వాక్యము: నిర్గమ 3 - హోరేబు పర్వతముపై మోషేకు దేవుని మొదటి ప్రత్యక్షత


 1. మోషే స్థితిగతులు

  మహారాజ్యమునకు అతి సుందరుడైన, సకల విద్యా ప్రవీణుడైన ఒక యువరాజు మిద్యోనులో 40 సంవత్సరములు గొర్రెలు కాయుట మోషే వినయ విధేయతకు బాహ్యరూపము. కనీసము యాకోబులా కొన్నిగొర్రెలు నావి అని కూడ అనకుండా తన మామ గొర్రెలను మేపుచుండెను. తన మామ ఇంటినుండి ఊరి బావి దాటి, అరణ్య మార్గముగుండా హోరేబు కొండ వరకు గొర్రెలను చాలా దూరము మేపుకురావడానికి గల కారణము హోరేబు కొండకు దేవునికొండ అని పేరు. మోషే అనుక్షణం దేవుని వెదుకుచుండెను. (ఇవతలనుండి వెళ్తే అది హోరేబు, గోషానునుండి వస్తే అది సీనాయి(కీర్త 68:8). ఇవతలినుండి అది దేవుని కొండ, అవతలనుండి అది పాపపుకొండ/విడువబడిన).

  40 సంవత్సరములు మోషే ఖాళీగా పడివునట్టు పైకి కనిపిస్తున్నా, అంతరంగమందు మోషే దేవుని ఉనికిని పసిగట్టి ప్రయాణించు విద్యను అభ్యసించెను. దైవసన్నిధిలో కనిపెట్టుపట్టు గలవారు ప్రస్తుతం పనికిరానట్టు పడి ఉన్నను జరుగవలసిన ఘనకార్యములు తప్పక జరుగునని దీనినిబట్టి ఓర్పు కలిగి ప్రభువైన యేసుక్రీస్తును బట్టి విశ్వాస ఉనికిని కొనసాగించు కృప కలుగుచున్నదని గ్రహింపగలము.

 2. అగ్నిజ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షత

  సాదారణముగ గొర్రెలకాపరులు పచ్చని పొదలు వెదుకుచు గొర్రెలను అక్కడ మేపుదురు. మోషేది సుధీర్గ అనుభవము గనుక పచ్చనిపొదమీద దృష్టిపడడం మమూలే గాని ఆ రోజు ఆ పచ్చనిపొదలో ఒక దేవదూత ప్రత్యక్షమాయెను. పొద తన కళ్ళెదుట మండుచుండెను. మోషే తన 40సంవత్సరముల అనుభవ నైజము వల్ల, అరే! పచ్చనిపొద తగలబడి పోవుచున్నదనుకొని చూసాడు; కాని ఆ పొద అగ్నిలో మండుచుండెను గాని కాలిపోలేదు. మోషేకు మొదట దూత ప్రత్యక్షమైనా గాని, ఆ పొద కాలిపోకుండుట ఆశ్చర్యమును కలిగించినది.

  వెంటనే ప్రభువు మోషే మోషే అనిపిలిచెను. మోషే పొదను మరచి ప్రభువు మాటకు వెంటనే లోబడెను. ప్రభువు మోషేను పిలిచిన అర్జెన్సీ(క్లిష్టస్థితి) అటువంటిది. అంతకుముందు అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చుటకు కత్తి పైకెత్తినపుడు అబ్రహామా! అబ్రహామా! అని పిలిచి ఇస్సాకును రక్షించిన దేవుడు(ఆది 22:11), తర్వాత ఇశ్రాయేలుకు చెవులు గింగురుమనిపించే విషయము చెప్పుటకు సమూయేలూ! సమూయేలూ! అని పిలిచిన దేవుడు(1సమూ 3:10), పేతురు తదితరులను సాతానునుండి రక్షించుటకు పేతురూ! పేతురూ! అనిపిలిచిన దేవుడు(లూక 22:31), వాక్యము ఎంత అత్యవసరమో చెప్పుటకు మార్తా! మార్తా! అని పిలిచిన దేవుడు(లూకా 10:41), సౌలును అపొస్తలునిగా పిలుచుటకు సౌలా! సౌలా! అని పిలిచిన దేవుడు(అపొ 9:4) మొట్టమొదటిసారిగా మోషేను పిలిచెను. ఆ క్షణములో ప్రభువు వారిని రక్షించి ఉండకపోతే యావత్ జాతి పెను ప్రమాదములో ఉండెడిది.

  ప్రభువు బహు వేదనతో యెరూషలేమా! యెరూషలేమా! అని పిలుచుచున్నట్లు(మత్తయి 23:37) దైవ సన్నిధి పరిమళమును, దైవప్రేమను పంచుటకును, సంపూర్ణ సువార్తను అందించి ప్రభువును దైవలక్షణములతో ఆరాధించుటకును దేవుడు ఇప్పుడు సంఘమా! సంఘమా! అని బహు ఆత్రముతో పిలుచుచున్నాడేమో గమనించవలసియున్నది.

 3. దేవుడు మోషేతో మాట్లాడుట, మోషే దేవునితో మాట్లడుట

  Sinai
  • దేవుని పిలుపు విన్న మోషేకు అక్కడ ఇక పొదగాని, దూతగాని కనబడలేదు కాని దేవుని సన్నిధే ప్రత్యక్షపరచబడినది.
   దేవుడెవరు? "ఉన్నవాడను, ఉండుననువాడను" అనగా సెల్ఫ్ ఎగ్జిస్టింగ్(ప్రత్యక్ష ఉనికి) అని అర్థము.
  • మోషే తండ్రి అమ్రాము దేవుని ఎరిగినవాడని మోషేకు స్పష్టత ఉన్నది, నోవహు, అబ్రహాము,ఇస్సాకు, యాకోబు, యోసేపులకు దేవుడు చేసిన ఘనకార్యములన్నియు మోషే ఎరిగినవాడై ప్రభువును వెంటనే విశ్వసించెను. మోషేకు ఈ 40ఏండ్లలో నాయకునిగా ముందునడచుచు మందను ఓపికతో కాయు నేర్పును ఒక పరిశుద్ధ నైజముగా అలవాటుచేసెను. మోషే నాయకత్వమును ప్రభువు అభిషేకించెను.
  • సీనాయి పాపపుకొండనుకూడా దేవుని హోరేబు కొండగా మార్చుటకు దేవుడు మోషేను అభిషేకించుటకు దిగివచ్చెను. లోకపాపములను హరించుటకు దేవుడే అభిషక్తుడాయెను. ప్రభువైన యేసుక్రీస్తు సీనాయి లోకమును సీయోను(సువార్త ప్రకటించునది) సంఘము క్రింద ఉంచెను. దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక!
  సారాంశము: ఆనాడు దేవుడు మోషేకు ప్రత్యక్షమైనట్లు నేడును మనతో మాట్లాడును, అన్నియు బోధించును. బైబిలు ఈ పనిని నిరంతరముగా చేయుచున్నది.

  దేవుడు మనందరిని వారి వారి కుటుంబ సంబంధ భాంధవ్యములలో, వృత్తి, ప్రవృత్తులలో, సంఘములో, సమాజములో, దేశములో, ప్రపంచ సంస్థలలో నాయకులుగా అబిషేకించి అశీర్వదించి దీవించునుగాక! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 3 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

 • Like this page on Facebook

 • Tweet this page on Twitter

 • Recommend this website on Google +