ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 27

వాక్య భాగము: Mat 26:58; Mark 14:54; Luke 22:55; John 18:15-18

మనము ప్రభువును వెంబడించువారమైతే , మనం కాదన్నా దేవుడు మనపట్ల చేయుచున్న కార్యములను బట్టి జనులు మనం యేసుతో ఉన్నవారమని తెలిసికొంటారు

లూకా 22:55 : వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను

ప్రభువుయొక్క శ్రమలో పాలి వారమై ఆయనను విడువక వెంబడించిన యెడల ఆయన నామములో గొప్ప పని చేయువారముగా వుంటాము. ఈ సందర్భములో పేతురు ప్రభువును యెరుగను అనిచెప్పినా గాని ఆయన శ్రమలో వెంబడించెను.

అపొస్తలుల కార్యములు 4వ అద్యాయములో
13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
14. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.


పేతురు అంతరంగము అంతా సిద్ధమైనప్పటికిని, బహిరంగ ఒప్పుదలకు ఇంకా సిద్ధపడలేదు. ప్రభువు మార్గములో ఈ స్థితి ఒక బాగము. మనం ప్రభువు మహిమార్ధమై చేయవలసిన ఘన కార్యములు ప్రస్తుతము అంతరంగములోనున్నను, ఆయనను వెంబడించుకొలది అవి బయలు పర్చబడి, కార్యరూపము దాల్చి నిర్మించబడతాయి కాబట్టి, ఆయనకు విధేయులమై ఉండుదము.

1 సమూయేలు 26:25 - అందుకు సౌలుదావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను.
దైవచిత్తములో దావీదు రాజుగా ఉన్నప్పటికి దావీదు తాను రాజును అనుకొనలేదు. దావీదు అంతరంగములో రాజు వున్నాడు. అయితే ఆయన తరమబడ్డాడు. దావీదు రాజైన తర్వాత ప్రభువును విసర్జింపక, మనకు అత్యంత ఆధరణనిచ్చే అనేక కీర్తనలను రచించిరి. దావీదు మహారాజు/చక్రవర్తి అయిన తర్వాత కూడ తరమబడెను కానీ ఆయన దేవుని మరువలేదు. సౌలు/పౌలు కూడా అంతే, పౌలు జైలులో చాలాకాలము గడిపెను. అయ్యో అలా జైలులో ఉండిపోయారు అనిపిస్తుంది కాని ఆ సమయములో అనేక పత్రికలు మనకు అందించెను.

గనుక మనము నిజమైన ఆనందము పొందుటకు ప్రభువు అంతరంగములో ఉన్న గొప్ప పనులను తలపెట్టి, పని చేయుటకు ఆశక్తి గలవారమై యుందుము గాక!


క్రైస్తవ సంఘ అంతరంగములో దైవరాజ్యమున్నది. అది పరలోకరాజ్యముగా రూపాంతరము చెందువరకు శ్రమలను జయించి మనము ఆయనను వెంబడించుదుము గాక! అమేన్.

నిజమైన క్రైస్తవ జీవితము, మనలను పొరుగువారు గమనించి క్రీస్తులో ఉన్నవారమని తెలిసికొని దైవప్రేమలోనికి రావడానికి తోడ్పడే మన సాక్ష్యామే.

Supporting verses

యోహాను సువార్త 18:
17. ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +