నిర్గమకాండము 10 - తరతరాలకు గుర్తుండే దైవశక్తిప్రార్థన: మమ్మును మిక్కిలి ప్రేమించి మా తప్పిదములను క్షమించి మమ్మును రాబోవు తరముల వారికి సాక్ష్యులుగా నిలువబెడుతున్న కరుణ గల దేవా! మీకు నమస్కారములు. మేము చూచిన మీ ఘనకార్యములను మా తర్వాత తరము గ్రహించునట్లు మా ప్రవర్తనను సరిచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

నిర్గమ 10:1 - 2; ఫరో మరియు అతని సేవకుల హృదయమును దేవుడెందుకు కఠినపర్చెను?
నిజానికి ఫరో కఠినత్వ పరిమాణము ఇశ్రాయేలీయుల హృదయ కాఠిన్య పరిమాణము కంటె చాలా తక్కువ. ఫరో కఠినత్వమును హెచ్చించి ఆయా సూచక క్రియలద్వారా హెబ్రీయుల హృదయ కాఠిన్యమును కరిగించెను. ఫరో ఇశ్రాయేలుకు ఒక తరము కుమారులను లేకుండా చేసి, వారిని తీవ్ర బానిసత్వములోనికి నెట్టినపుడు వారు దేవునికి పెట్టిన మొర వారి హృదయ కాఠిన్యమునకు దారితీసి, దేవుడు వారిని దర్శించువరకు పెరిగి పెద్దదైనది. 40సం.ల వారి ఎదురుచూపు ఆతరములో కాఠిన్య నైజమును నింపినది. దీనికి బీజము వేసినది ఫరో అతని సేవకుల మాంత్రికారాధన.

దేవుని ప్రజలపై ఫరోకు ఎందుకు పట్టు దొరికెను?
యవ్వనుడైన మోషే చెప్పిన మంచి మాటను గ్రహించలేని ఇశ్రాయేలీయులు, మునుపు వారు కష్టస్థితిలో ఉన్నను సహోదర సక్యతను వదిలి తాము ప్రత్యేక జనాంగమని గుర్తించక, "ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపుదువా" అని ఐగుప్తీయునితో పోల్చుకొను తరముగా మారుటవలన.

అయితే దేవుడు అబ్రహామునకు ఇచ్చిన తన వాగ్ధానమును గుర్తు చేసుకొని అబ్రహామునకు కుమారుని అనుగ్రహించినట్లు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు కుమారులను, వారి కుమారులను కలుగజేసెదను; ఈ మహత్కార్యములు వారి సంతతికి తెలియజేయుడి అని చెప్పెను. "ఇశ్రాయేలీయులకు మళ్ళీ కుమారుల సంతతి" రాబోతున్నది అనునది వారికి గొప్ప శుభవార్త. ఆరిపోయిన ఇశ్రాయేలీయుల విశ్వాసము "కుమార సంతతి" వాగ్ధానముతో వెలిగింపబడెను.

దేవుడు ఫరోను గద్దించిన ఆఖరి సూచకక్రియ గాలి ప్రవాహమునకు కొట్టుకొనిపోవు మిడుతల దండు. ఇది ఐగుప్తు సైన, సేవకులకు. అంత్య కాలములో అవిశ్వాసుల సముద్ర ఘోషకు(ట్రోలింగ్) సాదృశ్యము. వీరు మిడుతలవలే గాలి ఎటువీస్తే అటు మాట్లాడుదురు. మోషే ఐగుప్తులో ఫరోకంటే ఘనత నొందిన వాడుగా కీర్తించబడుట చేత సేవకులు మోషేకు అనుకూలముగా మాట్లాడిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపోయిన తర్వాత మళ్ళీ ఫరో గాలిలో పడి ఇశ్రాయేలీయులను తరిమి చివరికి మిడుతలవలే ఎర్రసముద్రములో పడి చచ్చిరి. అంత్యకాలములో క్రీస్తుజనులపై పడి చేయు ఘోష చివరకు వారి పంటను(మనుగడ)ను తమకు తెలియకుండ హరించివేయును(తినివేయును).

ఈ అద్యాయములో ఒక ప్రమాదకరమైన హెచ్చరిక వున్నది. ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును(మారుమనసు పొందక కఠినులైన వారికి ఆపద తమకు తెలియకుండా హఠాత్తుగా వచ్చును). ఐగుప్తులో 3 దినములు చీకటి కమ్ముట అటువంటిదే.

కారు చీకటిలో కాంతిరేఖయైన యేసుక్రీస్తు ప్రభువు వెలుగులో మనమును ఇశ్రాయేలీయులవలే జీవించు కృపను దేవుడు మనకు దయచేయునుగాక!


ఫరోకు ఉన్న పెద్ద దౌర్బాగ్యము: తమ పదిమంది మిధ్యాదేవతలను కొట్టివేసి దైవశక్తిని కనబర్చిన దేవుని యెదుట మోకరిల్లక పోవడానికి కారణము ఫరో తన ప్రాణముకంటే, ఐగుప్తు ప్రజల క్షేమముకంటే యెహొవా ప్రజలైన హెబ్రీయులను హింసించుటే వారికి ఆనందమాయెను. చివరికి అది వారికి ఉరి ఆయెను. క్రైస్తవలోక నాయకులు తమ భక్తిని, శక్తిని తమ సంఘాబివృద్ధికి వాడక చిన్నమందను కొట్టుటయందు నిమగ్నమైతే చివరికి వారు తాడిచెట్టు అంత ఎత్తుఎదిగినను ఢబాలున కూలుదురు.

ఫరో తన మిధ్యోన్మాద భక్తిని వదిలి ఒక రాజుగా/నాయకునిగా వ్యవహరించుట ఈ అద్యాయములో చూడగలము. ఫరో మొదట్లో "ఎవరెవరు వెళ్తారు? ఎంతమంది వెళతారు" అని సుముఖతతో మోషే విన్నపముయొక్క పరిధిని అంచనా వేసుకోవాలి. కాని తన మిధ్యాభక్తి మాయలోపడి యెహొవా చట్రములో ఇరుక్కుపోయెను. ఫరో చపలత్వము ఈ క్రింది నిర్ణయముల వలన తెలియును.

1. యెహోవా యెవడు?
2. యెహోవాను వేడుకొనుడి
3. నా కోసము యెహోవాను ప్రార్థన చేయుడి
4. నేను యెహోవా యెదుట పాపము చేసితిని
5. నా మరణమునుండి తప్పించుమని యెహోవాను వేడుకొనుము
6. యెహోవా మిమ్మును రక్షించునా? మోషేగాని దేవుడు గాని నా ముఖము చూడకూడదు... ఈ విధముగా ఫరో దైవ ఉనికిని దూరము చేసుకొని దౌర్భాగ్యుడయ్యెను.

కష్టములున్నను, నష్టములున్నను దేవుని విడవకుండుట విశ్వాసులకు గొప్ప ఆధరణ. దేవుడు తన వాక్యమును మనలో నివసింపజేసి, మన ఆత్మకు శాంతి, సమాధానములను అనుగ్రహించును గాక! ఆమేన్.

దేవుడెవరు? దేవుడు మిమ్మును రక్షించునా? ఈ రెండు పెద్ద ప్రశ్నలకు దేవుడు సమాధానమునిచ్చెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన 400సం.ల తర్వాత ఫిలిప్పీయులు ఈ ఐగుప్తు తెగుళ్ళను గుర్తు చేసుకొని యెహోవాకు భయపడి యుద్ధము చేసిరి. ప్రభువు తనప్రజలను మిధ్యాభక్తినుండి విడిపించి అన్ని దేశములకు సత్య సందేశమునిచ్చెను. ప్రస్తుతం అన్ని దేశములు ప్రభువు తన స్వరక్తమిచ్చి అనుగ్రహించిన రక్షణను అనుభవించుచున్నవి.


మన తర్వాత వచ్చు తరమైన మన పిల్లలకు దైవశక్తిని పరిచయం చేయగల శక్తిని దేవుడు మనకు దయచేయును గాక! ఆమేన్.

జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 10 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter