లెంటులోని ముప్పది ఐదవ దినము - సోమవారము

మూడు, నాలుగు మాటల వివరము

యోహాను 19:25-27; మత్తయి 27:45-46.

ప్రార్ధన:- యేసుప్రభువా! మిక్కిలి ప్రేమగల సమీపస్తులతో సిలువమీద నుండి మాట్లాడిన ప్రభువా! స్తోత్రము. నీవు మాట్లడిన మిక్కిలి ప్రేమగల మాటల నిమిత్తమై నీకు వందనములు. మిక్కిలి ప్రేమగలవారితో, మిక్కిలి ప్రేమగల నీవు, మిక్కిలి సమీప వాక్యములు చెప్పినందున నీకు వందనములు. నేడు ఈ చిన్న ప్రేమ చరిత్ర ద్వారా మాకు నీ సందేశము అనుగ్రహించుము. ఆమేన్.


విశ్వాస ప్రియులారా! ఈ వేళ యేసుప్రభువు ఇద్దరితో మాటలాడుట చదువుకున్నాము. ఇది వరకు అనగా నిన్న మొన్న, ఇద్దరితో మాట్లాడినారు.

ఈ వేళ తల్లితో, శిష్యునితో మాట్లాడినారు. తక్కిన శిష్యులు తోటలో నుండే దూరమగా పారిపోయినారు గనుక దూస్తులైనారు. కొండమీద కొందరు స్త్రీలు దూరముగా నిలువబడి ఏడుస్తునారు. అయితే ఇద్దరు మత్రమే సిలువకు దగ్గరగా నిలువబడి ఉన్నరని వ్రాయబడినది. వారు ఎవరనగా తల్లి మరియు శిష్యుడు. తల్లితో ప్రభువు చెప్పిన మాట 'అమ్మా నీ కుమారుడు'. శిష్యునితో చెప్పిన మాట 'ఇదిగో నీ తల్లి'.