నిర్గమకాండము 23 - దైవదూత సహాయ వాగ్దానం


ప్రార్థన: దేవా! మీరు మాకు ముందు నడుచుచు మార్గమును సరాళము చేసినను మేము బలహీనులమై మీరు అనుగ్రహించిన శాంతి, సమాధానములను అందుకొనలేకపోవుచున్నాము. ఈ వ్యాక్యధ్యానము ద్వారా మీ నిత్యమైన సమాధానమును, సంపూర్ణ ఆత్మ స్వస్థతను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

పరిచయము

శరీర నేత్రాలకు భూలోకం కనబడుతుంది, మనోనేత్రాలకు పరలోకం కనబడుతుంది -- యం.దేవదాసు అయ్యగారు
దేవునికి ఏ జన సమూహమును ఏ ఆత్మ నడిపించుచున్నదో సుస్పష్టము.

దైవదూత

ఈ అద్యాయములో బైబిలు అంతటికీ మూలాధారమైన దేవుడైన యెహోవా నామము కలిగిన దైవదూతను ప్రత్యక్షపరచుట చాలా సంతోషకరమైన సంగతి. ప్రభువైన యేసుక్రీస్తుగా భూలోకమున అవతరించిన ఈ దూత చేయు పనిని మొదటగా ధ్యానించిన తర్వాత మిగిలిన విషయములలోనికి వెళ్దాం.

దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాట నెరవేరును. దేవుని నోట నుండి వచ్చిన వాక్యమే ఈ దైవదూత. దేవుడు ఆజ్ఞాపింపగా అక్కడ మార్గము సిద్ధపర్చబడెను. దేవుడు దైవదూత ఇద్దరూ ఒకటే అయితే ఇద్దరికి తేడా ఏమిటి? దేవుడు కరుణా సంపన్నుడు. ఏ ఒక్కరు నశించుట ఆయనకు ఇష్టములేదు. అందుకు ఆయన తన దూతను పంపుటకు ముందు సిద్ధబాటు మాటలు చెప్పును. ఆ సిద్ధబాటు మాటలు, వాటి చరిత్రయే పాతనిబంధన.

ఈ అద్యాయములో దేవుడు మోషేతో/ప్రజలతో చెప్పుచున్న మాటలు సిద్ధపర్చుటయే. అయితే ఆయన దూతను(వాక్యమును) విడుదల చేసినపుడు అది నెరవేరక మానదు గనుక ప్రజలందరు తలవగ్గాల్సినదే. దేవుని ఆజ్ఞానుసారమైన పలుకే దైవదూత. యేసుక్రీస్తు ప్రభువు భూలోకమును దర్శించినపుడు ఆయన ప్రేమను వెల్లడించి పరిశుద్ధాత్మ మాటను వినవలెనని బోధించి ఆయనకు మార్గము సిద్ధపర్చెను.

దేవుడు తన రక్షణ మహా సంకల్పము చొప్పున ఆదియందు దైవదూతను(వాక్యమును) వదిలెను. ఈయన ఏడు ఆత్మలను చేతపట్టుకొని తన వాగ్ధాన ప్రజలను నడిపించుచుండెను. అయితే దేవుడు ఈ భూమిని ఇక నాశనము చేయనని నోవాహుకు వాగ్ధానము చేసిన తర్వాత; సాతాను దైవదూతకు వ్యతిరేకముగా 7 దురాత్మలకు హాము కుమారులైన 7 దేశాధిపతులను అప్పగించెను. ప్రపంచ దేశనిర్మాణములో ఈ 7 దురాత్మలు ఏదో ఒక రీతిని పనిచేయును. దేవుడు తన కుమారుని 7 సంఘముల కాళ్ళక్రింద సాతానును చితుకత్రొక్కెను.

ద్వితి 7:1. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన 1. హిత్తీయులు 2. గిర్గాషీయులు 3. అమోరీయులు 4. కనానీయులు 5. పెరిజ్జీయులు 6. హివ్వీయులు 7. యెబూసీయులను ఏడు జనములను .. నిర్మూలము చేయవలెను.

ఎందుకనగా ఈ 7 దురాత్మ సమూహములు దేవునితో దైవదూత రాకడ వరకు యుద్ధము చేయుచు వచ్చుచున్నవి. అంత్యకాలములో వీటి పాత్ర అమోఘము. వధువు సంఘమైయున్న బైబిలుమిషను వీటి జాడను గుర్తెరుగు శక్తి కలిగివుండుటకు అయ్యగారు ప్రకటన గ్రంధ వివరము అను ఆయుధమును మనకిచ్చిరి.

7 దురాత్మల క్లుప్త వివరము: దేవుని నడిపింపును వదిలి(గమ్యము చేరక) ఈ క్రింది పట్టికలో ఇవ్వబడిన దురాత్మ ఉనికి కనిపించగానే ఇదే దేవుడు అని మ్రొక్కుదురు.


ఆత్మ పేరు అర్థము వివరణ అంత్యకాల పాత్ర సన్నిధి సమాధానము
అమోరీయ పర్వతము; ప్రఖ్యాతిని కోరుకొనువారు స్వీయ ఘనత, నామ జపము కోరుకొనువారు , కీర్తి కాముకులు. రాజే దేవుడు, నాపై ఎవరూ లేరు అనువారు. దేవుళ్ళను నిలబెట్టువారు. అంత్యక్రీస్తు, మిగిలిన సమూహమును ఈ 7 ఆత్మల మాయలో ఉంచి, సమాధానమును చెడగొట్టును.
దేవుని ఆత్మ: షాలోం(న్యాయా 6:24), శాంతి స్థాపన. లవొదికయ.
మొదటి మెట్టు వద్ద ప్రభువుకు మాత్రమే చేయు నమస్తారముతో దురాత్మ ఎగిరిపోవును. సన్నిధి పరులు రాకడ సమయమును గుర్తెరుగుదురు. కొండను కదిలించు విశ్వాసము, దైవశక్తి
హిత్తీయ భీభత్సము కయీను సంతతి, తీవ్రవాదము, ఆత్మహుతి, డీప్ డిప్రెషన్. విశ్వాసలేమి, నీరసించిన నిరీక్షణ. దేవుని ఉగ్రత. సువార్తలేమి వలన కొంతకాలము గిర్గాషీయ ఆత్మకు దేవుడిచ్చిన అధికారము.
దేవుని ఆత్మ: నిస్సీ(నిర్గమ 17:15), చిన్నవారైనను గొప్ప దర్శనము, గొప్ప విజయము. ఫిలదెల్ఫియ.
రెండవ మెట్టువద్ద పాపములు ఒప్పుకొని విశ్వాస, నిరీక్షణ రూపాంతరకొండ ఎక్కుదురు. సన్నిధి పరుల పంట కోయబడుట
పెరిజ్జీయ ఏకగ్రామ రూపాంతరమునకు, మారు మనసును వ్యతిరేకించు ఆత్మ. కంఫర్ట్ జోన్ వదిలి రాలేని స్థితి. దేవుని సాక్ష్యులు ప్రత్యక్షముగా రుజువుపర్చుచున్నను, దైవకార్యములను చూచి దేవుని దూషింతురు గాని మారుమనసు పొందరు.
దేవుని ఆత్మ: కెదోషిం(లేవి 19:2), పరిశుద్ధ దేవుడు. సంపూర్ణుడు. సార్దీస్‌
3వ మెట్టువద్ద దైవసన్నిధి సామీప్యముతో మారుమనసు కొరకైన తీర్మానము చేయుదురు.
కనానీయ లోతట్టు వ్యసన బానిసత్వము. సొదమ గొమెర్ర సరిహద్దు సహవాసము మహావేశ్య పాత్రలోనిది త్రాగి మత్తిల్లెదరు.
దేవుని ఆత్మ: యీరే(ఆది 22:14), సేవ, సువార్త అందించుట. తుయతైర
4వ మెట్టులో స్వంతశక్తులు ఉడిగిపోయి దైవచిత్తమునకు సంపూర్ణ సమర్పణ చేయుదురు
హివ్వీయ గ్రామీణము ఆచార కట్టుబాట్లలో స్వీయతృప్తి, తాత్కాలిక ఆనందములో మునిగి తేలుట ఆకాశ సూచకక్రియలు గ్రహింపక దేవుని పిలుపును వినలేని సర్వ సమాజము.
దేవుని ఆత్మ: రాఫా(నిర్గమ 15:26), లోకమును జయించి సంఘమును స్వస్థపరిచి రక్షించును. పెర్గము
5వ మెట్టు: సర్వలోక సంచార మనో కార్యము. దైవ సంకల్పములోగల అంశముల కొరకు వేడుకొనుట
యెబూసీయ పరిమిత జీవనము పరిహాసము. కించపరచు జీవనము. ప్రేమలేమి. మహాత్ములను దూషించు ఆత్మ. ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు.
దేవుని ఆత్మ: షామా(యెహెజ్కేలు 48:35), దైవ స్నేహితుల కొరకు ప్రాణము పెట్టుట. స్ముర్న
6వ మెట్టులో సత్యమైయున్న దైవలక్షణముల స్తుతి. దేవునికే మహిమ
గిర్గాషీయ మట్టి నివాసము మట్టే దైవమని నమ్మి దేవుని ఉనికిని తిరస్కరించువారు. చూడని వాటిని నమ్మని ఆత్మ. 666, హేతువాద విజ్ఞాన నాస్తిక పరిది. తమ జ్ఞానమునకు అందని వాటిపై అందరిని కలవరపెట్టుదురు.
దేవుని ఆత్మ: సిద్కేను(యిర్మి 23:5,6; 33:16), నీతి రాజు. ఎఫెసు.
7వ మెట్టులో దేవునితో సహవాసము. కనిపెట్టు పట్టుగలవారు కలవర పడరు, కంగారు పడరు

క్రీస్తుప్రభువు సిలువ సమయానికి, ఆది సంఘ స్థాపన కాలములో ఈ దురాత్మలు బాగా పని చేసినవి. మళ్ళీ రాకడ సమయములో సాతాను భూమిపై పడవేయబడినపుడు ఇవి పరిపూర్ణముగా పనిచేయును. తర్వాత నిత్యనరకాగ్నికి పోవును.

నిర్గమకాండము 23వ అద్యాయ విషయములు

అన్యాయపు సాక్ష్యము చెప్పకూడదు

లేనివార్త పుట్టించుట, అబద్ధ సాక్ష్యము చెప్పుట, సమూహముతో కలిసి అన్యాయముగా నిందలు వేయుట యెబూసీయ ఆత్మ.

శత్రువునకు సహాయము

దేవుడు సృష్టించిన ఏ జీవియు నిరుపయోగముగా నశించకూడదు. అది శత్రువునకు సంబంధించినది యైనను విశ్వాసి కాపాడవలెను.

పండుగలు

దేవునిలో పండుగను ఆచరించుట గొప్ప సంతోషము గనుక మనకు సంవత్సరాంతము పండుగ క్యాలెండర్ ఇవ్వబడినది. నిర్గమకాండము ధ్యానించుట కూడ పండుగే.

నిబంధన

దైవ సన్నిధిలో దేవునితో తప్ప మరి ఎవరితోను నిబంధన చేసికొనరాదు.


ప్రభువా! మీ వాక్యమును(దైవదూత) మాలో నివసింపజేసి మమ్మును బ్రతికించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 23 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter