ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 30

వాక్య భాగము: John 18:25-28

దైవము vs యాజకులు

సత్యము: మన ఆత్మీయాహారమునకు ప్రభువే పస్కా
కృప: అనుదినము ప్రభువు మనకు అత్మీయాహారమునిచ్చుట

ప్రార్థన: మాకోసము బలియైన ప్రభువా! మీరిచ్చు ఆహారమును పవిత్రముగా తీసుకొను ధన్యత మాకు దయచేయుము.

విశ్వాసికి నిత్యము ఎదురయ్యే రెండు ప్రాధమిక ప్రశ్నలు 1. విశ్వాసీ! నీవెక్కడ? ఇది దేవుని ప్రశ్న 2. క్రైస్తవుడా! ఇది నిజమా? అని అడిగే సాతాను ప్రశ్న. విశ్వాసి ఎప్పుడూ గమనించవలసిన విషయము మనము ఎవరి సమక్షములో ఉన్నాము? సర్వవ్యాప్తియైన ప్రభువు అధీనములో మనమున్నామన్న సృహతో జీవించాలి.

ఈ రోజు వాక్యధ్యానములో, పేతురు, యాజకులు, సన్‌హెడ్రీన్ పరిచారకులు ఆయా కారణములవలన వారు ప్రభువు సమక్షములో ఉన్నామని మర్చిపోయిరి. యాజకులు వారి పరివారము దేవుని సేవను భక్తితో పవిత్రముగా ఆచరించుటకు నియమించబడిన దేవుని ఉద్యోగులు. సాక్షాత్తు దేవుడే దర్శనమిచ్చినా అది గుర్తించక అపవిత్రులై ఆయన సన్నిధిని (మందిరములో) నిలిచిరి.

వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు కాని వారు వారికి తెలియని స్థితిలో భలిపీఠము (ప్రభుని శరీరము) వద్ద నిలిచిరి, అవమాన పరిచిరి, అన్ని ఆజ్ఞలను మీరిరి, హింసించిరి. ఇదే వారి అపవిత్రకు దారితీసెను. తన సేవక బృందముద్వారా ప్రభువుకు కలిగిన అథ్యధిక శ్రమ ఇదే.

యాజకులు దేవుని స్వరమును వినక సాతాను ముసుగులో "ఇది నిజమా! యేసు దైవకుమారుడా?" అనే ప్రశ్నకు లొంగిపోయిరి. పేతురు శోధనకు లొంగక పశ్చత్తాపము పొంది సంఘమునకు ప్రధాన యాజకుడాయెను. ఆ యూదుల యాజకులు యేసును సిలువకు అప్పగించి సాతాను చెరలోనికి వెళ్ళిపోయిరి.

ప్రభువా! మేము నిరంతరము నీ సన్నిధిలో ఉండుట అనివార్యము కావున మమ్మును పరిశుద్ధపరచుము. పరలోకములో మీ మహిమలో నిలబడగల శక్తిని దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

Supporting Verses

యోహాను సువార్త 18:
28. వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +