ప్రతి దినము స్తుతించుటకు క్లుప్త ముగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. పూర్తి పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

 1. యేసు ప్రభువా! నీవు త్వరగా వచ్చెదవని చెప్పి ఇంత ఆలస్యముగా వచ్చుచున్నావు. ఈ ఆలస్యము యొక్క అర్ధము మేము ఇతరులకు ఎట్లు చెప్పవలెనో మాకు తెలుపుము.

 2. దేవుని సృష్టిలో, విశ్వాసియొక్క ఆత్మలో కూడ గురుతులు అయిన తర్వాత త్వరగా వచ్చును. త్వరగా అని చెప్పియున్నాడు. గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసియొక్క గురుతు.
  ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకొని మన భావమేమి అని చెప్పుకొనవచ్చును కాని విసుగు కొనరాదు. ప్రభువా నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మును త్వరగా సిద్ధపర్చుము.

 3. ప్రభువా అన్ని జనాంగముల నుండి నీ రాకడకు మనుష్యులను సిద్ధపర్చుకొనుము, అన్ని భాషలలో నున్న వారిని రాకడకు సిద్ధ పర్చుము.
  అన్ని స్థితులలో నున్నవారిని అనగా పాప స్థితిలో, వ్యాధిస్థితిలో, బీదస్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశస్థితిలో, మరణస్థితిలో ఉన్న వారిని, నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపర్చుము.

  నరమాంస భక్షులలో కొందరినైనా నీరాకడకు సిద్ధపర్చుము, భూలోకములో నున్నవారిలో కొందరు రక్షణ గల మరణమునకు సిద్ధపడగలరు, కొందరు భక్తులైనప్పటికి రాకడకు సిద్ధపడలేరు, సిద్ధపడుట ఎవరికిష్టమో వారిని సిద్ధపర్చుము.
  దేవా చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని గూడా నీ రాకడలో తీసికొని వెళ్ళుము. ఇట్టి మా ప్రార్ధన ఆలకించినందులకు నీకు వందనములు.

 4. సొదొమ పట్టణము నాశనమప్పుడు దేవదూతలు బలవంతముగ కొందరిని రక్షించి అగ్నిపాలు కాకుండచేసిరి. అబ్రహాము ప్రార్ధన చేసెను గాని నెరవేరలేదు.
  అయినను నిరాశపడలేదు. రాకడకు సిద్ధపడువారు కూడ తమ ప్రార్ధనలు కొన్ని నెరవేరనప్పుడు నిరాశపడరాదు. ప్రభువా అట్టి సమయములో నిరాశపడకుండ మమ్మును కాపాడుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.

 5. ఒక గ్రామములో ఇంటి యజమానుడు తన కుమారునికి వివాహము ఏర్పరచును, మరియొక గ్రామములో ఇంకొకరు తన కుమార్తెను పెండ్లియెర్పాటు చేయునుగాని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మన దేశములో మాట్లాడుకొనరు.
  అయితే మానవులు పాపలోకములో పుట్టిరి, గనుక ప్రభువు తన స్వరక్తముతో శుద్ధిచేసెను , గనుక ప్రభువు పెండ్లిసంఘముతో గదిలో (సన్నిధిలో మాటలాడును, సంఘమను పెండ్లికుమార్తెయు వరుడను ప్రభువును మాటలాడుచున్నారు.
  ఇట్టి చనువు సంఘమునకిచ్చిన ప్రభువా నీకు స్తోత్రములు.

 6. దయగల యేసుప్రభువా! నీవు మా సన్నిధి కూటము లోనికి వచ్చి రాకడ వర్తమానములు, ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియజేయు చున్న రాకడ వర్తమానములు లోకములోనున్న ప్రతివారికి తెలియజేయుము.
  మాకు వర్తమానము తెలియజేసినప్పుడు ఏలాగు వ్రాసికొను చున్నామో అలాగే వారికి తెలియజేసి వ్రాసికొనునట్లు చేయుము.

  మాకు ప్రతిదినము తెలియుచేయునట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి గూడ తెలియజేయుము. నీ మాటలు నమ్మి నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని యెహజ్కేలు ప్రవక్తతో చెప్పినావు కదా!
  92:4) మా పత్రికలలో మేము చెప్పుచున్నాము గాని అది చాలదు. మేము స్వయముగా చెప్పినను చాలదు. నీవు చెప్పిన సరిపోవును. వారి హృదయమునకు జ్ఞానమునకు అందును.
  అధమపక్షమువారి జ్ఞానమునకై అందునట్లు చెప్పుదువని నిన్ను వందించుచున్నాము.

 7. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రబువుయొక్క రాకడకు మరచి పోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు, సిద్ధపడినవారిని తీసికొని పోవును. పనులు ముగించుకొని తేరి చూచినప్పటికి రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడా జరుగును.
  గనుక ప్రతి దినము రాకడప్రార్ధన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగియుండకపోయిన రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యము రాకడ ధ్యానము, రాకడ తలంపు మాలోనుంచుమని వేడుకొనుచున్నాము తండ్రి! ఆమెన్.


త్వరగా రానున్న యేసు అను కీర్తనలోని కొన్ని చరణములు పాడవలెను.

రెండు రాకడలు

సీ|| పశువుల తొట్టిలో - బండిన బాలుడె
మహిమ మేఘంబెక్కి - మరల వచ్చు

పొత్తిగుడ్డలపైన - బొర్లిన బాలుడె
మహిమ వస్త్రములతో - మరల వచ్చు

మట్టిపై బుట్టిన - మరియమ్మ బాలుడె
మహిమ లోకమునుండి - మరల వచ్చు

నరుల మధ్యను జీవ - నము చేయు బాలుడె
నరులను గొంపోవ - మరల వచ్చు


దైవాత్మతో సిద్ధపాటు

సీ|| దైవాత్మ నొందుడి - దైవాంశములు విన
నవలీలగా మీకు - నర్ధమగును

దైవాత్మ నొందుడి - దైవ చిత్తాను సా
రముగ వర్తింప ని - ష్టము కలుంగు

దైవాత్మ నొందుడి - ధర్మముల్ బోధింప
వాగ్ధాటి వరుసగా - వచ్చుచుండు

దైవాత్మ నొందుడి - ధైర్యంబుతో ప్రతి
పాపంబు నెదిరింప - బలము వచ్చు

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

 • Like this page on Facebook

 • Tweet this page on Twitter

 • Recommend this website on Google +