నిర్గమకాండము 7 - ఐగుప్తుకు దేవుడు ఫరో - ఫరోకు దేవుడు మోషే


ప్రార్థన: సర్వశక్తివైయున్న దేవా! మీకు స్తోత్రములు. మీ అనాది సంకల్పములో మా రక్షణ ప్రణాళికను సిద్ధము చేసిన దేవా! మీకు వందనములు. మీరు మాకు అప్పగించే గొప్పక్రియలను బట్టి మా హోదాను పెంచుచున్న దేవా! మీకు వందనములు. మీరిచ్చు అధికారము మీ రాకడలో ఎత్తబడుటకు అడ్డంకిగా మారకుండు హృదయమును మాకు దయచేయుమని, మీరు మాకిచ్చు ప్రతీ ఈవిని మీ దైవశక్తితో మీ కాలానుసారముగా ఉపయోగించు ఆత్మను మాకు దయచేయుమని అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

దైవజనులు రెండురకములు; 1. దైవశక్తి జ్ఞానులు(power sense) 2. దైవకాల జ్ఞానులు(time sense). దైవశక్తి జ్ఞానులు(ఉదా:మోషే, ఏలియా) దైవ కార్యములు అనుభవములోనికి వచ్చిన తర్వాత దైవకాలమును గూర్చి గ్రహించుదురు. దైవకాలజ్ఞాన భక్తులు(ఉదా:దానియేలు) కాలమాన ప్రకారము దైవశక్తిని చూచి ఆ దైవశక్తిని గ్రహించెదరు. దైవశక్తి జ్ఞానియైన మోషే దేవుని సర్వశక్తిని సంపూర్ణముగా ఎరిగినవాడు గనుక దేవుని మాట సెలవిస్తే వెనువెంటనే అన్నీ జరిగిపోవాలి(కొడితే ఎర్రసముద్రము పాయలైపోవాలంతే) అనే నైజము కలిగి ఉండును. త్వరలో జరగనైయున్న దైవకాల పట్టిక ఇంకను మోషే గ్రహింపులోని రాలేదు.

దైవశక్తిని ఎరిగిన దైవజనుడు దైవకాలమును గ్రహించి అనుసరించినయెడల ఆయన ప్రవక్త అగును. దైవకాలజ్ఞానము ఎంత దీర్ఘకాలమైతే అంత పెద్ద ప్రవక్త అన్నమాట. మోషే దేవుని ఘనకార్యములు చేయువాడు మాత్రమే కాక తాను విడిపించిన జనాంగముయొక్క భవిష్యత్తు రాకడమేఘము ఎక్కువరకు దైవకాల జ్ఞానమును తర్వాత అనుభవములోనికి తెచ్చును కావున మోషేను ఫరోకు దేవునిగా అభిషేకించెను. ఐగుప్తునకు దేవుడు ఫరో, ఫరోకు దీటుగా మోషేను హెచ్చించెను.

దేవుని టైంలైన్ ప్రకారము మోషే ప్రభువు ఆజ్ఞాపించిన ఏ సూచకక్రియ ఫరో యెదుట చేయలేదు, జ్యేష్ఠకుమారుడైన ఇశ్రాయేలును విడుదల చేయకపోతే ఐగుప్తు జ్యేష్ఠకుమారుల విషయము ఫరోతో మాట్లాడలేదు కాని "దేవుని పేరిట ప్రకటిస్తే ఫరో పంపించడా?" అను బాధ మోషేలో రగులుచుండెను. తన్నుతాను దేవునిగా బావించుచున్న ఫరోకు (కఠినత్వము అనే తెర తొలగక) నిజదేవుని ఉనికి ఇంకను బయలుపడలేదు కాబట్టి కఠిన నిర్ణయములు తీసుకొనుచుండెను.

ఈ ప్రపంచములో దైవ సంభూతులుగా పిలువబడుచున్న రాజులకు గల పెద్ద ప్రోబ్లం ఏదనగా తాను అణచివేయుప్రజల పక్షమున దేవుడు పనిచేయును. ఐగుప్తు బానిసల పక్షమున దేవుడు పనిచేయుట ప్రారంభించెను. ఫరోను మోషేతో నిమగ్నము(engage) చేయుటకు మొదట మానవులు చేయు మహిమలతో దేవుడు తన అధ్బుతములు మొదలుపెట్టెను. అయితే ఫరో మోషే చేసిన దానిని మనసున పెట్టలేదు. మొదట మోషేను నిర్లక్ష్యము చేసిన యెడల మోషేకు అపజయము. ఇప్పుడు దేవుడు పని మొదలుపెట్టిన తర్వాత ఇక రాజుకు సమస్యలను కోరితెచ్చుకొనుట తప్ప మరొక మార్గము లేకపోయెను.

దేవునికే జయము. అహంకారులకు అపజయము.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 8 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +