47. వధువు కలవరింపు


  వధువు సంఘము వరునికొరకు - ఎదురు చూచు చున్నది =
  అధమ మొక్క పాపమైన - అంటకుండ నున్నది - అంటనీయకున్నది
  అంటు అంటను చున్నది || వధువు ||

 1. వరుని ప్రేమ స్మరణతోనే - పరిపూర్ణమౌచున్నది
  వరుని మీదనున్న ప్రేమ - పెరగనిచ్చు చున్నది
  తరగనీయకున్నది - వరుడు వరుడను చున్నది || వధువు ||

 2. 'త్వరగ ' ననగా గురుతులైన - తరువాత అనుచున్నది
  = గురుతులు జరిగిన జరిగిన దొంతి - గురుతు పెట్టుచున్నది
  వరుని గురుతను చున్నది - గురుతు గురుతను చున్నది || వధువు ||

 3. 'త్వరగ ' నన్నది నరుని యాత్మకు - ప్రవచన మనుచున్నది
  ఇరువదివందల యేండ్లయినను - 'త్వరగ 'నే యను చున్నది
  వధువు సిద్ధమనుచున్నది - వధువు వధువను చున్నది || వధువు ||

 4. గురుతులను ప్రవచనములను - గుణియించు చున్నది
  = సరిగనున్నవి రెండుననుచు - మురియుచునే యున్నది
  తరచు తరచు చున్నది - సరియె సరియను చున్నది || వధువు ||

 5. ఆడితప్పనివాడు రాక - అట్టెయుండ డను చున్నది
  = నేడు వచ్చివేసినట్టే - పాడుకొనుచు నున్నది
  కీడు చూడకున్నది - నేడు నేడను చున్నది || వధువు ||

 6. వరుడు వధువు నొకటే గనుక - 'త్వరగ ' నిజమనుచున్నది
  = త్వరగలో యిద్దరు దంపతులుగా - బరుగు చుండ్రనుచున్నది
  నిరుకు బ్రతుకను చున్నది - నిరుకు నిరుకను చున్నది
  || వధువు ||

 7. 'త్వరగ ' కడ్డులులేవని నర్ధము - విరివిగా చెప్పుచున్నది
  = నరులు నపవాదియు నడ్డు - పరుప లేరనుచున్నది
  వరుడడిగో యనుచున్నది - పాపహరుడనుచున్నది || వధువు ||

 8. తేదిరాక కున్నదన్న - లేదు లేదను చున్నది
  = తేదీ అపుడు తెలియునన్న - తెలియనగునను చున్నది
  కాదు ఇపుడను చున్నది - తేది తేది యను చున్నది || వధువు ||

 9. చేయడేమియు ప్రభువు సభకు - చెప్పనిదె యను చున్నది
  = ఆయత్తమౌనాటికి తేది - అందుననుచు నున్నది
  మాయలేదను చున్నది - హాయి హాయియను చున్నది || వధువు ||

 10. ఇక్కడను పైనక్కడను - ఒక్క కుటుంబమే యగును
  = లెక్కకు రెండగును మరియొక - లెక్కకు నొకటియే యగును
  ఒక్కటియే మందయగును - ఒకటియే సంఘమగును || వధువు ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


47. vadhuvu kalavariMpu


  vadhuvu saMghamu varunikoraku - eduru choochu chunnadi =
  adhama mokka paapamaina - aMTakuMDa nunnadi - aMTaneeyakunnadi
  aMTu aMTanu chunnadi || vadhuvu ||

 1. varuni praema smaraNatOnae - paripoorNamauchunnadi
  varuni meedanunna praema - peraganichchu chunnadi
  taraganeeyakunnadi - varuDu varuDanu chunnadi || vadhuvu ||

 2. 'tvaraga ' nanagaa gurutulaina - taruvaata anuchunnadi
  = gurutulu jarigina jarigina doMti - gurutu peTTuchunnadi
  varuni gurutanu chunnadi - gurutu gurutanu chunnadi || vadhuvu ||

 3. 'tvaraga ' nannadi naruni yaatmaku - pravachana manuchunnadi
  iruvadivaMdala yaeMDlayinanu - 'tvaraga 'nae yanu chunnadi
  vadhuvu siddhamanuchunnadi - vadhuvu vadhuvanu chunnadi || vadhuvu ||

 4. gurutulanu pravachanamulanu - guNiyiMchu chunnadi
  = sariganunnavi reMDunanuchu - muriyuchunae yunnadi
  tarachu tarachu chunnadi - sariye sariyanu chunnadi || vadhuvu ||

 5. aaDitappanivaaDu raaka - aTTeyuMDa Danu chunnadi
  = naeDu vachchivaesinaTTae - paaDukonuchu nunnadi
  keeDu chooDakunnadi - naeDu naeDanu chunnadi || vadhuvu ||

 6. varuDu vadhuvu nokaTae ganuka - 'tvaraga ' nijamanuchunnadi
  = tvaragalO yiddaru daMpatulugaa - barugu chuMDranuchunnadi
  niruku bratukanu chunnadi - niruku nirukanu chunnadi
  || vadhuvu ||

 7. 'tvaraga ' kaDDululaevani nardhamu - virivigaa cheppuchunnadi
  = narulu napavaadiyu naDDu - parupa laeranuchunnadi
  varuDaDigO yanuchunnadi - paapaharuDanuchunnadi || vadhuvu ||

 8. taediraaka kunnadanna - laedu laedanu chunnadi
  = taedee apuDu teliyunanna - teliyanagunanu chunnadi
  kaadu ipuDanu chunnadi - taedi taedi yanu chunnadi || vadhuvu ||

 9. chaeyaDaemiyu prabhuvu sabhaku - cheppanide yanu chunnadi
  = aayattamaunaaTiki taedi - aMdunanuchu nunnadi
  maayalaedanu chunnadi - haayi haayiyanu chunnadi || vadhuvu ||

 10. ikkaDanu painakkaDanu - okka kuTuMbamae yagunu
  = lekkaku reMDagunu mariyoka - lekkaku nokaTiyae yagunu
  okkaTiyae maMdayagunu - okaTiyae saMghamagunu || vadhuvu ||