నిర్గమకాండము 16 - ఆరు రోజుల మన్నాప్రార్థన: ప్రభువా! మా కొరకు మీరు దాచిన మన్నాను మాకు బైలుపర్చి, మా ఆత్మలను వెలిగించుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

1. పరిచయము

హెబ్రీయులు ఐగుప్తును విడిచివచ్చినపుడు ఎర్రసముద్రము వరకు వెనుకచూపుతో దేవుని మహిమలో సంపూర్ణముగా సంతోషించలేకపోయిరి. మళ్ళీ బానిసత్వము వైపు చూచిరి. ఎర్రసముద్రము దాటిన తర్వాత దేవుని ఆత్మతో నింపబడి మధురగీతము పాడిరి. షూరు అరణ్యములో ఎవరి బలిమి లేకున్నను మూడు దినములు హుషారుగా నడిచిరి. మారా దగ్గర సణిగిరి, నీళ్ళు శుద్ధి చేయబడెను.... ఈ విధముగా అరణ్యములో అంధకార దురాత్మల ఉనికిపట్టులో దైవాత్మపూర్ణులై సాగుచుండిరి. అంధకార మార్గములో ఆత్మదీపము సన్నిగిల్లితే అంధకారము మరింత దగ్గరకు వచ్చును. ఐగుప్తు ఆత్మను(యెషయా 19:3 తెలుగు తర్జుమాలో శౌర్యము) జయించు భారము దేవుడు ప్రజలపై పెట్టలేదు కాని ముందున్న దేశముల దురాత్మలను జయించు శక్తిని పొందుటకు దేవుడు వారిని పరీక్షింపబూనుకొనెను. ఐగుప్తు నుండి సీనాయికి ఉన్న ప్రాంతము పాపారణ్యమని హోరేబు/సీనాయిని Sin కొండ అంటారని నిర్గమకాండము 3వ అద్యాయంలో ధ్యానించితిమి.

2. దేవునిపై సణుగుట

సణుగు స్వనీతినుండి పుట్టును(యూదా 1:16). స్తుతి సునీతినుండి పుట్టును. శోధనలో దేవుని ఉపదేశమునకు లోబడుటవలన వచ్చు మొరలోనుండి కలుగు దేవుని రక్షణను బట్టి చేయు స్తుతి దేవునికిష్టమైనది. దేవుని ఉపదేశమునకు (Instruction, యెషయా 29:24) లోబడనొల్లని బాధ్యతారాహిత్యము వలన వచ్చు శోధనలోనుండి కలుగు నిరాశ వలన సణుగు వచ్చును. దేవుని ఉపదేశ మార్గమున నడుచునప్పుడు ఆయన సిద్ధపర్చినవి అవసరానికి కనిపించినపుడు స్తుతి వచ్చును. తమ స్వకీయాశల వలన సణుగువారు దేవుని స్తుతి చేయలేరు.

సణుగు సాతానుకు ద్వారము తెరుచును కావున దేవుడు దీనిని కొట్టివేసెను. విశ్వాసులమైన మన మాట "అవును అంటే అవును - కాదు అంటే కాదు" అను అధికారము యేసుప్రభువు మనకు దయచేసెను.

సణుగుట, గొణుగుట అనునవి స్తుతికి వ్యతిరేకమైనవి - యం.దేవదాసు అయ్యగారు.

3. మన్నా

దేవుడు భూమిలో మనకు కావలినవన్నియు పొదిగెను. దేవుని అనాది సంకల్పములోనున్న మార్గములో ప్రతీ కీడు వెనుక గొప్ప మేలును దాచిపెట్టెను. జీవాహారమైయున్న దేవుని వాక్యమును ఆనుకొని జీవించు వారిని దేవుడు ఒక్క వాక్కు/పదము ద్వారా లేవనెత్తును. దైవవాక్యములోని అన్ని పదములు అభిషేకింపబడినవే. తెలుగు వారికి ఆ అభిషేకింపబడిన పదములను అయ్యగారి పాట/పద్యములలో కూడ చూడగలము. ఆంద్ర క్రైస్తవ కీర్తనలలో చిన్న చరణమును పట్టుకొని జీవితాంతము ఘనకార్యములు చేసిన భక్తులు మన పితరులు. దేవుని వాక్యము ఎవరి అంతస్థును బట్టి వారి హృదయమునకు అందించబడును, ఎక్కువ తీసుకొన్నను సిద్ధమనసు లేకపోతే చివరివరకు తగినంతే మిగులును. కొంతమంది తక్కువ వాక్యము విన్నను, వారిలో ఎక్కువ వాక్యము ఊరును. బైబిలు వాక్య ధ్యానములోనుండి ఊరినదే క్రైస్తవ సాహిత్యము.

4. విశ్రాంతి దినము

మన్నా! విశ్రాంతిదినమున పాడవకుండుట గొప్ప వింత. ప్రతీ దినము వస్తే అది సాధారణము. దేవుని మాటను బట్టి వచ్చినది గనుక ఇది ప్రత్యేకమైన ఆహారము. క్రొత్తనిబంధన విశ్వాసులు జీవ వాక్యాహారమును అన్ని దినములు భుజించుటకు ప్రభువు విశ్రాంతి దినమును అభిషేకించెను.


కీడువలన ఖిన్నులము కాక ఆ కీడుచాటున దాచిన మేలును చూచుటకు ప్రభువు తన వాక్యాహారమును మనకు దయచేయును గాక! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 16 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter