నిర్గమకాండము 38 - ప్రత్యక్షగుడార ఆవరణము


మోషే సుఖోపదేశ ధ్యానమాలిక ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: సర్వజ్ఞానియైన దేవా! సమస్తమును ఎరిగిన ప్రభువా! మీకు వందనములు. మేము చేయు పనులు మీకు అంగీకారమగునట్లు మాకు మీ జ్ఞానమును దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

ఈ అద్యాయములో మందిర ఆవరణము(court), అందులోగల ఉపకరణముల పనులు వివరించబడినవి.

నిర్గమ 39:42. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి.
43. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.

అయితే ఇక్కడ దేవుడు చెప్పని పని ఒకటి కనబడుచున్నది. నిర్గమ 38:8. అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన "సేవకురాండ్ర అద్దములతో" ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను.

1. సేవకురాండ్రు సహితము దేవుని పనిలో నిమగ్నమగుట 2. ఇత్తడి అద్దములను తయారు చేసి తీసుకొనివచ్చుట. ఆ దినములలో మెటల్ ను అద్దముగా చేయుట అన్నిటికంటే శ్రేష్టమైన మెటల్ వర్క్. ఇది బెసలేలుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానాత్మ వలన ఇతరులకు నేర్పిన పనితనముయొక్క ప్రతిఫలము. దేవుడు ఈ పనిని అంగీకరించుట ద్వారా మోషే ఈ పనిని కూడ దీవించెను.

నేను పనులు చెప్పిన వారికి - నేను సొమ్ము యిచ్చెదను = నేను చెప్పని పనులు నావి - యైనను చేసిన క్షమియించెదను || మనో ||


1 కోరింథీ 13:12 ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.

యాజకులైనను, ప్రత్యక్షగుడారమైనను, జీవితమైనను, సంఘమైనను దైవాత్మకు ప్రతిబింభములుగా ఉండుటకు, ఇహలోకములో మన శరీరము తాత్కాలికమని ప్రతీకాత్మకంగా(సింబాలిక్) ఉండుటకు దేవుడు స్త్రీలకు ఈ అద్దములను చేయు నేర్పును దయచేసెను. అద్దములు ఆవరణమునకు ఎక్కువ సొగసును తెచ్చును. మందిరమునకు వెలుపల ఆవరణములో తాను చెప్పిన పనులకు కొంత హంగులకు దేవుడు అవకాశమిచ్చినను, మందిరము లోపల వీటికి అవకాశములేదు.

దైవప్రజల లెఖ్ఖింపు ద్వారా వచ్చిన పన్ను వలన దేవునికి మహిమ.
ప్రజలందరు దైవ ప్రజల లెక్కింపులోనికి(ఒక రకముగా భాప్తీస్మము) వచ్చుట దేవునికి మహిమ; మోషే నాయకత్వమునకు విజయము.
దైవప్రజల జనాభా లెక్కవలన వచ్చిన మొత్తము ఈ దినములలో 16 కోట్లు.

లెక్కకుమించిన - మ్రొక్కుబడుల సరుకు ఇక్కడకే వచ్చు తెలుసునా
మొక్కుబళ్ళసొమ్ము - ఒక్కదేవుని సేవ- కుపయొగపడునని తెలుసునా
అక్కరతీరును తెలుసునా - లెక్కవలన మహిమ తెలుసునా

గుడార నిర్మాణము కొరకు వాడబడిన విలువైన అర్పణలు, సుమారు ప్రస్తుత విలువ:
బంగారము 1250 కిలోలు = రూ. 500 కోట్లు
వెండి 4250 కిలోలు = రూ. 20 కోట్లు
ఇత్తడి 4000 కిలోలు = రూ. 16 లక్షలు

దీనినే సమృద్ధి అందురు. దేవుడు మన జీవితములో అవసరమైన వాటినన్నిటిని సమృద్ధిగా దయచేయును గాక!

Note: అయ్యగారు మందిరమును, ఆవరణమును కలపక వేరుపర్చిరి. మందిరములో కేవలము దైవారాధన, స్తుతులు, ప్రార్థనలు, సంఘకార్యక్రమములు జరుగును. ఆవరణము అనగా స్వస్థత శాలలు, సభలు, కూడికలు మొదలగు వాటికి ఆదివారముకాక వేరే దినములను కేటాయించిరి. అయితే వీటికి కూడ పరిది(తెర) ఉన్నది. విషయములు అభయాని, దైవిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఉపవాసప్రార్థనా ప్రకరణము అను పుస్తకములలో చూడగలము.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 38 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter