ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 37

వాక్య భాగము: Mat 27:33-56; Mark 15:22-41; Luke 23:33-49; John 19:17-37

సిలువ వేత

సత్యము: మన భారమును, పాపమును, వ్యాధిని, నరకమును తప్పించుటకు ప్రభువు సిలువపై వ్రేలాడెను.
కృప: ప్రభువు అనుగ్రహించిన నూతన నిబంధన, దైవరాజ్య రాజ్య స్థాపన ద్వారా మనకు కలిగిన విడుదల.


ప్రార్థన: ప్రభువా! మా నిమిత్తమై సిలువపై వ్రేలాడి మాకు రక్షణను, సత్యమును, కృపను అనుగ్రహించిన దేవా! మీకు కృతాజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీరు మాకు దైవసహవాసమును అనుగ్రహించుటకు నూతన నిబంధనను స్థిరపరచి దైవరాజ్యమును స్థాపించుచున్నారని నమ్మి, సత్యమార్గములో నడచు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

సిలువవేతకు గత రాత్రి ప్రభువు బహుగా ప్రయాసపడెను. ప్రభురాత్రి భోజనమప్పుడు 11 మంది శిష్యులకు పళ్ళెములో తానే నీళ్ళుపోసి, కాళ్ళుకడిగి, తువాలుతో తుడుచుటతో మొదలైన ప్రయాస, వారు యెరూషలేము విడిచి గెత్సెమనే వైపుగా నడచుచు, బహు ఆత్రముగా యోహాను 14,15,16,17 అద్యాయములలోని విషయములు ప్రయాసతో భోధించుచు, చమట రక్తముగా కారునంతగా ప్రార్థించి, అక్కడినుండి కెద్రోను వరకు నడచి(మొత్తం 15కి.మీ.) అదేరాత్రి మళ్ళీ యెరూషలేమునకు ఈడ్చబడి, కూర్చునుటకు సందులేనంత స్పీడుగా కోర్తులకు తిప్పి, పిడిగుద్దులు, కొరడాలతోకొట్టి, బరువైన సిలువమోతతో గొల్గతా చేరిరి. మరణమగునంతగా అలసి, ఒంటినిండా గాయాలతో, ముండ్లకిరీటముతో, సిలువ భారముతో ప్రభువు ఎక్కిన గొల్గొతా కొండ (1.5కి.మీ.) సిలువ యాత్ర కూడ మహాశ్రమయే. అక్కడ ఆ కపాలమనబడిన స్థలమున ప్రభువు సిలువ వేయబడెను.

రోమా ప్రభుత్వము సిలువ శిక్షవేయుట కేవలము యేసు ప్రభువునకే కాదు గాని చాలామంది ఆ విధముగా చనిపోయిరి. ప్రభువు ఎంత శ్రమపొందెనో వేరేఎవరైన ఇతరులు కూడా అన్యాయపు తీర్పునొంది ఇంచుమించు అంతే శ్రమపొంది ఉండవచ్చును. అయితే ప్రభువు మరణమునకు గల ప్రత్యేకత ఏమిటి? ఆయన దైవ కుమారునిగా ఎందుకు అభిషేకింపబడెను? ప్రభువు సిలువపై ఉన్న సమయములో బహిరంగముగా జరిగిన ఈ మహా కార్యములు మన మదిలో ముద్రించబడవలెను.

ఈ రోజుధ్యానములో గమనించివలసిన విషయమేమనగా ప్రభువు, ఆయన ఘనకార్యములు ప్రత్యక్షముగా మనకు కనిపించుచున్నను ఇంకా ప్రభువు మహిమను కనుగొనలేని మందస్థితిని కలిగివుండుట చాలా ప్రమాదకరము. లేఖనములన్నీ ప్రభువును సూచించుచున్నను, యూదుల రాజు అని డైరెక్ట్‌గా వ్రాసి పెట్టినను అనేక అధ్బుతములు ఆ సమయములో జరిగినను యాజకులు హృదయమును కఠినపర్చుకొనిరి గాని ప్రభువు ప్రణాళికను గ్రహించలేకపోయిరి.
ఈ సిలువ ధ్యాన సమయములో దేవుడు మనకు ప్రత్యక్షపరచిన విషయములు అందుకొని, హత్తుకొని ప్రభువును ఆనుకొని జీవించు కృప దేవుడు మనకు దయచేయును గాక.

Supporting Verses

లూకా సువార్త 23:
33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
34. యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
35. ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతానురక్షించుకొనునని అపహసించిరి.
36. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి
37. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.
38. ఇతడు యూదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను.

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +