ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 35

వాక్య భాగము: Mat 27:15-31; Mark 15:6-20; Luke 23:13-25; John 18:39,19:17

తానిచ్చిన తీర్పును అమలుచేయలేని పిలాతు

సత్యము: ప్రపంచమును ఐక్యపరచిన ప్రభువైన యేసుక్రీస్తు
కృప: అందరు విడిచినను, ఆధరణనిచ్చు ప్రభువుయొక్క ఆత్మతో మనలను ఐక్యపరిచెను
ప్రార్థన: ప్రభువా! మీపై మోపిన నిరాధార నిందలను భరించి, మీ సిలువ యాగమును కొనసాగించిన దేవా! మీకు వందనములు. మాపై ఉన్న నిందలలో, మా నిస్సహాయతలో మా చెంత నిలబడి మీ ప్రణాలికను నెరవేర్చుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

యేసుప్రభువు నిర్దోషి అని, ఆయనయందు ఏ తప్పిదమును కనబడలేదని చక్రవర్తి హేరోదు, గవర్నరు పిలాతు తీర్పు చెప్పిరి. కాని వారి తీర్పును వారే అమలుపర్చలేకపోయిరి. నిజానికి హేరోదు, పిలాతు నిర్దోషులు నీతిమంతులు అయ్యేవారు కాని, అల్లరి మూకలతో ఏకమై ప్రజలను సంతోషపరుచుటకు ప్రభువును హింసించి, కొట్టించుట ద్వార వారి స్వంతతీర్పువలన వారు ప్రభువుముందు దోషులై నిలిచిరి.

విశ్వాసి జీవితములో తప్పక ఎదురయ్యే సమస్యలలో ఇది ఒక విచారకరమైన సమస్య. దేవుని ప్రణాళిక మార్గములో స్థిరముగా నిలిచి పనిచేయునపుడు; ఓర్వలేని సహవాసులు/శత్రువులు వేసిన నిందలలో అధికారులు, స్నేహితులు అందరు మనపక్షమున నిలిచి మనము నిర్దోషులము అని చెప్పగలరుగాని శత్రువుల ఉరిలోనుండి కాపాడలేరు. ఒక్కోసారి శత్రువులతో చేరి వారిసంతోషము నిమిత్తము మనలను బాధపెట్టవచ్చు. ఆ సమయములో ప్రభువు ప్రణాళికను నెరవేర్చుచున్నామని మరచి, ప్రభువుమీద సణిగిన యెడల మనము ప్రభువు సిలువను మోసినవారముకాము.

విశ్వాసి తన శ్రమలలో ఓర్పుకలిగి ప్రభువును హత్తుకొని ఆయన యొక్క తేలికగానున్న సుళువైన కాడిని మోయుచుండగా పరులతోకలిసి కేకలువేసిన యెడల మనము కూడా దోషులమే. ప్రభువును మరలా సిలువకు అప్పగించువారమై యున్నాము.

ఏ దోషమును లేని ప్రభువు తన అనాధి సంకల్ప ప్రణాళికచొప్పున శ్రమను ఎదుర్కొన్న రీతిగా మనము సత్యముకొరకు శ్రమలగుండా వెళ్ళుచున్నను అధైర్యపడక ప్రభువు ప్రోక్షించిన ఆధరణకర్తయగు పరిశుద్ధాత్మ సహాయముతో రాకడవరకు రక్షింపబడుదుము గాక!

యేసుప్రభువు యొక్క తీర్పు సమయములో పొందిన శ్రమలయొక్క ఫలితము అప్పటివరకు శత్రువులుగా నున్న హేరోదు పిలాతు మిత్రులైరి, బరబ్భా విడుదల పొందెను, యూదాప్రజలందరు ఏకమైరి. అప్పుడు రోమా అధికారులు ప్రభువు విషయములో ఐక్యముగా వ్యతిరిక్తతతో నిలిచినను చివరికి రోమీయులు ప్రభువు నందు ఐక్యమై ప్రపంచమును ఐక్యపరిచిరి. ఆనాటి ప్రభువుయొక్క నిశ్శబ్ధ ఓర్పు ఇంతటి ఫలితమును తెచ్చినది. మన ఓర్పునకు కూడ గొప్ప ఫలితముండును.

Supporting Verses

లూకా సువార్త 23:
13. అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
14. ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు
15. హేరోదునకు కూడ కనబడలేదు.హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
16. కాబట్టి నేనితనిని
17. శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా
18. వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.
19. వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
20. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.
21. వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
22. మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.
23. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
24. కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి
25. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +