నిర్గమకాండము 11 - ప్రతివాని జీతము చెల్లింపబడును


ప్రార్థన: నీ సేవకులకు సమస్తమును విశదపర్చి మా రక్షణను సిద్ధపర్చుచున్న దేవా! మీకు వందనములు. ముందు జరుగునవి అన్నీ ముందే మాకు అందించిన దేవా! మీరు అందించు భాగ్యములను మేము అందుకొను కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ఈ అద్యాయము చిన్నదైనను చిట్టచివరికి దేవుని గొప్ప కార్యమును బైలుపర్చిన మహాద్భుతాద్యాయము. ఫరో సమూహమునకు దేవుడు చెప్పకుండా రప్పించిన చిమ్మచీకటిలో వెలుగు కలుగజేసిన తర్వాత ఫరో కఠినుడై మోషే ముఖము చూడనన్నందుకు దేవుడు ఫరోకు జారీచేసిన ఆఖరి హెచ్చరిక.

దేవుని కీలక ప్రణాళికను మోషేకు మొట్టమొదట బైలుపర్చెను. "నా జ్యేష్టకుమారుడైన ఇశ్రాయేలును ఫరో పట్టుకొనెను గనుక ఫరో సమూహముయొక్క జ్యేష్టకుమారులకు తీర్పు తీర్చువరకు ఫరో మిమ్మును పోనియ్యడు" అని చెప్పినపుడు అది ఒక మాట మాత్రమే. ఇప్పుడు అది దేవుని బలమైన క్రియ. హెబ్రీయుల కుమారులను చంపిన హస్తములకు దేవుడు జీతము చెల్లించెను.

50 సంవత్సరములనుండి హెబ్రీయులు ఐగుప్తీయులకు బానిసలుగా వెట్టిచాకిరి చేసిరి గాని ఫరో వారికి చిల్లిగవ్వ కూడ ఇవ్వలేదు కాని ఐగుప్తీయులు తాము పట్టివుంచిన హెబ్రీయుల జీతమువలన అధిక ఐశ్వర్యమంతులైరి. ఐగుప్తులో హెబ్రీయులు స్వతంత్రులైరి అనుటకు సాదృశ్యముగా ఐగుప్తీయులవద్ద తమవంతు జీతముగా బహుమానములను తీసుకొనవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. తమకు కలిగిన ఐశ్వర్యమునుబట్టి ఐగుప్తీయులు హెబ్రీయులకు ఇచ్చుటకు దేవుని దయ వలన సంతోషించిరి. ఇది గొప్ప విడుదల.

ఆ దినములలో ఫరో ఆజ్ఞ ప్రకారము ఘనత వహించిన ఇశ్రాయేలు పెద్దలపై చిన్న ఐగుప్తు కుర్రవాడు సహితము కుక్కలా మొరగడం, కలిగినది లాక్కోవడము పరిపాటి అయిపోయినది. అయితే ఆ దినమున ఐగుప్తులో జరిగిన గొప్ప రూపాంతరము ఏదనగా నిజమైన కుక్క కూడ హెబ్రీయులను చూచి భయపడినది.

దేవుడు విశ్వాసమునకు కర్త. ఏ దారి లేనప్పుడు విశ్వాసమును నాటి, పొదిగి, ఎదిగించి చిరరకు కార్యరూపమును దాల్చునన్న నమ్మకమునకు బహిరంగా రూపము ఇక్కడ కనబడుచున్నది. హెబ్రీయులు ఇంకను విడిపింపబడలేదు; అయినను వారు తలవంచి దేవునికి విధేయతచూపు రూపాంతరమును కలిగి అబ్రహాముయొక్క విశ్వాస వరుసలోనికి వచ్చిరి.

దేవుడు మోషేకు వాగ్ధానము చేసినట్లు సమస్తమును సమకూడి జరిగినవి. ఇశ్రాయేలీయుల ఆత్మీయస్థితి ఐగుప్తునుండి పూర్తిగా వేరుపర్చబడెను.

ఈ లోకములో దేవుడు కొట్టివేసినవాటిని పట్టుకొనక దేవుడు మనకు సిద్ధపర్చివ వాటిని సమకూర్చుకొనుటకు పరిగెత్తు కృపను ఆయన మనకు అందించును గాక! ఆమేన్.జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 11 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter