మత్తయి 3:11 మార్కు 1:8 లూకా 3:16
యోహాను 1:33 అపో.కా 1:5 లూకా 3:22
యోహాను 14:26 యోహాను 20:22 అపో.కా 2వ అధ్యా
అపో.కా 8:15 అపో.కా 10:44 అపో.కా 15:8
అపో.కా 19:6 రోమా 14:17 తీతు 3:5
1 పేతురు 1:12 ఆది 1:1-3 అపో.కా 9:31
2 కొరింథి 1:12 యోహాను 16:8-11 రోమా 15:23
గలతీ 5:5 యోహాను 7:37-39లూకా 1:16

ఆత్మ స్నానము కోరే విశ్వాసులారా! మీ జీవితకాలమంతయు ఆత్మ వలన నడిపింపబడుదురుగాక!

సర్వజనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించును అని పాతనిబంధన గ్రంథము వలన తెలిసికొన్నాము (యోవేలు 2:28). నేను నీళ్ళతో బాప్తీస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చు ఆయన అనగా యేసు ప్రభువు మీకు పరిశుద్ధాత్మతో బాప్తీస్మమిచ్చును అని యోహాను బోధించెను (లూకా 3:16). ప్రభువు తన శిష్యులకు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును గూర్చి బోధించెను (అపో.కా 1:18). ఇప్పుడు ఆయన పరలోకమునకు వెళ్ళెను గనుక నూట ఇరివై మంది విశ్వాసులు యెరూషలేములో ఒకచోట కూడుకొనిరి. దైవాత్మ బాప్తీస్మము కొరకు కనిపెట్టుచుండిరి. అప్పుడు పరలోకమునుండి దైవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. వెంటనే వారికి ఇతర బాషలు మాట్లాడగల జ్ఞానము కలిగెను. ఆనాటి బోధవలన మూడువేలమంది క్రైస్తవ మత సంఘములో చేరిరి. ప్రియులారా! మీరుకూడ క్రీస్తు శిష్యులవలే దైవాత్మ ప్రవేశము కలుగునని నమ్మి, ప్రార్ధించి, కనిపెట్టిన యెడల నిశ్చయముగా కలుగును. ఈ మాట సర్వ మతములవారికి చెప్పుచున్నాము. పెంతెకొస్తు పండగనాడు పేతురు చేసిన ప్రసంగములో ఈ మూడు సంగతులు గలవు.

  1. మీరు మారుమనస్సు పొందండి (అనగా ఉన్న పాపములను గురించి పశ్చత్తాపపడి, పాప విసర్జన చేయవలెను).
  2. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి.
  3. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.
  4. ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని సంబంధించి యున్నది.

చదవరులారా! క్రీస్తుప్రభువు వచ్చునని బోధించుట అనునది యూదుల మతములో గలదు. ఆయన వచ్చి సమస్తమును నెరవేర్చి పరలోకమునకు వెళ్ళి మరల త్వరలో సజీవముగా భక్తులను తీసుకొని వెళ్ళుటకు రానైయున్నాడని బోధించుట అనునది క్రైస్తవమతములో గలదు. పెంతెకొస్తు అను పండుగ యూదులకు సంబంధించిన పండుగ. గాని ఆ దినమే క్రీస్తుప్రభువు శిష్యులకు క్రైస్తవ మత సంఘస్థాపన దినమై యుండెను. ఇది జరిగి సుమారు 2 వేల సంవత్సరములైనది. అప్పటినుండి క్రమ క్రమముగా క్రీస్తు బోధ సర్వత్రా వ్యాపించుచున్నది.