నిర్గమకాండము 32 - పోతదూడ వలన తీర్పు


మోషే సుఖోపదేశ ధ్యానమాలిక ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: ప్రభువా! మేము మా పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఎల్లప్పుడు మిమ్మును స్తుతించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

దారి తప్పుటకు ముందు దూరదృష్టి నశించును. ప్రజలదృష్టి పరలోక దేవుని చూడక భూలోక దేవతవైపు మరలినది. "ఆ మోషే" పరదేశిగాను, అహరోను స్థానికునిగాను భావించిరి. కాని ఐగుప్తునుండి విడిపించి నడిపించినవాడు మోషే అను ఒక్క నిజమును మాత్రము చెప్పిరి.

దేవుని 10 ఆజ్ఞలు మోషే వివరించిన తర్వాత ప్రజలందరు తలలు వంచి అంగీకరించిన తర్వాతనే మోషే 7వ సారి సీయోను కొండ ఎక్కెను. ప్రజలవద్ద దైవ ఉనికి లేదు గాని దైవ వాక్కులు(ఆజ్ఞలు) ఉన్నవి. అయితే ప్రజలు డైరెక్ట్‌గా మొదటి ఆజ్ఞను అతిక్రమించిరి.

దేవుడు సీయోను కొండమీద చెప్పిన పనులన్నిటికి సిద్ధమనసు ప్రజలవద్ద ఉన్నది కాని భక్తినైజము ముదిరి దూడను పొదిగినది. దైవ చిత్తములోని క్రియలు చేయుటకు దేవుడు కొంతమందికి జ్ఞానాత్మను దయచేసెనని నిన్నటి ధ్యానములో చూసాము. కాని వీరి పని మొదలు కాకముందు ఈ పనికి దైవచిత్తములోలేని అహారోను పనిచేయుటవలన దూడ ఏర్పడినది. సీయోనుకొండపై అహరోనుకు దేవుడు అమర్చిన అంగీ మహిమ వేరు, పాళెములో అహరోను ధరించిన పాత్ర వేరు.

దైవ చిత్తమును అడ్డుకొని దైవకార్యములకు ఉపయోగించవలసిన వనరులను ముందుగా పాడుచేయుట సాతాను పని. విగ్రహారాధన ఏదైనను సరే, చివరికి నాశనమునకు దారితీయును. Trap: "ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు ఇదే" అని పోత దూడను కీర్తించుటనే "మాయాస్వరూపము" అందురు.

నిశ్శబ్దకాలమున నరుడు దేవునియందు నిలకడగా ఉండుటయే నిజమైన దైవభక్తి.


పాపంబు నరులకు - పరమాత్ముని మరుగుచేసెను - అయ్యయ్యో
పాపులందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం ||అనాది||


ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు మోషే మీద కాదు గాని దేవుని మీద అని పరిశుద్ధాత్మకు తెలియును. వారి భావన ఈ విధముగా నున్నది:
యెషయా 63:11. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?
12. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?
13. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి.

ఒకసారి వెలిగింపబడి, యేసుక్రీస్తు ప్రభువునందు సంపూర్ణ విశ్వాసముకలిగి, ఆయన వాక్యము మనలో నివసించుచున్నపుడు, ఎల్లప్పుడును దైవ సన్నిధి మనకు తోడుగా నుండును. సన్నిధి వదిలిన యెడల సందేహములు వచ్చును కావున దేవుడు తన సన్నిధి కాంతిని మనపై ప్రకాశింపజేయును గాక! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 32 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter