లెంటులోని ముప్పది నాలుగవ దినము – శనివారము

రెండవ మాట వివరము

లూకా 23:43;

ప్రార్ధన:- రక్షణకర్తవైన దేవా! రక్షణ వార్త సిలువమీద ఉన్నది. నేరస్ధునికి అందించినట్లు మాకును నీ సందేశమును అందించుము. ఆమేన్. ఈ సిలువ కధలో అందరు ప్రభువును దూషించిరి. ఆయన సిలువ వేతలో పాల్గొన్న వారందరు యేసుప్రభువును దూషించిరి. ఆయన సిలువ వేతలో పాల్గొనని ఆ ఇద్దరుకూడ ప్రభువును దూషించిరి. అయితే భక్తులు దూరమున ఉండి ఏడ్చుచున్నారు. వారిలో ఎవరు ఎక్కువ?


మూడు గుంపులు :-


ఆయన పక్షముగా ఉన్న ప్రపంచములోని జన సంఘము అంతా ఈ 5వ భాగములో ఉన్నారు. కొందరు భక్తులు ఆ స్త్రీలవలె దుఃఖించేవారై యున్నారు. మరికొందరు రెండవ గుంపు వారివలె యేసుక్రీస్తు దగ్గరకు వెళ్లి, ఎందుకు చావాలి? తప్పించుకొలేవా? అనువారివలె దూషిస్తున్నారు. ఏలగనగా: 'ఆ శత్రువులు పట్టుకొని వెళ్తే మాత్రము ఈయనెందుకు వెళ్లలి. తప్పించుకొలేడా? సైతాను అరణ్యములో శోధిస్తాడని చెప్పి, ఆయన ప్రభువు వెళ్ళకుండా ఉంటే బాగుండును కదా! వెళ్లినాడు. గనుక సైతానుకు లోకువైపోయినాడు'.


ప్రభువు వెళ్లుట జయించుటకైతే, వారెమో సైతాను లోకువైనాడని అంటున్నారు. అలాగే నేటి రెండవ గుంపు వారును ప్రభువును అంటున్నారు.


3వ గుంపు:- అనేక పాపములు తెలిసినా, పదే పదే ఆ పాపములే చేస్తూ మరల ప్రభువును సిలువ వేస్తున్నారని హెబ్రీ 6వ అధ్యాయములో ఉన్నది.


4వ గుంపు:- ఎడమ ప్రక్క దొంగవలె మారు మనస్సు పొందనివారు.


5వ గుంపు:- మారుమనస్సు పొందిన దొంగవలె కొందరు తప్పు తెలిసికొని, ప్రభువు తట్టు తిరుగువారు.


6వ గుంపు:- ఈ చరిత్ర అంతా చూచి మారుమనస్సు పొందిన శతాధిపతి (రోమా గవర్నమెంటులో గొప్పవాడు).


ఈ పాఠము సిలువమీద మారి, మారు మనస్సు పొందిన వానిని గూర్చియే. ఆయన ఒక్కడే. ఇతడు ఎవరు? బైబిలులో అతనిని గూర్చి వ్రాయబడినది.


చాలాకాలమునకు మారిన వానికంటే, బందిపోటు దొంగగా చాలా కాలముండి మారిపోవుట అద్భుతము కాదా! కొందరు ఎంత ప్రార్ధన చేసినా మారరు. కొందరు క్షణంలో మారిపోతారు. లోకము పుట్టినది మొదలు లోకాంతము వరలు ఎందరు మోక్షానికి వెళ్తారో, అందరికి ఈ దొంగ ప్రతినిధి. ప్రతినిధి ఎందుకైనాడనగా సిలువమీద ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు గనుక ఇప్పుదును ఈలోకములో శ్రమలో ఉన్నవారే మోక్షానికి వెళ్ళగలరు. అయ్యగారు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు? సన్హెడ్రిన్ సభవారు అంతా, గవర్నమెంటువారు అంతా కలిసి, ఆయన సిలువ పాత్రుడని తీర్మానము చేసి పంపితే, సిలువపైనే ఉన్న బందిపోటు దొంగ ఈయనయందు ఏ నేరము లేదన్నాడు. గనుక గవర్నమెంటుకు కోపము రావలెను, యూదులకు ఎంతో కోపము రావలెను. యేసుప్రభువును, ఆ దొంగయూ ఏలాగు చనిపోతారు! వారందరి కోరిక నెరవేరుతుంది గనుక వారికి కోపము రాలేదు.


ఆ దొంగ వట్టి దొందకాదు. బందిపోటు దొంగ అనగా పగలు పగలే దోచేవాడు. మామూలు దొంగలు రాత్రుళ్ళు దొంగలిస్తారు. అందరు గుడిలోయి తీస్తే, వీడు వడిలోయే తీసికొనును. ఆ బందిపోటు దొంగ ఇంకా ఎవడు? అన్యుడుకాడు, యూదుడు. ఇతను యూదుడని ఋజువు ఏమనగా యూదుడు కాకపోతే సిలువవేయరు. సిలువ వేసినందున యూదుడు. ఈయన సిలువమీద ఉండి, క్రింద ఉన్నవారిని పరీక్షించుచుండెను. ఈయన గొప్ప పరిశీలన కర్త. బాధలో ఉన్నాడు. అయితే ప్రభువును పరీక్షించినందున, యేసుప్రభువులో ఏ దోహ్సములేదని రోమన్ గవర్నమెంటు జడ్జి చెప్పాలిగాని, కుడిప్రక్క దొంగ ఆ జడ్జి పట్టా తీసికున్నాడు. పిలాతు ఈయనయందు ఏ దోషము లేదన్నప్పుడు మాత్రమే కాదు, క్రియకుకూద సిలువకు అప్పగింపకుడదు. ఈయనయందు ఏ దోషములేదు అని తీర్మానించి, మినిట్స్ (అధికారిక సంభాషణలు వ్రాయు పుస్తకము)లో వ్రాసి సిలువకు పంపెను. ఆ పిలాతు ఈ బంధిపోటు దొంగ చేసినపని చేయలేకపోయెను. పిలాతు అనవలసినది. 'అయ్యా! నీవు భక్తుడవు, యూదుడవు, దేవుడవు, యూదుల రాజువు. వారు ఆసూయచేత అప్పగించినారు అని మాకును, మా రాణిగారికి తెలిసెను. గనుక వాళ్ల లెక్కేంటి! వారు అల్లరిచేస్తే నేను ఊరుకొనను. కైసరు పటాలము రప్పించి వారిని అణచి వేయుదును' అని అనవలసినది. అయితే ఈ దొంగ ధైర్యమున్నవాడు, పిరికివాడు కాదు. బాధపడుతూ, చచ్చిపోతూకూడ ప్రభువు పక్షముగా ఉన్నాడు. అది ఆలాగుంచండి. అతడింకొక మర్మము గ్రహించెను. అతడు(ఆ దొంగ) ఎన్ని ప్రసగాలు విని మారెను? ప్రభువు చేసిన ఒక్క ప్రార్ధనే 'తండ్రీ! వీరు.......ఎరుగరు, క్షమించుము' అను ఈ మూదు మాటలు గల ప్రార్ధనకు మారిపోయినాడు.


బైబిలు తరగతిలో

దొంగ అలాగే ఈ రెండే ముఖ్యము. తండ్రీ! అనే దానిలో ఆ దొంగ ఏమి గ్రహించెను. యూదులు దేవునిని తండ్రీ! అంటారు. అన్యులు దేవా! అంటారు. ఈ దొంగ తండ్రీ! అనే మాటవిని, ఈయన మా యూదులలో ఒకడే అని గ్రహించెను. వీరిని తామే క్షమించెను. ఇంతగా సిలువ వేసెవారినే అట్లు అంటుమ్న్నాదాయన. ఇంత దొంగనైన నన్నునూ, ఎరుగరనునా! వారిని అన్నట్టు నన్నును క్షమించుదునని అనడా! అని ధైర్యము తెచ్చుకొనెను.


ఈ దొంగ క్రీస్తు పక్షముగా ఉండే వాడు ఏలగనగా ప్రక్క దొంగను గద్దించుటవల్ల, నీ రాజ్యములో జ్ఞాపకము చేసికొమ్మని ప్రార్ధించుత వల్ల; క్రీస్తుకు పునరుత్ధానమున్నదని గ్రహించుటవల్ల; ఈయన చనిపోయి తిరిగి రాజ్యముతో వస్తాడు అని నిరీక్షించాడు. ఆ నిరీక్షణే లేకపోతే నీవు వచ్చేటప్పుడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసికొమ్మని ఎందుకంటాడు! ప్రభువు తన రాజ్యములో, తన సింహాసనము దగ్గర బందిపోటు దొంగనే చేర్చుకుంటే, అందరినికూడ తప్పక చేర్చుకుంటాడు.


అయ్యగారు ఆ దొంగతో 'ఓ బంధిపోటు దొంగ! నీవు ఏ ముఖము పెట్టుకొని నీ రాజ్యములో నన్ను చేర్చుకొనుమని అడిగినావు? నీవు మా పెద్ద మనిషివా! నీవు సజ్జనుడవా! చేతిలో బళ్లెము గలవాడవు, దోపిడివాడవు! ఎవరైనా అడ్డువస్తే పొడ్చిన ఘోరపాపివి! నీ రాజ్యములో చేర్చుకొమ్మని ఎలా అదుగుచున్నావు. ఊరుకో!" అన్నారు. తప్పిపోయిన కొడుకుతో "నీవు దూబరివి. మురికి బట్టలు వేసికొని మురికివాడవై, పందులు కాచి, పొట్టు తిని, ఏ ముఖముతో వచ్చావని" ఆ తండ్రి అనలేదు. అలాగే సిలువపైనున్న తండ్రియు అనలేదు. మారినవారి వెనుక సంగతులు తండ్రి ఎత్తడు.


పరలోకమునుండి వస్తూ వస్తూ రక్షణ తెచ్చి, ఇక్కడనుంది తిరిగి వెళ్తూ రక్షితుని తీసికొని వెళ్లెను. ఈ రెండు మిషనులు ప్రభువు నేరవేర్చెను.

దొంగ,'ప్రభువా!' అన్నాడు. ఎందుకనగా ఈయన చనిపోయిన కొంత కాలనికి పునరుత్ధానము జరుగునని, ప్రభువే వరుస సిలువమీద ఉండే కట్టుకొనెను. ఈ పాఠము చాలా పెద్దది. దొంగే పెద్దవాడు గనుక పెద్ద పాఠము. ఇందులో అనేక పాఠములున్నవి.


1వ పాఠము:- ప్రార్ధన: యేసుప్రభువా! నీవు రక్షించడానికి వస్తే, నీ రక్షణ కోరువారు రావాలే గాని, వేడుకొనవలెనే గాని, నిన్ను గ్రహించిన వారైయుండాలే గాని ఎటువంటి వానినైనా నీవు రక్షిస్తావు. ఇదే మా ఆనందము గనుక స్తోత్రము. ఓ ప్రభువా! తుదకు మోక్షములోనికి నీవు చేర్చుకొనే 'పరిశుద్దులు' ఎవరులేరు. అందరు ఒకప్పుడు నేరస్ధులే. ఆ నేరస్ధులలో ఒక నేరస్ధుని సిలువమీద నుండి పైకి తీసికొని వెళ్లినావు. అతని చరిత్రలోనున్న ముఖ్యాంశములు మా జీవితమునకు గొప్ప పాఠముగా నిర్ణయించుము. ఆమేన్.


ప్రార్ధనలో చేసినట్లు పరలోకములో ఉన్నవారిలో ఎవరు కూడా నేరస్ధులుగా ఉండకుండ మోక్షనికి వెళ్ళరు. ఆదాము, హవ్వలు నేరస్ధులుగా అయిన తరువాతే మారుమనస్సు పొంది మోక్షమునకు వెళ్లిరి. వారు మొదలుకొని ఈ నిమిషము వరకు మోక్షమునకు వెళ్లినవారు, ఒకప్పుదు నేరస్ధులై మారుమనస్సు పొంది మోక్షమునకు వెళ్లినవారే. ఒక బందిపోటు దొంగను గూర్చి మాత్రమే సువార్తికులు నేరస్ధుడని వ్రాశారు. అతడొక్కడే నేరస్ధుడా? ఆది నుండి మోక్షనికి వెళ్లిన భక్తులందరు ఒకప్పుడు నేరస్ధులే. నేరస్ధులను నేరములేని వారినిగా మార్చి చేర్చుకొనుటకే యేసుప్రభువు వచ్చాడు. ఈ వరండామీద నేరస్ధులు కానివారు ఎంత మంది ఉన్నారో! మీరు నేరస్ధులుగానే ఉన్నారు గాని ప్రభువు రద్దు చేసినందున పరిశుద్ధులైరి. ఏ విషయములోనైనా మీరు నేరస్ధులుగా ఉంటే నిరాశపడవద్దు! ఆ నేరస్ధుని మార్చుటకు; అతడు నేరస్ధుడు కాడని తీర్పు తీర్చుటకు; 'పశుద్ధుడు' అని మోక్షము చేర్చుటకు; ప్రభువు సిలువలో ఎంత ప్రత్నించినారు! మూడు అంశములు ఇక్కడ ఉన్నవి.

ఆయన మనలను మార్చవలెననే ఇటువంటి కూటములు లోకమంతట పెట్టించుచున్నారు.


ఆ నేరస్ధుని మార్చిన ఆయన ఈ నేరము మార్చడా అనుకొనుటకు ఈ చరిత్రలో ఒక ఆధారము కనిపిస్తున్నది. లోకాధికారులు అతనిని నేరస్ధునిగా తీర్పు తీర్చినారు. ప్రభువు అతనిని

పరలోకాధికారి ఈ రీతిగా తీర్చిరి. నమ్మితే మన విషయములోకూడా అదే జరుగును. మూడవదిగా ఆయన చేర్చుకున్నాడు. మార్చితే, తీర్చితే గొప్ప సంగతేగాని, చేర్చుకొనకపోతే పై రెండు ఎందుకు! గనుకాప్రభువా! నేను మారలేకపోతున్నాను. నన్ను మార్చుము. నేను అపరాధినని నాకు బాగా తెలుసు. నన్ను పరలోకమునకు యోగ్యునిగా తీర్చుము అనగా తీర్మానించుము. నా బలహినతలు పరిష్కరించుము. తుదకు అతనిని మోక్షములోనికి చేర్చుకొన్నట్లే, నన్నుకూడ మోక్షములోనికి చేర్చుకొనుము'. ఇది నేటి పాఠము.


2వ పాఠము:- పోయినవారము మార్చుట, తీర్చుట, చేర్చుట నేర్చుకొన్నాము. ఈ మూడు ప్రార్ధనలు ఎవరంతట వారే నేర్చుకొనండి. రాజమండ్రిలో పెర్నాట్రిస్ అనే డాక్టరుగారు ఒకరున్నారు. ఆయన రోడ్డుమీద సైకిల్ పై వెళ్లుచూ, ప్రతివారి ముఖములోనికి చూస్తూ వెళ్లేవారు. ఒక మనిషి దగ్గరకు రాగానే సకిల్ ఆపి నిలువబడి, 'నీలో ఫ్లాని జబ్బు ఉన్నది' అని చెప్పి ఒక చిన్న స్లిప్(చీటి) అతనికిచ్చి, రేపు ఉదయము ఆస్పత్రికి వెళ్లి మంది తీసికో అని చెప్పేవారు. తన నోట్స్లో ఇతని కధ అంతా వ్రాసికొనేవారు. మరుసటి ప్రొద్దున్న ఆస్పత్రికి దొరగారు వెళ్లి, పలాన వారు వచ్చారా అని కనుగొని, వాడు రాకపోతే మాత్రము అరెస్టు చేయించేవారు. ఆయన సైకిల్ దిగగానే దగ్గరున్న మనిషి గజగజలాడేవాడు. సిలువమీద ఒక ప్రక్క మారు మనస్సు పొందని అక్రమకారుడు, మరొక ప్రక్క మారుమనస్సు పొందిన అక్రమకారుడు, ఇంకొక ప్రక్క అక్రమకారుడుగా ఎంచబడిన ప్రభువు ఉన్నారు. ఆ డాక్టరుగారు అందరిని వదిలి జబ్బుగా నున్నవాని దగ్గరకు వచ్చినప్పుడు, 'నా దగ్గరకే ఈయన వస్తున్నాడు' అని ఆరోగి గ్రహిస్తాడు. ఇద్దరు అక్రమ కారులున్నప్పుడు ప్రభువును కూడ అక్రమకారులలో చేర్చి, సిలువ వేసిరి. పైకి అది కనిపించుచున్నది. కాని అంతరంగములో ఈ డాక్టరుగారు(ప్రభువు) అక్రమకారులలో అక్రమకారులైన వారిని బాగుచేయడానికే సిలువ మీదకి వెళ్లిరి. ప్రభువు అక్రకారులలో ఒకడుగా ఎంచబడెనను మాట ఇప్పుడు నెరవేరినది. 'అక్రమకారుల దగ్గరకు నన్నెందుకు తీసికొని వెళ్తారు? నేను అక్రమకారుడనుకానని' ప్రభువు అనవలసినది కాని అనలేదు. ఎందుకంటే నేను అక్రమకారుల దగ్గరకు వెళ్లినప్పుడు అక్రమకారులు మారవచ్చు. వారు మార్పు పొందుటకు గడువు ఇవ్వాలి అని ప్రభువు మనస్సులో ఉన్నది. అలాగే లోకమంతటికి బోధించుటకై బోధలులను పంపించడము వారు మారుమనస్సు పొందుటకే. అయితే ప్రభువు వలన ఒకడు మారినాడు గనుక మోక్షానికి వెళ్లినాడు. రెండవ వాడు మారలేదు గనుక పాతళ లోకమునకు అరెస్టు అయినాడు. ఆ డాక్టరుగారు చేయించినట్లు; ప్రభువు దగ్గర మారినవారు మోక్షానికి, మారనివారిని వారి పాపమే అరెస్టు చేయించుచున్నది.


సాధు సుందర్సింగ్ చరిత్ర చదివినారు గదా! దానిలో ప్రభువు చెప్పినారు: 'దేవుడెవ్వరిని నరకానికి పంపడుగాని వారి పాపమే వారిని పంపుచున్నది'. అమెరికాలో రైలుబండి పడిపోయింది. అనేకమందికి కాళ్ళు, చేతులు విరిగాయి, గాయములు తగిలినవి. అందులో ఒక మిస్సమ్మ(దొరసాని) ఉన్నది. ఆమెకుకూడ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలాయి, ఆమె లేవలేదు. అయితే, బాగా ఉన్నవారి వైపు ఆమె చేతులెత్తి, 'నన్ను తీసికొని వెళ్లండి. వారి గాయలకు కట్లు కడతానన్నది'. ఆమె డాక్టరు. అట్లే ఆమెను తీసికొని వెళ్లగా కట్లు కట్టెను. ఆ మిస్సమ్మ సండేస్కూలులో అయ్యగారు మాస్టరుగారు. ఆ డాక్టమ్మవలె ప్రభువు శ్రమలో ఉండి, ఒక ప్రక్క పాపులను రక్షించెను. కుడివైపున నున్న వాని రక్షించెను. శ్రమలో ఉన్నప్పుడే, శ్రమలో ఉన్న వ్యక్తిని రక్షించినారు, విశేషము గదా! అప్పుడే ఆయన ఒకరిని రక్షించినారు, శ్రమ ఇప్పుడాయనకు లేదు గనుక ఎక్కువ మందిని రక్షిస్తారు. గనుక సిలువ వేయబడిన చరిత్రలో ఇది రెండవపాఠము.


3వ పాఠము:- ఎఫెసీ 4:8లో ప్రభువు చెరను చెరగా కొనిపోయెనని వ్రాయబడెను. ఇది అనగా మనముండే భూమి గుండ్రముగా నున్నది. అది అనగా పైన కనబడేది ఆకాశము. భూమి క్రిందది పాతాళలోకము. ఇదొక కధ.


ఒక కధ:- పాతాళలోకంలో రెండు డిపార్టుమెంటులు ఉన్నాయి. పాతాళలోకమంతా ఒకటేగాని దానికి వందల మైళ్ల దూరములో రెండు గదులున్నవి. ఒక కంపార్టుమెంటులో భక్తులున్నారు. వారిలో ఇద్దరు మనకు బాగా తెలిసినవారు. ఒకరు అబ్రాహాము, మరొకరు లాజరు. రెండవ కంపార్టుమెంటు పాతాళలోకమే. అదే హేడెస్సు లేక చెర. మొదటి కంపార్టుమెంటు పేరు భక్తుల చెర. ఇది మంచి చెర గనుక బాధ లేదు. విడి ఖైదీలు గనుక వారికి బాధలేదు. చెర అన్నపేరేగాని వారికి బాధలేదు. దాని అడుగుది చెరయే. దానికి అయ్యగారిచ్చిన పేరు చిన్న నరకము. అసలు పెద్ద నరకములోకి రాకముందు, మార్పులేని అందరు చిన్న నరకములోనికి వెళ్లలి. చిన్న నరకములో మనకు తెలిసిన ఆయన ధనవంతుడు, చెరలోని ధనికుడు పైనున్న అబ్రాహామును చూచి లాజరును పంపమనెని అడిగెను.


ఇప్పుడు ప్రభువు సిలువపై చనిపోయి, ఈ కంపార్టుమెంటుకు దిగిరి. ఇది మొదటిది. దీనికి పరదైసు అని పేరు. ఈ పేరు ఆదామునుండి ఉన్నది. ప్రభువు సిలువపై శ్రమలో ఉన్నాడు. ఆయన చనిపోయెనని. అందరూ అనుకున్నారు గాని తిన్నగా పరదైసుకు దిగెను. ఆ పరదైసుకు వెళ్ళునప్పుడే, కుడిప్రక్క దొంగతో 'నేడు నీవు నాతోకూడ పదైసులో ఉంటావు' అని చెప్పిరి. మారిన వానికి అపుడు చాలా ఆనందము కలిగెను. ఆయన (ఆ మారిన దొంగ) ఒక సన్నిధి కూటములో అంగీతో పాదియై వచ్చి ప్రభువు భోజనము ఇచ్చెను. పరదైసు వెళ్లినందున ఆ మాత్రము చేయవద్దా! ఆ దొంగ మారి పరదైసు వెళ్లివందువల్ల ప్రభువుతో అంగీవేసుకొని వచ్చి సంస్కారమిచ్చెను. పైది, క్రింది కంపార్టుమెంటులు చెరలే. మొదటి కంపార్టుమెంటులోని చెరకు చెరవేసి, పరలోకానికి తీసికొని వెళ్లెను.


మీ కొరకు చెరను అనుభవించి, ఆ చెరను చెరగా తీసికొని వెళ్లినాను గనుక మీకిక చెరలేదు(ఎఫెసీ.4:8). అని ప్రభువు చెప్పినట్లున్నది. ఈలాగు ఆయన చెరను చెరగా పట్టుకుపోయెను. సిలువ మ్రానుమీద ఆయన శ్రమపడినందున మనకు చెర తప్పెను. ఒక మాట: అబ్రాహాము అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళకూడదని అన్నాడు. అక్కడివారు ఈక్కడకు వస్తే వారికి వేదన ఉన్నది. గనుక వచ్చిన యెడల మహా వేదన ఉండును. పీర్ల పండుగకు అగ్ని గుందములో పరుగెత్తుతారు. కాలవు గాని, కాళ్లు వేడెక్కును. అయ్యగారు పరుగెత్తినారు గాని కాలలేదు.


ధనికుడు - 'యాతన పడుచున్నాడు'. మొదటి కంపార్టుమెంటు వారు క్రిందకి వస్తే యాతన పడుదురు. పీర్ల గుండములో (మొదటి కంపార్టుమెంటులో) బొబ్బలు లేకపోయినా కాలును గనుక ప్రభువు చెరను చెరగా పట్టుకొని వెళ్లిపోయెను. ఇప్పుడు హేడెస్సులో వారికి యాతన ఉన్నది. సిలువ కార్యక్రమము అయిపోయింది గనుక ఇప్పుడు కాల్పు ఉండదు, గాని యాతన ఉన్నది. అయితే పరదైసులోని భక్తులు పాతాళములోనికి వచ్చినా, వారికి బాధలేదు గాని పాతాళములోని వారికి బాధ ఉన్నది.


షద్రకు, మేషాకు, అబెద్నెగోలు కాలనట్లు పరదైసువారు పాతాళనికి వచ్చినా కాలరు. రేపు మనమందరము పరలోకానికి వెళ్లిన తర్వాత, వెయ్యేండ్ల పాలనలో మనమందరము తిరిగి వస్తాము. గాని అప్పుడు క్రొత్త గుంటూరు ఉంటుంది. ఈ గుంతూరు కాదు. ఇది గుంట+ఊరు= గుంతూరు. వెయ్యేండ్ల పాలనలో అగ్నికాలదు, నీటిలో మునిగి చావడము ఉండదు. పరదైసువారు పాతాళములో బాధితులకు, బోధ చేయుటకు వెళ్తారు. గాని భయపడుటకు వెళ్లరు.


4వ పాఠము:- భూమిమీద ప్రభువు ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. అందుకే శిష్యులు వచ్చిన బిరుదు. 'యేసుతో కూడ ఉన్నావారు' బాలిక పేతురుతో అదే అనెను. సన్నిధి కూటములు చేయు వారందరికి అదే బిరుదు ఉండును. భూలోకములో ఉండగానే దొంగకు వచ్చిన బిరుదు 'నాతో ఉంటావు'. 11మందికంటే వచ్చిన గొప్ప బిరుదు అనగా 'నీవు నాతో ఉంటావని' అతనికి వచ్చెను. ఎంత గొప్ప ధన్యత! ఇతనే గొప్పవాడు. ప్రభువు పరలోకమునకు వెళ్లుచూ 'సదాకాలము మీతో ఉన్నాను' అని చెప్పెను. ఇది వేరు. 'నాతో ఉంతావు' అనేది వేరు. మరొక అంశము ఏదనగా: మీరు యేసుతో ఉన్నారా? మీతో యేసు ఉంటారు. అప్పుడు మీరు పరదైసుకు, మోక్షానికి వెళ్తారు. ఎంతకాలము బ్రతికినా మన గురి మోక్షమే. అది లేకపోతే హేడెస్సే గురి.


ప్రార్ధన:- ప్రభువా! వాక్యములోనుండి వాక్యము, వ్యాఖ్యానములోనుండి వ్యఖ్యనము, అర్ధములో నుండి అర్ధము, అనుభవములో నుండి అనుభవము, ప్రార్ధనలో నుండి ప్రార్ధన, సాక్ష్యములో నుండి సాక్ష్యము, మార్పులోనుండి మార్పు, జవాబులోనుండి జవాబు, మా జీవిత కాలమంతయు ఊటలోనుండి తెచ్చుకొనగల కృప దయచేయుము. ఈవేళ నావైపు, ఇంకొక సిలువవైపు చూచుచు అందునుండి సారము గడించుకొనగల కృప దయచేయుము.


5వ పాఠము:- కల్వరి కొండమీద మూడు సిలువలున్నవి. రెండు సిలువలు చచ్చిపోయి బ్రతికిన వారి సిలువలు. మూడవ సిలువ మీది మనిషి చనిపోవడము ఎరుగుదుము గాని బ్రతకడము తెలియదు. ఇప్పుడు క్రైస్తవ సంఘము యొక్క కధయి అట్లే ఉన్నది. కొందరు మార్పులేని దొంగవలె, నేరస్ధినివలె ఉండి ఉండి ఆ తరువాత మారి, చనిపోయి పరలోకములో బ్రతికే ఉన్నారు. వారెంత ధన్యులు! ప్రభువు అందరికొరకు చనిపోయి, ఇప్పుదు అందరి కొరకు జీవిస్తునారు. ఇది సిలువ జరిగిన కధ.


ఇది వరకు దొంగ మారుమనస్సు పొందిన కధ విన్నాము. ఆ కధలో రెండు ముఖ్యాంశములున్నవి.

దానికి ప్రభువు గొప్ప జవాబిచ్చెను. అది 'నీవు నేడు నాతో పదైసులో ఉందువు' ఈ సంగతి విని భూమిమీద ఉన్నవారెవరైన సరే మార్పుచెంది, ప్రార్ధించిన యెడల వారి ప్రార్ధన ప్రభువు తప్పక వింటారు. ఆయన మన ప్రార్ధనలు వినక పోయినట్లయితే, సిలువమీద దొంగ ప్రార్ధన విన్నట్లు, జవాబిచ్చినట్లు వ్రయించడు. ఆ దొంగ ప్రార్ధన, వానికి ప్రభువిచ్చిన జవాబు పాపులందరికి ఆదరణ గనుక గొప్ప ధైర్యము కలుగుచున్నది.


దొంగ ప్రార్ధనలో గొప్ప రహస్యమున్నది. అది 'రాజ్యమును' గూర్చినది. 'ఆయన రాజ్యమంటే ఏమో సిలువపైనున్న దొంగకేలాగు తెలిసిందో' తెలియదు! ఆ సిలువమీద ఉన్నవారికి రాజ్యమేలాగు లేదు. అది కావలని అతడు అడుగలేదు. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకముంచు కొనుమంటే, 'చేర్చుకొమ్మని' అర్ధము. యెషయాలో ప్రభువు రాజ్యము, శాశ్వత కాల రాజ్యమని ఉన్నది. అది అతనికి తెలుసి, ఆ రాజ్యములోనికి చేరాలనే ఆశ ఆ దొంగకు కలిగినది. ప్రభువుకు భూలోకములో రాజ్యమున్నది. పాపలోకములో పాపులమధ్య అక్కడక్కడ, ఇక్కడ ఒక్కొక్క విశ్వసి ఉంటే వారిలో ఆయన రాజ్యమున్నది. అందుకే ప్రభువు ఈ లోకములో ఒకమాట అన్నారు: దేవుని రాజ్యము మీతోనే ఉన్నది. అయితే ఆ దొంగ మనస్సులో ఉన్నది అది కాదు. ఇప్పుడు ఈయన చనిపోయి లేచి, పరలోకానికి వెళ్లి రాజ్యము స్ధాపిస్తాడని తెలిసికొని, ఆ పరలోక రాజ్యములోకి చేర్చుకుంటాడని తెలుసుకున్నాడు.


యేసుప్రభువు కొండమీద ప్రసంగములో 'దీనమనస్సు గలవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది' అని చెప్పెను. అది పూర్తిగా పరలోక రాజ్యము. దానిలో పాపులు, పాపము, పాపము వలన కలిగే కీడు, దయ్యాలు లేవు. అట్టి రాజ్యములో చేర్చుకొమ్మని దొంగ అడిగాడు. ఇంతకు ముందు చెప్పినది, కళంకము లేని పరలోకములో ఉన్న పరలోకము. ముందు చెప్పింది, విశ్వాసులులలో ఉన్న రాజ్యము. పరలోక రాజ్యము అనగా పరలోకములోని దేవుని రాజ్యముకూడ విశ్వాసులలోని దేవుని రాజ్యమే. భక్తులకున్న నిరీక్షణ ఏమనగా పరలోక రాజ్యము ఎప్పటికైనా ఈ భూలోకమునకు సంపూర్ణముగా వచ్చివేస్తుంది. ఈ రాజ్యము సంపూర్ణముగా వచ్చినప్పుడు లోకములో పాపాలు, దయ్యాలు ఉండవు. భూమి పరలోకమువలె శుభ్రముగా ఉండునని యెషయాలో వ్రాయబడినది. అక్కడక్కడ పాత నిబంధన గ్రంధములో కొద్దికొద్ధిగా ఉన్ననూ, యెషయాలో ఈ సంగతి వివరముగా నున్నది. దానికి మించి ప్రకటన గ్రంధములో ఎక్కువ వివరముగా నున్నది. ప్రకటన గ్రంధము సిలువపైనున్న దొంగకు తెలియదు. అప్పటికి అది వ్రాయబడలేదు. లూకాలోను రాజ్యమును గురించి ఉన్నది. ఇదియు అప్పటికి వ్రాయబడలేదు గాన అదియు దొంగకు తెలియదు. ప్రభువు చనిపోయి లేచిన తరువాత, 40 దినములున్న తరువాత, ఆరోహణమైన తరువాత, పత్రిక (ప్రకటన) వ్రాయబడిన తరువాత, సంఘము స్ధాపింపబడిన తరువాత, లూకా సువార్త వ్రాయబడెను. బైండింగులో ఇట్లు పెట్టిరి. ఈ కధలన్నీ ఇతనికి తెలియదు. యెషయాలోనిదే అతనికి తెలుసు.


అది ఏలాగు తెలుసు అనగా ఇతడు మంచివాడుగాను, ఉన్నప్పుడు శాస్త్రులు, పెద్దలు, తల్లిదండ్రులు సునగోగులలోను చెప్పింది విన్నాడు. లేకపోతే ప్రభువుయొక్క రాజ్యము సంగతి ఆలాగున వినకపోతే దొంగకేలాగు తెలియగలదు!

ఎవరైతే బోధించినారో వారే నమ్మలేదు; ఆయన రాజ్యము ఇవ్వనందున. ఆయన (మెస్సీయ) వస్తే రాజ్యము ఇచ్చేవారు. ఈయన పాపులతో దయ్యాలతోపడి ఉన్నాడు అని ఆయనను (ప్రభువును) చంప జూచిరి.


దేవుడని, యూదులరాజు అని చెప్పుచున్నారే గాని, 'ఈయన రాజ్యము ఎక్కడ కనిపించలేదని' చంపివేసిరి. ఇతను దొంగ అయితే అయినాడుగాని ఆయన రాజ్యమును గ్రహించి; "ఈయనకు ఈలోకములో లేదుగాని పరలోకములో ఉన్నది". ఉన్నది ఎక్కడో ఒక చోటు ఉండునని గ్రహించెను. అంతేకాక, దొంగ తలముందే రాజని వ్రాయబడి ఉన్నది. యూదుల రాజు అని ఉన్నది. దొంగకూడ యూదుడే గనుక ప్రభువు రాజే గనుక; ఆయనకు అందులో రాజ్యమున్నది గనుకను, నాకును పాలు దయచేయుమని ఆయనను అడిగి నిరీక్షించెను.

6వ పాఠము:- Argument (సంవాదము):- ప్రభువుకు భూలోకములో రాజ్యములేదు. ఆయనకు పరలోకములో ఉన్నది. నేను ప్రార్ధించాను గనుక నాకు పరలోకములో ఉన్నదని గ్రహించెను. బొధలో ఉండికూడా యూదా ఎట్లు తప్పుకున్నాడో, ఇప్పుడును అట్టి పెద్ద మనష్యులున్నారు.

ఈలాటివి పెట్టుకొని ఎడమ ప్రక్కవాడు పాదైనాడు. యూదులరాజును సిలువ వేయుమని అందరు గోల పెట్టుచుండగా, ఆయన రాజ్యములేకుండా తీసివేయడానికి వీలులేదు అని దొంగ గ్రహించెను. దొంగ చరిత్ర, ప్రభువు చరిత్ర ఆలాగుంచి లోక చరిత్ర గుర్తించాలి. ఇది వరకు అక్కడక్కడ ఉన్న సంఘము ఇప్పుడు రాజ్యముగా ఏర్పడి, పరలోకానికి వెళ్లి అక్కడ కూర్చున్నది.


పైన చెప్పిన కార్యక్రమము అయిపోయున తరువాత వెళ్లిపోయున రాజ్యము మరలా దిగివచ్చును. అందరు అందులో లేరుగాని వారిలో అనేకులైన మఖ్యమైన భక్తులను, ఈ భూమిమీదికి తెచ్చి, వారితో ప్రభువు వచ్చి సింహాసనము వేసికొని, 12మంది శిష్యులకు 12 సింహాసనములు వేసి; ఆయన, వీరు కలసి రాజ్యపాలన చేయుదురు. అమెరికానుండి గుంటూరు వరకు అంతటా దేవుని రాజ్యమే. భూమిపై విష పురుగులు, పాపములు, గత్తర, చెత్త, పాములు, ముండ్లు, మరణాలు, యుద్ధాలు లేని రాజ్యము ప్రభువు స్ధాపించును.


ప్రకటన గ్రంధములో దేవుని రాజ్యమును పరలోకమునుండి ప్రభువు తీసికొని, ఆ రాజ్యముతోను, భక్తులతోను వస్తారని ఉన్నది. అదే దొంగ అప్పుడు చూచెను. నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు అనలేదు. నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు అని అన్నాడు. పై ప్రోగ్రాము జరిగితేనే గాని దేవుడు తన రాజ్యముతో రాడు. వెయ్యేండ్లపాలన మొదట్లో జ్ఞాపకముంచుకొనుమని అడిగెను. గనుక ఈ దొంగకు అది బోధపడుటకు యెషయా గ్రంధములో దేవుని రాజ్యమును గుర్చిన ప్రవచనములను శాస్త్రులు, పరిసయ్యులు బోధించిరి. ఇప్పుడు వస్తుందని ఆ మాటయొక్క అర్ధము కాదు. ఈలాగు ఈ దొంగ చరిత్రలో అనేక సంగతులు మిళితమై ఉన్నవి.


ఈ పూర్తి వివరమును ప్రభువు మీ హృదయములలో ముద్రించునుగాక. ఆమేన్.


కీర్తన: "రక్షణ కధ నడిపినావా - ఒకరిన్ - రక్షించి పరదైసు కొనిపొయినావా! = శిక్షితునికి బోధింపకనే శాంతి - లక్షణము చూపుచు రక్షించినావా!" ||ఏడు||