లెంటులోని ఇరువది నాలుగవ దినము - మంగళవారము

సిలువలోని నీతి చరిత్ర

కీర్తన 22:30-31

ప్రార్ధన:- దయగల ప్రభువా! నీ ముఖము ఎదుటను, ఈ శ్రమచరిత్ర ఉంచినావు. ఆ వెనుకను ఈ ప్రకారము సంఘములో జరుగుచున్నది. ప్రభువా! నీవు లోకములో నున్నపుడు నీకు, నీ ముఖము ఎదుట, నీకు రానున్న శ్రమలన్నీ కనబడుచున్నవి. అవి జరిగి ఇప్పటికి రెండువేల నాకుగు సం||లు అయినది. మాకు అవి మా వెనుక ఉన్నవి. మేము వెనుకకు తిరిగి వాటిని మా ముఖము ఎదుట పెట్టుకొని ధ్యానించబోవు చున్నాము. గనుక వాటిని నాకు చూపుము. నీ శ్రమలను ధ్యానించిన యెడల మాకు జయము, బలము కలుగును. నీవు దాచిపెట్టిన వర్తమానములు అందించుమని వేడుకొనుచున్నాము. నీ శ్రమచరిత్రలో మా శ్రమచరిత్ర జ్ఞాపకము వస్తున్నది. లోకములో శ్రమలున్నవి. అవి మా పాపములనుబట్టి కాదు. నిన్నుబట్టి, నీ వాక్యమునుబట్టి, నిన్ను ప్రార్ధించుటనుబట్టి, నీ మార్గములో నడచుటవల్ల మాకు శ్రమలు కలుగుచున్నవి. నీవు శ్రమలను లెక్కచేయలేదు. మేమును లెక్కచేయకుండునట్లు కృప దయచేయుము.


నీ శ్రమ చరిత్రలో నీ ఓర్పు, నీ శ్రమలో నీకు కలిగిన జయము కనబడుచున్నవి. నీ శ్రమలో మాకు ఆదరణ మాటలు ఉన్నవి. ఏడు ఆదరణ మాటలు నీవు పలికినట్లు మేముకూడా ఆదరణ మాటలు పలుకు కృప దయచేయుము. ఏదో ఒక శ్రమ కలిగియున్న మేము నీ ఎదుటికి వచ్చి కూర్చున్నాము. మా శ్రమలకు లెక్కయున్నది. నీ శ్రమలకు లెక్కలేదు. యేసుక్రీస్తును నమ్ముచున్న మీకు శ్రమలు ఎందుకు వచ్చుచున్నవి? అని సైతాను, తెలివిలేని జ్ఞానులు, బుద్ధిలేని మనుష్యులు, మనస్సాక్షి, జ్ఞానము, లోకమును అడుగుచున్నవి. హేళనచేయువారికి శాంతాముగా సమాధానముగా చెప్పు మనస్సు దయచేయుము. మా మాటలు నామకార్ధ మాటలు కాక ఆత్మలోనికి, జీవితములోనికి వెళ్లేటట్లు కృప దయచేయుము. నీ శ్రమలు ధ్యానించి మా శ్రమలు మరచునట్లు; మమ్మును నీ తట్టు, నీ శ్రమల తట్టు, నీ జయము తట్టు, నీ నిరీక్షణ తట్టు, బహుమానము తట్టు మా హృదయములను త్రిప్పుము. అవిశ్వాసికి శ్రమలు కలిగినపుడు కన్నీరు రాల్చుట, విసుగుకొనుట, కేకలువేయుట యుండును. విశ్వాసులు అట్లు చేయరు. శ్రమలు వచ్చినపుడు ఇది మా భాగ్యము, ఇది మా బహుమానము, ఇది మా విజయ ధ్వజము, ఇది మా విశ్రాంతి అని అతిశయింతురు. అట్లు సతోషించునట్లు మాకు శ్రమ పాఠము నేర్పుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.


ఇది సంఘ చరిత్ర. ఏమి చెప్పవలెను? శ్రమ పాఠములో చెప్పకుండ ఏమి కప్పవలెను? ప్రభుని శ్రమల ఎదుట నా శ్రమలు ఏ మాత్రము! యేసుప్రభువు ఈ లోకములోని శ్రమలన్నీ, తన కాళ్లక్రింద త్రొక్కిపెట్టి పై లోకములోనికి వెళ్లి తండ్రి సింహాసనముమీదనునట్లు, మనము శ్రమలు కప్పిపెట్టి మహోన్నత సింహాసన సిలువకు వెళ్లుదము. అది నలిగిన సిలువ. శ్రమ సిలువ, కర్ర సిలువ కాదు గాని మహిమ సిలువ.


ఒక సంతతివారు ఈ వాక్యములోనున్నట్లు చేయుదురు. ప్రభువుయొక్క శ్రమ చరిత్ర చూస్తే మొదటి కధ గెత్సేమనే తోటలో ప్రార్ధించిన పిమ్మట ఆయనను పట్టుకొన్న కధ.


ఈ కధన్నిటిని పొడుగున మనము నడచి, ఆ కధలోని నీతిభోధ కొద్ధిగా వినవలెను. ఈ కధలన్నిటికి ముందు జరిగిన కయప కధ, తరువాత మల్కు కధ.


అట్టి కృప దేవుడు నేడు మీకు దయచేయును గాక. ఆమేన్.


ప్రార్ధన:- ప్రభువా! నీ శ్రమకాలములో ఎందరిని మార్చినావో, పరలోకము వెళ్లిన తరువాత ఎందరిని మార్చినావో!! ఇక్కడున్న మమ్మును మార్చినావు గనుక నీకనేక స్తోత్రములు. ఆమేన్.


కీర్తన: సిల్వయొద్ద జేరుదున్ "కర్త నిన్నె నమ్ముదన్


బీద హీనయంధుడన్ కల్వరీ గొర్రెపిల్ల!


లోకమున్ త్యజింతును మోకరించి వేదెదన్


పూర్ణముక్తి నొందుదున్ నన్ను గావుమో ప్రభో!!"