నిర్గమకాండము 36 - గుడార తెరలు సామాగ్రి నిర్మాణము


మోషే సుఖోపదేశ ధ్యానమాలిక ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: ప్రభువా మీ చిత్తప్రకారము నడుచు కృపను దయచేయుము. మీ ప్రణాలికలో ఉన్నది మాత్రమే చేయగల శక్తిని మాకు ప్రసాదించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

దేవుడు సృష్టించి ఇచ్చిన ప్రత్యక్షగుడార మందిరము యొక్క నిర్మాణము ప్రారంభమైనది. దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే జరుగుచున్నది.

ఈ అద్యాయము నుండి జరిగిన దైవసేవ యొక్క సారాంశము "మంచిది" అను పదములో ఇమిడియున్నది. ఇక్కడ "మంచిది" అనగా "అనుగుణ్యత"(conformance) అని అర్థము. సృష్టింపబడిన దానికి అనుగుణంగా నిర్మించుటను దేవుడు "మంచిది"(అనుగుణ్యత కలిగినది) అని చూచెను. God wants everything shall go according to the plan of salvation. "Thy will be done in earth, as it is in heaven" - Matthew 6:10.

ఉదా:
11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను -- సృష్టి.
12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను -- నిర్మాణము (దేవుడు భూమికి దేనిని నిర్మించుటకు సామర్ధ్యమిచ్చెనో, ఎగ్జాట్‌గా దానినే నిర్మించెను).

ఇక్కడ ప్రజ్ఞా వివేకములుగల సేవకులు చేయు పని మంచిదిగా మోషే చూచుచుండెను. అనగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన నమూనా, కొలతల ప్రకారము ప్రతీ పనీ జరుగుచుండెను.
హెబ్రీయులకు 8:5 మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

సృష్టి ఆది నుండి రాకడ వరకు దైవ కార్యములు ఒకదానిలోపల ఒక గొప్ప "మంచి" విషయములు ఇమిడియున్నవి. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్ధానములో మోషే ఉండెను, మోషే తలంపులో దేవుడు పెట్టిన ప్రత్యక్ష గుడారము ఉన్నది; అదే బెసలేలు పనులలో ఉన్నది, పాప పరిహారార్థ బలిలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ, సిలువలో జయము, జయములో పరలోక సింహాసనము ఇమిడియున్నవి. సామ్యం(analogy): ఉల్లిపొరలు. ఇవన్నియు ఒకదానినొకటి రూఢి(conformance) పరుచుచున్నవి.
9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
ప్రకటన 3:21 నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

ఏ మిషను(పని)యైనను దేవుని చిత్తానుసారముగా చేయుట "మంచి"దని పై వాక్యములను బట్టి తెలియుచున్నది. అయ్యగారు దీనిని మిషనుకు మూలవాక్యముగా పెట్టిరి. యోహాను 2:5. ఆయన తల్లి పరిచారకులను చూచి "ఆయన మీతో చెప్పునది చేయుడి" అనెను.

దేవుని చిత్తనుసారముగా పనిచేయుట వలన ఎల్లప్పుడు "సమృద్ధి" కలుగును. మోషే ఇక అర్పణలు ఎవరూ తీసుకొని రావద్దు అని చాటించెను. అర్పణలు అత్యధికముగా వచ్చెను. దైవాత్మ పూర్ణులైన దైవసేవకులను దేవుడు పిలుచుట ద్వారా సమృద్ధి వెలుగులోనికి వచ్చినది.


ప్రభువా! మీరిచ్చిన వాగ్ధానములో నివసించుచు, మీ పనిలో పాలి భాగస్తులమై సమృద్ధితో జీవించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్. మరనాత.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 36 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter