ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 24

వాక్య భాగము: Mat 26:36-46; Mark 14:32-42; Luke 22:40-46; John 18:1

గెత్సెమనెలో ప్రభువు ప్రార్థన, ప్రయాస, కీడును జయించు సూత్రము

సత్యము: మెళకువతో ప్రార్థించి ప్రభువు కీడును జయించెను

కృప: మన ప్రార్థనను ప్రభువు విని దుష్టునుండి(కీడు) తప్పించును

ప్రార్థన: గెత్సెమనేలో బహు వేదనతో ప్రార్థించి మా కీడుని తీసివేసి, నిత్యజీవమును అనుగ్రహించిన దేవా! మీకు వందనములు. మేము ఈ చెడు దినములలో మెళకువగా ఉండి ప్రార్థించి దుష్టుని తరిమివేయు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ముందుపాఠములో ప్రభువు అంతరంగ ప్రార్థన, వేదన, శ్రమను ధ్యానించాము. ఈరోజు బహిరంగ, భౌతిక విషయములు ధ్యానించుదము. మెళకువ, ప్రార్థన అంతరంగ విషయము. దుష్టుడు, కీడు భౌతిక/బాహ్య విషయములు.

క్రైస్తవునికి పరలోకమందును, ఈ భూమిమీద కూడ మహిమ కలదు. లోకములో దైవరాజ్య సంబంధులకు శ్రమ కలుగును, దానికి అనేకరెట్లు మహిమను అనుగ్రహించుటకు ప్రభువు అత్యధికముగా ప్రార్థనలో శ్రమించెను. శిష్యులు ఆ సమయములో నిద్రమత్తులుగా నుండిరి గాని యోహాను ప్రభువు చెప్పుచున్న ప్రార్థనావర్తమానము మదిలో రాసుకొనుచుండెను. ప్రభువు శ్రమలో మనము పాలిభాగస్తులము కాజాలము గాని, ఆయన వర్తమానములను అందుకొను ప్రార్థనానుభవము కలుగుటకు తగిన శ్రమను మన శరీరమునకు అలవాటు చేయుట కనీస బాధ్యత.

రోమా 12:21 "కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము" అని పౌలు భక్తుడు చెప్పిన బహిరంగ విషయములను అంతరంగములోనికి మార్చినట్లయితే ఆ వాక్యము "మాంధ్యులై దుష్టునిచేత జయింపబడక, మెళకువతో ప్రార్థన చేయుచు దుష్టుని జయించుము".

బహుగా ప్రార్ధన చేయుడి - ఇకమీదట - బహుగా ప్రార్ధనచేయుడి
బహుగా ప్రార్ధనచేసి - బలమున్ సంపాదించి మహిలో కీడును
గెల్వుడి - దేవుని కెపుడు మహిమ కలుగనీయుడి


విడువక ప్రార్థించు కృప దేవుడుమనకు దయచేయును గాక! ఆమేన్.

Supporting verses

మత్తయి సువార్త 26
38. అప్పుడు యేసుమరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండు డని వారితో చెప్పి
39. కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
40. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?
41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +