లెంటులోని రెండవ ఆదివారము

సిలువలోని నాలుగు పటములు

మత్తయి 4:1-11

ప్రార్ధన:- తండ్రీ! నీ శ్రమను ఎన్నిమార్లు తరచినను, అందులోని నూతనత్వము తరగదు. నీ శ్రమానుభవములోనుండి సంఘమునకు కావలసిన నూతన అనుభవములను ఎప్పటికప్పుడు అందించుచున్నందుకు వందనములు. నేడునూ నూతన వర్తమానము దయచేయుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


శుక్రవారము మనము ఏర్పర్చుకొనిన ప్రభువుయొక్క శ్రమచరిత్ర, ఆయన సిలువ దినమైయున్నది. ఆ వేళ జరిగేటటువంటి కధ యావత్తు చదివిన యెడల, అనేక విషములు మనకు బైలుపడును. ప్రతిసారి, ప్రతి ఏట ఈ కధ చదువుచున్నాము.ఇది మనకు క్రొత్తకాదు. ఈ సంగతులు మనము ఎరుగుదుము గనుక అది మార్చి చూపిస్తున్నాను. ఈ వేళ మన పాఠమును 4 పటములుగా విభాగించెదము.


1వ భాగములో సైతానుయొక్క దూతలైన దయ్యాలు, సాతాను ఉన్నాడు,


2వ వరుసలో సైతానువల్ల ప్రేరేపింపబడి ఉద్రేకము కలిగి, ప్రభువును సిలువవేసిన సైతాను ఏజెంటైన శత్రువులున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు మొదలగువారు.


3వ వరుసలో ప్రభువుయొక్క సిలువ, దానిమీద ఆయన పడ్డ పాట్లు.


4వ వరుసలో సిలువ వెనుక అనగా ఆ తరువాత ఉన్న కధ. అనగా సిలువ, సమాధి, పునరుత్ధానము మొదలుకొని పెండ్లికుమార్తె ఎత్తబడేవరకున్న చరిత్ర. (ఎత్తబడి యున్న చరిత్ర).


5వ భాగముకూడా ఉన్నది. అది ఈ వేళ చెప్పను. చెప్పినది జ్ఞాపకముంచుకొని వచ్చినది ఇతరులకు చెప్పండి.


1. మొదటిది - సైతాను దాని దూతల పటము.


2. రెండవది - సాతానుచే ప్రేరేపించబడిన మనుష్యుల పటము.


3.మూడవది - ప్రభువుయొక్క ఎత్తబడిన సిలువ పటము. ఆ సిలువమీద ఆయనకు కలిగిన హింస.


4. నాల్గవది - యేసుప్రభువు సమాధిలోనుండి లేచిన తారీఖు మొదలుకొని, పెండ్లి కుమార్తె పరలోకమునకు ఎత్తబడిన రేప్చర్ గడియ వరకు నాలుగవ పటము.


ఈ పటము కాగితముమీద వేయగలిగితే ఒకదానికంటే ఒకటి ఎత్తైనదిగా వేసి అగుపడునట్లు చేయగలను. వీటిని గాలిలో ఉన్నట్లు తలంచుకొనండి. మొదటి పటముయొక్క చరిత్ర ఏమి? ఇది అంతా జరగవలెను. సాతాను కధ నేను చెప్పను. ఈ వేళ మానవులకు బదులుగా వచ్చిన యేసుప్రభువు యొక్క చరిత్రలో, ఆయనకు కలిగిన శ్రమ మాత్రమే చెప్పెదను. ఈ అపవాది యేసుప్రభువును హింసించుటకు పూనుకొన్నాడు. సైతానుకు బైబిలు తెలుసు. మత్తయి 4:6లో సైతాను ప్రభువుతో మాటలాడేటప్పుడు, బైబిలు వాక్యము ఎత్తి చెప్పితే ప్రభువు మరియొక వాక్యము ఎత్తెను. యేసుప్రభువు మాటలాడి ఓడించితే, ఓడిపోవుదునని సైతాను అనుకొనెను గాని దాని మోటుతనము చొప్పున మరల శోధించెను.


త్రాగుబోతు తప్పత్రాగినపుడు, తానుపడిపోదునని తనకు తెలుసునుగాని త్రాగకమానడు. ఎందుకంటే మోటుగాడు గనుక మూర్ఖత్వమువల్ల మానడు. ఆలాగుననే యేసుప్రభువును వాడు శోధించుట మానలేదు. దయ్యములకు కూడా ఈ సంగతి తెలియును.


1. మొదటి పటము: కపెర్నహూములో ప్రభువు దయ్యములను వెళ్లగొట్టినపుడు వాటికి తెలిసి ఏమనెను? ఇంతలోనే మమ్మును నాశనము చేయుదువా? చేయవచ్చితివా? అనెను. వాటి నాశన కాలమెప్పుడన్నది? ఇదివరకు మీకు తెలిసినకాలమే. యేసుప్రభువు సిలువమీద చనిపోయి సమాధై, పునరుత్ధానమొంది, ఆరోహణమై, సంఘమును స్ధాపించి సంఘమెత్తబడిన పిమ్మట 7 సంఘాల శ్రమకాలముదాటి, హర్మెగెద్దోను యుద్ధాంతమందు అంతెక్రీస్తు, దయ్యములు నిత్యాగ్ని పాలగుదురు. అపుడు సైతానుకు చెర. అది వాటి నాశనకాలము (అది ఇంకారాలేదు, అనుభవములో ఉన్నది) ప్రభువు పరలోకమునకు వెళ్లి చాలాకాలమైనది. వాటికి, వారికి నాశనమున్నదని తెలియును. అప్పుడు రావలసినది గాని ఇప్పుడు మమ్మును ఎందుకు వెళ్లగొట్టుచున్నావు అని దయ్యము, ఆయనను అడినది గాని సైతాను ఏమియు అడుగలేదు. అతని గుండె కొట్టుకొను చున్నది. బైబిలు 1యోహాను 3:8లో సైతాను కార్యములు లయము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెనని గలదని సాతానుకు, దయ్యములకు తెలియును. అందుచేత దిగులున్నది. అయినను వాడు మూర్ఖత్వముతో నిండియున్నాడు. సాతానును మన పాదముల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును (రోమా 16:20) అని సంఘము గుర్తించినది, సంఘముకూడా సైతాను క్రియలను నాశనము చేయునని సైతానుకు తెలిస్తే మాత్రము మానునా? మానక ఇంకా కఠినత్వము కలిగించుకొనుచున్నది. (అట్లే మూర్ఖుడు తన మనద్దు మార్చుకొనక ఇంకను ఎక్కువ కఠినత్వము కలిగించు కొనును). అప్పుడు అనగా యేసుప్రభువు వచ్చినప్పుడు (పుట్టినపుడు) "మాకెందుకాశ్రమ, మమ్ము నాశనము చేయడు' అని అనుకొని దయ్యములు తమ దుష్కార్యములు మానివేస్తే, చిక్కులు లేకపోవును. మనుష్యులు మారుచున్నారా? దయ్యములు మారుటకు, ఒకటి పూర్తిగా చెడిపోయిన దయ్యము మారుటకు పూర్తిగా చెడిపోక సగము చెడిన మనిషే మారుటలేదు. పూర్తిగా చెడిపోయిన దయ్యమెట్లు మారును? ఇది ఒక పటము.


2) రెండవ పటము: ఇది దయ్యములవల్ల ప్రేరేపింపబడినవారి పటము. యూదులును, రాణువవారును ఎక్కువ తక్కువగా దయ్యము వంటివారే. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి బ్రతికివచ్చునని వారికి తెలుసునా? సైతానుకు తెలిసినంత బాగా వారికి తెలియదు. యోహాను ప్రకటన గ్రంధము వ్రాసిన తరువాత చదువుకొన్న వారికి తెలియును. అదైనా కల(అనుకొనుచున్నారు) అని తలంచుచున్నారు.అందుకే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రభువు అనెను. ఎరుగుదురు గాని ఎరుగరు. అందుకే మోటుతనముతో ఆయనను సిలువవేసిరి. అంతకుముందు కొంత కధ నడిచినది.311/2 సం||ల నుండి కుట్రాలోచన జరుగుచున్నది. ఏమని? యూదులమతమును, మోషేధర్మశాస్త్రమును ఈయన మాటలు పడగొట్టేట్టున్నవి. గనుక ఏమి చేయవలెను? అని మాట్లాడుకొన్నారు. అప్పుడు వారి మనస్సులో ఏమి తీర్మానించుకొన్నారు? చంపడము తప్ప వేరే మార్గము ఏదీలేదు. చంపడమే ముఖ్యము అన్నారు. ఇప్పుడు ఈ వరుసలో దుర్మార్గులైన శత్రువులున్నారు (కీర్తన 22). దావీదు- వారికి బాషాను ఎద్దులు, కుక్కలు అని పేరుపెట్టి, అవి నన్ను చుట్టుకున్నవని అనుకొన్నాడు. దావీదు వారికి ఆ పేరు పెట్టెను. వారు సిలువ వేస్తే అంతా అయిపోవును అని అనుకొన్నారు. ఎందుకనగా వారు ఒకటి విన్నారు: 'అబ్బాయీ, నీవు త్రాగుచున్నావు. రోడ్డుమీద పడతావు. వాంతి అగును. ఇదంతా ఎందుకు? త్రాగుట మానుము' అని అనినను వాడు వినక త్రాగును. అలాగ్ర ప్రధాన యాజకుడు చెప్పెను. మరియు కావలికాయువారుకూడా చెప్పిరి.


'మూడవ దినమున లేస్తానన్నాడు ఎందుకు లేవలేదు. అని వారు అన్నారు. రోగులను బాగుచేసినవాడు, చనిపోయిన వారిని లేపిన ఆయన,దయ్యమును వెళ్లగొట్టిన ఆయన; లేవలేడా? అని వారు గ్రహించుకొనవలెను, కాని గ్రహించలేదు గనుక వారు త్రాగుబోతువారే. ఎందుకంటే, ప్రభువుకు కీడుచేయవలెనని వారికి ఉన్నది. ఆయన లేచిన తరువాతనైన క్షమించుమని అడుగవలసినది. అప్పుడు తీరిపోవును. గాను వారు అట్లు అనలేదు. అవతల సైతాను పటలమున్నది. వారు కలువనివ్వరు (చెవిలో ఊదుదురు). ఇది ఘోరమైన పటాలము.


3వ పటము:- ఇది సిలువ పటము. ఇది లోకమంతట కల్వరిమిద కనబడే సిలువైనది. ఆయనకు, తలమీద, కాళీలో, చేతులలో బాధలు, ప్రక్కలోపొడిచిన బాధ ఉన్నది. ఇది సిలువ చరిత్ర. ఈ ప్రకారము జరిగినపుడు యూదులు దగ్గరున్నారు. వారుతోపాటు సైతాను, దయ్యములున్నవి. వారికి, వీరికి జాలిలేదు. ప్రభువు ఒంటరిగా సిలువవేయబడెను. ఈ మూడును జ్ఞాపకముంచుకొని మర్చిపోకుండా ఉండేటట్లు ఇతరులకు చెప్పండి.


4వ పటము:- ఆయన సిలువమీద ముండ్ల కిరీటము వేసికొన్నాడు. జయించిన తర్వాత నిత్యజీవ, విజయకిరీటము వేసికొనెను. గనుక వీరు సిగ్గుపడవలెను. ఇంత కష్టపడి ముండ్ల కిరీటము వేస్తే ఆయన మహిమ కిరీటము వేసికొనెనని సిగ్గుపడవలెను. ముండ్ల కిరీటము వేసినను, అది ఎల్లప్పుడు ఆయన తలమీద ఉన్నదా? రక్తధారగా ఉన్నాదా? పునరుత్ధానమైనప్పుడు ఏమియులేదు. ఈ (ముండ్ల)కిరీటము శ్రమతో ఓపికతో సహించినది, ఎందుకంటే అది పోనైయున్నదని ఆయనకు తెలుసును. చేతులయందు మేకులు కొట్టుటచేత రక్తము. ఆయన పునరుత్ధామైన తరువాత ఆ రెండు చేతులతో శిష్యులను దీవించెను. తరువాత పరలోకమునకు వెళ్లెను. ఇక రక్తము కారుటలేదు. ఆ చేతులు (ఈ చేతులు). ఆ కిరీటము, ఆ విజయ కిరీటము (మంచి శుక్రవారమునాడు) మేకులున్నవి.గనుక దీవింప వీలులేదు. అయినను ఆయన దీవించెను. ఆయన తాను చేయవల్సినవన్నీ పూర్తిగా చేసెను. ఈ మూడు పటములలో ఆయన సంపూర్ణ జయ రూపము కబడుచున్నది.


అట్టి జయరూపము ఈ నాలుగు పటముల పాటము ద్వారా ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.

కీర్తన: "జీవమును - నా జీవంబునకై - సిల్వపై నర్పించిన యేసూ = దేవా నేను నీ ఋణంబు - తీర్చ గలనా! ఎన్నటికైన" //నీకు ఏమి//