నిర్గమకాండము 5 - సమర్పణ - శ్రమ - విజయము


మోషే సుఖోపదేశ ధ్యానమాలిక ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: దయగల దేవా! ఈ లోకమునకు దాసులమైన మమ్మును రక్షించి మీయొక్క సంఘములో నాటిన ప్రభువా! మీకు వందనములు. మీయందు మాకు కలుగు శ్రమలు గొప్ప విడుదలకు సంకేతములని ఆనందించు కృపను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

1. మోషే అహరోనుల సమర్పణ

దేవుడు చెప్పిన మాటలు, సూచకక్రియలు చూచి తలవంచి దేవునికి ఇశ్రాయేలీయులు నమస్కారము చేసిరి. మోషేకు అడ్డంకిగానున్న "ఆ ప్రజలు తన్ను అంగీకరించరు" అనే ఒకేఒక్క కారణము పటాపంచలై దేవుని కార్యము సఫలమువబోవుచున్నదని పూర్తిగా నమ్మిరి. మోషే అహరోనుల సమర్పణ ఫరోయందు భయము కంటే పెద్దదై ఫరోను ఎదుర్కొను ధైర్యము కలిగించెను. ఆ సమయములో దేవుడు ఫరో యెదుట చేయమన్న సూచక క్రియలు గుర్తు రాలేదు కాని విషయము స్పష్టముగా ఫరోకు చెప్పగలిగిరి. వారు చెప్పిన విషయమునకు రాజైన ఫరోదేవుడు(ఐగుప్తీయులు ఫరోను దేవునిగా కొలిచెడివారు) పెద్దపెద్ద నిర్ణయములు తీసుకొనేటంతగా వారి వాణి పలికినది. మోషే సమర్పణ రాజు నిర్ణయములను ప్రభావితము చేయగలిగిన బలముకలదై ఐగుప్తులో గొప్ప కదలికను తీసుకొనివచ్చెను.

ఫరో తన రాజనైజమునుబట్టి, వృత్తి ధర్మమునుబట్టి స్పందించెను గాని ఇది దైవ ప్రణాళిక అను స్పృహ ఇంకను రాకపోవుటచేత ఇశ్రాయేలీయులను ఇంకను భాధించెను. రాజు నిర్ణయము దైవప్రజలకు ప్రతికూలమైనప్పటికి, ఐగుప్తు అధికారులు మరియు ప్రజల కదలికలు బానిసల చుట్టుతిరుగుటకు రాజాజ్ఞ నాందిపలికినది. ఇది ఫరో తానువేసుకున్న మొదటి సెల్ఫ్‌గోల్.

2. ఇశ్రాయేలీయుల శ్రమ

ఇశ్రాయేలీయుల నాయకులు తమ ప్రజలు గొప్ప దురవస్థలో పడిఉన్నట్లు తెలిసికొన్నారు. ఇది గొప్ప వెలిగింపు. బానిసలు తమ దురవస్థను గుర్తించుట మార్పుకు మొదటిమెట్టు. మనిషి పాపబంధకములలో ఉన్నట్లు తెలుసుకుంటే ప్రభువు కృపవలన విడుదల సమీపించెనని గుర్తించవచ్చు.

80 సంవత్సరాలనుండి బాధింపబడుచు, అడపా దడపా ఒకరిద్దరుతప్ప 40సం.రాల లోపు వయసున్న ఒక జనెరేషన్ మొత్తం లేని జనాంగమైన ఇశ్రాయేలీయులలో అధికశాతం ముసలివారే కాని వారు చేయువెట్టిపనినిబట్టి మోషే వలే బలముకలిగి ఉండిరి. గడ్డి ఏకమొత్తములో దొరుకును కాని కొయ్యకాలు కూర్చుట కోతపనితో సమానము. ఐగుప్తు మొత్తం తిరిగినా వారికి తగినంత దొరుకుట అసాధ్యము. అయినను కష్టపడుట వల్ల వారికి ఆ దురవస్థలో వున్నట్లు మేలుకొనిరి.

3. మోషేకు ఫరోపై దేవుడిచ్చిన మొదటి విజయము

మనిషి దృక్కోణము(వ్యూ) వేరు, దేవుని దృక్కోణము వేరు. మోషే అహరోను, నాయకులు దురవస్థను చూచిరి. దేవుడు మోషే విజయమును చూచుచుండెను. మచ్చుకి కొన్ని విజయములు
1. మోషే అహరోనులు ఫరోను ఎదుర్కొనుట
2. ఫరో మోషే మాటను నిర్లక్ష్యపెట్టక విపరీతముగా స్పందించుట
3. పెద్దలు ఫరోను ఎదుర్కొనుట
4. ఐగుప్తు ప్రజలు, నాయకులు మొత్తం ఇశ్రాయేలీయులను కాయుటకు వారి చుట్టు తిరుగుట.
5. ఇశ్రాయేలీయులు తాము ఘోర దురవస్థలో ఉన్నమని గుర్తించుట
6. ఇశ్రాయేలీయులు ఐగుప్తు మొత్తం కలియ తిరుగుట
7. గడ్డికి బదులు కొయ్యకాలు ఉపయోగించి నిరుపయోగమైనదానినుండి ఉత్పత్తి పెంచుట
8. ముఖ్యంగా ముడిసరుకు తామే సమకూర్చుకొని మొత్తం ఉత్పత్తి సప్లై చెయిన్ తామే స్వంతం చేసుకొనుట
9. ఐగుప్తీయులపై ఆధారపడుట(ముడి సరుకు కొరకు) అనే బానిసత్వకాడిని విరుగగొట్టి శ్రమయైనను స్వతంత్రంగా సమకూర్చుకొనుటను నేర్పించుట గొప్ప విజయము
10. ఒక దేశమును కనుటకు ఒకే ప్రయత్నము చాలదని, ప్రభువు ప్రణాళికకు ఇది మొదటి మెట్టు మాత్రమేయని, మరలా మనము ప్రభువు చిత్తమను ఆశ్రయించ తధ్యమని మోషే గుర్తించుట.


ప్రభువు మనకు తోడై ఉన్నపుడు మనకు కలిగే శ్రమల లోతు పరిమాణము మనము పొందబోవు మహిమ ఎత్తుకు పునాది అని సంతోషించు హృదయమును దేవుడు మనకందరికి దయచేయును గాక! ఆమేన్.


రాకడ విశ్వాసి అనుభవము - 2 కొరింథీ 12:10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 5 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +