నిర్గమకాండము 35 - గుడారనిర్మాణం - పెరిగిన శ్రద్ధ


మోషే సుఖోపదేశ ధ్యానమాలిక ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: ప్రభువా! మా విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉండుటకు మీ ప్రణాలికలో జీవించు కృపను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

మనఃపూర్వకము: ఈ అద్యాయములో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కువసార్లు వాడబడిన పదము. ఈ పదములో సంతోషము, దుఃఖము; విజయము, ఓటమి కలిసియున్నవి. మన మనసులో చేసుకొన్న తీర్మానమును(మనఃపూర్వకము) బట్టి సుఖదుఃఖములు, గెలుపు ఓటమిలు ఉండును.

మోషే మరలా ఆజ్ఞలను తెలియజేయగా ప్రజలు విని, విశ్వసించి, ఆజ్ఞకు విధేయులగుటకు తీర్మానించిరి. ఇప్పుడు దేవుని మాట వినుట వారికి మనఃపూర్వకము. అంతకు ముందు దూడను చేయుటకు ఇచ్చిన విలువైన బంగారము వారికి ఓటమిని, విచారమును కలుగజేసెను. ఇప్పుడు ప్రత్యక్షగుడారము కొరకు ప్రజలందరు పాలిభాగస్తులగుట దేవుని ప్రణాలిక కావున వారికి సంతోషము, గొప్ప విజయము. "దేవుని ప్రణాళికను మన ఇష్టముగా స్వీకరించుట" మన మనసునకు ఇంపైనట్లుగా దేవుడు తన స్వరూపమందు మనలను రూపకల్పన చేసెను.

ప్రజలందరు తమకు కలిగిన ప్రశస్తమైన అన్ని వస్తువులను ధారాళముగా సమకూర్చిరి. ఇక్కడ అన్ని ప్రశస్త ఉపకరణముల తయారీతో పాటు వారి భవిష్యత్ పరిశ్రమల ఉత్పత్తికి ఒక సీడ్(విత్తనము - సృష్టి) నమూనా జరుగుచున్నది. ఇది జ్ఞానముతో కూడుకొన్నది. దేవుడు బెసలేలు టీం ను మిగిలిన అందరికి నేర్పుటకు(Repeatability=వారసత్వము) అభిషేకించెను.

దైవలక్షణమునకు ఉన్న గొప్ప లక్షణము వారసత్వము; అనగా ఆయా జ్ఞానము కలిగియున్న ఒకరు సిద్ధబాటు గలవారికి ప్రోక్షించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అన్ని వరములు కలిగిన పరిశుద్ధాత్మను కుమ్మరించి నిత్యజీవమును అనుగ్రహించెను. దీనిని మనఃపూర్వకముగా అంగీకరించవలెను.
లూకా 18:18 ఒక అధికారి ఆయనను చూచిసద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను. అధికారికి ఆశ ఉన్నది కాని మనఃపూర్వకమైనది కాదు.
తీతుకు 3:7 నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.

దేవుడు తన జ్ఞానాత్మను విశ్వాసులపై కుమ్మరించుట వలన ఈ లోకములో ప్రపంచములు కుమారునియందు విశ్వసించిన వారిచే నిర్మింపబడుచుండెను.
హెబ్రీయులకు 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.


దేవునికిచ్చుట అనగా ఆయన ప్రణాళికలో మన భవిష్యత్తుని నిర్మించుకొనుటయే.
దేవుని హృదయానుసారముగా జీవించు కృపను ప్రభువు మనకు దయచేయును గాక! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 35 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter