30. యేసుప్రభువు చేసిన బోధ

రాగం: కళ్యాణి తాళం: తిస్రచాపు  యేసునామమెంతో మధురం - మధురం మధురం మధురం

 1. దీనజనులు భాగ్యవంతుల్ - దివి రాజ్యంబు వారిదన్న || యేసు || (మత్తయి5:3)

 2. సాత్వికులగు జనులు భూమిని - స్వతంత్రించుకొందురన్న || యేసు || (మత్తయి5:5)

 3. కనికరించువారు ధన్యుల్ - కనికరంబు పొందెదరన్న || యేసు || (మత్తయి5:7)

 4. శుద్ధహృదయులు ధన్యుల్ దేవుని - చూతురని బహిరంగ పరచిన || యేసు|| (మత్తయి5:8)

 5. శాంతికరుల్ ధన్యుల్ వారు - స్వామిసుతులై యుందురన్న || యేసు || (మత్తయి 5:9)

 6. నా కొరకు హింసలను బొందు - మీకుదివి గొప్ప ఫలమని యన్న || యేసు || (మత్తయి 5:11)

 7. మీ సత్ క్రియలు చూచి ప్రజలు - మింటి తండ్రిన్ మెచ్చెదరన్న || యేసు || (మత్తయి5:16)

 8. నేను ధర్మశాస్త్రమునకు - నెరవేర్పై యున్నానని యన్న || యేసు || (మత్తయి5:17)

 9. నేను భవిష్యద్వాక్యములకు - నెరవేర్పైయున్నాననియన్న || యేసు || (మత్తయి5:17)

 10. అన్యాయముగా కోపపడిన - హత్యకార్య - మని వచించిన || యేసు || (మత్తయి5:22)

 11. ద్రోహివని నీ సోదరు నన్న - ద్రోహివి నీవౌదు వన్న || యేసు || (మత్తయి5:22)

 12. పాపక్రియలు లేకపోయిన - చూపె పాపమని బోధించిన || యేసు || (మత్తయి5:28)

 13. మీరు పరులవల్ల కోరు - మేలు వారికి చేయుడన్న || యేసు || (మత్తయి 7:12)

 14. అన్నపానాదుల విషయం - బైన చింత కూడదన్న || యేసు || (మత్తయి 6:25)

 15. మొదట దేవ రాజ్యంబు వెదకిన - పిదపవన్నియు దొరకు నన్న || యేసు || (మత్తయి 6:33)

 16. మొదట దేవ నీతి వెదకిన - పిదపనన్నియు దొరకు నన్న || యేసు || (మత్తయి 6:33)

 17. తీర్పు తీర్చరాదు అపుడు - తీర్పు నీకు రాదని యన్న || యేసు || (మత్తయి 7:1)

 18. నాయొద్దకున్ రండియనుచు - ఆయాసపడు వారి నన్న || యేసు || (మత్తయి 11:28)

 19. మీ శత్రువులను ప్రేమించండి - మేలుచేయుచు నుండుడన్న || యేసు || (లూకా6:33)

 20. నిన్ను వలె నీ పొరుగువానిన్ - నెనరుతోనే చూడు మన్న || యేసు || (లూకా 10:17)

 21. దేవుడు మీ తండ్రి యనెడి - దివ్య బంధుత్వంబు దెల్పిన || యేసు || (లూకా11:13)

 22. నరులు మీ సహోదరులను - వరుస బైలుపరచి యున్న || యేసు || (యోహాను 10:16)

 23. రోగులకు గల వ్యాధుల్ మీరు - బాగు చేయవలెనని యన్న || యేసు || (మత్తయి 10:8)

 24. ఉచితముగా పొందితిరి గనుక - ఉచితముగానే ఇయ్యుడన్న || యేసు || (మత్తయి 8:10)

 25. ఏమి యడిగిన చేతునన్న -హితవాక్యంబు పలికియున్న || యేసు || (యోహాను14:14)

 26. తలుపువేసి దైవప్రార్ధన - సల్పిన ప్రతి ఫలమని యన్న || యేసు || (మత్తయి6:6)

 27. ప్రార్ధనమున వ్యర్ధమైన - పలుకు వల్లపడదని యన్న || యేసు || (మత్తయి6:7)

 28. కలిగియున్న విశ్వాసంబు - వలన నీకు కలుగునన్న || యేసు || (మత్తయి 9:29)

 29. కార్యసిద్ధికి ముందే నమ్మిన - కార్యసిద్ధి యౌనని యన్న || యేసు || (మార్కు 11:24)

 30. పరుల కెరుక పరుపగల యుప - వాసము చేయరాదని యన్న || యేసు || (మత్తయి 6:16)

 31. నాకుమార ధైర్యమొందుము - నీకు పాపక్షమయని యన్న || యేసు || (మత్తయి9:2)

 32. నిన్ను శిక్షింపను పొమ్ము మరల - నేరమున పడరాదని యన్న || యేసు || (యోహాను 8:1)

 33. నశియించిన రక్షించుటకు - నరలోకమునకు వచ్చితి నన్న || యేసు || (లూకా19:10)

 34. కుడిచేతితో చేయు ధర్మము - యెడమచేతికి తెలియ రాదన్న || యేసు || (మత్తయి 6:3)

 35. తక్కువ చందాను చూచి - ఎక్కువేయని మెచ్చుకొన్న || యేసు || (లూకా 21:3)

 36. ఎక్కువ చందాను చూచి - తక్కువగనె యెంచి యున్న || యేసు || (లూకా 21:3)

 37. లోకమందు మీకు శ్రమలు - లోమును జయించితి నన్న || యేసు || (యోహాను 16:33)

 38. నేనే పునరుత్థానమై యు - న్నానని ధైర్యంబు చెప్పిన || యేసు || (యోహాను 11:25)

 39. నన్ను నమ్మువాడు మృతుడై - నప్పటికిని బ్రతుకు నన్న || యేసు || (యోహాను 11:25)

 40. బ్రతికి నన్ను నమ్మువాడె - ప్పటికిని మృతిపొంద డన్న || యేసు || (యోహాను 11:26)

 41. ఒక్కచోటనే నేను మీరు - ఉందుమని ప్రవచించియున్న || యేసు || (యోహాను 14:3)

 42. మరల వచ్చి మిమ్ముమోక్ష - పురము కొంచుపోదునన్న || యేసు || (యోహాను 14:3)

 43. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమని విన్పించిన || యేసు || (యోహాను 14:6)

 44. ననుజూచిన దేవుని జూచి - నట్లే యనుచు వెల్లడించిన || యేసు || (యోహాను 14:9)

 45. నా క్రియలకు మించు క్రియలు - నా విశ్వాసులు చేతురన్న || యేసు || (యోహాను 14:12)

 46. పరిశుద్ధాత్మ మీయందు ని - వాసము చేయ పంపెద నన్న || యేసు || (యోహాను 14:17)

 47. మీరు నాలో నేను మీలో - మిళితమై నివసింతు మన్న || యేసు || (యోహాను 14:20)

 48. నాకు వేరై మీరు ఏమియు - నడపలేరని నిరుకు చెప్పిన || యేసు || (యోహాను 15:5)

 49. సర్వసృష్టికి నా సువార్త - చాటుడంచు నానతిచ్చిన || యేసు || (మార్కు 16:15)

 50. పరిశుద్ధాత్మ వచ్చు వరకు - ప్రకటనకు బోరాదని యన్న || యేసు ||(లూకా 24:49; అపో.కా.1:4,5,8)

 51. యేసువలెనె పల్కువారు - ఎవరు లేరని పేరొందిన || యేసు || (యోహాను 7:46)


ప్రార్ధన: ఓదేవా, పరమ తండ్రీ! ఈ పాటలోని నీ దివ్యమైన పలుకులు నేను అనుభవించునట్లునూ, ఇతరులకు బోధించునట్టి కృపను నాకు దయచేయుమని వేడుకొనుచున్నాను తండ్రీ! ఆమెన్.
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


30. yaesuprabhuvu chaesina bOdha

raagaM: kaLyaaNi taaLaM: tisrachaapu  yaesunaamameMtO madhuraM - madhuraM madhuraM madhuraM

 1. deenajanulu bhaagyavaMtul^ - divi raajyaMbu vaaridanna || yaesu || (mattayi5:3)

 2. saatvikulagu janulu bhoomini - svataMtriMchukoMduranna || yaesu || (mattayi5:5)

 3. kanikariMchuvaaru dhanyul^ - kanikaraMbu poMdedaranna || yaesu || (mattayi5:7)

 4. SuddhahRdayulu dhanyul^ daevuni - chooturani bahiraMga parachina || yaesu|| (mattayi5:8)

 5. SaaMtikarul^ dhanyul^ vaaru - svaamisutulai yuMduranna || yaesu || (mattayi 5:9)

 6. naa koraku hiMsalanu boMdu - meekudivi goppa phalamani yanna || yaesu || (mattayi 5:11)

 7. mee sat^ kriyalu choochi prajalu - miMTi taMDrin^ mechchedaranna || yaesu || (mattayi5:16)

 8. naenu dharmaSaastramunaku - neravaerpai yunnaanani yanna || yaesu || (mattayi5:17)

 9. naenu bhavishyadvaakyamulaku - neravaerpaiyunnaananiyanna || yaesu || (mattayi5:17)

 10. anyaayamugaa kOpapaDina - hatyakaarya - mani vachiMchina || yaesu || (mattayi5:22)

 11. drOhivani nee sOdaru nanna - drOhivi neevaudu vanna || yaesu || (mattayi5:22)

 12. paapakriyalu laekapOyina - choope paapamani bOdhiMchina || yaesu || (mattayi5:28)

 13. meeru parulavalla kOru - maelu vaariki chaeyuDanna || yaesu || (mattayi 7:12)

 14. annapaanaadula vishayaM - baina chiMta kooDadanna || yaesu || (mattayi 6:25)

 15. modaTa daeva raajyaMbu vedakina - pidapavanniyu doraku nanna || yaesu || (mattayi 6:33)

 16. modaTa daeva neeti vedakina - pidapananniyu doraku nanna || yaesu || (mattayi 6:33)

 17. teerpu teercharaadu apuDu - teerpu neeku raadani yanna || yaesu || (mattayi 7:1)

 18. naayoddakun^ raMDiyanuchu - aayaasapaDu vaari nanna || yaesu || (mattayi 11:28)

 19. mee Satruvulanu praemiMchaMDi - maeluchaeyuchu nuMDuDanna || yaesu || (lookaa6:33)

 20. ninnu vale nee poruguvaanin^ - nenarutOnae chooDu manna || yaesu || (lookaa 10:17)

 21. daevuDu mee taMDri yaneDi - divya baMdhutvaMbu delpina || yaesu || (lookaa11:13)

 22. narulu mee sahOdarulanu - varusa bailuparachi yunna || yaesu || (yOhaanu 10:16)

 23. rOgulaku gala vyaadhul^ meeru - baagu chaeyavalenani yanna || yaesu || (mattayi 10:8)

 24. uchitamugaa poMditiri ganuka - uchitamugaanae iyyuDanna || yaesu || (mattayi 8:10)

 25. aemi yaDigina chaetunanna -hitavaakyaMbu palikiyunna || yaesu || (yOhaanu14:14)

 26. talupuvaesi daivapraardhana - salpina prati phalamani yanna || yaesu || (mattayi6:6)

 27. praardhanamuna vyardhamaina - paluku vallapaDadani yanna || yaesu || (mattayi6:7)

 28. kaligiyunna viSvaasaMbu - valana neeku kalugunanna || yaesu || (mattayi 9:29)

 29. kaaryasiddhiki muMdae nammina - kaaryasiddhi yaunani yanna || yaesu || (maarku 11:24)

 30. parula keruka parupagala yupa - vaasamu chaeyaraadani yanna || yaesu || (mattayi 6:16)

 31. naakumaara dhairyamoMdumu - neeku paapakshamayani yanna || yaesu || (mattayi9:2)

 32. ninnu SikshiMpanu pommu marala - naeramuna paDaraadani yanna || yaesu || (yOhaanu 8:1)

 33. naSiyiMchina rakshiMchuTaku - naralOkamunaku vachchiti nanna || yaesu || (lookaa19:10)

 34. kuDichaetitO chaeyu dharmamu - yeDamachaetiki teliya raadanna || yaesu || (mattayi 6:3)

 35. takkuva chaMdaanu choochi - ekkuvaeyani mechchukonna || yaesu || (lookaa 21:3)

 36. ekkuva chaMdaanu choochi - takkuvagane yeMchi yunna || yaesu || (lookaa 21:3)

 37. lOkamaMdu meeku Sramalu - lOmunu jayiMchiti nanna || yaesu || (yOhaanu 16:33)

 38. naenae punarutthaanamai yu - nnaanani dhairyaMbu cheppina || yaesu || (yOhaanu 11:25)

 39. nannu nammuvaaDu mRtuDai - nappaTikini bratuku nanna || yaesu || (yOhaanu 11:25)

 40. bratiki nannu nammuvaaDe - ppaTikini mRtipoMda Danna || yaesu || (yOhaanu 11:26)

 41. okkachOTanae naenu meeru - uMdumani pravachiMchiyunna || yaesu || (yOhaanu 14:3)

 42. marala vachchi mimmumOksha - puramu koMchupOdunanna || yaesu || (yOhaanu 14:3)

 43. naenae maargamu naenae satyamu - naenae jeevamani vinpiMchina || yaesu || (yOhaanu 14:6)

 44. nanujoochina daevuni joochi - naTlae yanuchu vellaDiMchina || yaesu || (yOhaanu 14:9)

 45. naa kriyalaku miMchu kriyalu - naa viSvaasulu chaeturanna || yaesu || (yOhaanu 14:12)

 46. pariSuddhaatma meeyaMdu ni - vaasamu chaeya paMpeda nanna || yaesu || (yOhaanu 14:17)

 47. meeru naalO naenu meelO - miLitamai nivasiMtu manna || yaesu || (yOhaanu 14:20)

 48. naaku vaerai meeru aemiyu - naDapalaerani niruku cheppina || yaesu || (yOhaanu 15:5)

 49. sarvasRshTiki naa suvaarta - chaaTuDaMchu naanatichchina || yaesu || (maarku 16:15)

 50. pariSuddhaatma vachchu varaku - prakaTanaku bOraadani yanna || yaesu ||(lookaa 24:49; apO.kaa.1:4,5,8)

 51. yaesuvalene palkuvaaru - evaru laerani paeroMdina || yaesu || (yOhaanu 7:46)


praardhana: Odaevaa, parama taMDree! ee paaTalOni nee divyamaina palukulu naenu anubhaviMchunaTlunoo, itarulaku bOdhiMchunaTTi kRpanu naaku dayachaeyumani vaeDukonuchunnaanu taMDree! aamen^.