లెంటులోని ముప్పది రెండవ దినము - గురువారము

మహా ప్రార్ధన దినము

మత్త.26:36-46; మార్కు 14:32-42; లూకా 22:39-46; యోహాను 18:1.

ప్రార్ధన:- తండ్రీ! మనవ మాత్రునిగా గెస్తేమనె తోటలో నీవు పడిన శ్రమ, వేదన మా జ్ఞానమునకు అందదు. మా అందరి నిమిత్తము నాడు నీవు చేసిన ప్రార్ధనే నేటివరకు మమ్ములను విమోచించుచున్నది, బలపర్చుచున్నది, నడిపించుచున్నది గనుక నీకు వందనములు. అట్టి నీ ప్రార్ధనానుభవము మాకును కలుగుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రీ. ఆమేన్.


ప్రభువు గెత్సేమనే తోట వెలుపల ఎనిమిదిమంది శిష్యులను ఉంచిరి, తోటలోపలికి ముగ్గురుని మాత్రము తీసికొని వెళ్ళెను. ఈ ముగ్గురి యొద్దనుండి రాతివేత దూరము వెళ్ళి అక్కడ ప్రార్ధనలో నుండెను. ఆ మహాప్రార్ధన దినము మూడు ఏర్పాటు ప్రార్ధన స్ధలములు గలవు. అచ్చట ఆయన


అట్టి స్ధితిలో పెండ్లికుమారుడైన క్రీస్తుప్రభువు మిమ్ములను స్ధిరపర్చును గాక. ఆమేన్.


యేసుప్రభువా! మేము పరలోకమునకు వచ్చువరకు బహుమెళుకువగ నుండు స్ధితి అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు ప్రార్ధనలో నుండు శ్రద్ద అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు శోధనలో పడకుండ జాగ్రత్తగ నుండు స్ధితి అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు నీతో కలిసి సహవాస ప్రార్ధనలో ఏకీభవించు ఏకీభావము అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు ఆశ్రద్ద అను కునుకుపాట్లు రాకుండా మా కన్నులను కాపాడుము. మేము పరలోకమునకు వచ్చువరకు "మీరు శోధనలో ప్రవేశించకుందునట్లు మెళుకువగా నుండి ప్రార్ధన చేయండి" అను ఈ నీ గద్దింపు మాట, ఈ జాగరూకత వాక్యము ఈ వజ్రవాక్యము జ్ఞాపకముంచుకొను శక్తి దయచేయుము. ఆమేన్.


కీర్తన: "ఒక తోట లోపట - నాడు నీవు పడిన - సకల శ్రమ లిచ్చోట = నికటమైయున్నట్లుగా - నిట్టూర్పులతో - దలంతు – నకట నా రాతి గుండె - శకలంబై పోవునట్లు ||నా యన్న రాగదే||