దైవ రాజ్య స్థాపనకై నూతన నిబంధన నిర్మాణం కొరకు ప్రభువైన యేసు క్రీస్తు పొందిన మహా శ్రమలు

ఈ వాక్యములు క్రైస్తవ పండుగలు అను పుస్తకములో సిలువధ్యానముల కొరకు అయ్యగారు ఏర్పరచినవి.

1. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు Wednesday

వాక్య భాగము: Mat 21:1-11; Mark 11:1-11; Luke 19:29-44; John 12:12-19

యేసుక్రీస్తు ప్రభువు హోసన్న జయ ధ్వనులతో యేరూషలేములో ప్రవేశించుట

2. దుష్ట దురాచారములను అంతం చేయగల శక్తి క్రీస్తుప్రభువు Thursday

వాక్య భాగము: యేసు క్రీస్తు ప్రభువు అంజూరపు చెట్టును ఎందుకు శపించెను ? Mat 21:18 19; Mark 11:12-14; Luke --; John --

రాజనీతి: దైవ లక్షణములైన ఆత్మ ఫలములను అందించని మతాచారములను వేళ్ళతో సహా ఎండగట్టిన ప్రభువు మన యేసు క్రీస్తు - Read More

3. యేసుమార్గమే దైవమార్గము Friday

వాక్య భాగము: సత్యసారము కలిగిన మతమే దైవమతము Mat 21:12-16; Mark 11:15-18; Luke 19:45-48; John --;

4. యేసుక్రీస్తు సత్యవాక్యమనే విత్తనము Saturday

వాక్య భాగము: సత్యాచార ఫలము మృతమైనయెడల సత్యము విస్తరించి బహుగా ఫలించును Mat 21:17; Mark 11:19; Luke --; John 12:20-50

I Sunday in lent Sunday

లెంటులోని మెదటి ఆదివారము

5. కొండను కదల్చగల విశ్వాసము Monday

వాక్య భాగము: Mat 21:20-22; Mark 11:20-25; Luke --; John --

6. క్రీస్తే సర్వాధికారి Tuesday

వాక్య భాగము: Mat 21:23, 22:1-14; Mark 11:27;12:1-12; Luke 20:1-19; John --

7. దేవునివి దేవునికి చెల్లించాలి మరియు దేశ పౌరవిధిని నిర్వహించాలి. Wednesday

వాక్య భాగము: Mat 22:15-22; Mark 12:13-17; Luke 20:20-26; John --

8. దేవుడు సజీవులకే దేవుడు గాని మృతులకు కాదు Thursday

వాక్య భాగము: Mat 22:23-33; Mark 12:18-27; Luke 20:27-33, 44; John --

9. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన పరమ ఆజ్ఞ: దైవప్రేమ Friday

వాక్య భాగము: Mat 22:34-40; Mark 12:28-34; Luke 21:37; John 15: 9-14

10. యేసుక్రీస్తు అందరికి ప్రభువు Saturday

వాక్య భాగము: Mat 22:41-46; Mark 12:34-37; Luke 20:39,41,44;21:38; John --

II Sunday Sunday

లెంటులోని రెండవ ఆదివారము

11. యేసు ప్రభువే పరమ బోధకుడు Monday

వాక్య భాగము: Mat 23:1-39; Mark 12:37-40; Luke 20:45-47; John --

12. కానుకకు విలువ కట్టేది ప్రభువే Tuesday

వాక్య భాగము: Mat --; Mark 12:41-44; Luke 21:4; John --

13. ప్రభువే దేవాలయము Wednesday

వాక్య భాగము: Mat 24:1-25,46; Mark 13:1-37; Luke 21:6-36; John --

14. ప్రభువును హింసించుటకు ఏకమైన పెద్దలు, ప్రధాన యాజకులు Thursday

వాక్య భాగము: Mat 26:2-5; Mark 14:1,2; Luke 22:1,2; John --

15. సువార్త సువాసన Friday

వాక్య భాగము: Mat 26:6-13; Mark 14:3-9; Luke --; John 12:1-8

16. ధన ప్రియులు బహు దారిద్రులు. మిత్రద్రోహమే వారి విద్య Saturday

వాక్య భాగము: Mat 26:14-16; Mark 14:10,11; Luke --; John --

III Sunday Sunday

లెంటులోని మూడవ ఆదివారము

17. ప్రభు రాత్రి బోజనము, సిద్ధబాటు Monday

వాక్య భాగము: Mat 26:17-19; Mark 14:12-16; Luke 22:7-13; John --

రాజనీతి: ఎన్ని ఆటంకములున్నను, మనకు ప్రభుభోజనము సిద్ధ పర్చుచున్న తండ్రి - Read More

18. ప్రభువు మిక్కిలి ఆశతో యిచ్చిన ప్రేమ విందు, మనకు నూతన నిభంధన Tuesday

వాక్య భాగము: Mat 26:20; Mark 14:17; Luke 22:14-20, 24-30; John 13:1-20

రాజనీతి: Inception of New Testament by Lord Jesus Christ - Read More

19. తన్ను అప్పగింపబోవు వానికికూడ భోజనము పెట్టిన ప్రభువు Wednesday

వాక్య భాగము: Mat 26:21-25; Mark 14:18-21; Luke 22:21-23; John 13:11-36

రాజనీతి: ప్రభువు సిద్ధపర్చిన మేళ్ళు ఆయన యెదుటే అనుభవిస్తూ ఆయనను చూడలేకపోవుటే దౌర్భాగ్యము. ... Read More

20. ప్రభు సంస్కారపు విందు - దైవ సహవాసము Thursday

వాక్య భాగము: Mat 26:26-29; Mark 14:22-25; Luke 22:19-20; John 13:31-32

దేవుడే మనకు తోడై యుంటె, మనకేమి కొదువ ? ... Read More

21. ప్రభువు పొదిగిన పరిశుద్ధ నైజము Friday

వాక్య భాగము: Mat 26:31-35; Mark 14:27-31; Luke 22:31-38; John 13:33-38,14:1-31

Postpone your death for Christ ... Read More

22. వలీవలకొండపై యేసుప్రభువు మరణ వాంగ్మూలము Saturday

వాక్య భాగము: Mat 26:30; Mark 14:26; Luke 22:39; John 15,16 Chapters

దైవాత్మ అభిషేక ఫలము = సత్యము మరియు ప్రేమ కలిగియుండడమే ... Read More

IV Sunday Sunday

లెంటులోని నాల్గవ ఆదివారము

23. యేసుప్రభువు వెల్లడించిన దైవ స్వరూప లక్షణములు, ఐక్యతలో బంధించు ప్రార్ధన Monday

వాక్య భాగము: Mat --; Mark --; Luke --; John 17 Chapter

24. గెత్సెమనెలో ప్రభువు ప్రార్థన, ప్రయాస, కీడును జయించు సూత్రము Tuesday

వాక్య భాగము: Mat 26:36-46; Mark 14:32-42; Luke 22:40-46; John 18:1

25. ప్రభువును బంధించుట అసాధ్యము Wednesday

వాక్య భాగము: Mat 26:47-56; Mark 14:43-52; Luke 22:47-53; John 18:2-11

26. ప్రధాన యాజకుని(తన సేవకుని) వద్దకు ప్రభువు తేబడుట Thursday

వాక్య భాగము: Mat --; Mark 14:53; Luke 22:54; John 18:12-14,19-23

27. పేతురుగారి శోధన. ప్రభువా లేక మనుగడా? Friday

వాక్య భాగము: Mat 26:58; Mark 14:54; Luke 22:55; John 18:15-18

మనము ప్రభువును వెంబడించువారమైతే , మనం కాదన్నా దేవుడు మనపట్ల చేయుచున్న కార్యములను బట్టి జనులు మనం యేసుతో ఉన్నవారమని తెలిసికొంటారు. ... Read more

28. యాజకులు అన్ని ఆజ్ఞలను మీరుట - అబద్ధ సాక్ష్యముతో సహా Saturday

వాక్య భాగము: Mat 26:57,59-68; Mark 14:53,55-65; Luke 22:63-65; John 18:2

V Sunday Sunday

లెంటులోని ఐదవ ఆదివారము

29. ప్రభువు దృష్టంతా తన శిష్యుల పైనే Monday

వాక్య భాగము: Mat 26:69-75; Mark 14:66-72; Luke 22:56-62; John 18:17

30. దైవము vs యాజకులు Tuesday

వాక్య భాగము: Mat --; Mark --; Luke --; John 18:25-27

31. ప్రభువైన ప్రధానయాజకుడు - యాజకులు Wednesday

వాక్య భాగము: Mat 27:1-2; Mark 15:1; Luke 22:66-71; John --

32. పశ్చాత్తాపమునకు కాలపరిమితి Thursday

వాక్య భాగము: Mat 27:3-10; Mark --; Luke --; John --

33. Lord vs lord Friday

వాక్య భాగము: Mat 27:2,11-14; Mark 15:1-5; Luke 23:1-7 ; John 18:28-38

34. యేసుక్రీస్తు ప్రభువు నిర్ధోషి అని తీర్పు Saturday

వాక్య భాగము: Mat --; Mark --; Luke 23:8-12; John --

VI Sunday మట్టలాదివారము

లెంటులోని ఆరవ ఆదివారము

35. తానిచ్చిన తీర్పును అమలుచేయలేని పిలాతు Monday

వాక్య భాగము: Mat 27:15-31; Mark 15:6-20; Luke 23:13-25; John 18:39,19:17

36. సిలువ మోత Tuesday

వాక్య భాగము: Mat 27:32; Mark 15:21-22; Luke 23:26-32; John --

37. సిలువ వేత Wednesday

వాక్య భాగము: Mat 27:33-56; Mark 15:22-41; Luke 23:33-49; John 19:17-37

38. యేసు ప్రభుని దేహము Thursday

వాక్య భాగము: Mat 27:57-61; Mark 15:42-47; Luke 23:50-56; John 19:38-42

39. Good Friday మంచిశుక్రవారము

మత్తయి సువార్త 27; మార్కు 15; లూకా 23; యోహాను 19

40. కావలి గల సమాధిలో ప్రభువైన క్రీస్తు. Holy Saturday Saturday

మత్తయి 27:59-66; మార్కు 15:43-46; లూకా 23:50-56; యోహాను 19:41,42.

Easter ఈస్టర్

మత్తయి సువార్త 28; మార్కు 16; లూకా 24; యోహాను 20

యేసు ప్రభువు చివరి ఏడు రోజుల యెరూషలేము యాత్రలో పొందిన శ్రమలను ఈ 40 రోజులు ధ్యానము చేయుదము.ప్రభువు యొక్క మహా శ్రమ ముగిసింది,అనాదిలో ఉద్దేశించిన రక్షణ మహా సంకల్ప లక్ష్యం నెరవేరింది. కాబట్టి సంతోషముతో ధ్యానము చేయుదము. మనముందు చాలా పని వుంది. ఇదే సమయంలో లోటు, లేమి కూడ ఉన్నాయి. సాధించవలసిన గమ్యం కూడ కొంచెం దూరంలోనె ఉంది. అయినా గాని ఈ 40 రోజులలో ప్రభువు యొక్క ఉద్ధేశమును తెలుసుకొని ఆయన యొద్దనుండి శక్తి పొంది గురిని చేరుదము.


arrow

దేవుడు దేవదాసు అయ్యగారికి అందించిన వర్తమానాలలో ఒక నూతన శాస్త్రము - కృపా శాస్త్రము. దీని ప్రకారం దేవుడు మనకొరకు సిద్ధపర్చిన తన రక్షణ మహా సంకల్పమును ఎరిగిన వారమై ఆయన యిచ్చు ఆహ్లాదకరమైన, తాజదనముతో కూడిన నూతన జీవితమును ప్రతి దినము అనుభవించే ధన్యత మనకు కలుగుతుంది. మనము విశ్వాసముతో సంపాదించుకొనుచున్నవన్నీ ఆయన మూలముగానే కలిగెను. అయినను మనకు శ్రమలు, కొదువ ఉన్నవి. అన్నిటిని జయించుటకు దేవుని కృప ఈ శ్రమకాల ధ్యానములో ఉన్న మనకు తోడై ఉండును గాక!

అయ్యగారి మాట:- మనము ఇంకను పాపములో ఉండిన యెడల కృపను లోకువ గట్టుటయే.

దేవుడు మొట్టమొదటిసారిగా నోవహునకు కృపను పరిచయం చేసెను. నోవహు ఇచ్చిన సాక్ష్యమేదనగా "లోకమంతయు ఘోరపాపములో పడివున్నను, మనము ఎంత శోధింపబడినను నీతిలో నివసించుటయే కృప. ఈ కృపవలన లోకములోనుండి ప్రభువు మనలను రక్షించును".


సిలువకు ముందు ఆఖరివారములో ప్రభువుపడిన శ్రమ

దేవుడు అనాదిలో సృజించి, ఆదిలో సృష్టించిన అన్ని మంచి ఫలములను తిరిగి (ఆదాము వలన కోల్పోయినవి) నిర్మించడానికి, అనవసర పద్దతులను తొలగించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు తన ఆఖరి వారం రోజులలో ఎక్కడా రాజీ పడలేదు. ఆయన ఆత్మను పొందిన మనము ఆయన వచ్చినప్పుడు అతి సుందరముగా అలంకరించబడిన వధువుగా కనిపించుటకు ఆశక్తి కలిగివుందుము గాక!. ఈ సంవత్సరం లెంటు గురి యేదనగా "సంఘ మరియు స్వంత వాగ్దానముల నెరవేర్పుకొరకు నిర్మాణాత్మక క్రియాభ్యాసము". అపొస్తలులైన పేతురు గారిచే నిర్మింపబడ్డ సంఘము అనేక శాఖలైనప్పటికిని క్రీస్తు ప్రేమను బట్టి అవన్ని కలిసి ఘనకార్యములు చేయుటకు ఈ సంవత్సరము ప్రభువు ఆత్మ పనిచేయును గాక!


ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీర ధారిగా ఉన్నపుడు చేసిన ప్రతి పని, దానికి వాడబడినవన్ని (ప్రాంతములు, రాజులు, మనుష్యులు, జంతువులు, చెట్లు, సిలువ మ్రానులు ...మొదలగునవి) ముందుగా తన ప్రణాలికలో ఉన్నవే మరియు తన ప్రవక్తలకు పాతనిబంధనలో తెలియజేసినవే. ఆయన అనాది సంకల్ప మహా రక్షణ ప్రణాలికను అమలు చేయుచున్న రెండు గుంపులు ఆయనను వెంట నడుచుచున్నవి.

  1. యాజకులు: మన ప్రభువు ప్రణాలికను అమలుపరుస్తున్నామని తెలియక, ఆయనను ద్వేషిస్తూ, కళ్ళెదుటె ప్రత్యక్షంగా యేసే, క్రీస్తుగా ఋజువు పరుస్తున్నప్పటికిని; స్వనీతి ముసుగులో కఠిన హృదయులై ఆయనను చూడలేనివారు.
  2. శిష్యులు: అనేక ప్రవక్తలు చూడగోరి, చూడలేకపోయిన ఈ మహా యజ్ఞమును, దైవ స్వరూపమును మనము ఇంత దగ్గరనుండి చూస్తున్నందుకు ధన్యులమని గుర్తెరిగి , యెంతో చింత ఉన్నను సిలువ చెంత నడిచిన వారు. వీరు ఆయన ప్రేమను జీవిత కాలము మరచిపోలేక ఆయన నిబంధనను అమలుపర్చినవారు.


యేసుక్రీస్తు ప్రభువు ఎంతో సిలువ శ్రమను అనుభవించి స్థాపించిన నూతన నిబంధనలో గల ఆనందమును ఆయన మనకు దయచేయునుగాక! ఆమేన్.


గమనిక: ఈ శీర్షికలు దేవదాసు అయ్యగారి ప్రసంగములనుండి సంగ్రహించబడినను, these are not direct messages of Devadasu ayyagaaru. So please read సిలువ విలువ - ధ్యాన కలువ/సిలువ ధ్యానములుfor direct messages of ayyagaru.


Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +