నిర్గమకాండము 33 - మోషే యొక్క మధ్యవర్తిత్వం


మోషే సుఖోపదేశ ధ్యానమాలిక ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: ప్రభువా! మీకు ఆయాసకరముగా కాక మాయందు మీరు ఆనందించునట్లు జీవించు కృపను మాకు దయచేయుము. మీ సన్నిధి దూతను చూడగల్గు సాన్నిహిత్యమును మాకు అందించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

దేవుని నడిపింపు కొరకు ఇశ్రాయేలీయులు చేసిన స్వంత ప్రయత్నము దేవునికి ఆయాసకరముగా మారిన తర్వాత ఆయనలో వారి పితరులకు ఇచ్చిన వాగ్ధాన నెరవేర్పు భాద్యత తప్ప వారియందు సంతోషములేదు. కావున దేవుడు తన దైవదూతను(ప్రేమాస్వరూప లక్షణమును) మధ్యవర్తిగా నుంచెను. ప్రజలకు దీనుడైన మోషేను మధ్యవర్తిగా నియమించెను.

యెషయా 63:8. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.
9. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

సన్నిధి దూతయైన యేసుక్రీస్తుప్రభువు యొక్క రక్షణ సంకల్పము ఆదినుండి మానవాళిని రక్షించుచుండెను. ప్రభువును చూచిన అన్నియు సరియౌను. ఎంతటి కఠిన సమస్యయైనను దైవ సన్నిధిలో అంశప్రార్థన చేసిన యెడల దేవుడు మార్గమును సరాళము చేయును. విశ్వాసులకొరకు అయ్యగారు సన్నిధి వాగ్ధానము పొందిరి. వివరముకొరకు దైవసాన్నిధ్యమును ధ్యానములో పెట్టవలెను.

దైవసన్నిధి 4 భాగములు:
ఏకాంత సన్నిధి - దేవునితో ముఖాముఖిగా మాట్లాడు మోషే అనుభవము
ధ్యాన సన్నిధి - దైవ సన్నిధిని వదలక ఎల్లప్పుడు గుడారములోనే ఉన్న యవ్వనస్తుడైన యెహోషువ అనుభవము
కూట సన్నిది - దేవునివైపు చేరిన ప్రజలు
ఏడుగురు సన్నిధి కూటము - జ్ఞానాత్మ కలిగి దైవ కార్యములు చేయగల బెసలేలు అనుభవము

1. దేవుని సన్నిధి నరులయొద్ధకు వచ్చుట - ఈ అద్యాయములో దేవుడు అనుగ్రహించిన రక్షణ
2. నరులు దేవుని సన్నిధికి పోవుట - మోషే దైవసన్నిధికి పోవునపుడు ప్రజలు మోషేను చూచిరి; మనము సన్నిధి దూతయైన యేసుక్రీస్తుప్రభువును చూచుచున్నాము.

ప్రతీ విషయము దేవుడు మోషేతో స్పష్టముగా చెప్పెను:
సంఖ్యాకాండము 12: 6. మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు.
7. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.
8. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.

ప్రభువు ఉపమానరీతిగా అనేక విషయములు బోధించెను గాని శిష్యులతో ముఖాముఖిగా మాట్లాడెను:

యోహాను సువార్త 16:25. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.
26. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.
27. మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.
28. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
29. ఆయన శిష్యులుఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.


దేవునితో సమాధానము కలిగి ఆయన సన్నిధిలో ముందుకు సాగు కృపను దేవుడు మనకు దయచేయును గాక! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 33 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter