లెంటులోని ముప్పదియవ దినము – మంగళవారము

సిలువలోని సిలువలు

యోషయా 53:3-5

ప్రార్ధన:- యేసుప్రభువా! ఈ వేళ మా సిలువలు మోసిన నీయెడల; నిన్ను చంపువారి కొరకు సిలువలు మోసిన నీ యెడల; నీతో సిలువ వేయబడిన దొంగ సిలువ మోసిన నీ యెడల; కృతజ్ఞత కలిగి ధ్యానము చేయునపుడు మా హృదయములను కృతజ్ఞతతోను, మా నేత్రములను కన్నీళ్లతోను నింపుము. కృతజ్ఞతతో కన్నీరు కార్చుటకు శుక్రవారము కూడుకొనినప్పుడు మా కష్టము కొరకు, వ్యాధి, బాధ కొరకు, కన్నీరు రాల్చక నీ యెడలగల కృతజ్ఞతతో కన్నీరు రాల్చే కృప ఇమ్ము. అప్పుడు నేలమీద, ఒంటిమీద, బట్టలమీదపడు కన్నీరు పరలోక నీ సింహాసనము వరకు వచ్చును. అట్లు కన్నీరు రాకపోతే యూదా ఇస్కరియోతువలెను, మారని దొంగవలెను, ఏడ్చిన స్త్రీలవలెను ఉందుముగదా! మాకు అట్టి ఆనంద కన్నీటితో నింపుకొను కృప ఇమ్ము. ఇట్టి ధన్యత, ప్రయత్నస్ధితి, ఈ కూటములో ఉన్న వారందరికిని ప్రాప్తించు కృప దయచేయుమని వెడుకొనుచున్నాము. దావీదు -నాయొక్క పాపము, కష్టమువల్ల, నా పడకను నా కన్నీటితో నింపుచున్నాననెను. మాకు అదికాదు. అనగా అది వద్దు. కృతజ్ఞతతో నిండిన హృదయమును, కన్నీటితో కృతజ్ఞతతో నింపుకొను కృప ఇమ్ము. త్వరగా రానైయున్న ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


శ్రమకాల ధ్యానవాస్తవ్యులారా! శ్రమ చరిత్ర అంతయు సువార్తికులు వరుసగా చేర్చియుంటే అది ఒక క్రమము అగును. ఆ చరిత్ర క్రమప్రకారముగా చెప్పుటకు 40 దినములు అవసరము. మనము ధ్యానము చేయునది కొద్ది కాలమే గనుక మిగిలినవి విడుచుచున్నాము. మంచి శుక్రవారము కొరకైన ధ్యానము ముందుగానే చెప్పుచున్నాము. లోకమంతా ఆ దినము ధ్యానింతురు.

ఈ మూడును మంచి శుక్రవారమున ధ్యానించవలెను.


మూడు సిలువలు ధ్యానము:- కొండమీద సిలువలు అనేకములున్నవి. అవి చిక్కులు గలవి. వీటిలో ప్రభువుయొక్క సిలువను జాగ్రత్తగా ధ్యానింపవలెను. ఆయన సిలువమీద మన పాపములు, శాపములు, వ్యాధి బాధలు అన్ని వేసుకొన్నారను సంతోషమును మీ హృదయములో ముద్రించుకొనవలెను. ఆ సిలువ మన కొరకే. కొండమీద మూడు సిలువలు కనబడుచున్నవని సువార్తికులు వ్రాసిరి. ప్రభువుయొక్క సిలువలో మూడు సిలువలున్నవి. కర్ర సిలువలో పై రెండు ఉన్నవి. అదిలేకపోతే 3 సిలువలు జ్ఞాపకమునకు రావు.
  • 1)పాపభార సిలువా?
  • 2) నేరముల సిలువా?
  • 3) కర్ర సిలువా?దేనికదే భారమైనది. ఆయన మనమీద ఉన్న ప్రేమనుబట్టి ఈ మూడును మోసెను.

ఆయనకు మనమీద నున్న ప్రేమనుబట్టి కర్ర సిలువ మోసెను.


ఆయనకు మనమీద నున్న ప్రేమనుబట్టి నిందలసిలువ మోసెను.


ఆయనకు మనమీద నున్న ప్రేమనుబట్టి పాపభార సిలువ మోసెను.


మొదటి, మూడు సిలువలు : కొండమీది కర్ర సిలువలు.


రెండవ మూడు సిలువలు :


నాలుగవ వరసలో మరి మూడు సిలువలు గలవు (యోహాను 3:16) దేవుడు లోకమునెంతో ప్రేమించెను. ఏట్లు మోసెను? కుమారుడు గోతిలోనికి దిగినయెడల తండ్రికి శ్రమకాదా? కుమారుడు శ్రమలోనికి వెళ్లిన యెడల తండ్రికి శ్రమగదా! కుమారుడు అంగీకరించిన యెడల తండ్రికి శ్రమగదా! (అది తడ్రికి సిలువ). ఆత్మను అంగీకరింపరు, అది ఆత్మకు సిలువ. ఒక నాస్తికుడు దేవుడు లేదనుచున్నాడు ఇది తండ్రికి సిలువ. తండ్రికి, అనగా త్రిత్వమునకు ఇది సిలువ అనగా త్రియేక దేవుడు ఈ రీతిగా సిలువను మోయుచుంటే మనిషికి ఏమి చింతలేదు. చీమకుట్టుట లేదు. పాపి, పాపమువల్ల బాధ వచ్చినపుడు ఏడ్చును. పాప ఫలితములను గూర్చి ఏడ్చును గాని నేను పాపము చేసితినే అని ఏడ్వడు. కష్టములు రాగా ఏడ్చెదరు గాని పాపమును చేసితినని ఏడ్వరు. శ్రమవల్ల ఏడ్పు రాదు. కోటానుకోట్ల ప్రజలందరు గాని పేతురువలె పశ్చాత్తాపపడి ఏడ్చువారుండరు.

మనకొరకు బాధపడుచున్న ప్రభువునుగూర్చి, రేప్చరు వరకు బాధ పడుచున్న ఆయనను గూర్చి ఏడ్వవలెను. ప్రభువు సిలువ శ్రమలో ఉండగా కొందరు స్త్రీలు ఏడ్చిరి. అప్పుడు ఆయన వారితో ఇట్లనెను. కుమార్తెలారా! నన్నుగూర్చి మీరు ఏడ్వవద్దు. మిమ్మును గుర్చి, మీ పిల్లలను గూర్చి ఏడ్వుడి. నేనైతే పాపమును, సిలువను, సమాధిని, మరణమును తప్పించుకొని బైటికి వత్తును గాని మీరైతే బైటికి రాలేరు గనుక మీ నిమిత్తము ఏడ్వుడి;

అట్టి కన్నీరు ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.


షరా:- అపవాది నీ శరీరములోని వ్యాధి, కష్టము, అవమానము, జ్ఞాపకము తెచ్చి కన్నీరు రప్పించుటకు పొంచియుండును. జాగ్రత్త.


కీర్తన: "నా ఋణము తీర్చిన - నా దేవా! నీ ఋణము తీర్చగలనా = నీవు - నాఋషివై బోధించి - నా సదులు చనిపోయి - నావని మరువగలనా" ||మూడు||