నిర్గమకాండము 25 - ప్రత్యక్ష గుడార ప్రణాళిక


మోషే సుఖోపదేశ ధ్యానమాలిక ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: సమస్త సదుపాయములను మాకు దయచేసిన సృష్టికర్తవైన ప్రభువా! మేము ఏ స్థితిలో ఉన్నను మీయందు సంపూర్ణ సమర్పణతో జీవించు కృపను దయచేయుము. పరలోకములో మేము ధనము కూర్చుకొను సూత్రమును మాకు నేర్పుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ఉపోద్ఘాతము

ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటిన తర్వాత రెండు నెలలలో వారి బానిస ముద్ర పటాపంచలైపోయినది. దేవుడు వారిని ఇచ్చువారిగా చేసెను. ఇశ్రాయేలీయులలో ఉన్న గొప్పతనమేదనగా "దేవుడు మనకు తోడు" అనే ఉనికి ఉన్నంతవరకు వారు ఎంతైనా చేయగలరు. నిర్గమ 17:7 మెరీబా యొద్ద వారి సణుగు అంతా దేవుడు నిజముగా మనకు తోడైయున్నాడా!! అనే సందేహమునకు దేవుని సమాధానము: నీరు, ఆహారము, చక్కని మాంసాహార సమృద్ధితో పాటు అమాలేకీయులపై గొప్ప విజయము.

దేవుడు ఇప్పుడు ప్రత్యక్షముగా దర్శనమిచ్చినపుడు వారి బానిసత్వ మనసు పోయి అబ్రహాము సంతాన శౌర్యము వెలుగులోనికి వచ్చెను. ఐగుప్తులో వెట్టిచాకిరి చేసి గట్టి కట్టడములు కట్టిరి. దేవుడు విడుదల చేసిన తర్వాత వారిని దైవ ప్రత్యక్ష గుడారమునకు యజమానులుగా గుర్తించెను.

దేవుడు సమర్పణను అడుగుట

దేవుడు "నాకు" ప్రతిష్టార్పణ తీసుకొని రావలెనని చెప్పెను. "నాకు" అనగా బిగ్గర్ సెన్స్‌లో "మీ కొరకు" అని అర్థము (మీ మద్య నేను నివసించుటకు పరిశుద్ధ స్థలమును సిద్ధపర్చుడి). దేవుని సన్నిధి మనమద్య నుండుట వలన సమస్తమును సమకూడి జరుగును.

సోమరివారి తల సైతాను నివాస గృహము -- యం. దేవదాసు అయ్యగారు

జనులందరికి ఆహార కొరత లేదు, పని ఒత్తిడి లేదు కావున సోమరియై మరలా సాతాను చేతికి చిక్కకుండునట్లు ప్రభువు వారికి ప్రశస్తమైన ప్రత్యక్షపు గుడారపు పనిని దయచేసెను.

మనఃపూర్వక అర్పణ: హేబేలు మొదలుకొని, పేదవిధవరాలి రెండుకాసుల కానుక వరకు దేవుడు కేవలము వారి మనసును మాత్రమే చూసెను. కయీను మొదలు అననీయ,సప్పీరాలు ఎంతో విలువైన అర్పణను అర్పించినను మనఃపూర్వకమైనది కాదు కావున దేవుడు తిరస్కరించెను. దేవుడే మనకొరకు బలియర్పణ ఆయెను. ఆయన ప్రత్యక్షతలో ప్రేమ ఉన్నది. విశ్వాసమునకు కొలమానము మనఃపూర్వక అర్పణ.

ఇక్కడ ఇవ్వబడిన విలువగల వస్తువుల పేర్లను బట్టి ఇశ్రాయేలు బహు సంపన్న దేశమని తెలియుచున్నది. ఆర్ధిక వనరులు పనిచేయుటవలన దేశాభివృద్ధి ఉండును. ఇశ్రాయేలు దేశసంపద దైవపని లోనికి దిగినది. తలాంతులను దాచిపెట్టుట నేరమని ప్రభువే స్వయముగా చెప్పెను (మత్తయి 25:26-30).

ప్రస్తుత నిబంధన మందసమైన బైబిలును దాచిపెట్టక పనిలో పెట్టుటయే "బైబిలుమిషను". బైబిలు ధననిధిలోగల మంచి విషయములు వాడుకలోనికి తెచ్చుటయను మిషను వల్ల పరలోకములో ధనము వృద్ధియగును. "ఇత్తడికి తుప్పు పట్టదు, యేసులో తప్పులేదు" అను అయ్యగారి సూక్తిని బట్టి ఇత్తడికి పైనున్న వెండి, బంగారము వంటి సద్విషయములు మాత్రమే మదికి తెచ్చుకొనుట మంచిది.

పరిశుద్ధ స్థలము

దేవుడు ప్రతీ విషయమును తన నుండే మొదలుపెట్టును. 10 ఆజ్ఞలు దేవునినుండి మొదలై మానవుని దురాశ వరకు చేరినవి. అదేవిధముగా ప్రత్యక్ష గుడారము పనులు దేవుని నివాసమైన అతిపరిశుద్ధ స్థలములోని ఉపకరణములతో మొదలై అన్యులు తిరిగే పాళెము వరకు వెళ్ళినది. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునుండి దిగివచ్చి పాపిని వెదికిపట్టుకొని పరిశుద్ధినిగా మార్చెను.

దేవుని ఆత్మ మన హృదయములో నివసించునట్లు దేవునికి పరిశుద్ధస్థలము మన మదిలో ఉండవలెను, గదిలో ఉండవలెను. ప్రతీ ఇంట్లో సన్నిధిగది(space) ప్రతిష్టించమని అయ్యగారు ఆజ్ఞాపించిరి.


ప్రభువా! మా జీవితములో మీకు అత్యున్నత స్థానమునిచ్చి మీరు మాకు దయచేసిన తలాంతులను విరివిగా వాడి మేము బహుగా ఫలించుటకు మీ కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్. మరనాత.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 25 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter