నిర్గమకాండము 20 - పది ఆజ్ఞలు


ప్రార్థన: ప్రభువా మీ ఆజ్ఞ నిత్యజీవము గనుక(యోహాను 12:50) వాటిని ఎల్లపుడు తలంచుచు మీ సత్యమార్గములో నడుచు కృపను దయచేయుమని, మా ఆత్మను శుద్ధీకరించుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ఈ రోజు ధ్యానము దేవదాసు అయ్యగారి ఉపవాస ప్రార్థన ప్రకరణము అను పుస్తకములో శుద్ధిప్రకరణము అను బాగములో 10 ఆజ్ఞల వివరము ఉన్నది.

కొంతమంది పొరబడి, పాతనిబంధన కొట్టివేయబడెను గనుక ఆజ్ఞలు పాటింపనవసరములేదు అని తప్పుగా చెప్పుదురు. ధర్మశాస్త్రమునకు మూలము ఈ 10 ఆజ్ఞలు. ఇవి దైవాజ్ఞలు. రాకడవరకు పాటించవలసినదే. అయితే క్రీస్తుప్రభువు ఈ ఆజ్ఞల అనుసరణ క్రియలనుండి తీసి మనసువద్ద పెట్టెను. ఇప్పుడు ఆజ్ఞకు వ్యతిరేకముగా మనసులో తీర్మానించుకొంటే, అది పాపము.

మిగిలిన శరీర చట్టమైన(లా) ఆచారములు, విధులు, కట్టడలు, సున్నతి, బలులు కొట్టివేయబడెను. ఆత్మానుసారమైన మనసు ఒక్కటే ఇప్పుడు మార్గము. దీనికి కాపల మనస్సాక్షి.

ప్రభువైన యేసుక్రీస్తు అందించిన కృపాశాస్త్రము వలన పాపములో కాక జీవములో జీవించు కృపను దేవుడు మనకందించును గాక!జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 20 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter