ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 28

వాక్య భాగము: Mat 26:57,59-68; Mark 14:53,55-65; Luke 22:63-65; John 18:2

యాజకులు అన్ని ఆజ్ఞలను మీరుట - అబద్ధ సాక్ష్యములతో సహా

సత్యము: ప్రభువైన యేసుక్రీస్తు దైవకుమారుడు
కృప: మన హృదయము తెరువబడి ప్రభువైన యేసే క్రీస్తు అనబడిన దైవకుమారుడని గ్రహించుట

ప్రార్థన: ప్రభువా! మా కన్నులు తెరిచి వాక్యమును గ్రహించి మీరు మా కొసము దిగివచ్చిన దైవకుమారులని గుర్తించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

యేసుక్రీస్తు ప్రభువు యాజకులవద్ద ఏమియు దాచక సత్యము పలికెను. మీరు అన్నట్టే నేను దైవకుమారునని చెప్పెను. అయినను వారు ఒక్కసారి పరిశీలింపలేకపోయిరి.

తూర్పుజ్ఞానులు నిజమైన భక్తిపరులు. కాని శాస్త్రులు, యాజకులు గర్వముచేత అజ్ఞానులైరి. మనముందు ప్రత్యక్షపరచబడిన ప్రభువును గుర్తించలేకపోవుట దేవుని నుండి విడదీయును.

సర్వలోకమునకై నాకై - నీకె - సర్వవేదజ్ఞులౌ - శాస్త్రుల కొరకై
ఉర్విని యేసుడు - ఉద్భవించెను - గర్వపు శాస్త్రులు ప్రభువు
నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము యేల వారు
ప్రభు - నెరుగకపోయిరో || యేసు జన్మించెన్ ఇలలో ||

యాజకులు ధర్మశాస్త్రమును బోధించువారు, వారికి పది ఆజ్ఞలు బాగుగా తెలియును. కాని వారు ప్రభువు విషయములో మోషే వారికిచ్చిన అన్ని ఆజ్ఞలను మీరిరి.

1. ప్రభువును ప్రేమింపలేకపోయిరి 2. వారుకూర్చుండు పీఠములే వారికి దేవుడాయెను 3. బలిపీఠములే విగ్రహములాయెను 4. దేవుని గుర్తించక దైవమును వ్యర్థముగా ఉచ్చరిస్తూ బట్టలు చింపుకొనిరి 5. యాజకులకు తండ్రియైన ప్రధాన యాజకుని అవమానపరచి, దూషించిరి 6. ప్రభువును చంపుటకు పూనుకొనిరి 7. దేవునివదిలి యూదామతాచారముతో వ్యభిచరించిరి 8. అబద్ద సాక్ష్యములను నిలువబెట్టిరి 9. రోమా సాంగత్యమునకు ఆశపడిరి 10. ప్రభువు మహిమను దొంగిలించిరి.

దేవుడు మనకిచ్చిన ఆధిక్యత వలన గర్వించి ప్రభువును గ్రహించలేనియెడల మనమును ఆయన శ్రమకు కారణమౌదుము.

ఫ్రభువా! ఎల్లప్పుడు మిమ్ములను ఆనుకొని జీవించు భాగ్యము దయచేయుము. ఆమేన్.

Supporting verses

మత్తయి సువార్త 26:
59. ప్రధానయాజకు లును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
60. అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.
61. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి.
62. ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను.
63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసునీవన
64. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
65. ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని--వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు;

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +