నిర్గమకాండము 9 - దేవుని దయ - ఫరో పతనము


ప్రార్థన: సమస్తమును మీ స్వాధీనములో ఉంచి పరిపాలించుచున్న దేవా! మేము మీ ప్రణాళికను వెంటనే అర్థం చేసుకొను దీనమైన సాత్విక హృదయమును దయచేయుము. మీ సన్నిధిలొ కఠినమనసుతో ఉండకుండు జాగ్రత్తను మాకు దయచేయుమని యేసు నామమునుబట్టి వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ఐగుప్తు దేశమును, ఫరోను, దేశప్రజలను దేవుడు ప్రేమించెను. ఐగుప్తు ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో దేవతలను ఆరాధించువారు. సమస్త దేవతలకంటే పైనున్న దేవుడు యేహోవా అని ఫరో పితరులకు తెలుసు కాని ఫరో మాయా భక్తిలో దేవుని వెదికి చివరకు ఆయా జంతు రూపములు శక్తిమంతులు అని తీర్మాంచెను. అయితే దేవుడు ఫరోను దయతో సముదాయించుచుండెను. సమస్త దేశములకంటే అప్పటి ఐగుప్తు ఉన్నతమైనదని, దానికి కారణం ఆయా దేవతలని ప్రపంచములో అందరి నమ్మకము. ఐగుప్తు ఆశీర్వాదమునకు కారణము ఇశ్రాయేలు చిన్నకుమారుడైన యోసేపు అని అందరు మర్చిపోయారు. కాని ఆ దేవుని ఆశీర్వాదము పెరిగి పెద్దదై ఇశ్రాయేలు అను దేశమై ఐగుప్తు దేశముకంటె సంపన్నమై గోషానులో ఉన్నది.

నిర్గమ 9:1 - "నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము" అని దేవుడు చెప్పిన మాట ఫరోకు బహు రౌద్రము రేపు మాట. ప్రపంచములోకెల్ల వింతైన కట్తడములు కట్టుచు దేశప్రఖ్యాతిని పెంచుతున్న ఇశ్రాయేలు ప్రజలు నా బానిసలు అని ఫరో వారిని పట్టుకొనెను. తన్ను మాత్రమే సేవించాలి అనుకొంటున్న ఫరోకు; ఇశ్రాయేలు 1. నా ప్రజలు అని ప్రభువు చెప్పుట 2. నన్ను సేవించుటకు అని నొక్కివక్కాణించుట ఫరోకు చాలా పెద్ద విషయము. నేను నా ప్రజలకు చేయు మేలు చూడుము, నీ ప్రజలకు వచ్చు ఏ తెగులైనను నా ప్రజలకు రానియ్యను అని ఫరోను హెచ్చరించెను. ఇంత గొప్ప కార్యములు చేయుచున్న ఈ దేవుడు ఎవరై ఉండునో అనే అన్వేషణ ఫరో అంతరంగములో ఉన్నది కావున దేవుని ఉనికి అనుభవములోనికి వచ్చువరకు ఫరో హృదయము కఠినపర్చబడెను(ఐగుప్తు వైభోగమునకు నిజమైన కారణమును ప్రపంచము గుర్తించువరకు).

సత్యమును వెలుగులోనికి తీసుకొని వచ్చుట బైబిలు పని. పాతనిబంధన లా ఆఫ్ ఫ్లెష్(శరీసానుసారమైన ధర్మము) కావున సత్యము శరీర క్రియలద్వారా ప్రత్యక్షపరచబడెను. క్రొత్తనిబంధన లా ఆఫ్ స్పిరిట్(ఆత్మానుసారమైన ధర్మము, మనసులో అనుకొని చేయనిశ్చయించుకొనుట) కావున కృపతో సత్యము బైలుపరచబడును. శరీరానుసారమైన శిక్ష పెద్ద భారమైనది కావున దేవుడు ఐగుప్తును ప్రేమించి నెమ్మదిగా బోధించుచు పశ్చత్తాపము వైపు నడిపించెను.

శరీరానుసారులకున్న పెద్ద ప్రోబ్లం ఏదనగా వారు సూచకక్రియ జరిగితే తప్ప దేనిని నమ్మరు. ఆత్మలో అర్థము చేసుకొను మనసు వారికి లేదు; అందుచేత దేవుడు తన శక్తిని చూపుట తప్పలేదు(ఆ శక్తిని చూచి అనేకులు ఫరోను వదిలి మోషేను ఆరాధించసాగిరి). ఈ సూచకక్రియలు కేవలము ఐగుప్తు ప్రజలకొరకు మాత్రమే కాదని, సర్వ జనులు సత్యము తెలుసుకొనుటకు ఇవి జరిగెనని తర్వాత అద్యాయములలో గ్రహింపగలము. మళ్ళీ ఐగుప్తును లేవనెత్తుట దేవునికి చాలా చిన్న విషయము.

1. రాజయోగమును అనుగ్రహించు సర్పదేవత(ఐగుప్తు నమ్మకము ప్రకారము) మ్రింగివేయబడినది. సంతానాభివృద్ధి కప్పదేవత చనిపోయినది. అయితే ఐగుప్తు ప్రజలందరి దేవత అయిన పశుదేవత(హాతోర్ - దూడ ముఖము, మనిషికి ఆయా జంతుముఖమును పెట్టుదురు) అన్నిదేవతలకు తల్లిగా బావించుదురు. ఇశ్రాయేలీయులకు పశుసంపద ఎక్కువ కావున హాతోర్ అనగానే వారు కూడ మ్రొక్కుదురు. ఇక్కడనుండి జరుగు సూచక క్రియలు ఇశ్రాయేలీయులు అనుసరించకూడనివి కావున దేవుడు వారిని వేరుపరిచెను. మనలను రక్షించునది దేవుడు మాత్రమే అని గ్రహించు నిమిత్తము పశువులను హాతోర్ కూడ రక్షించలేదు అను సత్యమును దేవుడు వారికి బోధించెను.

ఫరోకు యెహోవా మీద గట్టినమ్మకము ఏర్పడినది. దైవ ఉనికి ఐగుప్తును తాకినది. ఇశ్రాయేలు పశువులు రక్షింపబడినవి అని ఫరో వాకబు చేసి తెలిసుకొనెను.

2. ఐగుప్తీయులకు తమ దేవతా స్వరూపులు ఎన్నిపోయిన దిగులు లేదు. ఎందుకనగా శకునగాండ్రు మరల వాటిని పుట్టించి ఐగుప్తు మూఢ భక్తికి మూలపురుషులైరి. ఆవపుపిండి నేరుగా శకునగాండ్రను గురిపెట్టినది. దేవతలను పోయు శకునగాండ్రు నిలువలేకపోయిరి. క్రొత్తనిబంధనలో జీవించుచున్న మనము శరీరాశల కొరకు పరుగెత్తక, దేవుడు ప్రత్యక్షమైనపుడు సిగ్గుపడకుండు నిమిత్తము గారడీలుచేయు యాజకులకు దూరముగా ఉండుట మంచిది.

3. దేవుని శిక్ష నీటిని, నేలను, గాలిని, మనిషిని తాకిన తర్వాత మేఘమును, సూర్యుని తాకెను. ఇశ్రాయేలీయులు వీటిని ప్రాక్టీస్ చేయకూడదని ఈ విధముగా సత్యమును దాచు దైవమహిమ కబ్జాదారులనందరిని దేవుడు కొట్టివేసెను. అయితే ఐగుప్తులో అనేక ప్రజలు దేవుని శక్తిని గ్రహించి జాగ్రత్తపడిరి. దేవుని సైన్య సమూహముల ఉనికి ఐగుప్తు అంతటా ఉండెను.

మనము సర్వోన్నతుడైన దేవుని సొత్తు; ఈ లోకమునకు బానిసలము కాము అను సత్యమును గ్రహించి దేవుని లోబడి రక్షింపబడు కృప దేవుడు అందరికిని దయచేయును గాక! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 9 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +