83. క్రొత్త సంవత్సరము

రాగం: యమునా కళ్యాణి తాళం: ఆది  ఉపకారీనుతి నీకౌ
  ఉపకారులన్ మించిన = ఉపకారివీవెకావా - నెపముల
  నెంచకనె - కృప నదికముగా - జూపించుమా
  అపకారములను మాపు || ఉప ||

 1. రేయి యంతను మేము - హాయిగా నిదురబోవ = కాయునట్టి దూతను మా - కై ఏర్పచినావు - ఏ యపాయమునైనను రా - నీయనట్టి గొప్ప || ఉప ||

 2. మంచుకురియు కాలమున - సంచరింపలేము స్వేచ్ఛన్ = ఎంచు కొనిన పనుల్ - సాగవు సరిగా - మంచివారికి సహితంబు - పొంచి యుండు ననారోగ్యంబు - త్రుంచివేయగలమా || ఉప ||

 3. ఎండకు గాడ్పులుకొట్టు - మండుచు పొక్కునుకాళ్ళు = ఉండనందున నీ - రెక్కడను నోరు - ఎండుకొని పోవును - అండయుండదు ఇండ్లుకాలి - గండములను దాటించు || ఉప ||

 4. వానకు పడిసెముపట్ట - నానుపువరదలురాగ = మానవులెందరో - మరణముకాగా - ఈనాడు మాచేత - గానములు చేయించుటకొరకై హానిని పరిహరించిన మా || ఉప ||

 5. కలహములు వ్యాధులును - పలువిధములైన లేముల్ = నిలువున మ్రింగు భూకంపములు - పలుమారు దుర్వార్తలు - కలుగుట వలన - కలిగిన కలతలు - తొలగించుచు వచ్చినమా || ఉప ||

 6. దురితాత్మల పీడలను - నరులవలన వచ్చు బాధల్ = తిరిగెడు మృగములవలన కీడు - పురుగుల కాటును మరి జలచర పక్షుల - వలన హాని - దొరలగ దొర్లించిన మా || ఉప ||

 7. పాపకారకు డపవాది - పాప నైజమొక యపవాది = పాపఫలితంబు నొక యపవాది - శాపమొక యపవాది - పాపశోధన - యొక యపవాది - ఆపుచు వచ్చుచున్న మా || ఉప ||

 8. జీవితము మేలొంద - నేవి కలుగజేసితివో = ఆవస్తువుల వలననే మాకు - చావువచ్చె నకటా - నీవాక్యాతిక్రమ ఫలమిదియే మా విచారము బాపు || ఉప ||

 9. జనకసుతాత్మమల ప్రభువునకు అనయము మహిమభక్తులౌ = మనుజు లలో దూతలలో మోక్ష - జనులలో నా మదిలో - తనదుసృష్టి యంతటిలోను - ఘనత లభించునుగాక || ఉప ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


83. krotta saMvatsaramu

raagaM: yamunaa kaLyaaNi taaLaM: aadi  upakaareenuti neekau
  upakaarulan^ miMchina = upakaariveevekaavaa - nepamula
  neMchakane - kRpa nadikamugaa - joopiMchumaa
  apakaaramulanu maapu || upa ||

 1. raeyi yaMtanu maemu - haayigaa nidurabOva = kaayunaTTi dootanu maa - kai aerpachinaavu - ae yapaayamunainanu raa - neeyanaTTi goppa || upa ||

 2. maMchukuriyu kaalamuna - saMchariMpalaemu svaechChan^ = eMchu konina panul^ - saagavu sarigaa - maMchivaariki sahitaMbu - poMchi yuMDu nanaarOgyaMbu - truMchivaeyagalamaa || upa ||

 3. eMDaku gaaDpulukoTTu - maMDuchu pokkunukaaLLu = uMDanaMduna nee - rekkaDanu nOru - eMDukoni pOvunu - aMDayuMDadu iMDlukaali - gaMDamulanu daaTiMchu || upa ||

 4. vaanaku paDisemupaTTa - naanupuvaradaluraaga = maanavuleMdarO - maraNamukaagaa - eenaaDu maachaeta - gaanamulu chaeyiMchuTakorakai haanini parihariMchina maa || upa ||

 5. kalahamulu vyaadhulunu - paluvidhamulaina laemul^ = niluvuna mriMgu bhookaMpamulu - palumaaru durvaartalu - kaluguTa valana - kaligina kalatalu - tolagiMchuchu vachchinamaa || upa ||

 6. duritaatmala peeDalanu - narulavalana vachchu baadhal^ = tirigeDu mRgamulavalana keeDu - purugula kaaTunu mari jalachara pakshula - valana haani - doralaga dorliMchina maa || upa ||

 7. paapakaaraku Dapavaadi - paapa naijamoka yapavaadi = paapaphalitaMbu noka yapavaadi - Saapamoka yapavaadi - paapaSOdhana - yoka yapavaadi - aapuchu vachchuchunna maa || upa ||

 8. jeevitamu maeloMda - naevi kalugajaesitivO = aavastuvula valananae maaku - chaavuvachche nakaTaa - neevaakyaatikrama phalamidiyae maa vichaaramu baapu || upa ||

 9. janakasutaatmamala prabhuvunaku anayamu mahimabhaktulau = manuju lalO dootalalO mOksha - janulalO naa madilO - tanadusRshTi yaMtaTilOnu - ghanata labhiMchunugaaka || upa ||