67. యేసునామ ధారులు ధన్యులు


  యేసునామ ధారులు ధన్యులు యేసునామ ధారులందరు - ఎంతో ధన్యులు వారు భాసురమైనట్టి స్థితిలో - బ్రతుకజూతురు || యేసునామ ||

 1. ఆదాము హవ్వల వలెనె - ఐక్యమొందుదురు
  వారు బేధమేమియు లేకుండగనె - పెరుగుచుందురు || యేసునామ ||

 2. హేబేలువలెనె ప్రభువునకు మంచివి - ఇచ్చివేతురు
  వారు - ఆ బాలునివలెనె దేవుని అనుమతి పొందుదురు || యేసునామ ||

 3. హనోకువలెనె దేవుని - హత్తియుందురు
  వారు - ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు || యేసునామ ||

 4. నోవాహు వలెనె క్రీస్తుని - నావను జేరుదురు
  వారు - ఏవిధమైన ప్రళయంబును - ఎరుగకుందురు || యేసునామ ||

 5. షేమువలె దేవుని గలిగి - సిద్ధులౌదురు
  వారు - తాము తలంచు దేవునికి వందనము చేయుదురు || యేసునామ ||

 6. అబ్రామువలెనె పిలుపు - అందుకొందురు
  వారు - శుభ్రముగా యిలువిడిచి వేరు - చోటున చేరుదురు || యేసునామ ||

 7. ఇస్సాకు వలెనె చావు - నెదురుకొందురు
  వారు - డస్సిపోరు వెనుకాడరు - దాగియుండరు || యేసునామ ||

 8. యాకోబువలె దీవెనలెన్నో - ఆర్జింపగలరు
  వారు -త్రైకునితో పోరాడి పగను - దించివేయుదురు || యేసునామ ||

 9. యూదావలె పరులకొరకు - వాదింపగలరు
  వారు - వేదన గలవారికై క్రీస్తుని - వేడుకొనగలరు || యేసునామ ||

 10. యోసేపువలెనె శోధన-లున్న గెలుతురు
  వారు - ఏ సమయ మందైన - మంచి ఏలికలౌదురు || యేసునామ ||

 11. మోషేవలెనె దేవుని ముఖా-ముఖిగా జూతురు
  వారు - మోషేవలెనె విద్యకు - ప్రామ్ముఖ్యులౌదురు || యేసునామ ||

 12. యెహోషువవలె వాగ్దేశ - మేగుదురు త్వరలో
  వారు - మహాశూరులై వైరియడ్డు - మడద్రొక్కుదురు || యేసునామ ||

 13. న్యాధిపతులవలెనె - న్యాయముతీర్తురు
  వారు - ఆయా ఆపదలందు ప్రజల - నాదరింతురు || యేసునామ ||

 14. రూతువలెనె పాతకజనులు - జాతిని విడుతురు
  వారు - నీతిసభలోజేరి క్రీస్తు - నియమితులౌదురు || యేసునామ ||

 15. సమూయేలువలె ప్రార్ధన సమా - జములు పెట్టుదురు
  వారు-క్రమపరతురు జనసంఘములో - కలహములేకుండ || యేసునామ ||

 16. రాజులవలెనె నేటి దేవ - రాజ్యాసీనులు
  వారు - రాజులు యాజకులు శాంతి - రాజ్యప్రచారకులు || యేసునామ ||

 17. నెహెమ్యావలెనె పడిపోయినవి - నిలువబెట్టుదురు
  వారు - నెమ్యావలెనె ప్రజలను దిద్ది-నేర్పుదురు బుద్ది || యేసునామ ||

 18. ఎజ్రావలెనె మరచిన బోధ - ఎరిగింపగలరు
  వారు - ఎజ్రావలెనె శాస్త్రమునందు- ఎద్గింపగలరు || యేసునామ ||

 19. ఎస్తేరువలె స్వంతవారి - సృష్టికోరుదురు
  వారు - ఎస్తేరుతో అత్యాదులు - ఎత్తివేయుదురు || యేసునామ ||

 20. యోబువలెనె కష్టాలెల్ల - ఓర్చుకొందురు
  వారు - ఏబాధయందైన దేవుని - హెచ్చుగజూతురు || యేసునామ ||

 21. దావీదువలెనె దేవుని - సేవకులౌదురు
  వారు - పావనకీర్తనల కవులై - ప్రబలుచుందురు || యేసునామ ||

 22. సొలోమోనువలె జ్ఞానంబు - కలిగి యుందురు
  వారు - కలిమిగలిగి క్రొత్త పనులు - కల్పనచేయుదురు || యేసునామ ||

 23. ముగ్గురు బాలురవలెనే మండు - అగ్గికి జడియరు
  వారు - అగ్గినికాల్చి అగ్గినుండి - దిగ్గునలేతురు || యేసునామ ||

 24. దానియేలువలెనే శ్రమలో - ధైర్యవంతులు
  వారు - ఆ నిమిషమందే ప్రార్ధన - అధికము జేతురు || యేసునామ ||

 25. ప్రక్తలవలెనె దేవ - వాక్కు చెప్పుదురు
  వారు - ప్రవచనముల అర్ధములెల్ల - వివ - వివరింపగలరు || యేసునామ ||

 26. మరియంబవలెనె - క్రీస్తుని - ధరియింపగలరు
  వారు - పరిశుద్ధవార్త హృదయమున - భద్రపరతురు || యేసునామ ||

 27. పేతురువలెనె స్వజనులకు - ప్రేమితురులౌదురు
  వారు - రాతిపునాదులౌదురు - నూతన సభలందు || యేసునామ ||

 28. పౌలువలెనె పరజనులు సు-వార్తికులౌదురు
  వారు - పౌలువలెనె సిలువనొక్కి - ప్రజలకు జూపుదురు || యేసునామ ||

 29. స్తెఫనువలె ఎదురాడని - తెలివిని చూపుదురు
  వారు - అపరాదులు కాకున్నను హత-సాక్షులౌదురు || యేసునామ ||

 30. యోహానువలె మూడులోకా-లుండుట జూతురు
  వారు - యోహానువలె మూడులోకా- లుండుటజూతురు || యేసునామ ||

 31. యేసువలె అద్భుతాలు - చేసి చూపుదురు
  వారు - దాసులగుటచేత రక్షణ - దారిచూపుదురు || యేసునామ ||

 32. క్రీస్తువలె నడువగలుగు - క్రియలు చేయుదురు
  వారు - వాస్తవమైనవన్ని ఋజువు - పరుపనేర్తురు || యేసునామ ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


67. yaesunaama dhaarulu dhanyulu  yaesunaama dhaarulu dhanyulu yaesunaama dhaarulaMdaru - eMtO dhanyulu vaaru bhaasuramainaTTi sthitilO - bratukajooturu || yaesunaama ||

 1. aadaamu havvala valene - aikyamoMduduru
  vaaru baedhamaemiyu laekuMDagane - peruguchuMduru || yaesunaama ||

 2. haebaeluvalene prabhuvunaku maMchivi - ichchivaeturu
  vaaru - aa baalunivalene daevuni anumati poMduduru || yaesunaama ||

 3. hanOkuvalene daevuni - hattiyuMduru
  vaaru - aenaaDO okanaaDu paiki egiripOduru || yaesunaama ||

 4. nOvaahu valene kreestuni - naavanu jaeruduru
  vaaru - aevidhamaina praLayaMbunu - erugakuMduru || yaesunaama ||

 5. shaemuvale daevuni galigi - siddhulauduru
  vaaru - taamu talaMchu daevuniki vaMdanamu chaeyuduru || yaesunaama ||

 6. abraamuvalene pilupu - aMdukoMduru
  vaaru - Subhramugaa yiluviDichi vaeru - chOTuna chaeruduru || yaesunaama ||

 7. issaaku valene chaavu - nedurukoMduru
  vaaru - DassipOru venukaaDaru - daagiyuMDaru || yaesunaama ||

 8. yaakObuvale deevenalennO - aarjiMpagalaru
  vaaru -traikunitO pOraaDi paganu - diMchivaeyuduru || yaesunaama ||

 9. yoodaavale parulakoraku - vaadiMpagalaru
  vaaru - vaedana galavaarikai kreestuni - vaeDukonagalaru || yaesunaama ||

 10. yOsaepuvalene SOdhana-lunna geluturu
  vaaru - ae samaya maMdaina - maMchi aelikalauduru || yaesunaama ||

 11. mOshaevalene daevuni mukhaa-mukhigaa jooturu
  vaaru - mOshaevalene vidyaku - praammukhyulauduru || yaesunaama ||

 12. yehOshuvavale vaagdaeSa - maeguduru tvaralO
  vaaru - mahaaSoorulai vairiyaDDu - maDadrokkuduru || yaesunaama ||

 13. nyaadhipatulavalene - nyaayamuteerturu
  vaaru - aayaa aapadalaMdu prajala - naadariMturu || yaesunaama ||

 14. rootuvalene paatakajanulu - jaatini viDuturu
  vaaru - neetisabhalOjaeri kreestu - niyamitulauduru || yaesunaama ||

 15. samooyaeluvale praardhana samaa - jamulu peTTuduru
  vaaru-kramaparaturu janasaMghamulO - kalahamulaekuMDa || yaesunaama ||

 16. raajulavalene naeTi daeva - raajyaaseenulu
  vaaru - raajulu yaajakulu SaaMti - raajyaprachaarakulu || yaesunaama ||

 17. nehemyaavalene paDipOyinavi - niluvabeTTuduru
  vaaru - nemyaavalene prajalanu diddi-naerpuduru buddi || yaesunaama ||

 18. ejraavalene marachina bOdha - erigiMpagalaru
  vaaru - ejraavalene SaastramunaMdu- edgiMpagalaru || yaesunaama ||

 19. estaeruvale svaMtavaari - sRshTikOruduru
  vaaru - estaerutO atyaadulu - ettivaeyuduru || yaesunaama ||

 20. yObuvalene kashTaalella - OrchukoMduru
  vaaru - aebaadhayaMdaina daevuni - hechchugajooturu || yaesunaama ||

 21. daaveeduvalene daevuni - saevakulauduru
  vaaru - paavanakeertanala kavulai - prabaluchuMduru || yaesunaama ||

 22. solOmOnuvale j~naanaMbu - kaligi yuMduru
  vaaru - kalimigaligi krotta panulu - kalpanachaeyuduru || yaesunaama ||

 23. mugguru baaluravalenae maMDu - aggiki jaDiyaru
  vaaru - agginikaalchi agginuMDi - diggunalaeturu || yaesunaama ||

 24. daaniyaeluvalenae SramalO - dhairyavaMtulu
  vaaru - aa nimishamaMdae praardhana - adhikamu jaeturu || yaesunaama ||

 25. praktalavalene daeva - vaakku cheppuduru
  vaaru - pravachanamula ardhamulella - viva - vivariMpagalaru || yaesunaama ||

 26. mariyaMbavalene - kreestuni - dhariyiMpagalaru
  vaaru - pariSuddhavaarta hRdayamuna - bhadraparaturu || yaesunaama ||

 27. paeturuvalene svajanulaku - praemiturulauduru
  vaaru - raatipunaadulauduru - nootana sabhalaMdu || yaesunaama ||

 28. pauluvalene parajanulu su-vaartikulauduru
  vaaru - pauluvalene siluvanokki - prajalaku joopuduru || yaesunaama ||

 29. stephanuvale eduraaDani - telivini choopuduru
  vaaru - aparaadulu kaakunnanu hata-saakshulauduru || yaesunaama ||

 30. yOhaanuvale mooDulOkaa-luMDuTa jooturu
  vaaru - yOhaanuvale mooDulOkaa- luMDuTajooturu || yaesunaama ||

 31. yaesuvale adbhutaalu - chaesi choopuduru
  vaaru - daasulaguTachaeta rakshaNa - daarichoopuduru || yaesunaama ||

 32. kreestuvale naDuvagalugu - kriyalu chaeyuduru
  vaaru - vaastavamainavanni Rjuvu - parupanaerturu || yaesunaama ||