Note: త్రిత్వమును అర్థం చేసుకొనుటకు దేవదాసు అయ్యగారు 3 ఉదాహరణలు చెప్పిరి. వాటిని కుదించి అన్ని ప్రసంగములను ఒకే పేజీలో మచ్చుకి ఇవ్వబడినవి.


దదేవుడు ఆదికాండములో ఒక్కరిగాను, మనిషికి దైవజ్ఞానము లభించిన తర్వాత క్రొత్తనిబంధనలో ముగ్గురు గాను ప్రత్యక్షపరచబడెను. ఈ ముగ్గురు ఒక్కరే గాని ముగ్గురు వేరు వేరు. ఇది మర్మము.

యోహాను 14వ అద్యా. లో "10. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు. 11. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి." . మరియు "యోహాను 14వ అద్యా. లో 13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. 14 ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. 15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. ". అని వ్రాయబడి యున్నది.

ఇది ఎట్లు సాధ్యము. ఈ మర్మము గ్రహించుటకు ఉదాహరణలు


I. సూర్యుడొక్కడే, అకాశములో మాత్రమే నివాసస్థలము. కాని దాని శక్తి వేరు, కాంతి వేరు, వేడి వేరు. ఈ మూడు ఒకదానిలోనే ఇమిడి ఉన్నవి గాని వాటి వాటి పనులు వేరు.


Holy Trinity


II. చెట్టులో పండు ఇమిడి యున్నది, పండులో విత్తనము ఇమిడి యున్నది, విత్తనములో చెట్టు ఇమిడియున్నది.



Holy Trinity

III. అనాది ప్రణాళిక, దైవ వాక్యము, పరిశుద్ధుల నీతి క్రియలు (నిత్యము వెలుగుచున్న దీపము, వొత్తి, వెలుగు)



సీ|| సత్కృపా వర్షంబు | సర్వంబుపై కురి
యించు జనకుని చూ | పించు వాన

దేవత్వమును తేట | గా వెళ్ళడింపను
వచ్చిన సుతునగు పరచు వెలుగు

ప్రభుని బోధను వివ | రముగను బోధింప శు
ద్ధాత్మ నీలోగల | డనును గాలి

తండ్రి గద్దెకు ప్రక్క | తనయుని గద్దె నీ
అంతరంగంబు శు | ద్ధాత్మ గద్దె


తే||గీ|| ఒకరు ముగ్గురు ముగ్గురు | ఒక్కరె ఒకరు
జ్వాల వేడి వెల్తురు | వేరుపరుపలేము
ముగ్గురునులేని ఒకరిని మ్రొక్కలేము
త్రిత్వమర్మము రక్షణ దిక్షయాయె 146