ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 33

వాక్య భాగము: Mat 27:2,11-14; Mark 15:1-5; Luke 23:1-7 ; John 18:28-38

Lord vs lord

సత్యము: యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు
కృప: రాజును, ప్రభువైన యేసుక్రీస్తును మనము తెలిసుకొనుట, ప్రభువు మనలను పేరుతోసహా ఎరుగుట.

ప్రార్థన: ప్రభువైన దేవా! మీ అనాది సంకల్పముచొప్పున అధికారులయొద్దకు పంపబడి, అవమానపడి మాకు విడుదల దయచేసి, మమ్మును రాజులుగా మార్చిన యేసు ప్రభువా, మీకు వందనములు.

సర్వలోకమునకు ప్రభువైన యేసు ఈ భూమిమీద చిన్న ప్రదేశమునకు గవర్నర్ అయిన పిలాతు వద్దకు తేబడెను. "నిన్ను విడిపించుటకు నాకు అధికారము కలదని" పిలాతు యేసుతో చెప్పినను ప్రభువు ఏమియు తన వాదనను వినిపించలేదు కాని యేసు ప్రభువు 3 విషయములు స్పష్టపరిచెను. 1. నేను రాజును 2. నా రాజ్యము పరసంబంధమైనది 3. ఆ రాజ్యము సత్య సంబంధమైనది.

సత్యమనగా నేమి? అని పిలాతు అడిగి జవాబు వినడని తెలిసి ప్రభువు ముందే "నీ(దేవుని) వాక్యమే సత్యము"(యోహాను 17) అని చెప్పివేసెను(మనకోసము). చాలామంది నాస్తికులు యేసు సత్యమునకు నిర్వచనము పిలాతుకు చెప్పలేకపోయెను అని వాదింతురు కాని అన్ని ప్రశ్నలకు యేసు ముందే సమాధానము చెప్పెను.

దేవుడు విశ్వాసికి ఈ భూమిమీద అధికారమిచ్చెను. దానిని మెళకువతో ఉపయోగించుటకు ఈరోజు పాఠమును ధ్యానించుదము.

పిలాతు తన అధికారమంత ఉపయోగించి యేసును విడుదల చేయ యత్నించెను గాని యేసు ఏమియు తనకు అనుకూలముగా మాట్లాడలేదు. ఈ ముఖాముఖి సన్నివేశమును పూర్వ భక్తులు "గ్రేట్ ఎన్‌కౌంటెర్" అనిపిలుస్తారు. ఈ ప్రభువుల ఎన్‌కౌంటర్‌లో యేసుక్రీస్తు ప్రణాళికలో పిలాతు భాగమాయెను. పిలాతు ప్రభువు పని చేయుచుండెను గాని అది పిలాతుకు తెలియదు. సిలువ కార్యము ప్రభుని లక్ష్యము. పిలాతు ఆపజూచెను గాని ఆపలేకపోయెను. ఇదే ప్రభువు విజయము. ప్రభువు ఒక బాధితుడిగా అక్కడ నిలబడలేదు కాని తన ప్రణాళికను నెరవేర్చుటకు అక్కడ రాజాది రాజుగా నిలబడెను.

విశ్వాసి తన జీవితములో ప్రభువు ప్రణాళికను అనుసరించి జీవిస్తున్నపుడు, ఒకవేళ అధికారులయొద్దకు మనము తేబడినను చివరకు ప్రభువునకే జయము వచ్చును.

Supporting Verses

లూకా సువార్త 23:
1. అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి
2. ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
3. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయననీ వన్నట్టే అని అతనితో చెప్పెను.
4. పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోనుఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేద నెను.
5. అయితే వారుఇతడు గలిలయదేశము మొద లుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
6. పిలాతు ఈ మాట వినిఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
7. ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
యోహాను సువార్త 18:33. పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా
34. యేసునీ అంతట నీవే యీ మాట అను చున్నావా? లేక యితరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను.
35. అందుకు పిలాతునేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా
36. యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.
37. అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసం
38. అందుకు పిలాతుసత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +