Day 3 : సత్యసారము కలిగిన మతమే దైవమతము.

వాక్య భాగము : Mat 21:12-16; Mark 11:15-18; Luke 19:45-48

ధ్యానసారాంశము:
సత్యము: సంఘమునకు ప్రభువు యేసుక్రీస్తు. ఘనత, మహిమ, స్తుతి ఆయనకే చెల్లును.
కృప: ప్రభువును సత్యముతో ఆరాధించుటకు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించెను.

ప్రార్థన : తండ్రీ మా నిమిత్తమై వధింపబడిన తండ్రీ నీకు నమస్కారములు. మా కొరకు వ్రేలాడిన నీ రూపమును చూచి మా పాపపు బ్రతుకు చాలించుకొను కృప దయచేయుము. నేటి దిన సిలువధ్యానమున మా అంతరంగములకు మార్పు కలిగించునట్లుగా చేయుమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్.


పాపపరిహారార్థ బలి అర్పించు స్థితిలోనికి రాకుండుట ప్రభువునకు ఇష్టము. పాపపరిహారార్థ బలులు పెరుగుట సాతానుకు బలము. అనగా ప్రభువుకొరకు ఖర్చుచేయుట దేవునికి సంతోషము. పాపములకొరకు అర్పణలు తెచ్చుట సాతానుకు సంభరము.

బాలాము బహుమానములు, పేరు, ప్రతిష్టలకు ప్రాధాన్యతనిచ్చి దేవుని పేరుతో దేవునికి వ్యతిరిక్తముగా ప్రవచించుట ఒక వృత్తిగా ఎంచుకొనెను. చివరకు గాడిద బాలముకు బుద్ధిచెప్పెను. గాని గాడిద ప్రభువును విధేయతో మోసెను. అట్లే విశ్వాసి మతవ్యాపారికి బుద్ధిచెప్పును, ప్రభువును విధేయతతో హత్తుకొనును. ధనమే బలి అర్పణకు ప్రామణికమైతే అది బాలాము వృత్తే గాని ప్రభువు చిత్తముకాదు. సంఘమునకు ధనము అవసరమేగాని ప్రమాణము కాదు. సంఘ విశ్వాసమే దేవునికి కొలమానము.

Jesus Cleanses Temple
  1. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయ ములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి
  2. నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
  3. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
  4. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము1 అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి
  5. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి
  6. వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతని యకు వెళ్లి అక్కడ బసచేసెను.

ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాధించిన సంఘములు తమ విశ్వాసమును కొనసాగించుకొనుటకు దేవుని పరిశుద్ధాత్మ ఏర్పరిచిన సంఘాచారము (మతము) యొక్క ముఖ్య ఉద్దేశము ఈ భూమిమీద దైవరాజ్య స్థాపన, తద్వారా వధువు సంఘ సిద్ధబాటు ఇమిడియున్నవి. అయితే సంఘములో ఉన్న లావాదేవీలు ఆత్మ సంబంధమైనవా లేక ఆర్థిక సంబంధమైనవా ? ఒక ప్రసంగము ఆర్థిక ఆశీర్వాదములగురించి, అప్పులు, నొప్పులు, కుటుంబ తిప్పల గురించే కొనసాగితే అది మృతమైనదే. దైవ రాజ్యమును స్వతంత్రించుకొనగలిగితే ఇహలోక ఆశీర్వాదములు అవలీలగా దొరుకుతాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన వరములకొరకు సంఘము పాటుపడితే ప్రభువు మన అవసరములను తప్పక తీర్చును.


ప్రభువు సిలువ మరణమును లెక్కచేయక దేవాలయములో క్రయ విక్రయములను చేయువారిని తరిమివేసెను. ఈనాడు సంఘము ప్రభువు చేసిన పనిని చేయుచు, ప్రభువును దర్శించుచు, ఆయన మహిమయందు సంతోషించుచు, దైవాత్మను, ఆయన దివ్యలక్షణములను అందిపుచ్చుకొనుచు ఆయనను కలిగియున్నామనే ఆనందము కలిగి, ప్రభువు సిలువ మరణ/పునరుత్థాన శక్తిని నింపుకొనుచు కొనసాగే ధన్యత ఈ రోజు మనకు దేవుడు దయచేయునుగాక..

"ప్రభువైన యేసుక్రీస్తు మనలను మిక్కిలి ప్రేమించి మనకొరకు సిలువపై ప్రాణము పెట్టెను అను సత్యమును నిత్యము ఎరిగినయెడల ఈ సత్యసారము మనకు నిత్యజీవమునిచ్చును". మనలను అనాధులుగా విడువను, అన్ని ఈవులను దయచేయుదును అని సెలవిచ్చిన ప్రభువు మన జీవితమును ఉజ్జీవభరితముగా, సంఘమునకు ఉపయోగకరముగా తప్పక చేయును.

ప్రభువు సన్నిధికాంతి మనమద్య ఉదయించును గాక! ఆమేన్.

Supporting verses

మత్తయి 12:41, 42 - నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంత ములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల