకొనవలెను నాశనము అనేది ముద్రల కాలములోను బూరల కాలములోను ఉన్నది. పాత్రల కాలమునకూడా నాశనమే.

    20 వచనములో పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను అని ఉన్నది. అనగా కాలమునకు వెలుపల అని అర్ధం. లోకములో పట్టణములు, పల్లెలు ఉన్నవి అంతా కలిపితే పట్టణము. పట్టణమునకు వెలుపల అనగా యెరూషలేమునకు వెలుపల యేసుప్రభువు తనస్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమపడెను. హెబ్రీ 13: 12.

    • 1. కాలమునకు వెలుపల.
    • 2. లోకమునకు వెలుపల.
    • 3. యెరూషలేము పట్టణమునకు వెలుపల.

    ఆ కాలమందున్న దుర్జనులు పట్టణము వెలుపట రక్తం చిందించి నాశనమైరి. యెరూషలేమునకు ఉత్తరముగా వెలుపలగా ఉన్న హర్మగెద్దోను అను స్థలమునందు ఈ నాశనము జరుగును. ఈ స్థలము మనుష్యసంచారము లేనిది. ఇప్పుడుకూడా ఈ స్థలము ఖాళీగా ఉన్నది. దేవుడు ఎవరిని ఈ స్థలములోనికి రానిచ్చుటలేదు.

    ఈ యుద్ధం జరుగు హర్మెగెద్దోను యొద్దకు నాలుగు దిక్కులనుండి చీమలబారులవలె సైన్యమును ప్రోగుచేయుటకై మూడుకప్పలు బైలువెళ్ళెను. వారు దేవునితో యుద్ధమునకు సిద్ధపడుదురు అప్పుడు పరలోకమునుండి జడ్జిమెంట్ దిగివచ్చును. ఇక్కడ ఏడు సంవత్సరముల శ్రమకాలము అంతమగుటకు సమయము సమీపించినది. ఎత్తబడిన పెండ్లికుమార్తె సంఘముతో ఏడుఏండ్ల విందు ముగించుకొని పరలోకపటాలము దిగివచ్చును. సైతాను వాని సైన్యము భూలోకమందు మిగిలిపోయిన భక్తులతో యుద్ధంచేయుటకు సిద్ధపడుదురు.

    యుద్ధము ఎందుకు:-

    విశ్వాసులు దేవుని ప్రజలుగాను మిగిలిపోయిన భక్తులను చంపకుండగా ఒకవేళ ప్రభువువచ్చి అడ్డుపడునేమో చూడవలెనని అంతిక్రీస్తు సైన్యము విశ్వాసులమీద యుద్ధం చేయవచ్చును. విశ్వాసులైనవారు తక్కువమంది యైన తమకు సహాయము పైనుండి వచ్చునని వ్శ్వసించి యుద్ధముచేయ సిద్ధపడుదురు. ఈ విశ్వాసులు ఏడుఏండ్ల శ్రమకాలంలో దేవుని కార్యక్రమము ఏమిటో అని తెలిసికొనుటకు ప్రకటన గ్రంధమును చదువుదురు. నేటి దినములయందు ప్రకటన గ్రంధము చదివినందువల్ల మనకు ఏరీతిగా ముద్ర, బూర, పాత్రల శ్రమలు తెలియనగునో అలాగే వారికికూడా తెలియబడును. అందునుబట్టి సైతానుసైన్యముపై యుద్ధం చేయబూనెదరు.

    జెకర్య 8వ అధ్యాయములో ఘోరయుద్ధము జరగనై యున్నది. అని ఉన్నది. విశ్వాసులను రక్షించుటకు రక్షకుడు పరలోకమునుండి దిగివచ్చును. అప్పుడు యెరూషలేము యొద్దనున్న కొండలు పగులును. విశ్వాసులైనవరు కొండలలోనికి పారిపోవుదురు. అప్పుడు అవిశ్వాసులసైన్యము అంతయు ఆమహా ఉగ్రతతొట్టిలోవేయబడి తొక్కబడుదురు. సెతాను మట్టులేగొయ్యిలో వెయ్యేండ్లు బంధింపబడును. అప్పుడు హర్మగెద్దోను యుద్ధం ఆగిపోవును. అంతిక్రీస్తును అబద్ధ ప్రవక్తను దయ్యములను నరకములో వేయబడుదురు. హర్మగెద్దోను యొద్దకు వచ్చిన పటాలము నాశనము అగునుకాని మిగిలినవారు వెయ్యేండ్ల పాలనలోనికి ప్రవేశించెదరు. ముసలివారు యౌవ్వనులవలె ఉందురు వారు వందలాది ఏండ్లు బ్రతుకుదురు మరణములు అరుదు. నీతిరాజు పాలనలో వారు సుఖముగా ఉందురు.

    Home