లెంటులోని రెండవ దినము – గురువారము

శ్రమకాల గుడారము

లూకా 18:31-34;

ప్రార్ధన:- దయగలప్రభువా! నీ కుమారునిద్వారా చరిత్ర జరిగించి, యది మాకు వ్రాసిపెట్టినందులకు వందనములు. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును నిత్యస్తోత్రమని చెప్పు విశ్వాసులకు కలుగు శ్రమలు, ఆనందకరముగా జేయమని శ్రమల గుడారములో ప్రవేశించిన యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.


ప్రియులారా! మనము శ్రమలయొక్క గుడారములో ప్రవేశించినాము. ఈ నలుబది దినములలో ప్రభువు యొక్క కుడిప్రక్కను యెడమప్రక్కను ఎక్కడైనను శ్రమయే కనబడును. మనము క్రీస్తుయొక్క శ్రమలను ధ్యానించునపుడు మన శ్రమలు జ్ఞాపకమునకు వచ్చును గాని ఆయన శ్రమల యెదుటనవి యావగొంజంత మాత్రమే కనబడుచున్నవి. క్రీస్తు ప్రభువునకు జయముతో శ్రమల ముగిసినవి. భక్తులైనవారు పూర్వకాలమందు ప్రభువు యెక్క చరిత్ర పరీక్షించినారు. అందు క్రిస్మస్ చరిత్ర, ఆయన బోధ, ఆయన యద్భుతములు, ఆయన శ్రమలు ఉన్నవని గ్రహించినారు. అందు క్రీస్తు యెక్క పునరుత్ధానమున్నదనియు, రాకడున్నదనియు గ్రహించినారు. గాని క్రిస్మస్ చరిత్ర కంటే, బోధ కంటే, అద్బుతముల కంటే, ఆరోహణము కంటే, క్రీస్తు యెక్క శ్రమలే మహా ముఖ్యమైనవని, పెద్దలు యీ నలుబది దినములు ధ్యానముగా నేర్పరచినారు. ఈ నలుబది దినములు శ్రమలను గూర్చి ధ్యానించవలెను. క్రీస్మస్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే, ఈస్టరు పండుగను ధ్యానుంచుటకు ఒక్కరోజు మాత్రమే, ఆలాగుననే ఆరోహణ పండుగను ధ్యానించుటకు కూడ ఒక్కరోజు మాత్రమే గాని క్రీస్తు శ్రమలను గూర్చి ధ్యానించుటకు యెక్కువ సమయము కావలయునని పెద్దలనుకొని, నలుబది దినము లేర్పరచుకొన్నారు. మార్చి నెలయంతయు, ఇంకా ఏప్రిల్ నెలలో కూడా ధ్యానింతురు. ఇన్నిదినములెందుకని కొందరనుకొనవచ్చును. అయితే ఇవి మనము ధ్యానింపదగినవే. రేపు బుధవారము కదా! ఈ నలుబది దినములు ధ్యానించుటకు, బైబిలులో ననేకమైన వాక్యములు గలవు. అవన్నియు యిక్కడుపయోగింపక వాటి అన్వయ వాక్యములు మన ధ్యానముకొరకు చెప్పెదను. మీరు చదువుకొంటే 1 పేతురు 1:19-21 వరకని చెప్పుదును. అప్పుడు మీరు అధ్యాయమంతయు చదువుకొనెదరు. నిజమైన విశ్వసి ఈ బుధవారమున క్రీస్తుయెక్క సన్నిధానమునకు వెళ్ళి, మహావినయముతో " ప్రభువా! నేను బూడిదనై యున్నాను, ధూళినైయున్నని చెప్పగలుగును. అందరును చేప్పలేరు. గుడిలోను, మీటింగులలోను, యిండ్లలో మాత్రము కాదు, హృదయములో అబ్రాహామువలె చెప్పగవారుగా ఉండవలెను. అబ్రాహాము విశ్వాసులకు జనకుడు, ఆయనే 'ధూళినంటే, మనమే మనగలము. నేను ధూళికంటే ధూళిని బూడిదకంటే బూడిదనని చెప్పవలెను. అలాగు యెవరందురో వారే శ్రమకాలపు గుడడారములోనికి చేరగలరు." (ఆది 18:27) యోబు కూడ అలాగు చెప్పెను. (యోబు 30:19) విశ్వాసి (1) నేను పాపిని, (2) అయోగ్యుడను, (3) నేనశక్తుడనై యున్నాను అని చెప్పవలెను. మీరు యింటికి వెళ్ళి, యీ మూడు ఒప్పుకొనవలెను. అప్పుడు శ్రమకాల ధ్యనాములో ప్రవేశింతురు. మీరు ఇంటివద్ద, గుడిలోకంటే ఎక్కువగా ధ్యానించగలరు, చదువగలరు.

ఐదువేల మంది కాహారమియ్యగా, 12 గంపల రొట్టెముక్కలు మిగిలునని తెలిసినను,మిగిలి పోయేట్లు అద్భత కార్యక్రమము చేసినావు కాదా! అట్లే నీ శ్రమలన్నిటి ద్వారా వచ్చు దీవెనలన్నీ మేము అందుకొనలేమని తెలిసినప్పటికిని, నీవు శ్రమల ననుభవించినావు గనుక నీకు వందనములు. ఇప్పుడు నేను శ్రమ చరిత్ర వినిపించెదను. ఇంతవరకు మన చరిత్ర వినిపించినాను.అనగా పాపియొక్క చరిత్ర, పాపి తన చరిత్ర తెలిసికొని దేవునికి వందనములు చెల్లించిన యెడల అదియెంత మంచిది! ప్రభువా నేను అయోగ్యుడను, అశక్తుడను, నా మీద నీకింత ప్రేమా! యని అనిన యెడల అదియెంత మేలు. అట్టి చరిత్ర ధ్యానించుటకు ప్రభువు ఆత్మ మీకు తోడై యుండును గాక.