ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 25

వాక్య భాగము: Mat 26:47-56; Mark 14:43-52; Luke 22:47-53; John 18:2-11

ప్రభువును బంధించుట అసాధ్యము

సత్యము: తన్ను తాను అప్పగించుకొనకపోతే; ఆకాశ మహాకాశముల కంటే అత్యున్నతాసీనుడైన ప్రభువును పట్టుకొనుట అసాధ్యము
కృప: మన బంధకములను తీసివేయుటకు ప్రభువే బంధీ ఆయెను

ప్రార్థన: మా బంధకములనుండి విడిపించిన దేవా! మీకు వందనములు.

విత్తనము మొలకెత్తాలంటే అది భూమిలో పాతిపెట్టబడాలి. అలాగే దైవరాజ్యము ఆవిష్కరణ కొరకై ప్రభువు బంధింపబడుటకు తన్ను తాను తగ్గించుకొనెను.

పరలోకములో దైవచిత్తము నెరవేరుచున్నట్లు భూమిమీద ఆయన చిత్తము నెరవేరుటకు దైవరాజ్యము స్థాపింపబడెను. దైవరాజ్యములోని ప్రధానాంశము విడుదల. మన చుట్టూ ఉన్న ఉరులనుండి, భ్రమలనుండి, సాతాను అంధకార శక్తులనుండి విడుదల చేసి శొధనను జయించుటకు శక్తినొసగి పాపమునుండి విడుదల కలుగజేసెను. ముఖ్యముగా రెండవ మరణముండి తప్పించి పరలోకములో ఆయనతో సదాకాలము జీవించు కృపను ప్రభువు మనకు విడుదల చేసెను. అప్పుడు, ఆ క్షణమే ప్రభువు తాను బంధీ అయ్యి శిష్యులకు విడుదల కలుగజేసెను. ఇప్పుడు ఆయనను వెంబడించు వారిని, తద్వారా అణగారిన దీనులను ఆయన స్వతంత్రులుగా చేసెను.

ప్రభువునందు అంటుకట్టబడి మనమును బహుగా ఫలించు నిమిత్తము ప్రభువు అందించిన విడుదలకు కృతాజ్ఞతా స్తుతులు చెల్లించు జీవితమును దేవుడు మనకు దయచేయును గాక! ఆమేన్.

Supporting verses

యోహాను సువార్త 18:
4. యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లిమీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.
5. వారునజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసుఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
6. ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.
మత్తయి సువార్త 26:
51. ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.
52. యేసునీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె1 ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?
54. నేను వేడుకొనిన యెడలఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.
55. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయ ములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరు నట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యు లందరు ఆయనను విడిచి పారిపోయిరి.

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +