ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 32

వాక్య భాగము: Mat 27:3-10;

పశ్చాత్తాపమునకు కాలపరిమితి

సత్యము: యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మారుమనసు పొందిన వారికి పాపక్షమాపణ కలదు
కృప: యేసే క్రీస్తుప్రభువని నమ్మిన ప్రతీ ఒక్కరు సదాకాలము దైవ సన్నిధిలో జీవించుట

ప్రార్థన: ప్రభువా! మేము అనేకసార్లు తప్పిపోవుచున్నాము, మారుమనసు పొందకయున్నాము. అయోగ్యులమైనప్పటికిని మీ కృపద్వార మమ్మును పాపమునుండి దూర పర్చుము. మీ తట్టు తిరిగి మిమ్మును ఆనుకొని జీవించు ధన్యత దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

యూదా ఇస్కరియోతు గురించి బైబిలులో ఎక్కువగా వ్రాయబడిన ఈ వాక్యములు మనకొక పెద్ద హెచ్చరిక. యూదా అంతము చాలా బాధాకరం. ప్రభువుతో నడిచి ఆయనను గ్రహింపలేని దుస్థితి. అయితే ఈ పాఠములో కొన్ని క్రైస్తవ ప్రాధమిక అంశములు, వాటి పర్యవసానములను నేర్చుకొనుటకు మంచి ఉదాహరణ.

ఇక్కడ 3 రకముల దైవసంబంధ వ్యక్తులు ఉన్నారు. ముగ్గురూ దేవుని సేవించుచున్నవారే కాని వారి వారి స్థితులు వేరు.


ప్రభువు మహాశ్రమపొండి మనకు అంగ్రహించిన అమూల్యమైన ధననిధి పాపక్షమాపణ. పాపక్షమాపణ లేకుండా ఈ లోకములో ఏమిసంపాదించినా (వెండి, బంగారం, వజ్రవైఢూర్యాలు,ఆస్తులు,అంతస్థులు) చివరికి అవి అక్కరకు రావు, ప్రభువు చిత్తములో లేనివి చివరికి మరణమునకు దారితీయును.

పాపక్షమాపణ ప్రభువువద్ద ఉంటే, యూదా ప్రభువును మరచి యాజకులవద్ద వేడుకొనుటవల్ల కొంచెంకూడ ఉపయోగములేకుండా పోయినది. యూదా పశ్చాత్తాపము పొందెను గాని మారుమనసు పొందనందున పాప క్షమాపణ దొరకలేదు. శిష్యులు కూడ సిలువ శ్రమలలో ప్రభువును విడిచిపోయిరి. యూదా అమ్మబడుట, శిష్యులు చెదరిపోవుట లేఖననెరవేర్పులే; కాని శిష్యులు మారుమనసు కలిగి దేవుని కుమారులైరి. పశ్చాత్తాపము ఒక పనికి సంబంధినది కావున దానికి కాలపరిమితి ఉన్నది. ఒక దుశ్చర్యకు దుష్ట ఫలితము వచ్చిన తర్వాత పశ్చాత్తాపపడినను ఉపయోగములేదు. కాని దేవునియందు మారి నూతనపర్చబడుట ద్వారా కొత్త జీవితము లభించును.

ప్రభువా! మా ఇచ్చలను బట్టి అనేకమార్లు మీకు వ్యతిరేకముగా బ్రతికినను, మీ చెంతచేరి మారుమనసుపొందుటకు సహాయము చేయుము. పాపములనుండి విడుదల కలుగజేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

పదజాలము:
1. పశ్చాత్తాపము: తాను చేసిన పని తప్పు(బ్లండర్/మిస్టేక్/రాంగ్/ఫెయిల్) అని తెలిసుకొని దుఖించుట. ఇది పాపము కానక్కరలేదు కాని ఆ నిర్ణయము వలన ఫలితము శూన్యము/ప్రమాదము అని గుర్తించగల సృహలోనికి రావడము.
2. మారుమనసు: పశ్చాత్తాపమునకు పరిష్కార మార్గము. పశ్చాత్తాపము నిరాశను కలుగజేసి పాపమునకు ద్వారము తెరుచును.కాని మారు మనస్సు నిరాశనుండి విముక్తి కలుగజేసి మనసును నూతన పరచును.
3. రూపాంతరము: మారుమనసుకు తగిన ఫలము ఫలించుటకు తగిన భౌతిక/బహిరంగ మార్పు. ఇది నిరంతర ప్రక్రియ. ఉదా: పేతురు సిలువ సమయములో పడిపోయినను(చిన్నపిల్ల చేత భయపెట్టబడి) పశ్చాత్తాపపడి, మారి, మొదటి సంఘకాపరి ఆయెను(పెద్ద పెద్ద వారికి బోధించెను). ముందు స్థితి వేరు, అంతిమ స్థితి వేరు. మహిమ నుండి అధిక మహిమకు.

దేవుడు తప్పుచేయడు గనుక ఆయన పశ్చాత్తాపపడడు అని బైబిలో ఉన్నది కాని సౌలు రాజు విషయములో బహుగా పశ్చాత్తాపపడెను. సౌలుని ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పులేని కారణముగా దేవుడు పశ్చాత్తాపపడెను. దేవుని అభిషేకమును వ్యర్ధపరచుట దేవునికి పశ్చత్తాపము. అభిషేకమునకు ముందే ఇస్కరియోతు బయటికి పోయెను. యూదా యేసుప్రభువును అప్పగించుట లేఖన భాగము కావున యూదాను శిష్యునిగా చేర్చుకొనుట ప్రభువుకు పశ్చాత్తాపము కాదు.


పశ్చత్తాపము కలిగిన వేంటనే ప్రభువు చెంతకు చేరుట వలన మారుమనసు కలిగి నూతన క్రియలు జరుగును. ఆలస్యము చేసిన నిరాశ పాపమువైపుకు నెట్టివేయును.


దేవుడు మనకు నూతన బలము, నూతన స్వస్థత, నూతన శక్తి దయచేయును గాక! ఆమేన్.

Supporting Verses

మత్తయి సువార్త 27:
3. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి
4. నేను నిరపరాధరక్తమును1 అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
5. అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.
6. ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసి కొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.
7. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.
8. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
9. అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
10. వెండి నాణములు తీసికొనిఒ ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +