నిర్గమకాండము 22 - పునరుద్ధరణ చట్టాలు


ప్రార్థన: ప్రతీ వివాదమును పరిష్కరించు ప్రభువా! మీకు వందనములు. పొరుగువాని దేనినైనను ఆశించకుండునంతగా మాకు సమృద్ధిని కలుగజేయుము. మీరిచ్చు సమృద్ధిని అనుభవించు ఆత్మను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

పరిచయము

దొంగబుద్ధి, నాశనము అపవాది లక్షణం. దేవుని మహిమను దొంగిలించబోయి అపవాది ఘటసర్పముగా మారెను. లోకములోని అన్ని దుష్కార్యములకు దొంగబుద్ధి కారణము. అపవాది ఎవరి దరిజేరునో అక్కడ అతిక్రమము/దొంగతనము/ట్రెస్‌పాస్ ఉండును. మొదట హవ్వ దగ్గరకు జేరి వారి స్వాతంత్ర్యమును హరించెను. యోబు వద్దకుచేరి ఉన్న సంపద అంతయు దోచుకొనిపోయెను. చనిపోయిన మోషే శరీరమును దేవునిగా చేసి రాజ్యమేలుటకు యత్నించెను గాని మిఖాయేలు అడ్డుపడెను(యూదా 1:9). ప్రభువు 40 దినములు అరణ్యములో ఉపవాసము ముగించిన తర్వాత దైవకుమారుని హోదాను దోచుకొనుటకు వచ్చెను గాని ప్రభువు అపవాదిని తరిమి కొట్టెను.

దొంగ ఉనికిని పసిగట్టుటకు ప్రభువు ఒక క్లూ ఇచ్చెను. యోహాను 10:1 "గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు". అపవాది ఎప్పుడును సత్యముతో డైరెక్ట్‌గా రాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువును సందర్బములో పెట్టక (Lord shall be the center of context, but Satan subsides), ఎవరో ఒక విశ్వాసి/పరిచారకునిపై నేరము మోపుచు వచ్చును. అయితే విశ్వాసులు క్రీస్తు అను బండమీద నుండి కదలక ఉన్నంతవరకు అపవాది ఏమియు చేయలేడు.

అద్యాయ విషయములు

భౌతిక వస్తువుల దొంగలకు ఇప్పుడు ప్రతీ దేశములోను చట్టములు వచ్చినవి. ఇంటెలెక్యువల్ ప్రోపర్టీ పెరిగినందున పేటెంట్ లాస్(IP Laws, copyrights) కూడా వచ్చినవి. అయితే ఇప్పుడు అత్యంత అమూల్యమైన ఆత్మల దొంగతనము జరుగుచున్నది. ఆత్మల దొంగలు; ప్రతీ సంఘములో ఏదో ఒక వంకతో రక్షణపొందిన విశ్వాసి/ఆత్మలను దొంగిలించుటకు అపవాది కాచుకొని ఉన్నది. ప్రతీ సంఘము దైవ ఉనికి కలిగి, ప్రధాన ద్వారమైయున్న యేసుప్రభువు యొక్క ప్రేమ కలిగి, విశ్వాసులను గుర్తించు సహవాసము కలిగియుండవలెను. దొడ్డిదారిలో ప్రవేశించు ప్రతీ దుర్నీతికి దూరముగా ఉండి, రాకడ మేఘమెక్కువరకు అపవాదిని ఎదురించుటకు సర్వాంగ కవచమును ధరించుకొని జీవించుదము!

క్రీస్తు అను బండను వదలక, ప్రస్తుతమున్న ట్రెండ్(Trending topics) అనే ఇసుకమీదకు జారిపోకుండు స్థిరత్వమును దేవుడు మనకు దయచేయును గాక!

Commandments దేవుని అనాది సంకల్ప ప్రణాళికలో ఉన్నవారు ఎన్ని శోధనలు ఎదురైనను దేవుని చిత్తము అను సునీతి మేఘములో పైకెత్తబడి పరిశుద్ధతలోనే పడియుందురు; ఇటు/అటు/ఎటు తిరిగినా గాని చివరికి దేవుని వదిలి పోజాలరు. శరీరాత్మ గలవారు ఎన్ని పాపపరిహారార్థములు చెల్లించినను దుర్నీతి/దురాశలలో చిక్కుకొని పడిపోవుచుందురు; దుర్నీతి సర్కిల్ నుండి బయటపడుటకు రూపాంతరము అవసరము(రోమా 1,2).

ప్రభువైన యేసుక్రీసును సంపూర్ణముగా ప్రేమించువారికి సునీతి సంపద అను నిల్వలు సమృద్ధిగానుండును. బండ మీద నివాసము ఏర్పరుచుకొనువారిని ఏ సునామి ఏమియు చేయలేదు. వారి ఆనందమును ఎవరును దొంగిలించజాలరు.

దేవునికి ప్రధమ ఫలములను చెల్లించి, దేవునివి దేవునికి చెల్లించుచు; దొంగబుద్ధికి దూరముగానుండు దృఢమైన జీవితమును దేవుడు మనకందించును గాక! ఆమేన్.

అపవాది దొంగిలించినను, మనము కోల్పోయిన వాటినన్నిటిని దేవుడు మనకు అనేక రెట్లుగా దయచేయును గాక! పూర్వవైభవమును అనేక రెట్లుగా పునరుద్ధరించును గాక! ఆమేన్.బైబిలుమిషను అంతస్థును అర్థం చేసుకొని జీవించుట మంచిది. లేకపోతే "హోషేయా 6:9 - బందిపోటుదొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై యున్నారు" అను వాక్యము నెరవేరుచున్న ప్రస్తుత ట్రెండ్‌లో(TV debates on unnecessary Christian topics) పడే ప్రమాదమున్నది.

జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 22 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter