వాక్యము: నిర్గమ 2 - ఆపదలో విశ్వాసికి ఆధరణ


నిర్గమకాండము 2వ అద్యాయములో మోషేకు 4 ఆపదలు పొంచియున్నను దేవుడు గొప్ప ఆధరణతో కూడిన విజయమును అనుగ్రహించెను.

 • పుట్టుక

  మోషే అత్యంత అగ్రదేశమును, దేనికిని కొదువలేని ధనిక దేశమును, బహు భద్రత గల రాజ్యమైన ఐగుప్తులో జన్మించెను. అమ్రాము యోకెబెదు లకు అహరోను, మిర్యాము జన్మించినపుడున్న ఐగుప్తు వైభోగము మోషే తన తల్లి గర్బములో ఉన్నపుడు ఆ బిడ్డకు మరణశాసనమైనది. మోషే కేర్‌మని ఏడ్చుట తరువాయి, ఆ అగ్రరాజ్యములో మరణము మోషేను మింగివేయుటకు పొంచియున్నది.

  నిర్గమ 3:6 లో దేవుడు మొదటగా నీ తండ్రి దేవుడను అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో అమ్రామును కలుపుటను బట్టి అమ్రాము వాగ్ధానముకొరకు బహుగా విశ్వసించెనని తెలియుచున్నది. హెబ్రీ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి. ఇక్కడ సుందరుడనగా వారి విశ్వాసమునకు ప్రతిరూపమైన దైవకళను వారు చూచుటద్వారా మోషేను కాపాడిరి.

  మోషే పెరుగుదల వారిలో మరింత విశ్వాసాన్ని పెంచుకొని పోయి, అది "దేవుడు మిమ్మును దర్శించి నిశ్చయముగా ఈ దేశమునుండి కొనిపోవును" అను యోసేపు మాటలు దాటి, 400 వందల క్రితము అబ్రహామునకు కలిగిన వాగ్దానమును దాటి, దేవుడు నోవహుకు చేసిన ప్రమాణము వద్దకు పోయినది. ఒక తల్లికి తను జలప్రళయములో కొట్టుకొనిపోవుటకంటే తన ప్రాణమైన పసిబిడ్డ కళ్ళముందు మునిగి పోవుటే పెద్ద జలప్రళయము. నోవహు ఓడ కట్టుటకు ఉపయోగించిన ఒక ప్రత్యేకమైన కీలును(హెబ్రీ భాషలో ఓడదగ్గర, ఇక్కడ కీలుకు స్పెషల్ పదము వాడిరి) చిన్న బుట్ట పడవకు ఉపయోగించుట ద్వారా వారు నోవాహును కాపాడిన దేవుడు మోషేను కాపాడును అని విశ్వసించిరి.

  ఈ తరములో మనము ఏ కష్టస్థితిలోఉన్నాగాని మన విశ్వాసము మన పితరుల అంతస్థు వరకు వెళ్ళి బైబిలుమిషనను ఓడ పాఠములకు చేరి పెండ్లికుమార్తె వరుసలోనికి చేరవలెను.

 • నదిలో జలప్రళయము

  మోషే తల్లి రాజాజ్ఞ ప్రకారము మోషేను విశ్వాసముతో నదిలో ఉంచినది. వారి విశ్వాసము క్రియలులేని మృతమైనది కాదు గాని విశ్వాసముతో నోవహు నావకు సాదృశ్యముగా ఒక కవచమును ఏర్పాటు చేసెను. ఆ ప్రదేశమంతటా దేవుని ఉనికి కలిగివున్నందున దైవ ప్రణాళికకు వ్యతిరేకముగా ఏమియు జరుగలేదు. మోషేను చంపుటకు నదిలో వేయలేదు గాని దేవుని ప్రణాళికకు సమర్పించిరి. మోషే అక్కయైన మిర్యాము అదే విశ్వాసములో పెరిగినది గనుక దేవుడు వారిని ఎర్రసముద్రము దాటించిన వెంటనే స్తుతిపాటను ఆపలేక బిగ్గరగా గొంతెత్తి పాడసాగినది.

 • ఐగుప్తులో మరణశిక్ష

  మోషే పెద్దవాడై, అన్ని సుఖభోగములు అనుభవించు వయసు వచ్చినపుడు రాజగృహమును విడుచు హృదయము కలిగివుండుటకు కారణము పౌలు మాటలలో క్రింది వాక్యములలో వున్నది.

  హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
  25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
  26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
  27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.

 • మిద్యానులో మనుగడ

  దేవుని హృదయానుసారుడైన మోషేకు ఇశ్రాయేలు విడుదల హృదయములో రగులుచుండగా, మిద్యానులో 40 సంవత్సరములు దైవ ఉనికిని కలిగి పొదిగిన విషయములను రానున్న దినములలో ధ్యానించుదము.


  సారాంశము:
  దేవుని దయ మోషేకు తోడైయున్నట్లు మనకును తోడై ఉండును గాక!
  ఈ లోక సుఖభోగములయందు సంతోషపడక; నీతియు, సమాధానమును, ఆత్మయందలి ఆనందమును కలిగియుందుము గాక!
  ఏ చిన్నకుటుంబములో పుట్టినను మనకు కావలసిన విద్యా సదుపాయములను దేవుడు అందించునుగాక!

  జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 2 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

 • Like this page on Facebook

 • Tweet this page on Twitter

 • Recommend this website on Google +