మోషే సుఖోపవాస ధ్యానములు

theme: ఉనికిపట్టు

పరిచయ వాక్యధ్యానము: ఆదికాండము 15వ అద్యాయము

1 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

July 1 మోషే సుఖోపదేశ ధ్యానమాలిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అబ్రహామునకు అనుక్షణం దేవుని మాట వినే అలవాటు - ఆది 22:11
ఇస్సాకునకు ఇష్టము వచ్చినపుడు దేవుని సన్నిధికి చేరే ఆనవాయితీ - ఆది 24:63
యాకోబునకు యాతన వచ్చినపుడు దేవుని పట్టుకొనే పట్టుదల - ఆది 32:26

అందుకే దేవుడు తరతరాల భవిష్యత్తును అబ్రహామునకు చెప్పి విశ్వాసులకు తండ్రిగా నియమించినారు. ఈ ప్రపంచములు అబ్రహాము విశ్వాసము ద్వారా గర్బము ధరించి కనబడినవి. Jocob's ladder


ప్రార్థన: దేవా! మీ సర్వశక్తి సర్వవ్యాప్తియై ఉన్నది గనుక వందనములు. మా పరిస్థితుల అవసరాలను బట్టి, మీ ప్రణాలికను బట్టియు మేము ఈ లోకములో బంధింపబడినను మీ రక్షణ ద్వారా మాకు గొప్ప విడుదల కలుగజేసిన తండ్రీ మీకు స్తోత్రములు. మా బంధకములలో మీ విడుదల ఉనికిని మేము గ్రహించు శక్తిని మాకు ఈ ధ్యానములలో కలుగజేయుమని; మాకు సిద్ధపర్చిన వాటిని అందుకొనుటకు తగిన మారుమనస్సును, రూపాంతరము కలుగజేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


ఆదికాండము 15వ అద్యాయములో దేవుడు మోషే ద్వారా జరిగింపబోవు మహాత్కార్యములను వివరిస్తున్నపుడు అబ్రాము అప్పటికింకా అబ్రహాముగా మారలేదు; ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే ఎవ్వరూ లేరు. అయినను అబ్రహాములో విశ్వాసము గర్బము(జీవము) ధరించినది. దేవుడు అన్ని మార్గములను తెరిచి విజయము మీద విజయములను అబ్రహామునకు అందించెను. ఆదాము వలన భూలోకమంతా శపింపబడినను, "నీవు అడుగుపెట్టు స్థలమెల్ల ఆశీర్వదింపబడును" అను వాగ్ధానమును అబ్రహామునకు దేవుడు దయచేసి భూలోకమంతా అబ్రహాము సంతానమును సంచరింపజేసి అందరిని ఆశీర్వదించెను.

ఇస్సాకునకు కొన్ని మార్గములను తెరిచి కొంత పరిధిలో స్వాతంత్యమును విజయమును అనుగ్రహింపబడినవి. యాకోబునకు అన్ని మార్గములను మూసివేసి ఏకైక మార్గము(నిచ్చెన) ద్వారా నడిపించెను. దేవుడు ఏర్పాటుచేసిన ఒక్క మార్గములో తప్ప మరి ఏ మార్గములోను విజయములేదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏకైక ఇరుకు నిచ్చెన మార్గమే. పభువైన యేసుక్రీస్తు మార్గమును హత్తుకొని మిగిలిన ఉరులు(దారులన్నీ) మర్చిపోయి హాయిగా ఉండవలెను.

దైవసన్నిధి ఉనికిపట్టు: మధురమైన తేనె తయారుకు తేనెపట్టులా, దైవకార్యములకు ఉనికిపట్టు దైవ సన్నిధి. తరతరాల జనాంగములను మోయుటకు అబ్రహాము దైవ సన్నిధిలో జీవము పోసుకోవడమే దైవ ఉనికిపట్టు ( ఇంక్యుబెటర్‌గా/అల్లాడుట/పొదుగు) . ఉదా: సౌర కుటుంబము జీవరాసుల మనుగడకు ఉనికిపట్టు. నిర్గమకాండమునకు ఉనికిపట్టు హోరేబు/సీయోను కొండ (అనగా హెబ్రీయుల విడుదల ప్రణాళిక దేవుడు హోరేబు కొండలో ప్రత్యక్షపరిచెను).


ఇశ్రాయేలీయుల మనుగడకు దైవ వాగ్ధానమే ఉనికిపట్టు. సమస్త దేశములకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల రాజ్యాంగమే ప్రశాంతమైన జీవితమునకు ఆయువు పట్టు.

సంఘములకు, విశ్వాసికి, మారుమనసుకు ప్రామాణికము 10 ఆజ్ఞలు. అపాయ కాలమందు 10 ఆజ్ఞలను బట్టి మారుమనసు పొందిన యెడల ఎట్టి ఆపదయైనను తొలగిపోవును. కోల్పోయినవన్నీ తిరిగి అనుగ్రహింపబడును. ప్రజలు చేయవలసిన, చేయకూడని పనులు 10 ఆజ్ఞలలో ఉన్నవి. వీటిని పాటించుట జీవము; పాటించలేనియెడల లేమి, మరణములు వెంటాడునని బైబిలు బైలుపరుచుచున్నది.


నాశనకరమైన ఈ తరములోనుండి తప్పించుకొనుటకు నిర్గమకాండమును ధ్యానించి జీవ ఉనికిని వెదికి, అక్కడ నివాసము చేయు కృప విశ్వాసులందరికి దేవుడు దయచేయును గాక!

ఈ రాకడ సమయములో విశ్వాసి ఉనికిపట్టులను గూర్చి ధ్యానించవలసిన అవసరములు:

 • విశ్వాసిలో ఆత్మతీవ్రత తగ్గుదల, కొన్ని క్రైస్తవ శాఖలలో యేసుక్రీస్తు పేరువిన్నపుడు కలుగుచున్న అసహనముల కారణముగా సీయోను కుమార్తె బంధకములలోనికి పంపబడుచున్నది కావున సువార్త పరిమళము వెదజల్లు సీయోను; దైవ సన్నిధిలో దైవ ఉనికిని కలిగి ఉండుటకు ఈ ధ్యానము అవసరమై ఉన్నది.
  Ref: హబక్కూకు 1:6 - ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను.
  యెషయా 35:7 ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

 • అంత్యక్రీస్తు సమూహముయొక్క ఉనికిపట్టు గర్బము ధరించినది. దాని క్రియలు కూలిపోవునని దైవగ్రంధమునందు ఉన్నది. ఆ ఉనికిపట్టులో మనము పాలిభాగస్థులము కాకుండునిమిత్తము దైవసన్నిధికి చేరవలెను.
  Ref: ప్రకటన గ్రంథం 18:2 అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెనుమహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికిని ఉనికిపట్టు ఆయెను.

 • చిమ్మచీకటి కమ్ముకొనిన అంధకార ఉనికిపట్టులో వెలుగును ప్రసరింపజేయుటకు.
  Ref: 38:19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?

జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

సత్యము, ప్రేమ, జీవముల ఉనికిపట్టు ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము, శాంతి, సమాధానములుండును.


Please click on specific date. Ex July 10, click on 10. Aug 1, click on 32.
1 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

 • Like this page on Facebook

 • Tweet this page on Twitter

 • Recommend this website on Google +